కార్మిక చట్టాల అమలకు దేశ స్థాయిలో ఉద్యమం !
విజయనగరం,మేజర్‌న్యూస్‌ః కార్మిక చట్టాల అమలకు 5లక్షల మందితో ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నామని రాష్ట్ర ఏఐటీయూసీ కార్యదర్శి టి.నరసింహన్ తెలియజేశారు.ఆదివారం స్థానిక అమర్ భవన్‌లో జరిగిన పీఏసీఎస్ సిబ్బంది యూనియన్ జిల్లా సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.దేశవ్యాప్తంగా పీఏసీఎస్ సిబ్బంది సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.కార్మిక చట్టాల 150కి పైగా ఉన్నప్పటికీ అవేవీ అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వాలు ధరలు అదుపు చెయ్యడంలేదన్నారు.కార్మిక చట్టాలను అమలు చెయ్యడంలో తాత్సారం చేస్తున్నాయన్నారు. జట్లు,ముఠాల పేరుతో 46 కోట్ల మంది కార్మికులు దయనీయంగా జీవితాలు నెట్టుకొస్తున్నారన్నారు.2004 నుంచి పింఛన్లు ప్రభుత్వాలు రద్దు చేశాయన్నారు.పింఛను ప్రతీ ఒక్కరికీ వర్తింపజేయాలని తాము పోరాటం చేస్తున్నామన్నారు.46 కోట్లలో 40 కోట్ల మంది అసంఘటిత రంగాలలో కార్మికులగా ఉన్నారన్నారు.కాంట్రాక్టు ప్రాతిపధికన పనిచేస్తున్న ఉద్యోగులు కూడా కార్మికులగానే ఉద్యోగ,సామాజిక భద్రత కోల్పోయారన్నారు.
మన రాష్ట్రంలో 5లక్షల మంది అసంఘటిత రంగంలో కార్మికులగా ఉన్నారన్నారు. ఈ వ్యవస్థను రూపు మాపి సామాజిక భద్రత కల్పించాలని తాము అన్ని కార్మిక సంఘాలతో కలిసి ప్రభుత్వాలను డిమాండు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ వాటాలు అధికంగా ఉన్న, లాభాలు ఆర్జించే బీహెచ్‌ఈఎల్ లాంటి సంస్థలను ప్రభుత్వం ప్రైవేటు పరం చెయ్యడానికి సిద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు. ఆర్థికంగా ఆదుకునే పెట్రో ఉత్పత్తుల కంపెనీలను ప్రైవేటు రంగానికి అప్పజెప్పి నేడు ప్రైవేటు రంగాలు చెప్పిన మాటను జవదాటలేని కేంద్ర ప్రభుత్వం తొమిది నెలల్లో ఎనిమిది దఫాలు ధరలు పెంచిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బేరల్ ధర 34 శాతం ఉంటే మన ప్రభుత్వాలు 75 శాతం ధరలు పెంచి మధ్య, సామాన్య తరగతులు జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. నెలకు రూ. కోటి తీసుకున్న జీతగాళ్ళు ప్రైవేటు ఆర్గనైజేషన్లలో ఉన్నారన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు ప్రస్తుతం నెలకు రూ. లక్ష గౌరవ వేతనంగా పొందుతున్న నేపథ్యంలో సామాన్యునికి కనీసం రూ. 10వేలు జీతంగా చెల్లించలేని దౌర్భాగ్య ప్రభుత్వాలు కొనసాగుతున్నాయన్నారు.
వీటిపై ప్రజలు, సంఘటిత, అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల్లో అవగాహన కల్పించి ఉద్యమాలను తీవ్రతరం చేసి కార్మిక చట్టాలు అమలకు ముందుకెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నామన్నామని ఆయన విలేకరులకు వివరించారు.
జీఓ 151 యధాతదంగా అమలు చెయ్యాలి ః రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 జూన్ నెలలో చేసిన 151 జీఓ నేటికీ అమలు కాకపోవడంపట్ల ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యగా జీఓలు ప్రటించడం ఆ తరువాత వాటిని అమలు చెయ్యకపోవడం జరుగుతోందన్నారు. దీంతో ఉద్యోగులు, కార్మికులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమన్నారు. ఈ జీఓ చేసి మూడేళ్ళు అయినప్పటికీ ఏదో ఒక వంకపెట్టి పీఏసీఎస్ సిబ్బందిని ప్రభుత్వం ఇరకాటంలో పెట్టి వారి జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. సొసైటీలకు వచ్చిన లాభాలపై వీరి జీతాలు ఇవ్వాలని నాబార్డు నిర్ణయించడం ఎంతవరకు సబబు అన్నారు.
ఒకపక్క రైతుల రుణాలు మాఫీ చేస్తూ, సబ్సీడీలు ప్రకటిస్తూ, ఉచిత విద్యుత్తు ఇస్తూవుంటే ఏ విధంగా సొసైటీలకు లాభాలు వస్తాయని ఆయన ఎదురుప్రశ్న వేశారు. ఇచ్చిన రుణాలు రైతుల నుంచి ముక్కుపిండి వసూలు చేసే సత్తా ప్రభుత్వానికి ఉండాలన్నారు. సొసైటీలకు వచ్చే లాభాలతో సిబ్బంది జీతాలకు ముడిపెట్టడం సమంజసం కాదన్నారు.ఆధాయంతో వీరి జీతాలకు ముడిపెట్టినట్లైతే.. ఆదాయం రాని పాఠశాలలు, పోలీసు, మెడికల్ తదితర శాఖలు ఏమి లాభాలు ఆర్జించిపెడుతున్నాయి.. వీరికి నెలయ్యేసరికి జీతాలు ఖజానాల ద్వారా అందజేయడం లేదా అని ఆయన నిలదీశారు. నేడు పీఏసీఎస్‌లలో పనిచేస్తున్న సిబ్బంది రూ. 1000, రూ. 1,500లు, రూ. 2000లు జీతంతో మండుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో కుటుంబాలను ఎలా నెట్టుకొస్తున్నారో అనేది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న దేశంలో యూపీఏ, ఇక్కడ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదన్నారు.
రాష్ట్రంలో పీఏసీఎస్‌లలో 10వేల మందికి పైబడి సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. 20 ఏళ్ళుగా వీరు అరకొర జీతాలతో జీవితాలు సాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం జీఓలమీద జీఓలు చెయ్యడమే తప్ప అమలు చెయ్యడం లేదని ఆయన విమర్శించారు. గత నెలలో పీఏసీఎస్ సిబ్బంది యూనియన్ రాష్ట ప్రధాన కార్యదర్శి వి. కృష్ణంరాజు నిరాహార దీక్షకు పూనుకోగా.. ఆ శాఖ కార్యదర్శి, మినిస్టర్ కాసు కృష్ణారెడ్డి తదితరులు వచ్చి రాజీమంత్రంతో దీక్షను విరమింపజేశారన్నారు. నాబార్డు, ఆప్కాబ్ స్టేట్, కో ఆపరేటివ్ రిజిస్ట్రార్‌లతో సమీక్షించి జీఓను అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కూడా ఇంతవరకు అమలు కాలేదన్నారు. ఇటీవల సహకార శాఖలో ఉద్యోగాల భర్తీ చెయ్యాలని ప్రభుత్వం తలచిందన్నారు.
ఈ భర్తీలో ఇంతవరకు ఎన్నో ఆర్థిక ఒడుదొడుకులకు, ఒత్తిళ్ళకు సతమతమై పనిచేస్తున్న సిబ్బందిలో సీనియర్లను, అర్హత ప్రాతిపదికగా ఈ ఉద్యోగాల్లో భర్తీ చెయ్యాలని తమ యూనియన్ డిమాండు చేస్తోందన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించని పక్షంలో మిగిలిన సంఘాలతో కలిసి సమ్మెకు ఉపక్రమిస్తామని ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశం అనంతరం జిల్లా పీఏసీఎస్ సిబ్బంది తో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. కృష్ణంరాజు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం. మురళీధరరావు, ఉపాధ్యక్షుడు సాగి రంగరాజు, పీఏసీఎస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి. రామునాయుడు, కార్యదర్శి వర్రి. సన్యాసిరావు, ఉపాధ్యక్షుడు బి. బాస్కరరావు, ఏఐబీఈఏ కోఆర్డినేషన్ కమిటీ కార్యదర్శి నల్లా బాబాజీ, పీఏసీఎస్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.