భారతదేశంలో స్వేఛ్చ స్వాతంత్ర్యం ఎంతంటే?

భారతదేశంలో స్వేఛ్చ స్వాతంత్ర్యం ఎంతంటే?

i
Rate This
Quantcast

భారతదేశంలో స్వేఛ్చ స్వాతంత్ర్యం ఎంతంటే?

భారతదేశంలో స్వేఛ్చ స్వాతంత్ర్యం ఎంతంటే?

హద్దులు లేని వాక్ స్వాతంత్ర్యం,
గాంధీ నుంచి, గాడ్సే దాకా,
రామాయణం నుంచి, భారతం దాకా,
ఎంత మాట పడితే,
అంత మాట అనేయ్యోచ్చు!

ఎవరైనా, ఎప్పుడైనా,
ఎక్కడైనా, ఎన్నైనా,
పార్టీలు స్తాపించేసి,
గుప్పెడు డబ్బులు జల్లేసి,
గంపెడు ధనం మూటకట్టేసుకోవచ్చు,
స్వర్గ సుఖాలు అనుభవించేయ్యొచ్చు!

దేశం నడిబోడ్డులో అరాచకం సృష్టించినా,
బస్సుల్లో, రైళ్ళలో బాంబులు పేల్చినా,
సంవత్సరాల తరబడి,
జైళ్ళలో సుఖపడిపోవొచ్చు,
బిర్యానీలు లాగించెయ్యొచ్చు!

స్కూల్లలో, కాలేజీల్లలో,
IITల్లో, RECల్లో చేదివేసుకుని,
మేధస్సు పెంచేసుకుని,
పరాయి దేశం ఎగిరిపోయి,
మేధస్సు అంతా ఒలకపోసేసి,
పేరు, ప్రతిష్ట పొందేయ్యొచ్చు,
ధనం, దర్పం సంపాదించెయ్యొచ్చు!

నా సినిమా, నా ఇష్టం,
నా సీరియల్, నా కష్టం,
వెండి తెర, బుల్లి తెర,
ఎదైతేనేమి, ఏమైతేనేమి,
ప్రసారం చేసేయ్యొచ్చు,
రేటింగులు పెంచేయ్యొచ్చు!

ఆటగాళ్ళు ,
ఆటను అటకేక్కించేసి,
ప్రకటనలు పండించేసి,
ఓడిపోతూ,
అవార్డులు, రివార్డులు పొందేయ్యొచ్చు!

ఫైనులేదు, బిల్లు లేదు,
రూలు ఉన్నా లేదు,
ఏ నిబంధనలకు,
లొంగకుండా ఆనందించేయ్యొచ్చు!

చట్టాలుంటాయి, కోర్టులుంటాయి,
కుప్పలు తెప్పలు కేసులుంటాయి,
తరాలు తరలిపోయిన తర్వాతే,
తీర్పులుంటాయి,
తప్పులు చేసేయ్యొచ్చు,
తప్పించుకుని తిరిగేయ్యొచ్చు,
బతికేయ్యొచ్చు,చచ్చిపోయచ్చు!

చదువున్నా లేకున్నా,
విచక్షణ ఉన్నా లేకున్నా,
రౌడీ అయినా, కేడి అయినా,
ఎన్నికల్లో గెలిచేయ్యోచ్చు,
దేశాన్ని ఏలేయ్యొచ్చు,
దొరికినదంతా దోచేయ్యోచ్చు!

సమరయోధులు ప్రాణాలొడ్డి,
సాధించిన స్వాతంత్ర్యం ఇదీ,
స్వార్ధపరుల స్వార్ధంతో,
పౌరుల భాద్యతా రాహిత్యంతో,
తీరుమారిన స్వేఛ్చ ఇది!

యధా రాజ, తదా ప్రజా,
యధా ప్రజ, తధా రాజ!