బహుజన సామాజిక దృక్పథం

సాహిత్యం కులాన్ని పట్టించుకుని వెలువడిన విధానాన్ని బహుజన సాహిత్య దృక్పథం తెలుపుతుంది తప్ప, కులాన్ని ప్రోత్సహించదు. కులాన్ని ఆధారంగా చేసుకుని వ్యక్తిగత ప్రతిభను, సమాజాన్ని విచ్ఛిన్నం చేసిన విధ్వంసాన్ని విశ్లేషిస్తూ, కుల నిర్మూలనకు ప్రయత్నిస్తుంది. అందుకనే సాహిత్య సృజన కూడా ఒక బాధ్యతాయుత, సామాజిక ప్రయోజక సాధనంగా ఉపయోగపడాలని భావిస్తుంటుంది. కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసమన్న రీతిలో అవగాహన చేసుకోమంటుంది. అందుకే బహుజన సాహిత్యం అవధాన, చిత్ర కవిత్వ పాండిత్య ప్రదర్శనలకు అంతగా ప్రాధాన్యాన్నివ్వదు.

సాహిత్యం విశ్వజనీనమైంది. తీసుకున్న వస్తువు ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక ప్రాం తానికో, ఒక మతానికో, ఒక జెండర్‌కో చెందినట్లు పైకి కనిపిం చినా, దానిలో చెప్పే సత్యం మాత్రం విశ్వజనీనం కావాలి. అలా కానపు డు అది అందరి సాహిత్యంగా కాకుండా, కొందరి సాహిత్యంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఏ సమాజంలో జీవిస్తున్న రచయితైనా తన దృక్పథాన్ని బట్టి రచన కొనసాగిస్తాడు. తీసుకొనే వస్తువేదైనా, దాన్ని ఏ లక్ష్యం వైపు తీసు కెళ్తున్నాడో ఆ మార్గమే ఆ రచనా తత్త్వాన్ని, ఆ రచయిత దృక్ప థాన్నీ తెలుపుతుంది. అయినా, సర్వమానవాళికి చెందిన ఒక సామూహిక అనుభవమేదో ప్రతిఫలించగలిగినపడే అది సాిహ త్యమై పరిమళిస్తుంది.

ప్రపంచ సాహిత్యమంతా ప్రధానంగా రెండు మార్గాల్లో నడు స్తుంది. ఒకటి, సమాజాన్ని కొన్ని ఆధిపత్య వర్గాలకు అనుకూ లంగా మార్చుకోవడానికి సాహిత్యాన్ని ఒక సాధనంగా వాడు కునే దృక్పథం. దీన్ని భావ వాద దృక్పథం అని అంటారు. సమా జంలో అపరిష్కృతంగా కనిపించే అనేక క్లిష్ట సమస్యలకు పరి ష్కారాల్ని సూచిస్తున్నట్లుంటుంది. దైవాన్ని నమ్ముకోవడం వల్ల, యజ్ఞయాగాదులు, పూజలు చేయడం వల్ల ఆ సమస్యలన్న్లీ తీరి పోతాయని ఈ సాహిత్యం బోధిస్తుంది. తెలుగులో ప్రాచీన సాిహ త్యమంతా ఇంచు మించు ఈ భావవాద ధోరణిలోనే నడిచింది.

మానవుడే అన్నింటికీ కేంద్రమంటూ, అన్ని వర్గాలకూ ప్రాధా న్యాన్నిచ్చే దిశలో, సామాజిక వాస్తవిక దృష్టితో కొనసాగేది ఆధు నిక సాహిత్యం. కాలాన్నీ, సాహిత్య తత్త్వాన్నీ పరిశీలించడం వల్ల నిజమైన ఆధునిక సాహిత్యమేంటో తెలుస్తుంది. భావవాద ఛా యలున్న సాహిత్యం కొంత వెలువడుతున్నా, దానికి మూడు రె ట్లు అధికంగా భౌతికవాద దృక్పథంతోనే ఆధునిక సాహిత్యం వ స్తోంది. సామాజిక వాస్తవిక వాదులు భావవాద దృక్పథంతో వె లువడే సాహిత్యాన్ని తిరోగమన సాహిత్యమనీ, భౌతికవాద దృక్ప థంతో వెలువడే సాహిత్యాన్ని పురోగమన సాహిత్యమనీ వ్యాఖ్యా నిస్తారు.

భౌతికవాద దృక్పథంతో సాహిత్యాన్ని పరిశీలించే ధోరణి మార్క్సిజంలో కనిపిస్తుండడం వల్ల కేవలం దీన్నే ఒక ప్రధాన దృ క్పథంగా భావించడం జరుగుతోంది. దీనిలో వర్గం పునాదిగా ఉంటుంది. ఉపరితలాంశాలన్నీ, సాహిత్య, కళారూపాలతో సహా వర్గ సమస్య పరిష్కృతమైతే, మిగతా అన్ని సమస్యలూ పరిష్కా రమైపోతాయని భావిస్తుండడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. బహుజన దృక్పథంలో వర్గ సమస్యలున్నా, దేశీయ వాస్తవిక సామాజిక దృష్టివల్ల కులం ప్రాధాన్యాన్ని వహిస్తుంది. వర్గ వివ క్షనీ, కుల వివక్షనీ పక్క పక్కనే పెట్టి చూస్తే, కుల వివక్ష మానసిక క్షోభను కలిగిస్తూ, ఆత్మగౌరవ సమస్యని ముందుకి తెస్తుం ది. అందువల్ల కేవలం వర్గ సమస్యతో మాత్రమే సాహిత్యాన్ని చూస్తే, దాంట్లోనూ భౌతికదృష్టి ఉన్నా, సాహిత్యం సమాజ వాస్తవికతను ప్రదర్శించడంలో పాక్షికకోణమే ప్రదర్శితమౌతుంది. అందువల్ల వర్గ, కుల సమస్యల సమ్మేళనంతో సాిహత్యాన్ని విశ్లేషించేది సాహిత్యంలో బహుజన దృక్పథమవుతుంది.

కేవలం తెలుగుసాహిత్యం వరకే చూసినా, మన సాహిత్య చరి త్రకారులు అత్యధికులు నన్నయతోనే సాహిత్య యుగాన్ని ప్రా రంభించారు. అంతకుముందు సాహిత్యం ఉన్నా, గాసట బీసట గా ఉందనీ, లిఖిత సాహిత్యం కావ్యరూపంలో కనిపించ డమనే ది నన్నయతోనే మొదలైందని సిద్ధాంతీకరిస్తున్నారు. అందువల్ల నన్నయకు ముందున్న సాహిత్యాన్ని ప్రాజ్ఞన్నయ యుగం అం టున్నారు. నన్నయ సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అను సృజన (ట్రాన్స్‌క్రియేషన్‌ ) చేశాడు. పద్యంలో ఆంధ్ర మహా భార తాన్ని రమణీయంగా వర్ణించాడు.

పద్య రూపంలో ఒక కావ్యం వెలువడాలంటే, నాటి సాహి త్యవేత్తలు పద్యాన్ని అర్ధం చేసుకునే సామర్ధ్యానికి సంసిద్ధులై ఉండాలనే కదా. అంటే అప్పటికే సాహిత్యం చాలా ఉంది. అది పద్య, గద్య, గేయ, వచన రూపాల్లో ఉండే అవకాశం ఉందన్న మాట. దీన్ని శోధించడంతోనే తెలుగు సాహిత్యంలో బహుజన దృక్పథానికి ద్వారాలు తెరిచే అవకాశం ఉంది.సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థను బలంగా ఆచరించడానికి ఉపయోగపడే భావజాలాన్ని భావవాదం ప్రయత్నిస్తుంది. రాజు లు, పోషకుల ఆధారంగా సాహిత్య సృజన జరిగిందని నిరూ పించే దిశగా ఆరుద్ర తన సమగ్రాంధ్ర సాహిత్యాన్ని రాశారు. అభ్యుదయ యుగం వరకే రాసి, తర్వాత సాహిత్య చరిత్రను కొ నసాగించకపోవడానికి కుల అస్తిత్త్వ చైతన్యాన్ని గుర్తించక తప్ప ని పరిస్థితి రావడం ఒక బలమైన కారణం.

అందుకే 13వ సం పుటి రాసే నాటికే స్త్రీ, దళిత సాహిత్య ఉద్యమాలు వచ్చినా, వాటి ని చాలా జాగ్రత్తగా పక్కకు పెట్టేశాడు. ఇక్కడ నుండి మళ్ళీ సాహిత్య చరిత్రను రాయాల్సిన అవసరం ఉంది. అదెవరు రాసి నా దానిలో బహుజన దృక్పథం తప్పకుండా ప్రతిఫలించాలి.పన్నెండో శతాబ్దం నాటి శివకవులలో కూడా కులాన్ని యెడ బాయలేమని ప్రకటించిన వాళ్ళున్నారు. శివకవులు కొన్ని కింది వర్ణాలకీ స్థానం కల్పించినట్లనిపిస్తున్నా, వారినీ తమ మతానికి అనుకూలంగా మార్చుకోవడానికే ఆ భావాల్ని ఉపయోగించు కున్నారనేది బహుజనసాహిత్య దృక్పథం గుర్తిస్తుంది.

16వ శతాబ్దంలో మొల్ల రామాయణం, శ్రీకృష్ణదేవరాయలు �ఆముక్తమాల్యద� రాశారనే విషయాల్లోని వివాదాల్ని కుల దృష్టి తో పరిశీలించాల్సిన అవసరం ఉంది. వసుచరిత్రికారుడి పేరు గురించిన వివాదం, శూద్రుడు రాసిన కావ్యం కాకి ఎంగిలితో సమానమనీ, దాన్ని చదవకూడదనీ లక్షణాల్ని నిర్దేశించిన 17వ శతాబ్దం నాటి అప్పకవిని గురించి ఆలోచించాలి. బ్రౌన్‌ వెలికి తీసిన వేమననూ, వేమన పద్యాలుగా చలామణిలో ఉన్న ఆధ్యా త్మిక పద్యాల్నీ విశ్లేషించుకోవాలి. వీరబ్రహ్మేం ద్రస్వామి సాిహ త్యం కూడా ఆధ్యాత్మికమైనా, ఆ సాహిత్యంలో కనిపించే ప్రజా స్వామిక భావాల్ని మూల్యాంకన చేసే పద్ధతికీ, సంప్రదాయ సా ిహత్యాన్ని విశ్లేషించే దానికీ తేడా ఉంది. 17, 18 శతాబ్దాల నాటి తెలుగు సాహిత్యాన్ని క్షీణ ప్రబంధ యుగంగా సంభావించడం లోని ఆంతర్యాన్నీ గమనించాలి.

సాహిత్యం కులాన్ని పట్టించుకుని వెలువడిన విధానాన్ని బహుజన సాహిత్య దృక్పథం తెలుపుతుంది తప్ప, కులాన్ని ప్రో త్సహించదు. కులాన్ని ఆధారంగా చేసుకుని వ్యక్తిగత ప్రతిభను, సమాజాన్ని విచ్ఛిన్నం చేసిన విధ్వంసాన్ని విశ్లేషిస్తూ, కుల నిర్మూ లనకు ప్రయత్నిస్తుంది. అందుకనే సాహిత్య సృజన కూడా ఒక బాధ్యతాయుత, సామాజిక ప్రయోజక సాధనంగా ఉపయోగప డాలని భావిస్తుంటుంది. కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోస మన్న రీతిలో అవగాహన చేసుకోమంటుంది. అందుకే బహుజన సాహిత్యం అవధాన, చిత్ర కవిత్వ పాండిత్య ప్రదర్శనలకు అంత గా ప్రాధాన్యానివ్వదు.

తీసుకునే వస్తువుతో పాటు, ఆ వస్తువుకి ఎన్నుకునే రూపాన్ని కూడా జాగ్రత్తగా ఎన్నుకోవాలనేది బహుజన దృక్పథంలో గమ నించాల్సిన మరో ముఖ్యమైన అంశం. మన తెలుగు సాహిత్యం లో పద్యానికి ఒక విశిష్ట స్థానం ఉన్నా, ఆ పద్యం సంస్కృత సమా స భూయిష్టంగా ఉండటాన్నీ గమనించాలి. పద్య కవులు తమ పాండిత్య నిరూపణ కోసం రాస్తున్నారో, పండిత పామర జనరం జకంగా పద్యాన్ని నిర్మిస్తున్నారో పరిశీలించి, పద్యం ఎంతవరకూ ఆదరణీయమో తేల్చుకోవాలి.

గేయం, వచనం కలిగించినంత సత్వర చైతన్యం పద్యం కలి గించలేదు. కానీ, ఒక శాశ్వతమైన అనుభూతిని ఒకటి రెండు వాక్యాల్లో కూడా అందించగల శక్తి పద్యానికి ఉందని గుర్తిం చాలి. వచన సాహిత్యంలో కూడా చిన్న చిన్న వాక్యాలు, సంభాష ణలు, సన్నివేశ కల్పనలు ఉంటాయి. అవి పాఠకుల మనస్సుల్లో శాశ్వతంగా గుర్తుంటాయి. పద్యమా, వచనమా అనే దానికంటే, శక్తివంతమైన వాక్యం ముఖ్యం. అది వచనానికి కూడా ఉంది. రూపకాల్లో వివిధ వస్తువుల్ని తీసుకున్నా, సంభాషణలు, సన్నివేశ కల్పనలు శక్తివంతంగా వర్ణించి, ప్రదర్శించగలిగితే ఈ సాహిత్య రూపాలు కూడా ప్రజల్ని ఆలోచింప జేయగలుగుతా యి. సమాజ పురోభివృద్ధికి తోడ్పడాలనుకునే రచయితలు తీసు కునే వస్తువుతోపాటు, సాహిత్య రూపాల్ని కూడా జాగ్రత్తగా ఎ న్నుకోవాలి.

సాహిత్యంలో వస్తువు, రూపం, శిల్పం, ప్రక్రియల పట్ల ఉన్న కొంత అస్పష్టత వల్ల వీటిని సమర్థవంతంగా ఉపయోగించు కోలేని కొంతమంది రచయితలు కూడా కనిపిస్తున్నారు.ఇప్పటికే మార్క్సిస్టుశిబిరాల్లో సాహిత్యపాఠశాలలు కొనసా గిస్తూ, సాహిత్యాన్ని చారిత్రక, భౌతికవాద దృష్టితో చూడ్డం నేర్పా రు. దాన్నింకా కొనసాగిస్తూ, ప్రజాకళారూపాల్ని వాడుకోవడానికీ శిక్షణలిస్తున్నట్లు తెలుస్తోంది.ఇటువంటి శిక్షణనే దళిత సాహిత్యానికి కేంద్రస్థానంగా, మూలస్థానంగా పేరు గాంచిన హైదరాబాదు సెంట్రల్‌ యూని వర్సిటీలో సాహిత్య పాఠశాలలో తరగతుల్ని డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ అసోషియేషన్‌ ఆరంభించింది. దీనిలో ఎంపిక చేసిన కొంతమందికి రాజకీయ, ఆర్థిక, సాహిత్య, సాంస్కృతిక అంశా ల్ని బహుజనదృక్పథంతో అధ్యయనం చేయడమె లాగో శిక్షణ నిస్తుంది. ఇటు వంటి అవగాహనా తరగతుల్ని అన్ని చోట్లా కొన సాగించగలిగితే బహుజనదృక్పథం మరింత వేగవంతంగా ముందుకు రాగలుగుతుంది.

darlaసమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థను బలంగా ఆచరించడానికి ఉపయోగపడే భావజాలాన్ని భావవాదం ప్రయత్నిస్తుంది. రాజులు, పోషకుల ఆధారంగా సాహిత్య సృజన జరిగిందని నిరూపించే దిశగా ఆరుద్ర తన సమగ్రాంధ్ర సాహిత్యాన్ని రాశారు. అభ్యుదయ యుగంవరకే రాసి, తర్వాత సాహిత్య చరిత్రను కొనసాగించకపోవడానికి కుల అస్తిత్త్వ చైతన్యాన్ని గుర్తించక తప్పని పరిస్థితి రావడం ఒక బలమైన కారణం. అందుకే 13వ సంపుటి రాసే నాటికే స్త్రీ, దళిత సాహిత్య ఉద్యమాలు వచ్చినా, వాటి ని చాలా జాగ్రత్తగా పక్కకు పెట్టేశాడు. ఇక్కడ నుండి మళ్ళీ సాహిత్య చరిత్రను రాయాల్సిన అవసరం ఉంది. అదెవరు రాసినా దానిలో బహుజన దృక్పథం తప్పకుండా ప్రతిఫలించాలి.

మహిళలకు 50% రిజర్వేషన్లు

మహిళలకు 50% రిజర్వేషన్లు
స్థానికంలో సగం సీట్లు వారికే..
మహిళా సాధికారత పరిరక్షణకు పథకాలు

క్రెడిట్ లింకేజీకి సమగ్ర ప్రణాళిక..
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్, ఏప్రిల్ 3 : పంచాయతీరాజ్, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా రిజర్వేషన్లపై సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు ప్రారంభించారు.

యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ నేతృత్వంలో రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్ల అమలుకు చట్టాలను రూపొందించడంపై ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నట్లు సీఎం కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా స్థానికసంస్థల్లోని అన్ని కేటగిరిలలోనూ 50% రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే రిజర్వేషన్లలో సగం స్థానాలతో పాటు జనరల్ కేటగిరిలోనూ సగంసీట్లు మహిళలకు కేటాయిస్తారు.

రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మహిళలకు '1/3 వంతుకు తగ్గకుండా' రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇక నుంచి 50 శాతానికి చేరుస్తూ సవరణ చేస్తారు. పంచాయతీలు, మండల పరిషత్‌లు, జడ్పీలలో నే రుగా ఎన్నికయ్యే పదవులతో పాటు పరోక్ష పద్ధతిన నియమితులయ్యే మండల, జడ్పీ చైర్మన్ పదవులకూ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఛత్తీస్‌గఢ్, మణిపూర్, ఉత్తరాఖండ్, బీహార్, రాజస్థాన్, మద్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి.

మహిళా సాధికారిత, మహిళల హక్కుల పరిరక్షణ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 10 లక్షల వరకు గల మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)లో కోటి మందికి పైగా సభ్యులున్నారు. ఈ సభ్యుల ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు రుణ సౌకర్యంతో క్రెడిట్ లింకేజీని ఏర్పాటు చేసేందుకు సమగ్రమైన ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తోంది. మహిళా సాధికారత కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నారు.
ముఖ్యంగా సంఘాలకు ఇచ్చే రుణాలపై పావలా వడ్డీ పథకం అమలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు అభయ హస్తం పథకం ద్వారా కనీసం రూ.500ల నుంచి రూ.2200ల వరకు నెల వారీ పెన్షన్, ఇందిరమ్మ గృహాలను మహిళల పేరిట రిజిస్ట్రేషన్, దీపం పథకంలో వంట గ్యాస్ కనెక్షన్‌ను మహిళలకు మంజూరు చేయడం, వృత్తి విద్యా కోర్సుల్లో బాలికల కు మూడో వంతు సీట్ల కేటాయింపు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అన్ని రంగాల్లోనూ మహిళల భాగ స్వామ్యాన్ని సగానికి చేర్చడం ద్వారా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.ఆంధ్ర జ్యోతి సౌజన్యముతో 

లెడీస్ స్పెషల్ మహిళా సంఘాలకు ప్రత్యేక బ్యాంకు

లెడీస్ స్పెషల్
మహిళా సంఘాలకు ప్రత్యేక బ్యాంకు
రాష్ట్రస్థాయి ఫెడరేషన్ ఏర్పాటు.. నా బార్డు రుణం నేరుగా బదిలీ
వాటి ద్వారానే మహిళలు అప్పులు.. మైక్రో ఫైనాన్స్‌లకూ అడ్డుకట్ట

అయ్యా... బాబూ... మా ఆడపడుచులకు రుణాలివ్వండి! అని బ్యాంకుల చుట్టూ తిరగక్కర్లేదు. బ్యాంకులకు రుణ లక్ష్యాలను నిర్దేశించడం, పంపిణీ ఎంత వరకు వచ్చిందని అడగడం... ఇలాంటి తంటాలతో పని లేదు. మహిళా స్వయం సహాయ సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు రుణాలిచ్చేందుకు.. మహిళల కోసమే ఓ బ్యాంకు ఏర్పాటవుతోంది.

హైదరాబాద్, ఏప్రిల్ 3 : ఎస్‌హెచ్‌జీలకు ఏటా వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ, ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తున్నారు. అయినప్పటికీ... మహిళలకు పూర్తిస్థాయిలో రుణాలు అందడంలేదు. అనేక మంది బ్యాంకు రుణాలు లభించక ప్రైవేటు వడ్డీ వ్యాపారులను, సూక్ష్మ రుణ సంస్థలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ కష్టాలకు పరిష్కారంగానే 'మహిళా బ్యాంక్' ఏర్పాటు అవుతోంది. ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉన్న ఈ బ్యాంక్ అతి త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ)లకు రుణాలు ఇవ్వడం ఒక్కటే ఈ బ్యాంకు పని!

ఎస్‌హెచ్‌జీలకు రాష్ట్రంలో పదేళ్లుగా రుణాలులిస్తున్నారు. గతంలో వెలుగు పేరుతో ఉన్న ఈ ప్రాజెక్టు వైఎస్ అధికారంలోకి వచ్చాక ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ)గా మారింది. రాష్ట్రంలో 9.5 లక్షలకు పైగా ఎస్‌హెచ్‌జీలు ఉన్నాయి. మహిళా బృందాలకు ప్రభుత్వ, ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా ఏటా వేల కోట్ల రుణాలు అందజేస్తున్నారు. ఆరేళ్ల క్రితం పావలా వడ్డీ పథకాన్ని కూడా ప్రకటించారు.

2014 నాటికి కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు ఇప్పిస్తామని... తద్వారా కోటి మంది మహిళలను లక్షాధి కారులను చేస్తామని వైఎస్ పదే పదే ప్రకటించే వారు. మహిళల కోసం ప్రత్యేక బ్యాంకును కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దశల వారీగా లక్ష కోట్ల రుణాలను అందించేందుకు వీలుగా అప్పట్లోనే కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.

లక్ష్యాలకు అనుగుణంగా రుణ పంపిణీ చేయలేకపోయినప్పటికీ... ఏటా రుణ పరపతిని మాత్రం పెంచుతున్నారు. ఎస్‌హెచ్‌జీలకు 2010-11లో రూ. 7296 కోట్లు రుణాలుగా అందించాలని నిర్ణయించారు. కానీ... రూ. 7068 కోట్లు మాత్రమే అందించగలిగారు. 2011-12లో మహిళా సంఘాలకు 9100 కోట్లు రుణాలు ఇప్పించాలని నిర్ణయించారు. కోర్ గ్రూపుగా ఏర్పాటు చేసిన బ్యాంకుల ద్వారా ఈ రుణాలు అందజేస్తున్నారు. రుణాల రికవరీ (చెల్లింపులు) ఆధారంగా పావలా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నారు.

నాబార్డు చెల్లించే నిధులనే బ్యాంకులు మహిళా సంఘాలకు రుణాలు అందిస్తున్నాయి. నాబార్డు విధించే వడ్డీకంటే బ్యాంకులు అదనంగా మరింత ఎక్కువ వసూలు చేస్తున్నాయి. పైగా... ఈ రుణాలు పొందడంలో మహిళా సంఘాల ప్రతినిధులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల చుట్టూ పదే పదే తిరగాల్సివస్తోంది. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. రుణాల కోసం ప్రయత్నించడమే మానుకుంటున్నారు.

చివరికి అధికారులు చొరవ తీసుకుని, బ్యాంకు సిబ్బందికి నచ్చజెప్పి ఎంతోకొంత మేరకు రుణాలు అందేలా చూస్తున్నారు. ఇంత చేస్తున్నా... మహిళలు అప్పు కోసం మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించక తప్పడంలేదు. దీంతో ఏటా వేల కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా అందించడం కన్నా... ప్రత్యేకంగా మహిళా బ్యాంకును ఏర్పాటు చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రతిపాదించింది. నాబార్డు ద్వారా నేరుగా రుణాలివ్వాలని నిర్ణయించింది.

తొలుత రాష్ట్ర స్థాయి ఫెడరేషన్...
ప్రత్యేక బ్యాంకు ఏర్పాటులో భాగంగా... తొలుత రాష్ట్ర స్థాయిలో మహిళా సంఘాల సమాఖ్య (ఫెడరేషన్) ఏర్పాటు చేయాలని సెర్ప్ భావిస్తోంది. ప్రస్తుతం ఒక గ్రామంలో సంఘాలన్నింటినీ గ్రామైక్య సంఘంగా, ఒక మండలంలోని గ్రామైక్య సంఘాలన్నింటినీ కలిసి మండల సమాఖ్యగా, ఒక జిల్లాలోని మండల సమాఖ్యలన్నింటినీ కలిసి జిల్లా సమాఖ్యగా ఏర్పాటు చేశారు.

ఇప్పుడు... జిల్లా స్థాయి సమాఖ్యలన్నింటినీ కలిపి రాష్ట్రస్థాయిలో ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫెడరేషన్‌కు నాబార్డు ద్వారా నేరుగా రుణాలు ఇప్పిస్తారు. ఈ విధానంలో రాష్ట్ర స్థాయి ఫెడరేషన్ నుంచి జిల్లాకు, అక్కడి నుంచి మండలాలకు, గ్రామ సమాఖ్యలకు... చివరగా సంఘాల సభ్యులకు రుణాలు అందించడం జరుగుతుంది. వెరసి... బ్యాంకులు చేసే పని, రాష్ట్రస్థాయి మహిళా సమాఖ్య చేస్తుందన్న మాట.

ఎన్నో ప్రయోజనాలు
నాబార్డు ద్వారా నేరుగా మహిళా ఫెడరేషన్‌కు... వారి నుంచి మహిళలకు రుణాలు అందించడంవల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని సెర్ప్ భావిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా... మహిళా ప్రతినిధులు బ్యాంకుల చుట్టూ తిరగక్కర్లేదు.
అవసరమైన నిధులు ఫెడరేషన్ వద్దే అందుబాటులో ఉంటాయి కాబట్టి... రుణ పంపిణీలో ఆలస్యం జరగదు. నాబార్డు లెక్కల ప్రకారం వడ్డీ సైతం తక్కువగానే ఉంటుంది. తద్వారా పావలా వడ్డీ భారం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో... సాధ్యమైనంత త్వరగా మహిళా ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఆంధ్ర జ్యోతి సౌజన్యముతో