తల్లి బాధ్యత కొడుకులదే....

తల్లి బాధ్యత కొడుకులదే....సూర్య దిన పత్రిక సౌజన్యముతో 
నాకు నలుగురు కుమారులు. నలుగురు కుమార్తెలు. నా వయస్సు 65 సంలు. నా భర్త మరణించాడు. కొడుకులు, కూతుళ్ళు అందరి పెళ్ళిళ్ళూ అయిపోయాయి. అందరూ నా భర్త సంపాదన మొత్తం పంచుకోవాలని వేరు పడిపోయారు. ఇప్పుడు నా బాధ్యత ఎవరూ తీసుకోవడం లేదు. ఊళ్ళో పెద్దలు ఏమీ చెప్పడం లేదు. ఇప్పుడు నేను ఎలా బతకాలో తెలియడం లేదు. దీనికి పరిష్కారం చెప్పండి?
- జయమ్మ, వనపర్తి

law-img అమ్మా! నీకు నీ కొడుకుల సంపాదనలో కొంత మనోవర్తి అడిగే అధికారం ఉంది. కనుక దగ్గరలోని ఒక న్యాయవాదిని కలిసి నీ కొడుకుల (నలుగురు) మీద మనోవర్తి కింద ఐపిసి 125 ప్రకారం గాని లేదా గృహ హింస మహిళల రక్షణ చట్టం 2005 కింద గాని కేసు పెట్టవచ్చు. ఇది నలుగురి మీద గాని లేక ఏ ఒక్కరి పైన గాని పెట్టవచ్చు. నీకు తిండి, బట్ట, నివాస గృహం, వైద్య సౌకర్యాలు తప్పనిసరిగా కోర్టు ద్వారా రాబట్టుకొనే అధికారం చట్ట ప్రకారం ఉంది.
***
నాకు 1989లో వివాహం అయింది. నాకు ముగ్గురు కొడుకులు కలిగారు. 2008లో నా భార్య పక్కింటివానితో పరిచయమేర్పరచుకుంది. నాటి నుండి నన్ను, నా పిల్లలను మానసికంగా, ఆర్థికంగా, అన్ని విధాలా ఇబ్బందులు పెడుతోంది. తర్వాత నా భార్య గర్భవతి అయింది. తాను పక్కింటి అబ్బాయిని ప్రేమించానని, అతన్ని వివాహం చేసుకున్నానని బంధువులకు చెప్పింది. ఒక గుళ్ళో పూజారి సమక్షంలో పెళ్ళి జరిగిందని చెప్తోంది. తర్వాత చెప్పకుండా పక్కింటి అతనితో వెళ్ళిపోయింది. పిల్లలను నా దగ్గరే వదిలిపోయారు. తర్వాత ఆయనకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇప్పుడు నా పై వరకట్న కేసు, గృహ హింస కేసు, మనోవర్తి కోసం కేసులు పెట్టింది. దీనికి పరిష్కారం చెప్పండి.
- కృష్ణారావు, హైదరాబాద్‌

నీ భార్యకు పక్కింటి అబ్బాయితో వివాహేతర సంబంధం ఉన్నట్టు చెప్తున్నారు. కానీ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? వివాహేతర సంబంధం ఉన్నట్టు చట్టానికి ఆధారాలు తప్పనిసరిగా ఉండాలి. ఇవి లేకపోతే నీవు ఏమీ చేయలేవు. కనుక వెంటనే ఒక పోలీసు కేసు పెట్టండి. అప్పుడు పోలీసు వారు విచారణ జరిపి సాక్షాలతో విచారణ రిపోర్టు తయారు చేస్తారు. దీని ఆధారంతో నీ బార్యపై చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే నీ భార్య పక్కింటి అబ్బాయిని గుళ్ళో వివాహం చేసుకుంది అన్నందున ఆ ఆలయ కమిటీ నుంచి లేఖ తీసుకోండి. అంతేకాక పక్కింటి అబ్బాయితో వివాహేతర సంబంధం కారణంగా కన్న పిల్లల పుట్టిన సర్టిఫికెట్‌ తీసుకోగలరు. అదే విధంగా మీ భార్య‚ పక్కింటి అతనితో దిగిన ఫోటోల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తూ మీ దగ్గరలోని న్యాయవాది ద్వారా కేసు పెట్టగలరు. వీటి ఆధారాలతో నీపై పెట్టిన కేసులు నిర్వీర్యం అయ్యి నీకు న్యాయం జరుగుతుంది.
***
నేను 1998వ సంలో ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను. నాది ఎస్సీ కులం, నా భర్త బ్రాహ్మణుడు. నాతో వివాహా న్ని నా భర్త తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఇందువల్ల మేమిద్దరం ఇంతకాలం పక్కనే కలదిండిలో నివాసం ఉంటూ ప్రైవేటు పనులు చేసుకొని బతుకుతున్నాము. మాకు ముగ్గురు పిల్లలు కలిగారు. ఇప్పుడు మా అత్తమామలు తమకు గల ఎనిమిది ఎకరాల పొలాన్ని అమ్ముతున్నారు. ఆ విషయంలో తన వాటా గురించి నా భర్త ప్రశ్నించగా, నీ భార్య ను, పిల్లలను వదిలి వస్తేనే భాగం ఇస్తాము లేకపోతే ఒక్క పైసా కూడా ఇవ్వం అని భయపెడుతున్నారు. దీనికి పరిష్కారం చెప్పండి.
- శ్రీదేవి, కృష్ణాజిల్లా

నీకు కులాంతర వివాహం చేసుకున్నంత మా త్రాన ఆస్తి మీకు రాకుండా పోదు. మీరిద్దరూ రిజిస్టర్డ్‌ వివాహం చేసుకున్నారా లేక గుళ్ళోనా అనే విషయం చెప్పలేదు. ఏది ఏమైనా నీవు నీ భర్త కలిసి దిగిన ఫోటోలు, పెళ్ళి కార్డు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇవి మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి. అవి మాత్రమే ఆధారాలు కాగలవు. లేకపోతే సమస్యలు వస్తాయి. వాటి ఆధారంతో నీ భర్త ద్వారా నీకు దగ్గరలో గల న్యాయవాదిని కలిసి పార్టీషన్‌ కోసం కోర్టులో కేసు వేయగలరు. తప్పక మీకు న్యాయం జరుగుతుంది.
bala-bhramachari

సంక్షేమం' లేని అంగన్‌వాడి

సంక్షేమం' లేని అంగన్‌వాడ Buzz up!

కార్యకర్తల నెత్తిన బండచాకిరి..!
(ఎర్రోజు శ్రీనివాస్‌ వి.వి, కరీంనగర్‌)
నేటి బాలలే రేపటి పౌరులన్న స్పృహతో భారీ బహుముఖ వికాసా నికి ప్రభుత్వాలు వెచ్చించే ప్రతి రూపాయి భారతావని బంగరు భవితవ్యానికి అమూల్యమైన పెట్టు బడి. శిశు జననం నుంచి సంపూర్ణ మానవుడిగా ఎదుగుదల కోసం సమస్త సేవలు సమకూర్చాలన్న 1974 నాటి జాతీయ విధాన పత్రంలో పొంగులు వారింది. అదే స్ఫూర్తి, ఆ స్వప్నం సాకారం చేయ డానికే అవతరించిన సమగ్ర శిశు అభివృద్ధి పథకం( ఐసిడిఎస్‌) వాస్త వంలో ఎలా నీరోడుతున్నదో డిమాండ్ల సాధన పేరిట తరచూ రోడ్డెక్కాల్సి వస్తున్న అంగన్‌వాడి సిబ్బంది దురావస్తే కళ్ళకు కడు తుంది. అప్పటికీ గండం గట్టెక్క డానికి నాయకుల కంటి తుడుపు హామీలు, బుడిబుడి దీర్ఘాలతో పరిస్థితి అమాంతం సానుకూల పడుతుందన్న భ్రమలు ఎవరికీలేవు. దేశవ్యాప్తంగా 22 లక్షలమంది అంగన్‌వాడి కార్మికులకు వేతనాలు రెండింతలు పెంపు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీ బడ్జెట్‌ మోతెక్కించటం తెలిసిందే. ఏప్రిల్‌ 1వ తేదీనుంచి అమలవుతుందన్న పెంపుదల ప్రకారం సహాయకుల కొత్తవేతనం నెలకు రూ||లు 1500, కార్యకర్తలకు రూ||లు 3000. నిత్యా వసర వస్తువుల ధరలు చుక్కల్ని తాకుతున్నపుడు అరకొర రాబడితో బతికేదెలాగని అంగన్‌వాడి సిబ్బంది ఆక్రోశిస్తున్నారు. రాష్ట్ర నలుమూ లలనుంచి హైదరాబాద్‌కు తరలి వచ్చిన కార్మికులు, కార్యకర్తలు, సహాయకులు, పాతబాకీలు తీర్చా లని, సహేతుక జీతభత్యాలు ఇవ్వా లని గళమెత్తడం వెనక విస్తృత నేప థ్యం ఎంతో బాధాకరం. తమను కనికరించడంతో పాటు అంగన్‌వాడి కేంద్రాల్లోని పిల్లలకు మధ్యాహ్నవేళ తిండి ఏర్పాట్లు చూడాలని, పౌష్ఠికా హార పంపిణీ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టరాదన్న డిమాండ్లు వేళ్ళు తన్నుకున్న ఆ వ్యవస్థకు అద్దంపడుతున్నాయి. సిబ్బంది తీవ్ర అసంతృప్తితో దహించుకు పోతుండగా ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఇవ్వాల్సిన టీకాలు, రక్తహీనతకు గురికాకుండా గర్భవతులకు, కిషోర బాలికలకు మందుల పంపిణీ చాలాచోట్ల కాగితాలకే పరిమితమవుతున్నాయి. అందుకే పిల్లల ఆరోగ్యకర ఎదుగుదల ఎండమావిని తలపిస్తోంది. దేశవ్యాప్తంగా సమీకృత ఘోరవైఫల్యాన్ని జనార్ధన్‌ ద్వివేది సారథ్యంలోని పార్లమెంటరీస్థాయి సంఘం ధృవీకరించింది. తన వంతుగా సర్వోన్నత న్యాయస్థానం అంగన్‌వాడి కేంద్రాల నిర్వహణ ఎందుకిలా చతికిల పడిందని కేంద్రాన్ని సూటిగా నిగ్గతీసింది. నేటికీ సరైన దిద్దుబాటు చర్యలే కరువు! ప్రపంచంలోనే అతి పెద్ద పోషకాహార పథకం, అనునిత్యం ఏడు కోట్లకుపైగా పిల్లలకు సుమారు కోటిన్నర మంది బాలింతలకు, గర్భిణీలకు పది లక్షల కేంద్రాలలో ఆసరాగా నిలుస్తుందన్న గణాంకాలవల్లే వెతతో సర్కారు మురిసిపోతున్నది. ఆరేళ్లలోపు పిల్లల సంఖ్య సుమారు 17 కోట్లని అంచనా. వారిలో యాభై శాతానికైనా రక్షణ లేదు! ఐసిడిఎస్‌ను సార్వత్రీకరించడానికి అదమపక్షం 14 లక్షల అంగన్‌వాడి కేంద్రాలు నెలకొల్పాలన్నది నాలుగేళ్ళనాటి సుప్రీం సూచన. ఆ స్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లకు అవకాశం, సన్నద్దత కనుచూపుమేరలో కానరావడంలేదు. ప్రతిష్టాత్మక పథకం పది, పదకొండు కోట్లమంది పిల్లలను గాలికొదిలేసిందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగే లెంపలేసుకున్నారు. పిల్లల్ని జాతి సంపదగా పరిగణిస్తున్నామని, వారి అభ్యున్నతికి చేయగలిగినంత చేస్తామని బులిపించిన యుపిఏ నాయకగణం, సమస్య మూలాలపై దృష్టి సారించడమేలేదు. నిర్ధిష్ఠ కాల వ్యవధిలో విస్తరణ వ్యూహాల మాట దేవుడెరుగు, ఇప్పటికే నడిపిస్తున్నామన్న అంగన్‌వాడి కేంద్రాల నిర్వహణ పరమ అధ్వాన్నం. దేశీయంగా పిల్లల మరణాలలో సగందాకా పోషకాహార లోపాల వల్లే సంభవిస్తున్నాయన్న అధ్యయనాలు- ఐసిడిఎస్‌ లోపభూయిష్టమని నిర్దారించాయి. సబ్బందిని పస్తులు పెట్టి, అధికారుల పర్యవేక్షణను నామమాత్రం చేసి పోషకాహార నిలువలని పక్క దారి పట్టిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ ముందు వరుసలోనే తిష్టవేసింది. ప్రతి వేయి మంది జనాభాకు ఒక అంగన్‌వాడి కేంద్రం నెలకొల్పాలని గిరిజన ప్రాంతాల్లో 700 మందికి ఒక కేంద్రం పనిచేసేలా చూడాలన్నది సర్వోన్నత మార్గదర్శక సూత్రం. మంజూరైన కేంద్రాలన్నీ పూర్తి స్థాయిలో సమర్థంగా నిర్వహించలేని ప్రభుత్వాల అసమర్ధతే దేశంలో సంక్షేమ భావనకు అతిపెద్ద విఘాతం. గర్భిణులకు, బాలింత లకు, కిషోరబాలికలకు సంవ త్సరంలో కనీసం మూడువందల రోజులపాటు సరైన పోషకాహారం అందించాల్సిన బాధ్య త ప్రభుత్వాల దేనన్న సుప్రీం తీర్పు, దేశ రాజధా నిలోనే కొళ్ళబోతున్నది. అక్కడి కొన్ని కేంద్రాల్లో లబ్ధిదా రులకు ఏడాదిలో సగటున 150 రోజులపాటు ఆహార పంపణీకి దిక్కులేదని లోగడే వెల్ల డైంది. ఆ రికార్డును బద్దలు కొట్టడానికి కావ లసిన సంబరాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో దండిగా పోగుప డ్డాయి. రాష్ట్రంలో ఏటా పదహారు లక్షల మేరకు జననాలు నమోదవు తుండగా, లక్ష మంది శిశువులు పొత్తిళ్లలోనే మరణి స్తున్నారు. 61 శాతం పిల్లలకు పౌష్ఠికాహారం లభించడంలేదు. 71శాతం బాలలు రక్తహీనతతో సతమతమవుతున్నారు. పేరుకు 80 వేలకు పైగా అంగన్‌ వాడీలు మంజూరైనా అధికారికంగా నిర్వహి స్తున్నవి 70 వేల లోపే. పర్య వేక్షణా అధికారుల నియామకాల్లో పీనాసితనం, నిఘాకు తూట్లుపొ డుస్తున్నది. ఇరుకు అద్దె భవనాలు, సిబ్బంది కొరత, తూతూ మంత్రంగా కేంద్రాల నిర్వహణ, గౌరవ వేత నాలను ఆరేడు నెలలకు విదిలించ డం, అనేకానేక రుగ్మతలకు అంటుక డుతున్నట్లు సామాజిక తనిఖీలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా క్షేత్రస్థాయిలో జరిగే కార్య క్రమాలన్నింటి పని భారాన్ని అంగన్‌వాడి కార్యకర్తల నెత్తిన రుద్దేసి బండ చాకిరి చేయించు కుంటూనే, వారికి తగిన పరిహారం ముట్టచెప్ప కపోవడం అమానుషం.
కేంద్రాలలో సంక్షేమం వాలిపో వడానికి అదే మూలకారణం. కనీస వేతన చట్టాన్ని అపహసిస్తూ సర్కారు సాగిస్తున్న శ్రమదోపిడీకి అడ్డుకట్ట పడినప్పుడే అంగన్‌వాడీలకు స్వాంతన, కేంద్రాలలో మౌలిక లోటుపాట్లను సరిదిద్ధిన్నాడే అసంఖ్యాక భావిపౌరుల బతుకుల్లో వెలుగురేఖలు వెదజల్లుతాయి.

భూ పోరాటాలకు మార్గదర్శి

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున మన పాలకులు భూస్వామ్య విధానాన్ని రద్దు చేస్తామని అనేక వాగ్దానాలు చేశారు. అనేక చట్టాలు చేశారు. అయినా ఇప్పటికీ భూస్వామ్య విధానం అంతమవ్వలేదు. దున్నే వాడికి భూమి లభించలేదు. 1970లలో అమరజీవి కామ్రేడ్‌ సుందరయ్య భారతదేశం-భూసమస్య అన్న తన చిన్న పుస్తకానికి పరిచయం రాస్తూ పై మాటలు చెప్పారు. వాస్తవానికి భూసమస్యకి కామ్రేడ్‌ సుందరయ్య జీవితమే అద్దం పట్టింది. వ్యవసాయ సంబంధాలపై శాస్త్రీయ అవగాహనతో రూపొందించుకున్నది ఆయన వైఖరి.అసమాన త్యాగాలలతో, అకుంఠిత దీక్షతో రైతులు, భూమిలేని నిరుపేదలు, వ్యవసాయకార్మికులను, అర్ధబానిస పెట్టుబడిదారీ దోపిడీ నుండి విముక్తి చేయడానికి ఆయన కృషి సల్పారు. కామ్రేడ్‌ సుందరయ్య మరణించిన కొద్దిరోజులకు 'మెయిన్‌స్ట్రీమ్‌' పత్రికలో ఆ సంపాదకుడు నివాళులర్పిస్తూ సుందరయ్య 'కమ్యూనిస్టు ఋషి' అని పేర్కొన్నాడు.

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయరంగంలో భూ యాజమాన్యం గురించి చూద్దాం. కామ్రేడ్‌ సుందరయ్య చెప్పిన పరిస్థితి 1970 దశకంలో ఏమైనా మార్పు చెందిందేమో పరిశీలిద్దాం. 1970-71లో చిన్న, సన్నకారు రైతులకు మొత్తం కమతాల్లో 65 శాతం ఉండగా, వారి ఆధీనంలో 12 శాతం భూమి మాత్రమే ఉంది. నాలుగు శాతంగా ఉన్న పెద్దరైతుల ఆధీనంలో 30 శాతం భూమి ఉంది. 1981లో చిన్న, సన్నకారు రైతులు 72శాతం ఉండగా, వారి ఆధీనంలో 29శాతం భూమి ఉంది. రెండు శాతంగా ఉన్న పెద్దరైతుల ఆధీనంలో 18 శాతం భూమి ఉంది. 1970 నుండి 1980 వరకు భూసంస్కరణల వల్ల పెద్దరైతుల పట్టు కొంత సడలినట్లు కాగితాలపై కనిపిస్తుంది. కానీ వాస్తవంలో వారి పట్టు ఏమాత్రం తగ్గలేదు.
ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ పార్థసారథి పరిస్థితిని చక్కగా క్లుప్తీకరించారు.

'సీలింగ్‌ చట్టాల కింద 1984 వరకూ 1.32లక్షల హెక్టార్ల భూమిని మాత్రమే పంచారు. ఇది మొత్తం సాగుభూమిలో 0.1శాతం మాత్రమే. పంపిణీ చేసిన దానిలో కూడా 93.7శాతం మెట్టభూమి. 1969 నుండి 12.62లక్షల బంజరు భూమిని చిన్న, సన్నకారు రైతులకు పంచారు. ఇది మొత్తం సాగుభూమిలో 8.7శాతం అని చెపుతున్నారు. చట్టాల్లోని లొసుగుల వల్ల భూమిలేని నిరుపేదలకు భూమిని పంచడం, కౌలుదార్లకు భూస్వాముల నుండి రక్షణ కల్పించడం అనే ప్రధాన ధ్యేయాలు నెరవేరలేదు. పేద రైతులకు రుణసౌకర్యం, మెరుగైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందించి, ఉత్పాదకతను పెంచలేకపోయారు. వీటన్నింటికీ రాజకీయ చిత్తశుద్ధి లోపించడమే కారణం. ఇది గ్రామీణ ప్రాంతాలలో ధనిక, భూస్వామ్య పెత్తనంతో ముడిపడి ఉంటుంది. పాలకవర్గాలు తన స్వభావరీత్యా పేద, సన్నకారు రైతులకు లాభించే చర్యలు గైకొనడానికి ఇష్టపడవు. ఇది ప్రస్తుత వాస్తవ పరిస్థితి. పంటలు అధికం చేయడానికి చర్యలు గైకొన్నప్పటికీ వాటి ఫలితం కొద్దిమందిగా ఉన్న ధనిక, భూస్వామ్య వర్గాలకు మాత్రమే దక్కింది. చిన్న, సన్నకారు రైతులు అంతకంతకూ దివాళా తీసి, వ్యవసాయకార్మికుడిగా మారిపోవడం పెట్టుబడిదారీ విధానం సూత్రాల్లో ఒకటి. అడవుల పెంపకం, పండ్ల తోటల పెంపకం, కోళ్ల పెంపకం మొదలైనవి ఇటీవలి కాలంలో పెరగడాన్ని ఇదే సూచించిస్తోంది. ధనికరైతులు పనివారిని అధికంగా వినియోగించే పద్ధతులు లేకుండా పెట్టుబడి అధికంగా వినియోగించే పద్ధతులు వ్యాపార ప్రాతిపదికపై పండ్ల తోటల పెంపకం మొదలైనవాటికి మారుతున్నారు. సామాజిక పరిశీలకులకు ఇది ఆశ్చర్యం కలిగించదు.

గిరిజనులు అధికంగా ఉన్న ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ వంటి జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. 1970 నుండి పది సంవత్సరాల కాలంలో గిరిజనుల ఆధీనంలో ఉన్న అత్యధిక భూమి గిరిజనేతరుల చేతుల్లోకి మారింది. ఇది ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలకు, శాంతిభద్రతల సమస్యకు కారణమవుతుంది. భూ యాజమాన్యంలో అసమానత నీటిపారుదల సౌకర్యాల వినియోగం అసమానతలకు కూడా కారణమవుతున్నాయి. కమాండ్‌ ఏరియాలకు దగ్గరగా ఉన్న రైతులు సేద్యపు నీటి సౌకర్యాలను అధికంగా వినియోగించుకుంటున్నారు. ఫలితంగా భూ వసతి కలిగిన వారికి, భూమిలేని నిరుపేదలకు మధ్య వ్యత్యాసం మరింత అధికమైంది. ఐదవ ప్రణాళికాంతం నుండి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు తగ్గించడం వల్ల పేద ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నమైంది. పౌష్టికాహారలోపం, నిరక్షరాశ్యత, పసిబిడ్డల అధికచావులు ఇలాంటి రుగ్మతలకు గురయ్యే దశలో బలహీనవర్గాలే రాష్ట్రంలోని అత్యధిక ప్రజానీకమైన బడుగుజనాల స్థితికి ఇవే సూచికగా ఉన్నాయి.
మన విధాన నిర్ణేతలు పెద్ద పెట్టున ప్రచారం చేస్తున్న సమానత్వంతో కూడిన అభివృద్ధిని సాధించడం, భూ యాజమాన్యం పరిస్థితిపై ఎంతో ఆధారపడుతుంది. ఉత్పత్తిశక్తులు ఉత్పత్తి సంబంధాలను సక్రమ పద్ధతిలో ఉంచాలంటే దున్నేవానికి భూమి లభించాలి. ఈ సమస్యను ఇంకెంతమాత్రం అలక్ష్యం చేయరాదు. లేనట్లయితే మొత్తం దేశ స్థితిగతులే విచ్ఛిన్నమౌతాయి. రాజకీయ చిత్తశుద్ధి ఉంటే సమస్య పరిష్కారానికి తగినంతగా కృషి చేయవచ్చు. ఈ విషయాన్ని పశ్చిమబెంగాల్‌, కేరళ, వామపక్ష ప్రభుత్వాలు రుజువు చేస్తున్నాయి. దానినే ఈ రాష్ట్రంలో కూడా సాధించుకోవచ్చు. రైతుల ప్రయోజనాల కోసం పనిచేసే పురోగామి ప్రజాశక్తులన్నింటితో కూడిన ఉద్యమం అవసరం. ఇటువంటి ప్రజాతంత్ర ఉద్యమం కోసం మనం పునరంకితమవుదాం. ఇదే కామ్రేడ్‌ సుందరయ్య స్మృతికి మనం అర్పించగలిగిన నిజమైన నివాళి.ప్రజా శక్తీ దిన పత్రిక soujanyamutho
ముఖోపాధ్యాయ