రుణమాఫీ వల్ల ఎవరికి లాభం?

రుణమాఫీ వల్ల ఎవరికి లాభం?
- డా.బి.శ్యామసుందరి

చేనేత కార్మికులను కేవలం ఓటు బ్యాంకుగా పరిగణించి తీసుకు నే చర్యలకు, చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందాలని తీసుకునే నిర్ణయాలకు చాలా తేడా ఉంటుంది. రుణమాఫీ క్రింద సహకార సంఘాల రుణాలే కాకుండా, చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాలు కూడా రద్దు చేస్తామని ప్రకటన ఇవ్వడం జరిగింది. జాతీయ బ్యాంకులేవి కూడా చేనేత కార్మికులకు అప్పు ఇచ్చేందుకు సిద్ధంగా లేవు.

రాజకీయ అం డదండలు ఉన్న బోగస్ సంఘాలు రుణమాఫీ కింద డబ్బు కాజేసే ప్రమాదం ఉంది. అందుకని కేవలం ఎన్ని కోట్లు రుణమాఫీ కింద విడుదల చెయ్యబడ్డాయని కాకుండా, ఈ పధకం ఎవరికి చేరింది, ఆ సంఘాల, చేనేత కార్మికుల వివరాలు బహిరంగంగా ప్రకటించాల్సి ఉంటుంది. రుణమాఫీ అమలులోకి వచ్చిన ఆరునెలల తరువాత సంఘాలకు ఏం లాభం చేకూరింది, వారికి పెట్టుబడి సౌకర్యం పెరిగిందా, ఇంకా ఎక్కువ మంది కార్మికులకు పని ఇవ్వగలుగుతున్నా రా, వంటి విషయాలను తిరిగి చూడాల్సి ఉంటుంది.

ఈ పరిశీలన లో సంఘం యాజమాన్యం బాగుపడి, పనిచేసే కార్మికుల పరిస్థితి యధావిధిగా ఉందని తేలితే, పథకంలో లోపంఎక్కడ ఉందోపరీక్షిం చే వీలు ఉంటుంది. లేని పక్షంలో చేనేత రంగానికి ఇన్ని కోట్లు (320 కోట్లు) ఇచ్చినా కార్మికుల వలస తగ్గలేదు, చేనేత వ్యాపారం వృద్ధి చెందలేదు అన్న మాటలు మాత్రమే మిగులుతాయి. ప్రభుత్వం నుంచి వచ్చే అరకొర సహాయం కూడా సరైన పర్యవేక్షణ లేక, చేనేత కార్మికులకు అందడంలేదు. ప్రభుత్వం ప్రకటించిన సహాయం వలన ఎవరు లాభపడుతున్నారో కనిపెట్టండి.
- డా.బి.శ్యామసుందరి, చేనేత రంగ నిపుణులు