పిచ్చి జనాలు…

పిచ్చి జనాలు…


పిచ్చి జనాలు,
మందలో మేకలు,
బుర్ర ఉన్నా, లేకున్నా,
తేడా లేని మహా మేధావులు!

అన్యాయం, అన్యాయం,
అంటూ ఆక్రోశిస్తూ,
న్యాయమేమిటో తెలీని,
న్యాయమూర్తులు ఈ పిచ్చి జనాలు!

మోసపోతూ,
మళ్ళి మళ్లీ మోసపోతూ,
మోసానికి అలవాటైపోతూ,
అలవాట్ల పొరపాట్లకు,
నవ్వాలో, ఏడవాలో కూడా తెలీని,
ఘరానా మోసకారులు ఈ పిచ్చి జనాలు!

నేటి న్యూస్ పేపర్ చదువుతూ,
ఆవేశం తెచ్చుకుని,
రేపటికల్లా మర్చిపోయే,
మహా ఞాపకస్తులు ఈ పిచ్చి జనాలు!

లంచాలు ఇస్తూ,
పనులు చేపించుకుంటూ,
అధికారులు లంచగొండులు అంటూ,
వాపోయే నీతిమంతులు ఈ పిచ్చి జనాలు!

“అన్నీకావాలంటూ” సమ్మెలు చేస్తూ,
బస్సులు తగలేస్తూ,
బడులు,షాపులు మూసేస్తూ,
కాలాన్ని కాల్చేస్తూ,
“ఏమేమి కావాలో చెప్పు” అంటే,
నాయకుల కాళ్ళు, కళ్ళు చూసే,
సమ్మేకారులు ఈ పిచ్చి జనాలు!

ఐదేల్లకొకసారి నేరగాడిపై,
తుపాకీ పేల్చే అధికారమున్నా,
తుపాకీ గుండును,
నేరగాడి జేబులో పెట్టి,
ఎదురుకాల్పుల్లో ఎన్కౌంటర్ అయ్యే,
దయగల సహృదయులు ఈ పిచ్చి జనాలు!

సూటుబూటు వేసుకుని,
సాఫ్ట్వేర్ ఆఫీసులో కూర్చుని,
ప్రోగ్రామ్స్ ఎడాపెడా రాసేసే వీరులు,
ఓటు వెయ్యటానికి కూడా తీరిక లేని,
బిజీకారులు ఈ పిచ్చి జనాలు!

భాద్యత, హక్కులకు తేడా తెలీని,
సగటు జనాలు ఈ పిచ్చి జనాలు!

ఈ పిచ్చి రాతలు రాస్తున్న నేను,
ఈ పిచ్చి జనాల పిచ్చికి,
ప్రతీకను!!

మీకీ పిచ్చి గోల నచ్చకపోతే ఇక్కడ క్లిక్ చెయ్యకండి……నన్ను “ఈ పిచ్చి గోల ఏంటమ్మా”,అని తిట్టకండి… సమాజంలో సామాన్య మానవుడు

This entry was posted in కవితలు, సమాజంలో సామాన్యులు. Bookmark the permalink.
Be the first to like this post.

10 Responses to పిచ్చి జనాలు…..

సురేష్ says: