సంక్షేమం' లేని అంగన్‌వాడ
కార్యకర్తల నెత్తిన బండచాకిరి..!
(ఎర్రోజు శ్రీనివాస్ వి.వి, కరీంనగర్)
నేటి బాలలే రేపటి పౌరులన్న స్పృహతో భారీ బహుముఖ వికాసా నికి ప్రభుత్వాలు వెచ్చించే ప్రతి రూపాయి భారతావని బంగరు భవితవ్యానికి అమూల్యమైన పెట్టు బడి. శిశు జననం నుంచి సంపూర్ణ మానవుడిగా ఎదుగుదల కోసం సమస్త సేవలు సమకూర్చాలన్న 1974 నాటి జాతీయ విధాన పత్రంలో పొంగులు వారింది. అదే స్ఫూర్తి, ఆ స్వప్నం సాకారం చేయ డానికే అవతరించిన సమగ్ర శిశు అభివృద్ధి పథకం( ఐసిడిఎస్) వాస్త వంలో ఎలా నీరోడుతున్నదో డిమాండ్ల సాధన పేరిట తరచూ రోడ్డెక్కాల్సి వస్తున్న అంగన్‌వాడి సిబ్బంది దురావస్తే కళ్ళకు కడు తుంది. అప్పటికీ గండం గట్టెక్క డానికి నాయకుల కంటి తుడుపు హామీలు, బుడిబుడి దీర్ఘాలతో పరిస్థితి అమాంతం సానుకూల పడుతుందన్న భ్రమలు ఎవరికీలేవు. దేశవ్యాప్తంగా 22 లక్షలమంది అంగన్‌వాడి కార్మికులకు వేతనాలు రెండింతలు పెంపు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీ బడ్జెట్ మోతెక్కించటం తెలిసిందే. ఏప్రిల్ 1వ తేదీనుంచి అమలవుతుందన్న పెంపుదల ప్రకారం సహాయకుల కొత్తవేతనం నెలకు రూ||లు 1500, కార్యకర్తలకు రూ||లు 3000. నిత్యా వసర వస్తువుల ధరలు చుక్కల్ని తాకుతున్నపుడు అరకొర రాబడితో బతికేదెలాగని అంగన్‌వాడి సిబ్బంది ఆక్రోశిస్తున్నారు. రాష్ట్ర నలుమూ లలనుంచి హైదరాబాద్‌కు తరలి వచ్చిన కార్మికులు, కార్యకర్తలు, సహాయకులు, పాతబాకీలు తీర్చా లని, సహేతుక జీతభత్యాలు ఇవ్వా లని గళమెత్తడం వెనక విస్తృత నేప థ్యం ఎంతో బాధాకరం. తమను కనికరించడంతో పాటు అంగన్‌వాడి కేంద్రాల్లోని పిల్లలకు మధ్యాహ్నవేళ తిండి ఏర్పాట్లు చూడాలని, పౌష్ఠికా హార పంపిణీ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టరాదన్న డిమాండ్లు వేళ్ళు తన్నుకున్న ఆ వ్యవస్థకు అద్దంపడుతున్నాయి. సిబ్బంది తీవ్ర అసంతృప్తితో దహించుకు పోతుండగా ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఇవ్వాల్సిన టీకాలు, రక్తహీనతకు గురికాకుండా గర్భవతులకు, కిషోర బాలికలకు మందుల పంపిణీ చాలాచోట్ల కాగితాలకే పరిమితమవుతున్నాయి. అందుకే పిల్లల ఆరోగ్యకర ఎదుగుదల ఎండమావిని తలపిస్తోంది. దేశవ్యాప్తంగా సమీకృత ఘోరవైఫల్యాన్ని జనార్ధన్ ద్వివేది సారథ్యంలోని పార్లమెంటరీస్థాయి సంఘం ధృవీకరించింది. తన వంతుగా సర్వోన్నత న్యాయస్థానం అంగన్‌వాడి కేంద్రాల నిర్వహణ ఎందుకిలా చతికిల పడిందని కేంద్రాన్ని సూటిగా నిగ్గతీసింది. నేటికీ సరైన దిద్దుబాటు చర్యలే కరువు! ప్రపంచంలోనే అతి పెద్ద పోషకాహార పథకం, అనునిత్యం ఏడు కోట్లకుపైగా పిల్లలకు సుమారు కోటిన్నర మంది బాలింతలకు, గర్భిణీలకు పది లక్షల కేంద్రాలలో ఆసరాగా నిలుస్తుందన్న గణాంకాలవల్లే వెతతో సర్కారు మురిసిపోతున్నది. ఆరేళ్లలోపు పిల్లల సంఖ్య సుమారు 17 కోట్లని అంచనా. వారిలో యాభై శాతానికైనా రక్షణ లేదు! ఐసిడిఎస్‌ను సార్వత్రీకరించడానికి అదమపక్షం 14 లక్షల అంగన్‌వాడి కేంద్రాలు నెలకొల్పాలన్నది నాలుగేళ్ళనాటి సుప్రీం సూచన. ఆ స్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లకు అవకాశం, సన్నద్దత కనుచూపుమేరలో కానరావడంలేదు. ప్రతిష్టాత్మక పథకం పది, పదకొండు కోట్లమంది పిల్లలను గాలికొదిలేసిందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగే లెంపలేసుకున్నారు. పిల్లల్ని జాతి సంపదగా పరిగణిస్తున్నామని, వారి అభ్యున్నతికి చేయగలిగినంత చేస్తామని బులిపించిన యుపిఏ నాయకగణం, సమస్య మూలాలపై దృష్టి సారించడమేలేదు. నిర్ధిష్ఠ కాల వ్యవధిలో విస్తరణ వ్యూహాల మాట దేవుడెరుగు, ఇప్పటికే నడిపిస్తున్నామన్న అంగన్‌వాడి కేంద్రాల నిర్వహణ పరమ అధ్వాన్నం. దేశీయంగా పిల్లల మరణాలలో సగందాకా పోషకాహార లోపాల వల్లే సంభవిస్తున్నాయన్న అధ్యయనాలు- ఐసిడిఎస్ లోపభూయిష్టమని నిర్దారించాయి. సబ్బందిని పస్తులు పెట్టి, అధికారుల పర్యవేక్షణను నామమాత్రం చేసి పోషకాహార నిలువలని పక్క దారి పట్టిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలోనే తిష్టవేసింది. ప్రతి వేయి మంది జనాభాకు ఒక అంగన్‌వాడి కేంద్రం నెలకొల్పాలని గిరిజన ప్రాంతాల్లో 700 మందికి ఒక కేంద్రం పనిచేసేలా చూడాలన్నది సర్వోన్నత మార్గదర్శక సూత్రం. మంజూరైన కేంద్రాలన్నీ పూర్తి స్థాయిలో సమర్థంగా నిర్వహించలేని ప్రభుత్వాల అసమర్ధతే దేశంలో సంక్షేమ భావనకు అతిపెద్ద విఘాతం. గర్భిణులకు, బాలింత లకు, కిషోరబాలికలకు సంవ త్సరంలో కనీసం మూడువందల రోజులపాటు సరైన పోషకాహారం అందించాల్సిన బాధ్య త ప్రభుత్వాల దేనన్న సుప్రీం తీర్పు, దేశ రాజధా నిలోనే కొళ్ళబోతున్నది. అక్కడి కొన్ని కేంద్రాల్లో లబ్ధిదా రులకు ఏడాదిలో సగటున 150 రోజులపాటు ఆహార పంపణీకి దిక్కులేదని లోగడే వెల్ల డైంది. ఆ రికార్డును బద్దలు కొట్టడానికి కావ లసిన సంబరాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో దండిగా పోగుప డ్డాయి. రాష్ట్రంలో ఏటా పదహారు లక్షల మేరకు జననాలు నమోదవు తుండగా, లక్ష మంది శిశువులు పొత్తిళ్లలోనే మరణి స్తున్నారు. 61 శాతం పిల్లలకు పౌష్ఠికాహారం లభించడంలేదు. 71శాతం బాలలు రక్తహీనతతో సతమతమవుతున్నారు. పేరుకు 80 వేలకు పైగా అంగన్ వాడీలు మంజూరైనా అధికారికంగా నిర్వహి స్తున్నవి 70 వేల లోపే. పర్య వేక్షణా అధికారుల నియామకాల్లో పీనాసితనం, నిఘాకు తూట్లుపొ డుస్తున్నది. ఇరుకు అద్దె భవనాలు, సిబ్బంది కొరత, తూతూ మంత్రంగా కేంద్రాల నిర్వహణ, గౌరవ వేత నాలను ఆరేడు నెలలకు విదిలించ డం, అనేకానేక రుగ్మతలకు అంటుక డుతున్నట్లు సామాజిక తనిఖీలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా క్షేత్రస్థాయిలో జరిగే కార్య క్రమాలన్నింటి పని భారాన్ని అంగన్‌వాడి కార్యకర్తల నెత్తిన రుద్దేసి బండ చాకిరి చేయించు కుంటూనే, వారికి తగిన పరిహారం ముట్టచెప్ప కపోవడం అమానుషం.
కేంద్రాలలో సంక్షేమం వాలిపో వడానికి అదే మూలకారణం. కనీస వేతన చట్టాన్ని అపహసిస్తూ సర్కారు సాగిస్తున్న శ్రమదోపిడీకి అడ్డుకట్ట పడినప్పుడే అంగన్‌వాడీలకు స్వాంతన, కేంద్రాలలో మౌలిక లోటుపాట్లను సరిదిద్ధిన్నాడే అసంఖ్యాక భావిపౌరుల బతుకుల్లో వెలుగురేఖలు వెదజల్లుతాయి.