లెడీస్ స్పెషల్
మహిళా సంఘాలకు ప్రత్యేక బ్యాంకు
రాష్ట్రస్థాయి ఫెడరేషన్ ఏర్పాటు.. నా బార్డు రుణం నేరుగా బదిలీ
వాటి ద్వారానే మహిళలు అప్పులు.. మైక్రో ఫైనాన్స్‌లకూ అడ్డుకట్ట
అయ్యా... బాబూ... మా ఆడపడుచులకు రుణాలివ్వండి! అని బ్యాంకుల చుట్టూ తిరగక్కర్లేదు. బ్యాంకులకు రుణ లక్ష్యాలను నిర్దేశించడం, పంపిణీ ఎంత వరకు వచ్చిందని అడగడం... ఇలాంటి తంటాలతో పని లేదు. మహిళా స్వయం సహాయ సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు రుణాలిచ్చేందుకు.. మహిళల కోసమే ఓ బ్యాంకు ఏర్పాటవుతోంది.
హైదరాబాద్, ఏప్రిల్ 3 : ఎస్‌హెచ్‌జీలకు ఏటా వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ, ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తున్నారు. అయినప్పటికీ... మహిళలకు పూర్తిస్థాయిలో రుణాలు అందడంలేదు. అనేక మంది బ్యాంకు రుణాలు లభించక ప్రైవేటు వడ్డీ వ్యాపారులను, సూక్ష్మ రుణ సంస్థలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ కష్టాలకు పరిష్కారంగానే 'మహిళా బ్యాంక్' ఏర్పాటు అవుతోంది. ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉన్న ఈ బ్యాంక్ అతి త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ)లకు రుణాలు ఇవ్వడం ఒక్కటే ఈ బ్యాంకు పని!
ఎస్‌హెచ్‌జీలకు రాష్ట్రంలో పదేళ్లుగా రుణాలులిస్తున్నారు. గతంలో వెలుగు పేరుతో ఉన్న ఈ ప్రాజెక్టు వైఎస్ అధికారంలోకి వచ్చాక ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ)గా మారింది. రాష్ట్రంలో 9.5 లక్షలకు పైగా ఎస్‌హెచ్‌జీలు ఉన్నాయి. మహిళా బృందాలకు ప్రభుత్వ, ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా ఏటా వేల కోట్ల రుణాలు అందజేస్తున్నారు. ఆరేళ్ల క్రితం పావలా వడ్డీ పథకాన్ని కూడా ప్రకటించారు.
2014 నాటికి కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు ఇప్పిస్తామని... తద్వారా కోటి మంది మహిళలను లక్షాధి కారులను చేస్తామని వైఎస్ పదే పదే ప్రకటించే వారు. మహిళల కోసం ప్రత్యేక బ్యాంకును కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దశల వారీగా లక్ష కోట్ల రుణాలను అందించేందుకు వీలుగా అప్పట్లోనే కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
లక్ష్యాలకు అనుగుణంగా రుణ పంపిణీ చేయలేకపోయినప్పటికీ... ఏటా రుణ పరపతిని మాత్రం పెంచుతున్నారు. ఎస్‌హెచ్‌జీలకు 2010-11లో రూ. 7296 కోట్లు రుణాలుగా అందించాలని నిర్ణయించారు. కానీ... రూ. 7068 కోట్లు మాత్రమే అందించగలిగారు. 2011-12లో మహిళా సంఘాలకు 9100 కోట్లు రుణాలు ఇప్పించాలని నిర్ణయించారు. కోర్ గ్రూపుగా ఏర్పాటు చేసిన బ్యాంకుల ద్వారా ఈ రుణాలు అందజేస్తున్నారు. రుణాల రికవరీ (చెల్లింపులు) ఆధారంగా పావలా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నారు.
నాబార్డు చెల్లించే నిధులనే బ్యాంకులు మహిళా సంఘాలకు రుణాలు అందిస్తున్నాయి. నాబార్డు విధించే వడ్డీకంటే బ్యాంకులు అదనంగా మరింత ఎక్కువ వసూలు చేస్తున్నాయి. పైగా... ఈ రుణాలు పొందడంలో మహిళా సంఘాల ప్రతినిధులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల చుట్టూ పదే పదే తిరగాల్సివస్తోంది. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. రుణాల కోసం ప్రయత్నించడమే మానుకుంటున్నారు.
చివరికి అధికారులు చొరవ తీసుకుని, బ్యాంకు సిబ్బందికి నచ్చజెప్పి ఎంతోకొంత మేరకు రుణాలు అందేలా చూస్తున్నారు. ఇంత చేస్తున్నా... మహిళలు అప్పు కోసం మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించక తప్పడంలేదు. దీంతో ఏటా వేల కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా అందించడం కన్నా... ప్రత్యేకంగా మహిళా బ్యాంకును ఏర్పాటు చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రతిపాదించింది. నాబార్డు ద్వారా నేరుగా రుణాలివ్వాలని నిర్ణయించింది.
తొలుత రాష్ట్ర స్థాయి ఫెడరేషన్...
ప్రత్యేక బ్యాంకు ఏర్పాటులో భాగంగా... తొలుత రాష్ట్ర స్థాయిలో మహిళా సంఘాల సమాఖ్య (ఫెడరేషన్) ఏర్పాటు చేయాలని సెర్ప్ భావిస్తోంది. ప్రస్తుతం ఒక గ్రామంలో సంఘాలన్నింటినీ గ్రామైక్య సంఘంగా, ఒక మండలంలోని గ్రామైక్య సంఘాలన్నింటినీ కలిసి మండల సమాఖ్యగా, ఒక జిల్లాలోని మండల సమాఖ్యలన్నింటినీ కలిసి జిల్లా సమాఖ్యగా ఏర్పాటు చేశారు.
ఇప్పుడు... జిల్లా స్థాయి సమాఖ్యలన్నింటినీ కలిపి రాష్ట్రస్థాయిలో ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫెడరేషన్‌కు నాబార్డు ద్వారా నేరుగా రుణాలు ఇప్పిస్తారు. ఈ విధానంలో రాష్ట్ర స్థాయి ఫెడరేషన్ నుంచి జిల్లాకు, అక్కడి నుంచి మండలాలకు, గ్రామ సమాఖ్యలకు... చివరగా సంఘాల సభ్యులకు రుణాలు అందించడం జరుగుతుంది. వెరసి... బ్యాంకులు చేసే పని, రాష్ట్రస్థాయి మహిళా సమాఖ్య చేస్తుందన్న మాట.
ఎన్నో ప్రయోజనాలు
నాబార్డు ద్వారా నేరుగా మహిళా ఫెడరేషన్‌కు... వారి నుంచి మహిళలకు రుణాలు అందించడంవల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని సెర్ప్ భావిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా... మహిళా ప్రతినిధులు బ్యాంకుల చుట్టూ తిరగక్కర్లేదు.

అవసరమైన నిధులు ఫెడరేషన్ వద్దే అందుబాటులో ఉంటాయి కాబట్టి... రుణ పంపిణీలో ఆలస్యం జరగదు. నాబార్డు లెక్కల ప్రకారం వడ్డీ సైతం తక్కువగానే ఉంటుంది. తద్వారా పావలా వడ్డీ భారం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో... సాధ్యమైనంత త్వరగా మహిళా ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఆంధ్ర జ్యోతి సౌజన్యముతో