విద్యాహక్కు చట్టం అమలు ‘బడిబాట’ లో విద్యాభివృద్ధి పనులు
హైదరాబాద్, మేజర్‌న్యూస్ : ఈ నెల 13 నుంచి ప్రారంభం కావాల్సిన ‘బడిబాట’ కార్యక్రమంలో పలు విద్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి పాఠశాల విద్యా శాఖ అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేసింది. అందులో విద్యా హక్కు చట్టం అమలు, ఎన్‌రోల్ మెంట్ పెంచడం, అక్షర అభ్యాసం, ఉచిత దుస్తులు పంపిణి వంటి అనేక కార్య క్రమాలు చేపట్టుతున్నారు. అయితే విద్యా వారోత్సవాల పేరుతో 13 నుంచి 18 వర కు నిర్వహించనున్న బడిబాటలో భాగంగా ఏ రోజు ఏయే కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందనే షెడ్యూల్‌ను విద్యా శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ కార్యక్రమా లను తేదీల వారిగా అమలు చేయాలని ఆయా జిల్లాల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మండల విద్యాధికారులు, హెడ్ మాస్టర్లు ఈ కార్యక్రమ నిర్వ హణకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.ఆ వివరాలు ఇలా ఉన్నాయి...
జూన్ 13న:- విద్యా హక్కు చట్టం అమలతో పాటు ఎన్‌రోల్‌మెంట్ పెంచడం, అక్షరాభ్యాసం చేపించడం ఉచిత దుస్తుల పంపిణీ చేయడం. అలాగే పేద విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాల పంపిణీ తీరు తెన్నులు. మధ్యాహ్న భోజన పథ కం అవగాహన కార్యక్రమాలు. అందులో భాగంగానే స్థానిక ప్రజలు, పెద్దలు. తల్లి దండ్రులు కూడా పాల్గొనే చర్యలు తీసుకోవడం. అన్ని స్కూళ్ళలో మంచి రుచికరమైన ఆహారాన్ని అందించడం.
జూన్ 14న:- మాధ్యమిక విద్య పటిష్ట పరచడానికి 1000 హైస్కూళ్ళలో అందు కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులుచేత కాంపెక్స్‌లు ప్రారంభించడం. 500 హైస్కూళ్ళలో కాంప్లెక్స్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం. తొమ్మిదవ తరగతి చదువుతున్న వారికి భవిష్యతు ఉపాధి, ఉన్నత చదువుల గురించి విద్యావేత్తలతో, ఎంప్లాయిమెంట్ అధికారులతో కౌన్సెలింగ్ ఇప్పించడం.
జూన్ 15న:- ‘సబల’ పథకాన్ని ప్రారంభించడం. వారికి స్కాలర్ షిప్‌లు మంజూ రు చేయించడం. కస్తూరిభా గాంధీ విద్యాలయాలలో ప్రత్యేకమైన ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించడం. మండల విద్యాధికారులు, హెడ్‌మాస్టర్లు స్థానిక కెజిబివీలలో పిల్లల ఎన్‌రోల్‌మెంట్ గుర్తించడం.
జూన్ 16న:- ప్రాథమిక విద్య పటిష్ట పరచడం కోసం కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం.
జూన్ 17న :- ప్రజా ప్రతినిధులతో రాష్ట్రంలో 355 మోడల్ స్కూళ్ళ ఏర్పాటుకు శంకుస్థాపనలు. అందుకోసం కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయడం.
జూన్ 18న :- పదవ తరగతి పరీక్షలో అధిక ఉత్తీర్ణత శాతం సాధించడానికి కృషి చేసిన టీచర్లను విద్యార్థులు, తల్లిదండ్రుల సమక్షంలో గౌరవించడం. మెరుగైన ఫలి తాలు సాధించడంలో ఒకరి అభిప్రాయాలను మరోకరు పంచుకోవడం. 6వ తరగతి నుంచి 10వ తరగతి నుంచి మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించడం. మంచి మార్కులు సాధించిన విద్యార్థుల చేత మిగితా విద్యార్థులకు తమ అభిప్రాయాలు తెలియజేసే విధంగా చర్యలు చేపట్టడం.