దళితులను దగా చేస్తున్నారు

దళితులను దగా చేస్తున్నారు

  • జాన్‌వెస్లీ
  • రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
  • కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం
ఈ సంవత్సరం మొత్తం బడ్జెట్‌ లక్షా 28 వేల 542 కోట్లలో దళితుల సంక్షేమానికి కేవలం 2,352 కోట్లు (1.82 శాతం) మాత్రమే కేటాయించారు. మొత్తం ప్రణాళిక బడ్జెట్‌ 47,558 కోట్లలో ఎస్‌సి సబ్‌ప్లాన్‌ ప్రకారం దళితులకు 7,704.40 కోట్లు క్రోడీకరించి ఎస్‌సి నోడల్‌ ఏజెన్సీకి కేటాయించాలన్న దళితుల డిమాండ్‌ను పెడచెవిన పెట్టారు. దళితులకు ప్రయోజనం లేని రంగాలకు ఈ నిధులు కేటాయించి దళితులను దగా చేస్తున్నారు. బడ్జెట్‌ను సవరించి ఎస్‌సి సబ్‌ ప్లాన్‌ దళితులకు ఖర్చు చేయాల్సిన నిధులు 7,704 కోట్లు ఎస్‌సి నోడల్‌ ఏజెన్సీకి కేటాయించాలి. దళితవాడల అభివృద్ధికి 10 వేల కోట్లు అదనంగా కేటాయించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీి డిమాండ్‌ చేస్తోంది.ఉపాధి హామీ పథకానికి కేటాయించిన రూ.600 కోట్లలో ఎస్సీ, ఎస్టీల భూముల అభివృద్ధికి, కమ్యూనిటీ హాల్స్‌ నిర్మాణానికి రూ.300 కోట్లు, జలయజ్ఞానికి కేటాయించిన రూ.15,010 కోట్లలో ఎస్‌సి సబ్‌ప్లాన్‌ ప్రకారం రావల్సిన రూ.2,400 కోట్లు, చిన్న నీటి పారుదల ద్వారా దళితుల భూములకు సాగునీరు అందించేందుకు కేటాయించాలి. గ్రామీణాభివృద్ధికి కేటాయించిన రూ.3,341 కోట్లలో దళితవాడల అభివృద్ధికి వెయ్యి కోట్లు, గ్రామీణ రోడ్లకు కేటాయించిన రూ.672 కోట్లలో దళిత వాడల్లో రోడ్ల నిర్మాణానికి రూ.300 కోట్లు, గ్రామీణ నీటి సౌకర్యానికి కేటాయించిన రూ.773 కోట్లలో దళితవాడలకు మంచినీటి సౌకర్యానికి రూ.200 కోట్లు కేటాయించాలి.

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి 2007-08లో 600 కోట్లు కేటాయించి ఈ సంవత్సరం 60 కోట్లకు తగ్గించారు. 13 లక్షల ఇళ్ళ నిర్మాణానికి 13000 కోట్లు కేటాయించాల్సి వుండగా, ఇళ్ళ స్థలాల కొనుగోలు, దళితుల సాగుభూమి కొనుగోలు పథకాలను ఎత్తేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించిన 385 కోట్లు అదనపు అభివృద్ధికి కేటాయించిన 400 కోట్లు మొత్తం ఎస్‌సి, ఎస్‌టివాడల అభివృద్ధికి ఖర్చు చేయాలి. దళితవాడల సమగ్రాభివృద్ధికి గతంలో కోత విధించిన నిధుల్లో 10 వేల కోట్లు ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నాం. సాంఘిక సంక్షేమ శాఖకు 3,500 కోట్లు అవసరం కాగా 2,352 కోట్లు మాత్రమే కేటాయిం చారు. ఎస్‌సి కార్పోరేషన్‌కు గత సంవత్సరం 88 కోట్ల నుండి 10 కోట్లు కోత విధించారు. దళితులకు నిధులను దళితులకు ప్రయోజనం లేని రంగాలకు ధార పోశారు. ఈ బడ్జెట్‌ను సవరించి దళితులకు రావసిన 7704 కోట్లు, గతంలో కోత విధించిన 10 వేల కోట్లు దళితవాడల అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నాము.

మంటగలుస్తున్న శేష ప్రతిష్ట

ప్రజాస్వామ్యం పరిఢవిల్లాల్సిన రాష్ట్ర శాసనసభ దౌర్జన్యాలకు, భౌతిక దాడులకు, దొమ్మీలకు వేదిక కావడం ఆందోళనకరం. సంయుక్త అసెంబ్లీలో గవర్నర్‌కు అవమానం, శాసనసభ ఆవరణలో ఎమ్మెల్యేపై దాడి ఘటనలు మరవక ముందే సోమవారం ఒక మంత్రి నిండు శాసనసభలో ప్రతిపక్ష సభ్యులపై చేయి చేసుకోవడం గర్హనీయం. ఈ దుర్మార్గాన్ని ఖండించడానికి మాటలు చాలవు. వ్యవసాయ శాఖ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి అమాంతం టిడిపి సభ్యుల వద్దకు దూసుకెళ్లి వారి చేతుల్లోని ప్లకార్డులను చించిపారేసి ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి చేశారు. మీసం మెలేసి తొడగొట్టారు. టిడిపి సభ్యులపై తిట్ల దండకం ఎత్తుకున్నారు. పరుష పదజాలంతో వీరంగం వేశారు. సభలో రౌడీయిజం చేసిన వివేకాను మంత్రి, ఎమ్మెల్సీ పదవుల నుండి బర్తరఫ్‌ చేయాలంటూ ప్రతిపక్షాల నుండి నిరసనలు మిన్నంటడంతో విధిలేక ప్రభుత్వం దిగొచ్చింది. నా ఆవేశానికి మన్నించండి అంటూ రాతపూర్వక ప్రకటనను వివేకా చదవాల్సి వచ్చింది. మంత్రే దౌర్జన్యం చేయడంతో విధిలేక ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం క్షమాపణ చెప్పారు. వివేకా 'ప్రాయశ్చిత్త' ప్రకటనపై టిడిపి అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఉపసభాపతి సమక్షంలో జరిగిన ఫ్లోర్‌ లీడర్ల సమావేశంలో అధికార, ప్రతిపక్షాల మధ్య పరస్పర అంగీకారం మేరకు వివేకా ప్రకటనతో సమస్య సద్దుమణిగింది. ఇప్పటికి సమస్య సమసిపోయినట్లు కనబడినా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న, చట్టసభలను తమ దౌర్జన్యాలకు వేదికలుగా చేసుకుంటున్న ప్రజా ప్రతినిధుల ప్రవర్తనను చూసి ప్రతి ప్రజాతంత్ర వాదీ తలదించుకోవాల్సి వస్తోంది. ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చలు, ప్రజోపయోగ శాసనాలు చేయాల్సిన సభలో ఇలాంటి వికృత చేష్టలకు అధికార పక్షమే దిగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. చట్ట సభలంటే ప్రజల్లో విశ్వాసం క్రమంగా అంతరించిపోతోంది. సభల పరువు అడుగంటుతోంది.
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుండి ఏ రోజు ఏం జరుగుతుందో గుండెలదిమి పట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికే చట్టసభలన్నా, నేతలన్నా, ప్రజాస్వామ్యమన్నా, ఎన్నికలన్నా ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఏహ్యాభావం అలముకుంటోంది. తమ గురించి ఆలోచించని వారికి ఓట్లెందుకు వేయాలన్న ప్రశ్నలు ప్రజల నుండి వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో చట్ట సభల్లో జరుగుతున్న విపత్కర సంఘటనలు వారిని మరింతగా అసహ్యం కలిగిస్తున్నాయి. ఫిబ్రవరి 17న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్‌కు జరిగిన అమర్యాద, జెపిపై ఎమ్మెల్యేల దాడిని అన్ని పార్టీలూ, అందరు సభ్యులూ ఖండించారు. అంతలోనే శాసనసభలో మంత్రి వివేకా వీరంగం చోటు చేసుకుంది. వివేకానందరెడ్డికి చట్టసభలు, సంప్రదాయాలు కొత్త కాదు. గత పాతిక ముప్పై ఏళ్లుగా ఎమ్మెల్యే, ఎంపి, ఎమ్మెల్సీ పదవులను వెలగబెట్టారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర కేబినెట్‌ మంత్రి. అంతేకాదు శాసనమండలిలో అధికార పక్షానికి ఫ్లోర్‌లీడర్‌. శానసభలో ముఖ్యమంత్రి ఎలాగో మండలిలో వివేకా హోదా అలాంటిది. తన స్థాయిని ఆయన మర్చిపోయి ప్రవర్తించారు. శాసనసభ విలువలకు నిలువెత్తు పాతరేశారు. ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాల్జేశారు. మంత్రులు అసెంబ్లీలో ఇంత ఇలా ప్రవర్తిస్తారా అని ప్రజలు విస్తుపోయేటట్లు చేశారు. ఎక్కడో సీమ సందుల్లో ఫ్యాక్షనిస్టులు తొడలు గొట్టడం తెలుగు సినిమాల్లో చూస్తున్నార. ఇప్పుడు రాష్ట్ర శాసనసభలో మంత్రే అందుకు పూనుకోవడం చూపడం ప్రజాస్వామిక వాదులు జీర్ణించుకోలేని వైపరీత్యం. పదేళ్లకో పదిహేనళ్లకో ఒక రోజు ప్రజాస్వామ్యానికి బ్లాక్‌డే, చీకటి దినం, గొడ్డలిపెట్టు వంటి పదాలు వినేవాళ్లం. ప్రస్తుతం ప్రతి రోజూ దాదాపు బ్లాక్‌డేలే అవుతుంటే తెలుగు నిఘంటువులో కొత్త పదాలు వెతకాల్సి ఉంది.
సభలో దొమ్మీకి పాల్పడిన మంత్రి వివేకా తన పశ్చాత్తాప ప్రకటనలోనూ రాజకీయం చేశారు. తన అన్న వైఎస్సార్‌ను అనరాని మాటలంటే ఆవేశం వచ్చిందని, టిడిపి మొదటి నుండి ప్రతి పథకాన్నీ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. కొందరు కాంగ్రెస్‌ నేతలు, మంత్రులు వైఎస్‌ను అదే పనిగా తిడుతుండగా రాని కోపం టిడిపి వాళ్లు ప్లకార్డులు చూపిస్తే ఎందుకొచ్చిందో వివేకా సమాధానం చెపాల్సి ఉంది. ప్రతిపక్షాలు ఏ సమస్య లేవనెత్తినా ప్రభుత్వం అసహనానికి లోనవుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ప్రభుత్వ పక్ష సభ్యులు ప్రతిపక్షాలపై కాలు దువ్వడం రివాజైంది. సంయమనం పాటించాల్సిన ప్రభుత్వ పక్షం ఎదురుదాడి చేయడం, ప్లకార్డులతో గోల చేయడం కొత్త తరహా వ్యూహం. సభను సజావుగా నడిపించాల్సిన అధికారపక్షం ప్రజా సమస్యలపై చర్చలను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అసెంబ్లీ సంప్రదాయాలను, విలువలను మంటగలుపుతున్న ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. జయప్రకాశ్‌ నారాయణ్‌పై జరిగిన దాడిపట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటిదో తెలిసి పోతూనే ఉంది. ప్రజా సమస్యలపై సభల్లోని సభ్యులందరూ దృష్టి పెడితే తమను ఎన్నుకున్నవారికి న్యాయం చేసినవారవుతారు. లేదంటే చట్ట సభల శేష ప్రతిష్ట కూడా మంటగలుస్తుంది.

దళితులపై దాడి కేసు

దళితులపై దాడి ఘటనకు సంబంధించి తమిళనాడులోని రామనాథపురం పార్లమెంటు సభ్యుడు జెకె రితీష్‌ (డిఎంకె)ను సెంట్రల్‌ జైలుకు పంపారు. తిరువాడనై నియోజకవర్గంలో డిఎంకె అభ్యర్థిగా పోటీచేస్తున్న రాష్ట్ర మంత్రి శుభా తంగవేలన్‌ సోలాందూర్‌ గ్రామంలోని దళితవాడలో సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ గ్రామ పరిధిలోని కలవాకుడి గ్రామానికి వెళ్లే దారి సరిగాలేదని, ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోయిందని కాలనీ వాసులు మంత్రికి విన్నవించారు. తమ సమస్య పరిష్కారం కాలేదని, అందువల్ల తమ కాలనీలో ప్రచారం నిర్వహించరాదంటూ అభ్యంతరం తెలిపారు. ఇది డిఎంకె అభ్యర్థి కోసం ప్రచారానికి వచ్చిన రామనాథపురం ఎంపీ రితీష్‌కు ఆగ్రహం తెప్పించింది. తన వెంట వచ్చిన రౌడీ మూకతో కాలనీపై దాడి చేయించారు. ఆ దాడిలో కాలనీకి చెందిన ఒక వ్యక్తి తీవ్ర
గాయాలపాలై ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కాలనీకి చెందినవారి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసిన పోలీసులు సోమవారం తెల్లవారు ఝామున రితీష్‌తో పాటు మరో ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. వారిని మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా రితీష్‌ను 15 రోజుల రిమాండ్‌కు, మిగిలిన వారిని పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. పోలీసులు రితీష్‌ను మదురై సెంట్రల్‌ జైలుకు తరలించారు. దీంతో జైలులో ఉన్న డిఎంకె పార్లమెంటు సభ్యుల సంఖ్య రెండుకు చేరింది. ఇప్పటికే 2జి స్పెక్ట్రమ్‌ అవినీతి కేసులో డిఎంకె పెరంబలూర్‌ పార్లమెంటు సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి ఎ రాజా తీహార్‌ జైలులో ఉన్న విషయం విదితమే.

దళితుల అభివృద్ధికి ప్రత్యేక చట్టం తేవాలి

ప్రజాశక్తి - యంత్రాంగం   Mon, 28 Mar 2011, IST  
  • సమస్యలు పరిష్కరించకుంటే మరో దఫా ఉద్యమం
  • రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో వక్తల హెచ్చరిక
దళిత, గిరిజనవాడల అభివృద్ధికి ప్రత్యేక చట్టం తేవాలని వ్యవసాయ కార్మిక, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. దళిత, గిరిజనుల అభివృద్ధి కోరుతూ 44 సూచనలతో ప్రభుత్వం ముందు డిమాండ్లు ఉంచాయి. వీటిని తక్షణం పరిష్కరించకుంటే రెండో దఫా పోరాటం తప్పదనీ హెచ్చరించాయి. విజయవాడ, విశాఖ, కర్నూలు, అనంతపురాల్లో ఆదివారం జరిగిన ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశాలను కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నిర్వహించాయి. 'దళిత, గిరిజన గ్రామాల అభివృద్ధికై ఉద్యమాలు-అనుభవాలు-భవిష్యత్తు పోరాటాలు' అంశంపై విశాఖ ద్వారకానగర్‌లోని పౌర గ్రంథాలయంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి.శేషారత్నం అధ్యక్షతన జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆర్థికశాస్త్ర విభాగం ఆచార్యులు ఎం.ప్రసాదరావు మాట్లాడుతూ, దళితులు చదువుకొని చైతన్యవంతులై పోరాడితే తప్ప సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేశారు. కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు కె.లోకనాధం మాట్లాడుతూ దళితుల సంక్షేమం పట్ల నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారికి కేటాయించిన రూ.21 వేల కోట్లను ఎందుకు దారి మళ్లించిందని ప్రశ్నించారు. పాలకవర్గాలు దళితులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయన్నారు. కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌.నాగరాజు, కెవిపిఎస్‌ నగర ఉపాధ్యక్షులు వై.రాజు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, ఉత్తరాంధ్ర దళిత ఐక్యవేదిక నాయకులు బి.గోపాలరావు, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్‌ నాయకులు బి.కల్యాణరావు తదితరులు మాట్లాడారు.
విజయవాడలోని యుటిఎఫ్‌ కార్యాలయంలో 'దళితపేటల అభివృద్ధి' అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. రక్షిత మంచినీటి వసతి కల్పించడానికి ప్రతి దళితవాడకూ రెండు లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు ప్రభుత్వాధికారులూ, పోలీసులు వారంలో ఒక రోజు దళితవాడల్లో పర్యటించాలని కోరారు. సమావేశంలో కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అన్నవరపు నాగేశ్వరరావు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నీలం పుల్లయ్య, చౌటపల్లి రవి, నగర అధ్యక్ష కార్యదర్శులు పి.కోటేశ్వరరావు, జి.నటరాజు, నాయకులు పి.రాజేష్‌ పాల్గొన్నారు.
అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో 'దళిత, గిరిజన వాడల అభివృద్ధి - ప్రభుత్వ హామీలు' అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జి.వీరన్న, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు ఎం.కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు జి.ఓబుళకొండారెడ్డి మాట్లాడారు. అనంతపురం జిల్లాలో దళితులు, గిరిజనులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారన్నారు. కార్యక్రమంలో బిసి కులాల ఐక్య వేదిక నాయకుడు నాగరాజు, మాలమహానాడు నాయకుడు పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూల్లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం బాలఉశెని అధ్యక్షత వహించారు.
కెవిపిఎస్‌ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్‌ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ఏడి ఆశోక్‌ రత్నం, డివైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి నారాయణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సిపి నాయుడు దళితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. 44 సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ముందు డిమాండ్లు ఉంచారు. వాటిని పరిష్కరించకుంటే రెండో దఫా పోరాటాన్ని చేపడతామని వారు తెలిపారు.

వికీలీక్స్‌

యుపిఏ ప్రభుత్వాన్నే కాదు బిజెపీని కూడా సత్యపీఠం ఎక్కించింది వికీలీక్స్‌. అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన కేబుళ్లను అది బయటపెట్టడంతో మన్మోహన్‌ ప్రభుత్వానికి గుక్క తిప్ప్పుకోలేకుండా అయింది. ఇదంతా వచ్చే ఎన్నికల్లో తనకు కలిసివస్తుందనుకున్న బిజెపి నెత్తిన కూడా తాటికాయ పడినంత పనైయింది. ప్రముఖ రాజకీయ నాయకులతో అమెరికా దౌత్యవేత్తలు జరిపిన సంభాషణల కేబుళ్లను కూడా వికీలీక్స్‌ బయట పెట్టింది. కాంగ్రెస్‌తోపాటు బిజెపీనీ ఫిక్స్‌ చేసింది. ఇలాంటి తప్పుడు పద్ధతులకు, రెండు నాల్కల విధానానికి సిపిఎం అతీతమని వికీలీక్స్‌ కేబుళ్లు వెల్లడించాయి. అమెరికా నుంచి అణుఒప్పందాల వరకు బయటేమి చెబుతున్నారో అమెరికా అధికారులు భేటీ అయినపుడు అంతరంగికంగా అదే చెప్పారని ప్రకాష్‌ కరత్‌తో చేసిన సంభాషణల గురించి వెల్లడించిన వికీలీక్స్‌ పత్రాలు సుస్పష్టం చేశాయి. ఇంతవరకు వెల్లడైన అంశాలు మన దేశ పాలకవర్గ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్‌, బిజెపిలకు ఏ మాత్రం విశ్వసనీయత లేదన్నది వెల్లడించాయి. అధికారం నిలుపుకోవటం సంతలో పశువుల్లా పార్లమెంట్‌ సభ్యులనే కొనుగోలు చేయటానికి కాంగ్రెస్‌ వెనుకాడదు. ఓటుకు నోటు ఉదంతంపై వికీలీక్స్‌ వెల్లడించిన సమాచారంతో గుక్కతిప్పుకోలేకపోయిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అదంతా అయిపోయిందని, దానిపై చర్చ తరువాత ఓటర్లు ఇచ్చిన తీర్పు తమకు అనుకూలంగా ఉందని చెప్పుకున్నతీరు పెద్దమనిషిగా పేరున్న వ్యక్తి స్థాయిని దిగజార్చేదే తప్ప పెంచేదికాదు. అదే ప్రాతిపదిక అయితే బాబ్రీ మసీదును కూల్చిన బిజెపి ఆ తరువాతే ఎన్నికలలో గెల్చింది కనుక జనం మసీదును కూల్చేందుకు అంగీకరించారంటే కుదురుతుందా? ఓట్లు తద్వారా సీట్లతో అధికారం కోసం బిజెపి కుహనా హిందూ జాతీయవాదాన్ని నిరంతరం రెచ్చగొడుతుంది. ఆ ముసుగులో హిందూ ముస్లిం విభేదాలను పురికొల్పుతుంది. జనాన్ని మభ్యపెట్టటం కోసమే కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు ఫోజు పెడుతుంది. భారత్‌లో అమెరికా అనుకూల వాతావరణాన్ని, రాజకీయ పునాదిని కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆ పార్టీ నాయకులు సలహాలు ఇస్తారని వెల్లడైంది. బిజెపి అంతరంగాన్ని వెల్లడించిన వారు చిన్నా చితకా నాయకులు కాదు. అద్వానీ తరువాత అగ్రపీఠం కోసం పోటీపడుతున్నవారిలో ఒకరైన అరుణ్‌ జైట్లీ హిందూత్వం ఓట్ల కోసం ముందుకు తెచ్చిన ఒక అవకాశవాదం అని, దానిపై బిజెపి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుందని జైట్లీ తనతో చెప్పారన్నది అమెరికా దౌత్యవేత్త రాబర్ట్‌బ్లేక్‌ నివేదిక సారాంశం. పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి, బంగ్లాదేశ్‌ నుంచి వలసల వంటి ఉదంతాలలో హిందూత్వాన్ని రెచ్చగొట్టి ఓట్లు పోగేసుకొనేందుకు బిజెపి ప్రయత్నించినట్లు జైెట్లీ మాటల తీరుతెన్నులు స్పష్టం చేశాయి. భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శేషాద్రిచారి మేము చేసే తీర్మానాలు ముఖ్యంగా విదేశాంగ విధానం, అదీ అమెరికా గురించి అంత తీవ్రంగా పట్టించుకోవద్దు యుపిఏపై రాజకీయంగా పైచేయి సాధించటానికి అలాంటివి చేస్తుంటామని చెప్పినట్లు ఒక పత్రం వెల్లడించింది. తాము అధికారంలోకి వస్తే విదేశాంగ విధానం, అణుఒప్పందాల గురించి సమీక్షిస్తామని బిజెపి చెప్పింది. అయితే అలాంటిదేమీ ఉండదు, అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవిస్తాం, మరింత పటిష్ట పరుస్తాం అని ఉక్కుమనిషిగా భుజకీర్తులు తొడిగిన అద్వానీ సైతం అమెరికన్‌ దౌత్యవేత్తల ముందు వివరణిచ్చుకున్నాడంటే ఆ పార్టీ విశ్వసనీయత గురించి ఇంక చెప్పాల్సిందేముంది? బిజెపి నాయకుడు నరేంద్రమోడీకి అమెరికా వీసా నివారించటమేమిటో తనకు అంతుబట్టడం లేదని అరుణ్‌ జైెట్లీ బ్లేక్‌ వద్ద వాపోయాడు. ఇక్కడ మోడీ వీసా సమస్య కంటే తాము ఎంత విధేయులుగా ఉన్నా ఇలా వ్యవహరించటం ఏమిటని అమెరికాతో సంబంధాల కోసం బిజెపి పడిన ఆందోళనను అర్ధం చేసుకోవటం ముఖ్యం. ఒక్క విదేశాంగ విధానమే కాదు ఆర్థిక విధానాలపై దాని వ్యతిరేకత కూడా ఒక నాటకమే. వ్యాట్‌పై బిజెపి పాలిత రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేయటం కూడా సంకుచిత రాజకీయ లాభనష్టాలలో భాగమే అని, న్యాయసేవల రంగాన్ని కూడా విదేశీ పోటీకి అనుమతించాలని జైట్లీ స్పష్టం చేశాడు.మరో ముఖ్యనాయకుడు జస్వంత్‌ సింగ్‌ కూడా అమెరికా దౌత్యవేత్త స్ట్రాబ్‌ టాల్బోట్‌, బర్న్‌తో అనేక విషయాలు చెప్పాడు. తాము అమెరికాతో సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నప్పటికీ అందుకోసం దేశంలో రాజకీయ లబ్దిని పోగొట్టుకోలేమని, దానికే తొలి ప్రాధాన్యత ఇస్తామని పూసగుచ్చినట్లు వివరించాడని మరో పత్రం వెల్లడించింది. అంతేకాదు కమ్యూనిస్టుల మద్దతుపై యుపిఏ ఆధారపడినంత కాలం యుపిఏ ఏమీ చేయలేదని,తిరిగి ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చేంతవరకు దేశంలో నాటకీయ పరిణామాలేవీ జరగవన్నాడు.(ఈ సంభాషణలు 2005లో జరిగాయి) అంతేకాదు అణుసమస్యపై తొందరపాటుతో వ్యవహరించకుండా ముందు బలమైన రాజకీయ పునాదిని ఏర్పాటు చేసుకొనే వరకు ఆగాలని కూడా అమెరికాకు సలహా ఇచ్చాడు. ఈ పూర్వరంగంలో అమెరికాతో ఒప్పందం కోసమే కమ్యూనిస్టుల మద్దతును వదులుకొని నోట్లతో సహా అనేక ప్రలోభాలతో చిన్నా చితకా పార్టీలను కూడగట్టుకొని మన్మోహన్‌సింగ్‌ సర్కార్‌ వ్యవహరించిందన్నది స్పష్టం. మరోసారి దేశంలో కమ్యూనిస్టుల ప్రమేయంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడకుండా ఉండాలంటే అసలు కమ్యూనిస్టులనే ఓడిస్తే పోతుందనే ఆలోచనతోనే పశ్చిమ బెంగాల్‌, కేరళల్లో సిపిఎంను దెబ్బతీసేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అన్నిరకాల సిపిఎం వ్యతిరేకశక్తులను ఏకం చేసేందుకు అది పూనుకుందన్నది గమనించాలి.

ధర్మభిక్షం కన్నుమూత

  • నేడు సూర్యాపేటలో అంత్యక్రియలు
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సిపిఐ మాజీ ఎంపి బొమ్మగాని ధర్మభిక్షం(90) శనివారం కన్నుమూశారు. అవిశ్రాంత పోరాటయోధునిగా, నిత్యం నిరుపేదల గురించి తపించేవ్యక్తిగా ఆయన మన్ననలందారు. గత నెల రోజులుగా నగరంలోని కామినేని ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నారు. కుడికాలి తుంటికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. చికిత్స పొందుతున్న సమయంలో శ్వాసకోశంలో నీరు చేరడంతో ఆరోగ్యం క్షీణించిందని, సమయం గడిస్తేగానీ తామేమీ చెప్పలేమని వైద్యబృందం అప్పుడే తెలిపింది. ఆసుపత్రిలోనే వైద్యం పొందుతూ, ఆ తరువాత కొంత కోలుకున్నట్లు అనిపించినా, శనివారం ఆరోగ్యం క్షీణించడంతో పరిస్థితి చేయిదాటినట్లు డాక్టర్లు వెల్లడించారు. 2008లో ఇలాగే జారిపడడంతో ఎడమకాలి తుంటికి అపరేషన్‌ జరిగింది. ధర్మభిక్షం మరణవార్త తెలిసిన వెంటనే ఆయన బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. బంధువులతో పాటు సిపిఐ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు,అభిమానులు కామినేని ఆసుపత్రికి వందలాదిగా తరలివచ్చారు. కష్ట జీవుల కోసం పనిచేశారు
సిపిఎం రాష్ట్ర కమిటీ సంతాపం
సిపిఐ నాయకులు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు, మాజీ పార్లమెంటు సభ్యులు బొమ్మగాని ధర్మభిక్షం మృతిపట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. కష్ట జీవుల కోసం పనిచేసిన ఆయనకు జోహార్లర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు పేర్కొన్నారు. విద్యార్థి దశ నుండే అభ్యుదయ సాహిత్యం పట్ల ఆకర్షితులైన ధర్మభిక్షం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. ఆంధ్ర మహాసభ కార్యకర్తగా పనిచేస్తూ రహస్య జీవితాన్ని, జైలు జీవితాన్ని అనుభవించారని వివరించారు. నల్లగొండ జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు.
సిపిఐ జాతీయ సమితి సంతాపం
తెలంగాణ సాయుధ పోరాట యోధులు, స్వాతంత్య్ర సమరయోధులు బొమ్మగాని ధర్మభిక్షం మరణం పట్ల సిపిఐ జాతీయ సమితి తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దాలకు వ్యతిరేకంగా ధర్మభిక్షం పోరాడారని తెలిపింది. వెట్టి చాకిరీ నిర్మూలనకు ఆయన ఎంతగానో కృషి చేశారని పేర్కొంది. గీత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ఆయన అనేక పోరాటాలు నిర్వహించారని సిపిఐ జాతీయ సమితి తెలిపింది. పార్లమెంటు సభ్యునిగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పార్లమెంటు లోపల,వెలుపలా అనేక పోరాటాలు నిర్వహించారని సిపిఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి పేర్కొన్నారు.
ప్రముఖుల నివాళి
ధర్మభిక్షం మరణవార్త తెలిసిన వెంటనే పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.రామకృష్ణ, పల్లా వెంకటరెడ్డి, సిపిఎం శాసనసభాపక్ష మాజీ నేత నోముల నర్సింహయ్య, విశాలాంధ్ర రెసిడెంట్‌ ఎడిటర్‌ కె.శ్రీనివాసరెడ్డి తదితరులు ధర్మభిక్షం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

ఎంపి ధర్మభిక్షం కన్నుమూత

హైదరాబాద్‌ (వి.వి) : తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నేత కామ్రేడ్‌ బొమ్మగాని ధర్మభిక్షం(89) శనివారం సాయంత్రం 6 గంటలకు ఎల్‌.బి. నగర్‌లోని కామినేని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని కార్యకర్తల సందర్శనార్ధం ఆదివారం ఉదయం 8.30 గం||ల నుండి 10.30 గంటల వరకు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయం హిమాయత్‌ నగర్‌లోని మఖ్దూంభవన్‌ ఆవరణలో ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.
జీవితసంగ్రహం : మిడిల్‌స్కూల్‌ వయసులోనే నిజాంనవాబు జన్మదినోత్సవాలను విద్యార్థులందరిచేత బహిష్కరించి నిజాం సంస్థానమంతటా ప్రకంపనలు సృష్టించిన ఆ ఉద్యమ నెలబాలుడు, ఎనిమిది దశాబ్ధాల అలుపెరుగని సమరశీల పోరాటాల మహాప్రస్థానంలో ప్రజాకంఠక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కొరడా ఝుళిపి మెడలు వంచడమే కాదు, 'విశ్వ రాజకీయ యవనికపె'ౖ కమ్యూనిస్టు విజయపతాకను ఎగరేసిన తెలంగాణ సాయుధపోరాటయోధుడు,ఉద్యమాలఎర్ర 'సూర్యుడు' బొమ్మగాని ధర్మభిక్షం. పీడిత, తాడిత, అట్టడుగు బడుగు బలహీనవర్గాల ఆరాధ్యులుగా ఇంటి మనిషై, యావత్‌ ఆంధ్రరాష్ట్ర ప్రజల నోట ఆయనపేరు తారకమంత్రమై, అఖండ భారతావని గర్వించదగిన ప్రజాప్రతినిధిగా, 'ప్రజల మనిషి'గా చరిత్ర పుటల్లో సుస్థిరస్థానాన్ని దక్కించుకున్నారు. ఫిబ్రవరి 7న ఇంట్లో జారిపడిన ధర్మబిక్షాన్ని చికిత్సకోసం హైదరాబాద్‌ కామినేని హాస్పిటల్‌లో చేర్చారు. 10న కుడికాలు తొడ ఎముక ఫ్రాక్చర్‌కు శస్త్రచికిత్స జేశారు. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌సోకి పరిస్థితి విషమంగా తయారైంది. తెలంగాణ సాయుధ పోరాటానికి కేంద్రబిందువైన 'పోరాటాల పోతుగడ్డ' సూర్యాపేటలో నిరుపేద కల్లుగీత కార్మిక కుటుం బంలో 1922, ఫిబ్రవరి 15న బిక్షం జన్మించారు. బొమ్మగాని ముత్తిలింగయ్య, గోపమ్మలు తల్లిదండ్రులు. అక్కలు ఎల్లమ్మ, తిరుపతమ్మలు కాగా, వెంకటయ్య, ముత్తయ్యలు ఆయన సోదరులు. వీరందరిలో మిగిలిన సోదరుడు బొమ్మగాని వెంకటయ్య ఆయన పోరాటాల అడుగుజాడల్లో నేటికీ 'లక్ష్మణుడిన్ని' తలపిస్తారు. సోవియట్‌ దేశప్రజలు సాగించిన వీరోచిత పోరాటాలు, విజయాలు, భారతదేశంలో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల వెల్లువ నుంచి సూర్యాపేటలో నల్గొండజిల్లాలోనే ప్రథమ కమ్యూనిస్టు సెల్‌ ఏర్పడేందుకు పురికొల్పింది. తొలి కమ్యూనిస్టుపార్టీ సెల్‌ను ఏర్పాటు చేయడంలో ధర్మబిక్షం పాత్ర అత్యంత కీలకమైనది. ఆంధ్రమహాసభ కార్యకర్తగా పనిచేస్తూ, 1942లో ధర్మబిక్షం కమ్యూనిష్టు పార్టిలో చేరారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వ్యాపించిన వందేమాతరం ఉద్యమజ్వాల నల్లగొండకు విస్తరించి, అది ధర్మబిక్షం నాయకత్వంలో ఉధృతమైంది. కేంద్రంలో సమ్మె విరమించినా, నల్గొండలో 23 రోజుల పాటు సమ్మె కొనసాగింది. ధర్మబిక్షంతో సహా 30మంది విద్యార్థులను పాఠశాలనుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జనగామ తాలూకా విసునూరు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో భాగంగా సూర్యాపేటలో సమ్మె జరిపినందుకు నిజాం ప్రభుత్వం ఈయనపై అరెస్ట్‌వారెంట్‌ జారీచేసింది. కనిపిస్తే కాల్చివేత ఉత్వర్వులు కూడా జారీచేసింది. ఒకటిన్నర సంవత్సరం పాటు ధర్మబిక్షం 'రహస్యజీవితం' గడిపారు. తర్వాత అరెస్ట్‌కాబడిన ఆయన సూర్యాపేట, నల్గొండ, చంచల్‌గూడ సెంట్రల్‌జైల్‌, ఔరంగాబాద్‌, జాల్నా జైళ్ళలో ఐదున్నరేళ్ళపాటు ప్రమాదకర రాజకీయఖైదీగా జైలుజీవితం గడిపారు. జాల్నాజైల్‌ కాన్సంట్రేషన్‌ క్యాంపులో ధర్మబిక్షాన్ని వేసిన బ్యారక్స్‌ చుట్టూ మిషన్‌గన్స్‌, స్టెన్‌గన్స్‌, రైఫిల్స్‌తో మిలిటరీవాళ్ళ కాపాలా నడుమ కఠినజైలు జీవితం సాగింది. నల్లగొండ జిల్లా కమ్యూనిష్టు పార్టీకి తొలి కార్యదర్శిగా సారధ్యం వహించి 'నల్లగొండ పేరు చెప్పితే ఢిల్లీ కోటలో గుండె ఝల్లుమనేలా' సమరశీలపోరాటాలకు ధర్మబిక్షం రూపకల్పన చేశారు. భారతదేశంలో కమ్యూ నిష్టు ఉద్యమాల్లో బలమైన కేంద్రంగా పరిఢవిల్లుతోన్న నల్గొండ జిల్లాను కమ్యూనిష్టు పార్టీకి కంచుకోటగా తీర్చిదిద్దుతూ, పటిష్టపునాదులు నిర్మించ డంలో ధర్మబిక్షం చేసిన అవిశ్రాంత కృషి అనితరసాధ్యం.1988లో హైదరా బాద్‌లో జరిగిన అఖిల భారత గీతపనివారల, కార్మిక సమాఖ్యకు అధ్యక్షులుగా ఎన్నికై నేటివరకూ గీతపనివారల హక్కులసాధనకై మడమతిప్పని పోరాటాలు చేస్తున్నారు.
విద్యార్థి ఉద్యమాలకు ఆద్యుడు : పేదరికం శాపమైనప్పటికీ, చదువుల తల్లి ముద్దుబిడ్డగా ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ ఫోరం వరకూ క్లాస్‌లో ఎల్లప్పుడూ మొదటి ర్యాంక్‌ను సాధించే భిక్షం మానిటర్‌గా కూడా ఎన్నికయ్యేవారు. హైదరాబాద్‌ రెడ్డి హాస్టల్‌ సందర్శన అనంతరం సూర్యాపేటలోని తాను చదివే పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు, పత్రికలు, మ్యాగజైన్స్‌ అందించడం, విద్యార్థుల చర్చావేదిక ఏర్పాటు అనే 3 ప్రధాన డిమాండ్ల సాధనకు ఒకరోజు సమ్మె భిక్షం నాయకత్వంలో జరిగింది. హెడ్‌మాస్టర్‌ కరీముల్లాఖాన్‌ దిగివచ్చి వెంటనే సమస్యల పరిష్కారానికి అంగీకరించడం నల్లగొండజిల్లా అంతటా చర్చనీయాం శమైంది. ఇదే పాఠశాలలో నైజాం ప్రభుత్వపు ఏడవ నవాబు జన్మదినోత్సవ వేడుకలకు నిజాం ప్రధానమంత్రి కిషన్‌ప్రసాద్‌ హాజరవుతున్న దృష్ట్యా విద్యార్థులంతా మాస్‌డ్రిల్‌ యూనిఫారం ధరించి పరేడ్‌ చేయాలన్న హెడ్మాష్టర్‌ కరీముల్లాఖాన్‌ హుకూంను భిక్షం నాయకత్వంలో విద్యార్థులంతా సంఘటితమై బహిష్కరించడం పత్రికల పతాకశీర్షికలకెక్కి నిజాం సంస్థానం అంతటా సంచలనం సృష్టించింది. విద్యార్థినాయకుడు భిక్షంపై నిజాం ప్రభుత్వం అప్పటి నుంచే 'నిఘా' పెట్టింది. నల్గొండలో హైస్కూల్‌ చదువుకెళ్ళిన భిక్షం అక్కడ కూడా హాస్టల్‌ను నెలకొల్పి, వందేమాతరం ఉద్యమంలో నాయకత్వ పాత్ర పోషించారు. నల్గగొండ జిల్లాలో తొలి విద్యార్థినాయకుడుగా గణతికెక్కారు.
హైదరాబాద్‌ నగర కొత్వాల్‌చే 'ధర్మ' బిరుదు ప్రదానం : బొమ్మగాని భిక్షం తన స్నేహితుడు రౌతు జనార్ధన్‌రావు (హైదరాబాద్‌లో విద్యార్థిగాఉన్న తరుణంలో) తండ్రి ఊళ్ళో హత్యకు గురయ్యారన్న వార్తను తెలియజేసేందుకు భిక్షం హైదరాబాద్‌కు వెళ్ళిన సందర్భంగా రెడ్డిహాస్టల్‌ను సందర్శించారు. అది విద్యార్థులను దేశస్వాతంత్య్రం కోసం పోరాడే దేశభక్తులుగా, క్రీడాకారులుగా, చైతన్యవంతులుగానూ తీర్చిదిద్దే కేంద్రంగా దర్శనమిచ్చింది. దీంతో చిన్నవయసైనప్పటికీ సూర్యాపేటలో వెంపటి బుచ్చయ్య ఇంట్లో హాస్టల్‌ను ప్రారంభించారు. హాస్టల్‌ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన హైదరాబాద్‌నగర కొత్వాల్‌ (పోలీస్‌ కమిషనర్‌) రాజ బహద్దూర్‌ వెంకట్రామారెడ్డి తన ఉపన్యాసంలో 'ఈ హాస్టల్‌ విద్యార్థులను కేవలం ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్న హాస్టల్‌ మాత్రమే కాదు. దేశానికి వన్నెతెచ్చే యువకులను సృష్టిస్టోందన్నారు.' ఒక చేత్తో దానమడుగుతూ రెండో చేత్తో ధర్మం చేస్తోన్న వ్యక్తి భిక్షం ఎలా అనబడతాడు ఆయన ఇకనుంచి 'ధర్మభిక్షం'గా పిలవబడతాడు అని సభాముఖంగా బిరుదునిచ్చారు. ఆ నామమే నేడు ప్రజల నోట తారకమంత్రమయ్యింది.
ప్రజాప్రతినిధిగా 'ధర్మబిక్షం' అఖండవిజయం : సూర్యాపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌ మొదలు పార్లమెంట్‌సభ్యుడి వరకూ ధర్మభిక్షం విజయయాత్రలో ప్రతీ ఎన్నిక ఒక విశిష్టతతో కూడిన రికార్డును నమోదు చేసి చరిత్రపుటల్లో కెక్కింది. ఆయనను 'ప్రజలమనిషి'గా ప్రజల హృదయసీమలపై ప్రతిష్ఠింప జేసింది. ఆయన ఎన్నికల్లో పోటీచేసినప్పుడల్లా జిల్లాలోని లక్షలాది జనం ఆయన గెలుపువార్త వినేందుకు తహతహలాడుతూ రేడియో వార్తలు వినేందుకు చెవులురిక్కించేవి. హైదరాబాద్‌ సంస్థానంలో రాజరికవ్యవస్థకు చరమగీతం పాడబడి, 1952లో హైదరాబాద్‌ స్టేట్‌ అసెంబ్లీకి జనరల్‌ ఎన్నికలు జరిగాయి. దేశానికి స్వాతంత్య్రం తామే తెచ్చామని కమ్యూనిష్టులకు డిపాజిట్‌దక్కకుండా చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ధనబలం, అంగబలంతో సర్వశక్తులు ఒడ్డినా ధర్మభిక్షం నాయకత్వంలో ఎన్నికల రణరంగంలోకి దిగిన పి.డి.ఎఫ్‌ అభ్యర్థు లంతా అధికసంఖ్యలో గెలుపొంది జిల్లాలో విజయఢంకా మోగించారు. భారీ మెజార్టీ రికార్డుతో సూర్యాపేట శాసనసభ్యులుగా ధర్మభిక్షం అసెంబ్లీలో అడుగు పెట్టడం జిల్లా అంతటా పెద్ద చర్చనీయాంశమైంది. 1957లో నూతనంగా ఆవిర్భవించిన నకిరేకల్‌ నియోజకవర్గం నుంచి కూడా ఆయన ఘనవిజయం సాధించారు. 1962లో నల్లగొండ అసెంబ్లీకి సి.పి.ఐ. శాసనసభ్యుడిగా ఎన్నిక య్యారు. నల్లగొండ జిల్లాలో మూడు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాలనుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్‌ సాధించిన రికార్డు ఆయనకే దక్కింది. 1991లో 10వ లోక్‌సభకు జరిగిన ఎన్నికలో ఆయన సి.పి.ఐ తరపున నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో సుమారు 68 వేలఓట్లతో విజయం సాధించారు. దక్షిణభారతదేశం నుంచి గెలిచిన ఏకైక సిపిఐ ఎంపిగా ధర్మబిక్షం లోక్‌సభలో తనవాణిని విన్పించారు. 1996లో జరిగిన 11వ లోక్‌సభ ఎన్నికల్లో కూడా తిరిగి ఆయన సిపిఐ అభ్యర్ధిగా రంగంలోకి దిగి మరోసారి విజయదుందుభి మోగించారు. 484 మంది అభ్యర్ధులు నల్గొండ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. లోక్‌సభ చరిత్రలోనే తొలిసారి ఎన్నికల సంఘానికి ఎదురైన ఈ అనుభవంతో ప్రత్యేకంగా తయారుచేయించిన న్యూస్‌ పేపర్‌సైజ్‌ బ్యాలట్‌ పేపర్‌, డ్రమ్ము సైజ్‌ బ్యాలట్‌ బాక్స్‌లు ఏర్పాటుచేసి ఎన్నికలు నిర్వహించింది. దేశంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ఎన్నికలో ధర్మబిక్షం 76 వేల ఓట్లతో ఘనవిజయం సాధించి పార్లమెంట్‌ చరిత్ర పుటల్లో విశిష్టస్థానాన్ని సంపాదించడం జాతీయ మీడియాలో పతాకస్థాయి వార్తల్లోకెక్కింది. నల్లగొండ జిల్లాలో తాగునీరు, సాగునీరు సమస్యలపై ఆయన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై పార్లమెంట్‌సభ్యులుగా ఒత్తిడితెచ్చి సాధించడంలో కృతకృత్యులయ్యారు. ప్రభుత్వం నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల పరిధిలో రాచకొండ ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజిను ఏర్పాటు చేయాలని ప్రయత్నించిన సందర్భంలో పార్లమెంట్‌లో ఆ ప్రాంత ప్రజల మనోభావాలను ప్రతిబింబి ంపజేసి ఆ ప్రయత్నాన్ని విరమింపజేశారు. ఫ్లోరైడ్‌ పీడిత జిల్లాలైన నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌లకు రక్షితనీటి పథకాలపై ఎంపీగా పార్లమెంట్‌లో తీవ్రస్థాయిలో గళమెత్తారు. పోచంపల్లిలో ప్రతిపాదించబడిన గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాన్ని ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు. ధర్మబిక్షం సహచర శాసనసభ్యుడైన కీ.శే. మాజీ ప్రధాని పివి.నర్సింహారావు ఒక సందర్భంలో వ్యాఖ్యానిస్తూ ధర్మబిక్షం సలహాలు, సూచనలూ చట్టసభల్లో చట్టాలు రూపకల్పన చేసే తరుణంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొనడం ఆయన సమర్థతకు గీటురాయి.
ముఖ్యమంత్రి సంతాపం: తెలంగాణసాయుధ పోరాటయోధుడు, ప్రముఖ సిపిఐ నేత,మాజీ ఎంపి బొమ్మగాని ధర్మబిక్షం(89) మృతి పట్ల ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ధర్మబిక్షం అనేక పోరాటాల్లో పాల్గొని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించారని, హైదరాబాద్‌ శాసనసభకు, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో సభ్యునిగానేగాక రెండు పర్యాయాలు నల్గొండ ఎంపిగా విశేష సేవలందించారని ముఖ్యమంత్రి కొనియాడారు. ధర్మబిక్షం కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పేద ప్రజల కోసం తన జీవితాంతం పోరాటమే ఊపిరిగా జీవించిన పేదల పెన్నిది, స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ పార్లమెంట్‌ సభ్యులు బొమ్మగాని ధర్మబిక్షం ఆకాల మరణం పట్ల ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు డి.శ్రీనివాస్‌, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, లోక్‌సత్తా అధ్యక్షులు జయప్రకాష్‌ నారాయణ, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కెసిఆర్‌, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షులు చిరంజీవి, సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి.రాఘవులు, నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఐజెయు సెక్రటరీ జనరల్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి, ఎపియుడబ్ల్యుజె అధ్యక్షులు డి.సోమసుందర్‌, ప్రధాన కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, సీనియర్‌ జర్నలిస్టులు కరుణాకర్‌రెడ్డి, దైవాదీనం, తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ అధ్యక్షులు ఎం.సోమయ్య, కన్వీనర్‌ కప్పర ప్రసాద్‌ వేర్వేరు ప్రకటనల్లో తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు.
సిపిఐ జాతీయ, రాష్ట్ర సమితుల సంతాపం: తెలంగాణ సాయుధ పోరాట యోధులు, స్వాతంత్ర సమరయోధులు బొమ్మగాని ధర్మబిక్షం మృతిపట్ల భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, దేశ్‌ముఖులకు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరి నిర్మూలించబడాలని, తెలంగాణా సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర నిర్వహించిన ధర్మబిక్షం పోరాట పటిమను సిపిఐ జాతీయ, రాష్ట్ర సమితులు శ్లాఘించాయి. ఘనంగా జోహార్లు అర్పించాయి. ఆనాటి నుండి ఈనాటి వరకు గీత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో, గీత వృతి పరిరక్షణలో అనేక సమరశీల పోరాటాలను ధర్మబిక్షం నిర్వహించారు. వేలాది మంది గీత కార్మికులను సమీకరించి, పోరాటాలు నిర్వహించిన యోధులు ధర్మబిక్షం అని. పార్లమెంటు సభ్యునిగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పార్లమెంటు లోపల, బయట అనేక పోరాటాలు నిర్వహిచారని, ప్రత్యేకించి నల్లగొండ జిల్లాలో ఆయన నిర్వహించిన పోరాటాల ఫలితంగా ఆయన గుర్తు పట్టని వారెవ్వరూ లేరని సిపిఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ నుండి రెండు సార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నిక కావటమేగాక, ఆ జిల్లాలోని మూడు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి శాసనసభ్యునిగా ఎన్నికై హ్యాట్రిక్‌ సాధించిన ఘనత బొమ్మగాని ధర్మబిక్షందేనని సుధాకరరెడ్డి, నారాయణ పేర్కొన్నారు.
అరుణ పతాక అవనతం: ధర్మబిక్షం మృతికి సంతాప సూచికంగా సిపిఐ రాష్ట్ర కార్యాలయంపై ఉన్న అరుణ పతాకాన్ని అవనతం చేశారు.
ప్రముఖుల నివాళి: ధర్మబిక్షం మృతి వార్త తెలిసిన వెంటనే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు-ఎంఎల్‌సి పువ్వాడ నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె. రామకృష్ణ, పల్లా వెంకటరెడ్డి, వి. రాంనరసింహారావు, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, యాదగిరిరావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ రెడ్డి ,నాయకులు బండారు దత్తాత్రేయ, ఎన్‌. ఇంద్రసేనా రెడ్డి, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, మాజీ ఎం.ఎల్‌.ఎ.రమావత్‌ రవీంద్రకుమార్‌, సిపిఐ (యం) నాయకులు నోముల నర్సింహయ్య, ఐజెయు సెక్రటరి జనరల్‌ కె. శ్రీనివాస్‌రెడ్డి, సిపిఐ నాయకులు కందిమళ్ళ ప్రతాపరెడ్డి, నల్లగొండ జిల్లా పార్టీ కార్యదర్శి యం. ఆదిరెడ్డి, హైదరాబాద్‌ నగర కార్యదర్శి వి.ఎస్‌.బోస్‌ ఎస్‌టియు నాయకురాలు కమలారెడ్డి, హైదరాబాద్‌ నగర నాయకులు దేవయ్య, రవీంద్రాచారి, ప్రవీణ్‌గౌడ్‌, సూర్యాపేట మాజీ మునిసి పల్‌ ఛైర్మన్‌ సత్యనారాయణ ప్రభృతులు ఎల్‌బినగర్‌ కామినేని హాస్పటల్‌కు వెళ్ళి భౌతికకాయాన్ని సందర్శించి, పుష్పగుచ్ఛాలుంచి నివాళులు అర్పించారు.
పలువురి సంతాపం : ధర్మభిక్షం మృతిపట్ల బికెఎంయు వర్కింగ్‌ ప్రసిడెంట్‌, సి.పి.ఐ. శాసనసభా పక్ష నాయకులు జి.మల్లేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిద్ధి వెంకటేశ్వర్లు, జల్లి విల్సన్‌, అఖిల భారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. గ్రామీణ శ్రమజీవులైన గీత కార్మికులు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన పోరాటాలు, కృషి మరువలేనిదన్నారు. సి.పి.ఐ. రాజ్యసభ సభ్యులు సయ్యద్‌ అజీజ్‌పాషా, మాజీ శాసనసభ్యుల ఫోరం కన్వీనర్‌ కె. సుబ్బరాజు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్య మండలి సీనియర్‌ నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు, అధ్యక్షులు పులి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ్మ, నాయకులు గని, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్‌ పత్తిరైతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గుర్రం యాదగిరిరెడ్డి, శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడారు ప్రభాకరరావు, ఏపి చేతివృత్తిదారుల సమాఖ్య అధ్యక్షులు టి. వెంకట్రాములు, సిపిఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ కార్యదర్శి మడత కాళిదాస్‌, మహిళా సమాఖ్య నాయకులు చండ్ర రాజకుమారి, అఖిలభారత అభ్యుదయ రచయతల సంఘం అధ్యక్షవర్గ సభ్యులు ఎస్వీ సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, వరంగల్‌ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస రావు, సహాయ కార్యదర్శి టి. సత్యం, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, సి.పి.ఐ. పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి నెక్కంటి సుబ్బారావు, ఇందుకూరి సుబ్బరాజు, సి.పి.ఐ. రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎన్‌. బాలమల్లేష్‌, సి..పి.ఐ. జాతీయ సమితి సభ్యురాలు పశ్య పద్మ, ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. రాష్ట్ర అధ్యక్షులు బి. ఆంజనేయులు, కార్యదర్శి లెనిన్‌బాబు తదితరులు ధర్మభిక్షం మృతికి సంతాపం తెలియజేసిన వారిలో వున్నారు.

తూతూ మంత్రం

తూతూ మంత్రం
- సంపాదకీయం

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇన్ని తక్కువ రోజులు జరగడం ఇటీవలి కాలం లో ఎప్పుడూ లేదు. గడచిన శీతాకాలపు సమావేశాల మాదిరిగా పూర్తిస్థాయి సభాస్తంభనలు జరగలేదు కానీ, ఈ సమావేశాలు కూడా సజావుగా సాగాయని చెప్పలేము.

సభలో ప్రవేశపెట్టవలసిన బిల్లుల్లో అత్యధికం పెండింగ్‌లో పడిపోయా యి. పన్నెండున్నర లక్షల కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించిన భారీ బడ్జెట్‌ను ప్రజాప్రతినిధులు నిశిత పరిశీలన చేయకుండానే ఆమోదించవలసి వచ్చింది. అయితేనేమి, రైల్వే బడ్జెట్‌ను, కేంద్ర బడ్జెట్‌ను ప్రభుత్వం ఆమోదింపజేసుకోగలిగింది. ఐదు రాష్ట్రా ల్లో త్వరలో జరగనున్న ఎన్నికల దృష్ట్యా, ప్రతిపక్షాలు అవసరమైన రాజకీయ ప్రచారాన్ని పొందగలిగాయి.

బడ్జెట్ సమావేశాల మధ్యలో కొద్దిరోజులు విరామం ఇచ్చి మరో విడత సమావేశా లు నిర్వహించడం ఆనవాయితీ. ఏప్రిల్ నెలలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, మలివిడతను విరమించుకున్నారు. మార్చి 25 వరకే సమావేశాల ను కుదించారు. ఫిబ్రవరి21న ప్రారంభమైన బడ్జెట్ సెషన్స్‌లో పార్లమెంటు మొత్తం 23సార్లు సమావేశమైంది.

శీతాకాల సమావేశాల స్తంభనకు కారణమైన సంయుక్త పార్లమెంటరీ సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం ఈసారి అంగీకరించింది. అయినాసరే, సమావేశాలు సజావుగా సాగలేదు. తెలంగాణ ఎంపీలు వరుసగా సభలో చేసిన ఆందోళన, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు, వికీలీక్స్ ద్వారా వెల్లడయిన 'ఓటుకు నోటు'-పార్లమెంటును కుదిపివేశాయి. టిఆర్ఎస్ సభ్యు లు ఇద్దరు లోక్‌సభలో తెలిపిన నిరసన, మొదటిరోజు నుంచి కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు చేసిన నినాదాలు, వారికి భారతీయజనతాపార్టీ నాయకత్వం తెలిపిన మద్ద తు- సభా కార్యక్రమాల్లో చెప్పుకోదగ్గ విశేషాలు.

2జి స్పెక్ట్రమ్ కుంభకోణంతో ప్రతిష్ఠ దిగజారిన యుపిఎ ప్రభుత్వం, విజిలెన్స్ కమిషనర్ థామస్ నియామకంపై సుప్రీంకోర్టు వేసిన అక్షింతల కారణంగా మరోసారి బోనెక్కవలసి వచ్చింది. జరిగినదానికి తాను బాధ్యత వహించడం ద్వారా ప్రభుత్వాన్ని సంకట స్థితినుంచి గట్టెక్కించాలనుకున్న ప్రధాని ప్రతిపక్షం నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. తెలిసితెలిసీ చేసిన నియామకం అది. ఇతరులు హెచ్చరించినా ఖాతరు చేయక థామస్‌కు ప్రధాని ఆ పదవిని అందించారు.

యుపిఎ ప్రభుత్వాన్ని అప్రదిష్ట నుంచి రక్షించడానికి ఇక మన్మోహన్ సింగ్ దగ్గర మిగిలిన ప్రతిష్ఠ ఏమీ ఉన్నట్టు లేదు. 2008లో అణుఒప్పం దం వివాదం నేపథ్యంలో యుపిఎ-1 ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి కోట్లు వెచ్చించి ఓట్లు కొన్నారని వికీలీక్స్ ద్వారా వెల్లడయిన సమాచారం ప్రభుత్వాన్ని, ప్రధానిని మరీ ఇరకాటంలో పెట్టింది. వికీలీక్స్ సమాచారాన్ని నమ్మనక్కరలేదని, విదేశీయులు చెప్పినదాన్ని ప్రమాణంగా తీసుకోనక్కరలేదని-ఏవేవో సమర్థనలు చెప్పారు.

కానీ, ప్రజలలో ఏర్పడవలసిన అపనమ్మకం ఏర్పడిపోయింది. దేశసార్వభౌమాధికారాన్ని పణం పెట్టి అణు ఒప్పందం కుదుర్చుకుంటున్నారని ఒకపక్కన ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సమయంలో, అవసరమైన మద్దతును అవినీతిమార్గాల ద్వారా సమకూర్చుకోవడం ద్రోహపూరితమని అర్థం చేసుకోవడానికి పెద్ద రాజకీయజ్ఞానం అక్కరలేదు. నీతిపరుడిగా కీర్తిగడించిన ప్రధానికి తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయని నమ్మడానికి వీలులేని సందర్భాలు ఇవి.

శీతాకాల సమావేశాల సందర్భంగా ఏర్పడిన ప్రతిష్టంభనను చూసి, ఎప్పటికైనా ఈ పార్లమెంటు సక్రమంగా సాగుతుందా, మధ్యంతర ఎన్నికలు రాక తప్పదా అన్న అనుమానాలు కలిగాయి. జెపిసి విషయంలో కేంద్రం సుముఖంగా మారడంతో బడ్జె ట్ సమావేశాలు అర్థవంతంగా సాగుతాయన్న ఆశ మొదట కనిపించింది. ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి కూడా ఈసారి సభా కార్యక్రమాలను సాధ్యమైనంతగా అనుమతించాలనే భావించింది.

ఆనవాయితీగా జరగవలసిన తప్పనిసరి ఆమోదాలను, చర్చలను అనుమతిస్తూనే, ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నంలో సఫ లం అయ్యాయి. సంచలనాత్మకమైనవీ, రాజకీయంగా తక్షణం లాభదాయకమైనవీ అయిన అంశాలు ప్రాధాన్యం పొంది, సాధారణమైనవీ, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నవీ అయిన అంశాలు అప్రధానమై అన్యాయమైపోవడం- ఈసారి సమావేశాల్లో నూ కనిపిస్తుంది.

మొత్తం ఈసారి 37 బిల్లులు ప్రవేశపెడదామనుకున్నారు. వాటిలో మహిళారిజర్వేషన్ల బిల్లు, భూసేకరణ సవరణబిల్లుతో సహా అత్యధికం పెండింగ్‌లోనే ఉండిపోయాయి. పెన్షన్ రెగ్యులేటరీ అథారిటీ బిల్లు వంటి ఒకటి రెండు మాత్ర మే సభ ఆమోదాన్ని పొందాయి. బడ్జెట్‌లో వివిధ పద్దుల కింద చేసిన కేటాయింపులను మదింపు వేసి, చర్చించడానికి సమయమే దొరకలేదు.

అసెంబ్లీ ఎన్నికల పేరు తో పార్లమెంటరీ స్థాయిసంఘాలు మంత్రిత్వ శాఖల వారీగా చేయవలసిన కేటాయింపుల సమీక్షలను రద్దు చేశారు. ఇక సమావేశాల సందర్భంగా పార్లమెంటు సమీపంలోను, రాజధానిలోనూ వివిధ ప్రజాసమస్యలపై జరిగే ఆందోళనలకు, ప్రదర్శనలకు సభలో పెద్దగా సంఘీభావం లభించలేదు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఢిల్లీదాకా వెళ్లిన మాదిగ పోరాటకారులను ఆలకించేవారే లేకపోయారు.

అయితే, నిత్యరణరంగంగా ఉండిన పార్లమెంటు సమావేశాలు, ఒకరకంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని ప్రతిబింబించాయి. సర్వత్రా వ్యాపించిన ఆర్థిక అకృత్యాలు, అవినీతి, నైతికమైన డొల్లతనం దేశనాయకత్వాన్ని హీనస్థాయిలో నిలుపుతున్నాయి. పాలకపక్షాన్ని నిలదీయడమే తప్ప స్వయంగా ప్రత్యామ్నాయం కాలేని బలహీనతలో ప్రతిపక్షం కూరుకుపోయి ఉంది. కాంగ్రెస్‌పార్టీ స్వయంగా అంతర్గత జాడ్యాలతో ఉక్కిరిబిక్కిరిగా ఉన్నది.

2జి స్కామ్‌లో ప్రధాన దోషిగా ఉన్న పార్టీని బెదిరించి నాలుగుసీట్లు ఎక్కువ సంపాదించుకోవడం తప్ప, దాన్ని దూరం పెట్టగలి గే శక్తి కాంగ్రెస్‌కు లేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవిభజన సమస్య పార్టీనే రెండు గా చీల్చింది. శ్రీకృష్ణ కమిటీ ద్వారా సంపాదించిన ఏడాది గడువు తరువాత కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా సమస్య మిగిలిపోయింది. వైఎస్ హయాం లో అధిష్ఠానం అనుసరించిన వైఖరి కారణంగా జగన్ ఏకు మేకై కూర్చున్నాడు. వీటన్నిటి నేపథ్యంలో కాంగ్రెస్ చొరవను కోల్పోయి, తానే వేసుకున్న చిక్కుముడులను విప్పలేక సతమతమవుతున్నది.andhra jyothi soujanyamutho

గ్రామాల్లోనూ సభలు నిర్వహిస్తే సమస్యలు పరిష్కారం : మాణిక్యవరప్రసాద్

హైదరాబాద్, మార్చి 26 : అసెంబ్లీ సమావేశాలు ఆరునెలలు హైదరాబాద్‌లోనూ, మరో ఆరునె లలు గ్రామీణ ప్రాంతాల్లోను నిర్వహించాలని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తన సరికొత్త ఆలోచనలతో ముందుకువచ్చారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించవచ్చనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈసందర్భంగా శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఒకసారి తెలంగాణలోని మారుమూల పల్లెల్లో నిర్వహిస్తే, మరోసారి ఆంధ్రా ప్రాంతంలోని ఓ గ్రామంలో, ఇంకోసారి రాయలసీమలోని ఇలా సభలు నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరిస్తే బాగుంటదనే తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

దీనిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చిస్తామని, ప్రతిపక్షానికి , ప్రభుత్వానికి లేఖ రాస్తానని మంత్రి పేర్కొన్నారు. సభ నిర్వహణకి పెద్ద భవనాలే అవసరం లేదని, టెంట్ల కింద కూడా నిర్వహించవచ్చని అన్నారు. స్పీకర్, ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయా గ్రామాలకు చేరుకుని ప్రజా సమస్యలను స్వయంగా అడిగి త్వరగా పరిష్కరించ వచ్చని మాణిక్యవరప్రసాద్ అభిప్రాయ పడ్డారు.

విద్యాబిల్లు ఆమోదం పొందకపోవడంపై కపిల్‌ సిబల్‌ అసంతృప్తి

న్యూఢిల్లీ : విద్యా హక్కు చట్టం పరిధిలో అంగవైకల్యం కలిగిన పిల్లలను అననుకూల బృందాలుగా పరిగణించాలని పేర్కొంటూ ప్రవేశ పెట్టిన బిల్లును శుక్రవారం రాజ్యసభ ఆమోదం పొందక పోవడంతో మానవ హక్కుల శాఖమంత్రి కపిల్‌ సిబల్‌ నిరుత్సాహానికి గురైనట్లు కనిపిస్తున్నది. పిల్లలకు సంబంధించిన ఉచిత, నిర్బంధ విద్యాహక్కు(సవరణ) 2010 బిల్లు శుక్రవారం చర్చించాల్సిన అంశాల జాబితాలో ఉన్నందున కపిల్‌ సిబల్‌ దానికి సిద్ధమై వచ్చారు. అయితే సభ ప్రారంభం కావడానికి కొన్ని నిముషాల ముందు ఈ బిల్లును సభలో చర్చించడం లేదని తెలుసుకున్న సిబాల్‌ నిరుత్సాహానికి గురయ్యారు. కాగా బిల్లు ఆమోదానికి సంబంధించి వామపక్ష సభ్యులు అనుకూలంగా ఉన్నప్పటికీ దీనిపై చర్చించడానికి తగినంత సమయం కావాలని బిజెపి కోరింది. ఈ బిల్లుపై కనీసం నాలుగు గంటలపాటు చర్చ జరగాలని బిజెపి పేర్కొంది. ఆ తరువాత ఈ విషయమై బృందాకారత్‌ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌, బిజెపిలను తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ నిర్వాహకులు, బిజెపి మొండితనం వలన బిల్లు ఆమోదం పొందలేకపోయిందని ఆమె అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పి.కె. బన్సాల్‌ సరైన ప్రయత్నం చేయలేదన్నారు. పెన్షన్‌ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రభుత్వానికి సహకరించిన బిజెపి ఈ విద్యా బిల్లు ఆమోదం పొందడంలో సహకరించలేదన్నారు.

చట్టాన్ని అమలు పరచేందుకు 15 ఏళ్ళు చాలదా: సుప్రీం కోర్టు

కార్మికలోకం
వి.వి.ఎస్‌.మూర్తి
భవన తదితర నిర్మాణ కార్మికుల ఉపాధి క్రమ బద్ధీకరణ చట్టాలను అమలు పరచడంలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలవైఫల్యాల పట్ల తన ఆందోళనను వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టు మార్చి 15న సంబంధిత అధికారులకు నోటీసులు పంపించింది. వారికి వ్యతిరేకంగా కోర్టు ధిక్కార ప్రొసీడింగ్స్‌ ఎందుకు చేపట్టకూడదో తెలియజేయమని కోరింది.
ప్రధాన న్యాయమూర్తి ఎస్‌హెచ్‌ కపాడియా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆ అధికారులను తదుపరి విచారణ రోజున కోర్టుకు వ్యక్తిగతంగా హాజరై, చట్టాన్ని అమలు జరపడంలో వారి వైఫల్యాలకు గల కారణాలను వివరించుకోవాలని తెలియజేసింది.
సుప్రీం కోర్టు- ఉత్తర ప్రదేశ్‌, జమ్మూ-కాశ్మీర్‌, అస్సాం తదితర రాష్ట్రాల కేసును ప్రస్తావిస్తోంది. అక్కడి ప్రభుత్వాలు భవన తదితర నిర్మాణ కార్మికుల (ఉపాధి క్రమబద్దీకరణ, సర్వీసు నిబంధనల) చట్టం, 1996ను అమలు జరపడంలో విఫలమయ్యాయి.
అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కోర్టు ధిక్కారణ కింద ఎందుకు చర్య తీసుకో కూడ కారణం చూపమని కోరుతూ వారికి నోటీసులు పం పించడం తప్ప కోర్టు ముందు మరో మార్గం లేదని తేల్చిచెప్పింది.
దేశ సర్వోన్నతన్యాయస్థానం పైన పేర్కొన్న చట్టం అమలుకు సంబంధించి జారీ చేసిన వివిధ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని, వారి చట్టబద్ధమైన విధులను నెరవేర్చడంలో విఫలమైనాయని పేర్కొంది.
భవన, నిర్మాణ కార్మికుల చట్టాన్ని అమలు పర చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని కోరుతూ కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజనాల వాజ్యం (పిఐఎల్‌-పిల్‌) పై విచారణ జరుగుతోంది.
ఈ ఫిర్యాదును ఎన్‌జివో నిర్మాణ కార్మికుల జాతీయ ప్రచారోద్యమ కమిటీ ఫైల్‌ చేసింది. మహారాష్ట్ర, గోవా నాగాలాండ్‌, ఛత్తీస్‌ఘర్‌తో సహా అనేక రాష్ట్రాలు చట్టాన్ని అమలు పరచడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తోంది. ఈ చట్టం అసంఘటిత నిర్మాణ కార్మికులను క్రమబద్ధీక రించేందుకు ఉద్దేశించబడింది.
ఈ చట్ట ప్రకారం ఆయా ప్రభుత్వాలు రిజిస్టరింగ్‌ అధికారులను నియమించాలి, ప్రతి యజమాని తమ సంస్థను రిజిస్టర్‌ చేయాల్సి ఉంది.
ఈ చట్ట ప్రకారం నిర్మాణ కార్మికులకు వివిధ ప్రయోజనాలు సమకూర్చాలి. కార్మికులు ఈ ప్రయోజ నాలను పొందేందుకు ప్రతీ రాష్ట్రం, రాష్ట్ర సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఈ బోర్డుకు చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేసిన వ్యక్తి ఉండగా, ఇతర సభ్యులుగా 15 మందికి మించకుండా రాష్ట్ర ప్రభు త్వం నియమించాల్సి ఉంది.
చట్ట ప్రకారం, సంక్షేమ బోర్డుల నేర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చేందుకు అధికారం కలిగిన కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగించుకోక పోవడం పట్ల సర్వోన్నతన్యాయస్థానం ఆందోళనను వ్యక్తం చేసింది. ఇది సెస్‌ద్వారా వసూలు చేసిన మొత్తాన్ని కార్మిక ప్రయోజనాల కోసం వెచ్చించేందుకు అవ రోధంగా ఉందని కోర్టు పేర్కొంది. భవన తదితర నిర్మాణ కార్మికుల చట్టంలోని సెక్షన్‌ 60 కింద రాష్ట్రాలు బోర్డులనేర్పాటు చేయడంపై ప్రాథమిక చర్యలు కూడా కేంద్రం తీసుకోలేదని ఇంతకుముందు జరిగిన కేస్‌ హియరింగ్‌లలో (విచారణలలో) కోర్టు వ్యాఖ్యానించింది.
ఎన్‌జివోకు పిటీషనర్‌గా హాజరౌతున్న సీనియర్‌ అడ్వకేట్‌ కాలిన్‌ గొంజాల్వెజ్‌ తమిళనాడు, కేరళలు తప్ప ఇతర రాష్ట్రాలన్నీ చట్టాలను అమలు జరపడంలో విఫలమయ్యాయని చెబుతున్నారు.
చట్టాలు చేసి 15 ఏళ్ళు గడుస్తున్నా, ఇటు కేంద్రం గాని, అటు రాష్ట్ర ప్రభుత్వాలుగాని, వాటిని అమలు జరిపిన దాఖలాలు లేవని పిఐఎల్‌ ఆరోపిస్తోంది.

సమాచార కమిషన్‌లో

సమాచార కమిషన్‌లో అదనపు కమిషనర్లను నియమించాలి

Thu, 24 Mar 2011, IST    vv Share  Buzz up!
కిరణ్‌కుమార్‌కు నారాయణ లేఖ
హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌లో అదనంగా కమిషనర్లను నియమించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి సి.పి.ఐ. రాష్ట్ర సమితి కార్యదర్శి డా|| కె.నారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ యిలా వున్నది. సమాచార హక్కు చట్టం ఏర్పడి 6 సంవత్సరాలు పూర్తయి నప్పటికీ నిజాయితీగా చెప్పుకోవాలంటే అది సంతృప్తికర స్థాయిలో లేదా ఆశించదగ్గ రీతిలో అమలుకు నోచుకోలే దన్నది మీకూ తెలిసిన విషయమే ! చట్టపు ఆచరణకు సంబంధించిన బలమంతా తగినంత మంది యోగ్యులైన కమిషనర్ల నియామకంపైనే అధారపడి ఉంటుందన్నారు. ఏ కారణాల వల్లనైతేనేమి గతంలో ఒక ప్రధాన కమి షనరు, ముగ్గురు కమిషనర్ల నియామకం మాత్రమే జరిగిందన్నారు. ఈ 6 సంవత్సరాల అనుభవం చెబు తున్న దాన్ని బట్టి సమాచార హక్కు చట్టం క్రింద సమా చారం కోరుతూ చేసుకున్న దరఖాస్తులను పరిష్కరించే పని పౌర సమాచార అధికారుల స్థాయిలో సక్రమంగా అమలు జరగలేదన్నారు. ఆ నేపధ్యంలో కమిషన్‌కు వచ్చిన అప్పీళ్ళ పరిష్కారం కూడా తగినంత మంది కమి షనర్లు లేకపోవటం వల్ల విపరీతమైన జాప్యం జరు గుతూ నెలలే గాక సంవత్సరాల తరబడి అపరిష్కృతం గానే పడి ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అంతగా చైతన్యవంతంగాని ఈ దశలోనే పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఒక పక్క ప్రభుత్వం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ద్వారా, ఏ.ఎం.ఆర్‌ - అపార్డు ద్వారా ప్రభుత్వాధికారులకే గాక ప్రజలకూ అవగాహన కల్గించే కార్యక్రమాలు చేపట్టింది. ఈ రెండు సంస్థల యత్నాల వల్ల రాబోవు కాలంలో చైతన్యవంత మైన ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించు కోవడానికి పూనుకుంటారు. ఆ పరిస్థితిలో వారు కోరిన సమాచారాన్ని అందించడానికి గానీ, సమాచారాన్ని సక్రమంగా అందిచని వారిపై చర్యలు తీసుకోవడానికి తగినంత మంది కమిషనర్లు, వారికి సహకరించే సిబ్బంది, అనువైన సామాగ్రి లేకుండా సాధ్యపడదు. కనుక పూర్తి స్థాయిలో కమిషనర్ల నియామకం తప్పని సరిగా చేయవలసి ఉందన్నారు. ఇది జరగకుంటే కమిష నర్ల ముందుకు వచ్చే ఆప్పీళ్లు పెండింగ్‌ కేసులు మాదిరే తయారయ్యే ప్రమాదముందన్నారు.
అంతేగాక కమిషనర్ల ఎంపిక విషయంలో సమాచార హక్కు చట్టం నిర్ధేశిస్తున్న మార్గదర్శకాలకు అనుగుణంగా అనుభవజ్ఞులైన వ్యక్తులను కమిషనర్లుగా నియమించక పోయినా, చట్టం ఆశిస్తున్న రీతిలో ప్రజలకు న్యాయం జరగదన్నారు. కనుక ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను దృష్టిలోపెట్టుకొని చట్టం అవకాశం కల్పి స్తున్న మేరకు ప్రధాన కమిషనర్‌కు తోడుగా 10 మంది కమిషనర్లను నియమించ వలసిందిగా కోరారు. ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలలో పదిమంది చొప్పును కమిషనర్ల నియామకం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మన కంటే చిన్న రాష్రాలలో కూడా ఎక్కువ సంఖ్యలో కమిషనర్ల నియామకం జరిగి, సమాచార హక్కు చట్టం ఆదర్శప్రా యంగా అమలు జరుగుతున్నదన్నారు. ఈ దశలో పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇంతవరకు కమిషనర్ల ఎంపిక జరగక పోవడం విచారకరమన్నారు. వెంటనే కమిషనర్ల ఎంపికతో పాటుగా కమిషన్‌లో తగినంత మంది సిబ్బందిని, సామాగ్రిని, వసతులను సమకూర్చవలసిం దిగా కోరారు. సమాచార హక్కు చట్టం సెక్షన్‌ 26 లో చూపించిన విధంగా వీలైనంత ఎక్కువగా దాన్ని గురించి చేయవలసిన ప్రచారానికి వీలైనంత ఎక్కువగా నిధులను సమకూర్చాలని కోరారు.
సమాచారం అందక ఇబ్బంది పడుతున్న పేద ప్రజలు రెండవ అప్పీలు విషయంలో రాష్ట్ర రాజధానికి రావలసి రావడం పెను భారంగా మారిందన్నారు. అందుచేత రెండు లేక మూడు జిల్లాలకు ఒక కమిషనర్‌ చొప్పున ప్రాంతీయ కమిషనరేట్లను కూడా ఏర్పాటు చేసి చట్టం ప్రధానంగా ఉద్ధేశిస్తున్న పేద ప్రజలకు న్యాయం చేకూర్చవలసింనదిగా కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌కు నారాయణ విజ్ఞప్తి చేశారు.

ప్రతి కార్మికునికీ

ప్రతి కార్మికునికీ రూ.10 వేల జీతం ఇవ్వాలి

Thu, 24 Mar 2011, IST    vv Share  Buzz up!
కార్మిక సంఘాల ఐక్య ధర్నా
హైదరాబాద్‌ (వి.వి.) : రాష్ట్రంలో ప్రతి కార్మికునికి కనీస వేతనం రూ.10 వేలకు పెంచి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న 5 లక్షలపైగా ఉన్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులను వెంటనే క్రమబద్ధీకరించే వరకు ఐక్య ఉద్యమాలను కొనసాగిస్తామని పలు కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికుల న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ పి.జె చంద్రశేఖరరావు హాజరుకాగా, ఎఐటియుసి కార్యదర్శి నరసింహన్‌, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాభాస్కర్‌, టిఎన్‌టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రాంబాబు, ఐఎఫ్‌టియు నాయకులు ఎస్‌.వెంకటే శ్వరరావు, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు నాయిని నర్సింహారెడ్డి, నాయకులు ఆర్‌.రాంబాబు, ఎఐయుటియుసి నాయకులు సుధీర్‌, సిసిఇడబ్య్లూడబ్య్లూ నాయకులు వి.నాగేశ్వరరావు, ఎఐడిడిఇఎఫ్‌ నాయకులు చంద్రయ్యలు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కార్మిక సంఘాల నాయకులు మహమ్మద్‌ యూసుఫ్‌ (ఎఐటియుసి), జె.వెంకటేశ్‌ (సిఐటియు), వెంకటేశ్‌ (హెచ్‌ఎంఎస్‌), ఎస్‌.ఎల్‌.పద్మ (ఐఎఫ్‌టియు), అశోక్‌ (టిఎన్‌టియుసి) అధ్యక్షవర్గంగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా పి.జె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, శాశ్వత స్వభావం గల పనులలో శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టర్లు మారినాఅప్పటికే అక్కడ పని చేస్తున్న కార్మికులను తొలగించడమో, మార్చడమో చేయరాద న్నారు. రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్న కార్మికులకు పెరిగిన ధరలకు అనుగు ణంగా కనీస వేతనం 10 వేలకు పెంచాలని గత రెండేళ్లుగా ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఎన్నో ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
నరసింహన్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు ఇప్పటికే రూ.40 వేల వరకువున్న వేతనాలను రెట్టింపు చేయాలని అడిగిన వెంటనే జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో అమలు చేయడానికి సిద్ధమైన ముఖ్యమంత్రికి కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదని ధ్వజమెత్తారు. కార్మికులకు ఇచ్చే నాలుగు, ఐదు వేల రూపాయలు జీతం ఈ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇస్తే ఇంట్లో వారికి తిండి పెడతారో, లేక వాత పెడతారో తెలుస్తుందన్నారు. సుధాభాస్కర్‌ మాట్లాడుతూ కనీస వేతనానికి సంబంధించి జీవో విడుదల చేసినా అమలు చేయడం లేదని విమర్శించారు. అమలు అయ్యేలా ముఖ్యమంత్రిచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జి.రాంబాబు మాట్లాడుతూ, కనీస వేతన జీవో విడుదల కోసం పోరు తప్పడం లేదని, మరోవైపు వచ్చిన జీవో అమలుకు కూడా ఉద్యమిస్తే తప్ప ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేెటన్నారు. ఎస్‌.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సమానపనికి సమాన వేతనం చెల్లించాలని జీవో నెం.6 క్లాజ్‌ (7)ను విధిగా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆర్‌.రాంబాబు, సుధీర్‌లు మాట్లాడుతూ, కార్మికుల చట్టం ప్రకారం పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌ కార్మికులన్న తేడా లేకుండా సంవత్సరంలో 30 రోజులు పని చేస్తే బోనస్‌ ఇవ్వాలని ఉన్నా, కార్మికులకు మాత్రం ఏళ్ళకు ఏళ్ళుగా పనిచేస్తున్నా బోనస్‌ ఇవ్వడం లేదన్నారు. వి.నాగేశ్వరరావు, చంద్రయ్య మాట్లాడుతూ 1957వ సంవత్సరంలో జరిగిన ఇండియన్‌ లేబర్‌ కాన్ఫ్‌రెన్స్‌ సూచనల మేరకు కనీస వేతనం అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా ప్రతి కార్మికునికి పిఎఫ్‌, ఇఎస్‌ఐ, బోనస్‌ తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

పునరావాసం,

పునరావాసం, పునర్నిర్మాణం పేరుతో పేదలను దూరం చేయొద్దు

Wed, 23 Mar 2011, IST    v Share  Buzz up!
కె.శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్‌, (వి.వి.) : ప్రభుత్వం ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకుండా, పునరావసం కల్పించకుండా నిరుపేదలు నివసించే మురికివాడలను నగరానికి దూరంగా తరలించడం నేరమవుతుందని ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజెయు) సెక్రటరీ జనరల్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజల్లో లోతైన చర్చ జరగకుండా కేంద్రప్రభుత్వం మురికివాడల పునరాభివృద్ధి, పునరావాసం, నివారణాచట్టం- 2010 (మెప్మా) పేరుతో రూపొందించిన ముసాయిదాబిల్లును రాష్ట్రప్రభుత్వం చట్టంగా తీసుకువస్తే అది పేదప్రజల నివాసహక్కుకు తీరని నష్టాన్ని చేకూరుస్తుందన్నారు. బుధవారం నగరంలోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో 'అందరికీ నివాసహక్కు' డిమాండ్‌పై, నివాస హక్కుల పరిరక్షణ ప్రచారసమితి (ఛత్రి) ఆధ్వర్యంలో జరిగిన మీడియా ప్రతినిధుల ఇష్టాగోష్ఠి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్రప్రభుత్వం 'రాజీవ్‌ ఆవాస్‌ యోజన' అమలుకోసం రూపొందించిన మురికివాడల అభివృద్ధి, పునరావాసం, నివారణ చట్టం అనే పదాలు పేదలకు చెడుచేయకుండా ప్రభుత్వ ఉద్దేశ్యం యథావిధిగా అమలు చేస్తే అభ్యంతరం లేదన్నారు. ఈ చట్టంలోని లొసుగులు అధికారులకు, రాజకీయవేత్తలకు చాలా అందుబాటులో ఉండి వారికి లబ్ధిచేకూర్చేదిగా ఉంటే వ్యతిరేకించాల్సిన అవసరముందన్నారు.నగరాలు, పట్టణాల్లో భూమి బంగారం కంటే ఎక్కువగా పెరిగిపోతుందని, పేదలు నివాసమేర్పరచుకోవడానికి అనువుగా ఉన్న 95 శాతం ప్రభుత్వభూమిని ల్యాండ్‌మాఫియా, కొందరు రాజకీయవేత్తలు, బ్యూరోక్రసీ ఏకమై అక్రమించుకునేందుకు యత్నించడం శోచనీయమన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి మహీధర్‌ రెడ్డి రాష్ట్రంలో రాజీవ్‌ ఆవాస్‌ యోజన అమలుకు కేంద్రాన్ని రూ.68 వేల కోట్లనిధులు కోరితే, రూ. 6,500 కోట్లు కూడా కేటాయించలేదని తెలిపారు. 2014 నాటికి రాష్ట్రంలో ఎక్కడా కూడా మురికివాడలు లేకుండా చేస్తామన్న ప్రభుత్వఆకాంక్ష సరైనదైనప్పటికీ, ఆచరణ కష్టసాధ్యమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదాబిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్‌కు ప్రయత్నించే అవకాశం కూడా ఉందన్నారు.మానవ హక్కుల వేదిక అధ్యక్షులు జీవన్‌కుమార్‌ ప్రసంగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్‌ సిటీ కాన్సెప్ట్‌ వస్తుందని అందుకు షాంఘై నగరాన్ని ఉదహరించారు. నగరాలు చాలా అందంగా ఉండాలన్న పేరుతో పాలకులు పేదలను నగరాలనుంచి వెళ్ళగొట్టే ఆలోచన చేయడం ఆక్షేపణీయమన్నారు. మురికివాడలను, ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యం (పిపిపి) పేరుతో అభివృద్ధి చేయాలని చూస్తోందన్నారు. పిపిపి చాలా ప్రమాదకరమైనదని పేర్కొన్నారు. పాలకులు రాజకీయలబ్ది కోసమే ఎన్నికలప్పుడు పథకాలను రూపొందిస్తున్నారని, ప్రజలకు జీవించే హక్కు ఉన్నప్పటికీ నివాసహక్కు కల్పించకపోవడం విచారకరమన్నారు. ఛత్రి కన్వీనర్‌ బ్రదర్‌ వర్ఘీస్‌ తెక్నాథ్‌ మాట్లాడుతూ పేదప్రజలకు నివాసహక్కు దక్కే విషయంలో మీడియా క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. పేదరికం నిర్మూలన కోసం ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నా నేటికీ అట్టడుగువర్గాల ప్రజలకు ఉచితంగా ఇళ్ళు నిర్మించి ఇవ్వలేకపోవడం విచారకరమన్నారు. పేదలకు నివాసహక్కు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. ఛత్రి కో- ఆర్డినేటర్‌ జె.రమణారావు అధ్యక్షతన జరిగిన ఈ ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఛత్రి కన్వీనర్‌ వర్ఘీస్‌ సమాధానాలిచ్చారు.

కాంగ్రెస్ కు భంగపాటు

కాంగ్రెస్ కు భంగపాటు

  • 'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్‌ బోణీ
  • టిడిపికి రెండు బోనస్‌
  • డిఎస్‌, సిఎం 'పోస్టుమార్టం'
  • నివేదికతో నేడు ఢిల్లీకి కిరణ్‌
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఎనిమిది జిల్లాల్లోని తొమ్మిది 'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ బుధవారం జరగ్గా కాంగ్రెస్‌కు భంగపాటు కలిగింది. తొమ్మిది స్థానాల్లో మూడు మాత్రమే అధికార కారగ్రెస్‌కు దక్కగా ఆరింట ఓడిపోయింది. జగన్‌ గ్రూపు అభ్యర్ధులు మూడు స్థానాల్లో గెలుపొందగా టిడిపికి మరో మూడు స్థానాలు లభించాయి. గతంలో ఈ తొమ్మిదింటిలో ఆరు కాంగ్రెస్‌ స్థానాలు కాగా రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు, ఒక చోట టిడిపి అభ్యర్థి గెలిచారు. ఆరు స్థానాలున్న కాంగ్రెస్‌కు ఈ సారి మూడే వచ్చాయి. ఇదే సమయంలో ఒక సిట్టింగ్‌ స్థానం ఉన్న టిడిపికి రెండు బోనస్‌గా వచ్చాయి. కాంగ్రెస్‌లోని గొడవల కారణంగానే టిడిపి లాభ పడింది. ఇక జగన్‌ గ్రూపు మూడు స్థానాలను తన ఖాతాలో వేసుకొని బోణీ కొట్టింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా అయిన చిత్తూరులో కాంగ్రెస్‌ అభ్యర్థి పరాజయం పాలయ్యారు.
అక్కడ జగన్‌ గ్రూపు అభ్యర్థి గెలవడం కొసమెరుపు. చిత్తూరులో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్నికకు ముఖ్యమంత్రి స్వయంగా పావులు కదిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. జగన్‌ సొంత జిల్లా కడపలో ఆయన గ్రూపు నిలబెట్టిన అభ్యర్థి గెలుపొందినప్పటికీ ఇదేమంత గెలుపు కాదని రాజకీయ విశ్లేషకులు, ప్రత్యర్ధులు అంటున్నారు. కడప జిల్లా మొత్తం తనదేనని వైఎస్సార్‌ పార్టీ చెప్పుకుంటున్న తరుణంలో జగన్‌ గ్రూపు అభ్యర్థికి కేవలం పది ఓట్ల మెజార్టీ వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి జగన్‌ గ్రూపు వశమైంది. ఇక్కడ ఊహించినట్లుగానే గంగాభవానీకి చుక్కెదురైంది. ఆమె అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీలోని కొందరు వ్యతిరేకించారు. అయినా ఆమెకే టిక్కెట్‌ ఇవ్వడంతో జగన్‌ గ్రూపు గెలుపునకు మార్గం సుగమైంది.
'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీలో గ్రూపు తగాదాలకు ఆజ్యం పోశాయి. అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డికి, మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్‌ మధ్య బహిరంగంగా విమర్శల తూటాలు పేలుతున్నాయి. చిత్తూరు జిల్లాలో మొదటి నుండి కిరణ్‌కుమార్‌రెడ్డిని వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారథ్యంలో ఎమ్మెల్యేలు కుతూహలమ్మ, షాజహాన్‌ తదితరులు కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడించి తమ అభ్యర్థిని గెలిపించుకున్నారు. ఇది సిఎంకు చెంప పెట్టులాంటిది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చక్రం తిప్పినట్లు పేరొచ్చింది. కాంగ్రెస్‌ అభ్యర్థులందరినీ గెలిపించుకోవడంతో సొంత పార్టీ నేతలు ఆకాశానికెత్తారు. ఇదే సమయంలో తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ నేరుగా సిఎంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కెసిఆర్‌ విమర్శలను పక్కనబెడితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించడంతో పెరిగిన ముఖ్యమంత్రి ప్రతిష్టను 'స్థానిక' ఎమ్మెల్సీ ఫలితాలు పాతాళానికి దిగజార్చాయి. 'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి రాజకీయ పార్టీలు డబ్బు మీదనే నడిచాయి. ఓటర్లను పలు రకాలుగా ప్రలోభాలకు గురి చేసినట్లు ఆరోపణ లొచ్చాయి. ప్రధానంగా కాంగ్రెస్‌, జగన్‌ గ్రూపు వేర్వేరు చోట్ల ఓటర్లకు శిబిరాలు నిర్వహించాయి. టిడిపి సైతం కొన్ని చోట్ల క్యాంప్‌ రాజకీయాలు చేసింది. భారీ స్థాయిలో ఓటర్ల కొనుగోళ్లు జరిగినట్లు వార్తలొచ్చాయి. తొలుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయట్లేదని, తమ మద్దతుదార్లు ఆత్మప్రబోధానుసారం ఓట్లేయాలని జగన్‌ ప్రకటన చేశారు. ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పొచ్చింది. జగన్‌ బహిరంగంగా కనబడకపోయినప్పటికీ ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలు, నేతలు 'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టారు. ఆ విధంగా కడప, చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలోని ఒక స్థానంలో జగన్‌ గ్రూపు అభ్యర్థులు రంగంలోకి దిగగా కడప, చిత్తూరు, పశ్చిమ గోదావరిలో విజయం సాధించారు. పశ్చిమ గోదావరిలోని మరో స్థానంలో టిడిపి నెగ్గింది. తూర్పు గోదావరిలో జగన్‌ గ్రూపు, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్య ఓట్ల చీలిక టిడిపికి లాభించింది. అక్కడ టిడిపి అభ్యర్థి గెలుపొందారు. అనంతపురం స్థానం మరీ విచిత్రం. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి బరిలో ఉన్నారు. తనకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదన్న అసంతృప్తితో ఉన్న జెసి దివాకర్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సత్తా చూపారు. తమ గ్రూపు ఓటర్లను ఎన్నికల్లో ఓట్లు వేయనీకుండా చేశారు. దీంతో అక్కడ ఊహించని విధంగా టిడిపి అభ్యర్థి గెలుపొందారు. పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి గతంలో వైఎస్‌కు సన్నిహితంగా ఉండేవారని పేరుంది. మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్‌ పరోక్షంగా జగన్‌ గ్రూపుతో చర్చలు జరిపి వారి తరఫున అభ్యర్థి లేకుండా చూసుకున్నారని తెలుస్తోంది. అయితే మంత్రులను వ్యతిరేకిస్తున్న జెసి తనదైన శైలిలో అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి లేరంటూ ఎన్నికలను బహిష్కరించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమి చెందడంతో అనంతపురం జిల్లాలో మంత్రులు, జెసి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. జెసి కాంగ్రెస్‌ ద్రోహి అని, ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని మంత్రి రఘువీరా విమర్శించగా, మంత్రులే ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యారని జెసి గ్రూపు ఆరోపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల అనంతపురం జిల్లా కాంగ్రెస్‌లో చిచ్చు రాజుకుంది. పార్టీ నిట్టనిలువునా చీలింది. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన సన్నిహితుడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన గెలుపు వెనుక ధర్మాన కృషి ఉందని చెప్పాలి. ఇక నెల్లూరులో జగన్‌ గ్రూపు అభ్యర్థి ఉన్నప్పటికీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, నేదురుమల్లి గ్రూపులు కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపునకు కలిసి పని చేశారని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. అందుకే అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందారంటున్నారు. కర్నూలులో ఎస్‌వి సుబ్బారెడ్డి కుమారుడు ఎస్‌వి మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకిదిగి విజయం సాధించారు. ఇక్కడ జగన్‌ గ్రూపు ఎస్వీకి మద్దతిచ్చింది. ఎస్వీ సోదరి శోభానాగిరెడ్డి ప్రస్తుతం జగన్‌కు మద్దతిస్తున్నారు. ఆ సంబంధాలే జగన్‌ గ్రూపు అభ్యర్థిని నిలబెట్టకుండా చేశాయని సమాచారం.
ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలతో కంగుతిన్న ముఖ్యమంత్రి ఇప్పుడు డబ్బు ప్రభావం ఎన్నికల్లో పని చేసిందంటున్నారు. వాస్తవానికి కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపునకు మంత్రులు రంగంలోకి దిగి నానా ప్రలోభాలకు గురి చేశారన్నది బహిరంగ రహస్యం. అవేమీ తెలీనట్లు వ్యవహరిస్తున్నారు సిఎం. నిజానికి స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు పంపిణీ, క్యాంపు రాజకీయాలు, మద్యం ప్రవాహం తదితర అరాచకాలు ప్రబలాయి. వీటికి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలన్నీ బాధ్యత వహించాల్సి ఉంది. తూర్పుగోదారి జిల్లాలో పలువురిపై పిసిసి అధ్యక్షుడు సస్పెన్షన్‌ వేటు వేసినప్పటికీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అదుపు చేయలేకపోయారు. ఫలితాలొచ్చాక ఎక్కడో తప్పు జరిగిందని, పోస్టుమార్టం చేస్తున్నామని, పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని డిఎస్‌, సిఎం హెచ్చరికలు చేస్తున్నారు. నిజానికి మాజీ మంత్రి జెసిపై చర్య తీసుకొనే స్థితి ప్రస్తుత కాంగ్రెస్‌కు లేదనే చెప్పాలి. అలాగే చిత్తూరులో కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇప్పుడు తమ అభ్యర్థి జగన్‌ గ్రూపు కాదు కాంగ్రెస్‌ అభ్యర్థి అని చెబుతున్నారు. బహిరంగంగా సిఎంకు సవాల్‌ విసురుతున్న పెద్దిరెడ్డిపై సైతం చర్యలు తీసుకోలేని బలహీనత కాంగ్రెస్‌కు ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ అధిష్టానానికి డిఎస్‌, సిఎం వేర్వేరుగా నివేదికలు తయారు చేసి పంపుతున్నారు. ముఖ్యమంత్రి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అధిష్టానానికి అన్ని విషయాలూ వివరించడానికే కిరణ్‌ ఢిల్లీ వెళుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఏది నా మాదిగ

ది నా మాదిగ పల్లెలో కత్తికి పదును పెట్టి తోలు జేక్కను పలుగాజిరి కాలుకు కొలత తిసి తోలు పెట్టి తోలుతో నా అరె పదునెక్కి తోలుకు దిగొట్టి తోలు చిరికతో ముడిపెట్టి పదును పెట్టి పను రాయి గుటాముతో మొలలు దిఘ గొట్టి నా రా చిరి జేడకట్టి రిబ్బన్ అల్లి ముద్దుగా ముడిచేతే అ తోలు చెప్పు సింగారించి సమారు పెట్టి కళ్ళకు తొడిగి బాటన  పోతుంటే కిర్రు కిర్రు చప్పుడు నా కాళ్ళ జోడు రాజులూ కట్టించిన రతి మేడలు ఎక్కువో మాదిగ ముడిచినా తోళ్ళ చెప్పులు గూడా అంతా రాజ్యానికి రక్షణ  గోడలంటివి గట్టు కెళ్ళినా ముళ్ళ పొదలు తొక్కినా ముట్టనియదు  కాళ్ళకు రాయి దోక్కినా నిప్పు  రవ్వ తొక్కినా బోడుపు రానివ్వదు బొగ్గ కానివ్వదు ఏది నా మాదిగ పల్లెలో తోళ్ళ కోతల చప్పుడు ఏది తొక్కి తిరుగాదామన్న నటి సంధడేది చినిగన చెప్పుకు వుంగటం ముడుచే పెద్దలేరి నా కత్తికి కల తప్పి పని రాయి గుతము ములకు ములుగా పట్టే నా అరె సిమ్మట సిలుము ఎక్కి కానరాదే లంద గోలేము ఎండిపోయే తోళ్ళ వునుడు మనుడాయే తంగడి చెక్క తలదన్ని పాయె నా వృత్తి ధర్మం కులిపయే భాతుకు బారము బరేడాయే కాదు కాదు కుదోసిన అ కుభేరులు అగ్రవర్ణ రాక్షసులు పరిశ్రమలు పెట్టి పడుచేసిరి చేతి నిండా పనిలేక కూటికి కుమిలిసచ్చే నా మాదిగలు యుగాలు మారి మతాలు మారిన మార్పు రాదాయే నా మాదిగ జాతిలో ఎన్నాళ్ళు ఇంకా ఎంత కాలము యి ఆఘా చట్లు పడ లేక  అమానుషము అంటా రానిథానము వెలిఎయడము బలి చేయడము తగదు తగదు ఉద్యమిస్తము ఉప్పెనైతము లేవాలి లేచి నడవాలి ఉద్యమానికి తేవాలి నా మాదిగ జాతికి అ మార్పు ------------- చెరుకు పల్లి జనార్దన్ మాదిగ భువన గిరి డివిజన్ మాదిగ దండోరా సంక్షేమ సమితి అద్యక్షులు సెల్ నంబర్ 9912978924

'మౌలిక' నిరశన

దళితులు, ఆదివాసులు, పట్టణ పేదలు, కౌలుదార్ల సమస్యలపై హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, ఆ పార్టీకి చెందిన కార్యదర్శివర్గ సభ్యులు జి. నాగయ్య, ఎస్, వీరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మిడియం బాబూరావులు ఆమరణ నిరశన దీక్షను చేపట్టారు. ఐదురోజులుగా నిరశన దీక్ష చేస్తున్న వారిని శనివారం అర్ధరాత్రి అరెస్టుచేసి గాంధీ హాస్పిటల్‌కు తరలించినప్పటికీ వారు తమ దీక్షలను కొనసాగించారు.

ప్రజా సమస్యలపై నిరాహార దీక్ష చేస్తున్న వారితో ప్రభు త్వం చర్చించకుండా అరెస్టు చేసి దీక్షను భగ్నం చే సేందుకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవాప్తంగా ఆందోళనలు జరిగాయి. వివిధ జిల్లాల్లో వందలాది మందిని ప్రభుత్వం అరెస్టు చేసింది. ప్రభుత్వ వైఖరి పట్ల రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ ప్రతినిధులుగా రాష్ట్ర మంత్రులు పి.శంకరరావు, డొక్కా మాణిక్య వరప్రసాదరావులు దీక్ష చేస్తున్న నేతలను సోమవారం పరామర్శించారు. నిర్దిష్టమైన హామీలేమీ ఇవ్వకపోయినా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని మంత్రులు ప్రకటించారు.

దళిత, ఆదివాసుల సమస్యల పట్ల స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకూ దీక్షలు కొనసాగిస్తామని ప్రకటించిన సీపీఎం నేతలు రాష్ట్ర మంత్రులు పితాని, బాలరాజుతో మరో విడత చర్చించిన అనంతరం దీక్ష విరమణకు సమ్మతించారు. పెద్ద సంఖ్యలో దీక్షాస్థలికి చేరుకున్న కార్యకర్తల సమక్షంలో ఈ నిరశనోద్యమం పాక్షిక విజయం సాధించిందని ప్రకటిస్తూ రాఘవులు తదితర నేతలు దీక్షను విరమించారు.

గత కొంత కాలంగా ప్రత్యేక తెలం గాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు, పార్టీలలో తలెత్తిన అంతర్గత వివాదాల చుట్టూ దాదా పు అన్ని రాజకీయపార్టీలు ప్రదక్షిణాలు చేస్తున్నాయి. సమాజంలోని అట్టడుగు ప్రజానీకపు మౌలిక సమస్యలను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోని ఈ సమయంలో వాటి పరిష్కారానికై సీపీఎం నేతలు నిరవధిక నిరశన దీక్షకు సిద్ధపడటం హర్షించదగ్గది.

సీపీఎం నేతలు చేస్తున్న నిరశన దీక్షలకు సమాంతరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సమస్యలకు చెందిన ప్రజా సెక్షన్‌లను కదిలిస్తూ ఆ పార్టీ స్థానిక కార్యకర్తలు ఆందోళన లు చేపట్టారు. ఆ క్రమంలో మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. సీపీఎం నేతలు చేస్తున్న దీక్షలకు మద్దతుగా అనుబంధ సంఘాలు, ప్రజాసంఘాలు మహార్యాలీని నిర్వహించాయి.

అయితే దళిత, ఆదివాసుల సమస్యలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాలన్న నిరశనకారుల డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం తోసి పుచ్చింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కచ్చితంగా అమలయ్యేందుకు ప్రత్యేక చట్టం చేయాలని సోమవారం సీపీఎం సభ్యలు ఉభయసభలలో డిమాండ్ చేశారు. గత కొద్ది సమావేశాల నుంచి అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలు అధికార, ప్రతిపక్ష పార్టీల బలాబలాలను తేల్చుకునే వేదికలుగా మారిపోయాయి.

దిగజారిపోతున్న ప్రజల జీవన ప్రమాణాలు, అధిక ధరలు, నిరుద్యోగం, ఆహార, ఆరోగ్య భద్రతలు, దారిద్య్రం లాంటి మౌలిక ప్రజా సమస్యలపై రాజకీయపక్షాలు లోతుగా, సమగ్రంగా చర్చించకుండా స్కాంలపై మాత్ర మే తీవ్రంగా స్పందిస్తున్నాయి. దాంతో ప్రజా సంక్షేమం కుప్పకూలింది. ఈ నిరశనోద్యమం విస్మృత ప్రజా సమస్యలను తిరిగి తెరపైకి తెచ్చింది.

వాస్తవానికి సీపీఎం ముందుకు తెచ్చిన 51 డిమాండ్లు ఈనాడు కొత్తగా ముందుకొచ్చినవి కావు. ఏళ్ల తరబడి ప్రభుత్వాలు పట్టించుకోకుండా పోయినవే. వాటిలో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్, స్కెషల్ కాంపొనెంట్ అమలు డిమాండ్‌లు ఇందిరాగాంధీ పాలనా కాలంలో రూపొందినా ఇప్పటికీ అమలుకు నోచుకోని దుస్థితి.

దళిత, ఆదివాసీ ప్రజానీకం కోసం రూపొందించిన ఉప ప్రణాళిక, నోడల్ ఏజెన్సీ పనితీరు, నిధుల కేటాయింపులు, వాటి అమలు తీరుతెన్నులు వగైరాలు ఆ ప్రజలను ఓటు బ్యాంకులుగా మాత్రమే ఈ ప్రభుత్వాలు పరిగణిస్తున్నట్లు రుజువు చేస్తున్నాయి. అదే సమయంలో దళితులు, ఆదివాసులు విద్య, వైద్య సౌకర్యాలకు ఆమడ దూరంలో ఉన్నారు. 2009-10 ప్రణాళికలో కేటాయించిన నిధులలో 10 శాతాన్ని కూడా ప్రభు త్వం ఖర్చుపెట్టకపోవడం ప్రభుత్వాల చిత్తశుద్ధికి ప్రబల తార్కాణమని సీపీఎం విమర్శిస్తోంది.

జనాభాకు అనుగుణంగా, అంతకంటే అధికంగా ఎస్సీ, ఎస్టీలకు నిధులను కేటాయించాలని 1981లో ప్రణాళికా సంఘం సూచించింది. ఆ సూచ నలు రాష్ట్రంలో 2005లో ఉత్తర్వులుగా వచ్చాయి. ఈ నిధులను అమలులోకి తెచ్చే లక్ష్యంతో 2007లో ఒక నోడల్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన్పటికీ అది ఏరోజూ పనిచేసిన పాపాన పోలేదు. ఉప ప్రణాళిక ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవైఒక్క వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంది.

ఎస్సీ, ఎస్టీలకు చెందిన నోడల్ ఏజెన్సీని ప్రభుత్వం కోరలులేని పులిగా మార్చివేయడంతో వేల కోట్ల రూపాయల నిధులు మురిగిపోయిన తర్వాత వేరే రంగాలకు తరలిపోతున్నాయి. కేటాయించిన నిధులను మురగబెట్టేది, వాటిని వేరే ప్రయోజనాల కోసం వినియోగించేదీ ఈ ప్రభుత్వాలే. ఈ అంశంపై ప్రణాళికా సంఘం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుపట్టింది.

దళిత, ఆదివాసుల సంక్షేమ కోసం కేటాయించిన నిధుల నిర్వహణ కోసం కేంద్రీయ ప్రణాళిక ఏదీ ప్రభుత్వం దగ్గర లేదు. ఆదివాసేతరులు అక్రమణలో ఉన్న ఆదివాసుల భూమిని విడిపించేందుకు ఉద్దేశించిన 1/70 చట్టానికే దిక్కులేదు. ఇక ఎస్టీల అనుభవంలోని 25 లక్షల హెక్టార్ల భూమికి పట్టాలిచ్చే ముచ్చట ఎక్కడిది? సమగ్రమైన, శాస్త్రీయమైన ఆదివాసీ భూముల సర్వేను చేపట్టకుండా కేవలం నాలుగు లక్షల హెక్టార్లకు మాత్రమే పట్టాలిచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది.

వ్యసాయోత్పత్తిలో అత్యధిక భాగాన్ని సమకూరుస్తున్న కౌలుదార్లకు బ్యాంకు రుణ సౌకర్యం కోసం గుర్తింపు కార్డులు, మహిళా కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌ల నియామకం, చివరికి దళిత, ఆదివాసులకు స్మశాన స్థలం కేటాయింపులాంటి వివిధ డిమాండ్లపై సీపీఎం ఆందోళన చేపట్టింది.

ప్రజల మౌలిక సమస్యలపై జరుగుతున్న నిరశన ఉద్యమం అనవసరమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వివిధ ప్రతిపక్షపార్టీలు, అనేక ప్రజా సంఘాలు సీపీఎం దీక్షకు మద్దతు ప్రకటించి ప్రభుత్వ అలక్ష్యాన్ని ఆక్షేపించాయి. చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఒకవైపు రాత పూర్వకంగా అనుమతినిస్తూ మరోవైపు జిల్లాల నుంచి తరలివస్తున్న ప్రజలను అరెస్టు చేయడం, నాయకులను ముందస్తుగా నిర్బంధించడం ప్రభుత్వ అప్రజాస్వామిక స్వభావాన్ని బట్టబయలు చేసిందని సీపీఎంతో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ తప్పుపట్టాయి.

ఈ నిరశన దీక్షతో ప్రజల మౌలిక సమస్యల తక్షణ పరిష్కార అవసరాన్ని, సందర్భాన్ని తిరిగి తెరపైకి తెచ్చినట్లయింది. కుల, మత, ప్రాంత, జాతి అస్తిత్వ ఉద్యమాలు, ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం కోసం సాగే ఉద్యమాలు పరస్పరం భిన్నమైనవి కావు. ఒకదానికి ఇంకొకటి అవరోధమూ కావు. అవి పరస్పరపూరకమైనవి. రాజకీయపార్టీలు, ఉద్యమ సంస్థలు ఈ రెండు రకాల ఉద్యమాలను నేర్పుగా అనుసంధానించడంలోనే ప్రజా ప్రయోజనం ఇమిడి ఉంది.andhra jyothi soujanyamutho

ఉచిత పంపిణీ

రాజకీయ పార్టీల ఎన్నికల ప్రణాళికలంటే సామాజిక పరివర్తనకు, అభివృద్ధికి పార్టీలు (అధికారంలోకి వస్తే) అనుసరించే విధానాలు పొందుపరిచిన పత్రం అనేది సర్వసాధారణ భావన. అధికారంలోకి వచ్చిన పార్టీ ఎన్నికల వాగ్దానాల అమలులో సాఫల్య వైఫల్యాలు తదుపరి ఎన్నికల్లో చర్చనీయాంశాలయ్యేవి. అది ఒకప్పటి మాట. ఇప్పుడంతా మారిపోయింది. ముఖ్యంగా నయా ఉదారవాద మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థను బూర్జువా పార్టీలన్నీ ఆలింగనం చేసుకున్నాక విధానాలపరంగా భేదాలు అంతర్ధానమయ్యాయి. అధికారం కొరకు పోటీలో అధికార-ప్రతిపక్ష స్థానాలను బట్టి పరస్పరం దుమ్మెత్తిపోసుకోవటం, ఓటర్లకు గాలమేసేందుకు ఉదార లేక ఉచిత పంపిణీ వాగ్దానాలు పెరిగాయి. ఎన్నికల అవినీతి కిందకు రాని రాచబాట ఇది. ప్రజలు అధికారమిస్తే ప్రజలు పన్నుల రూపంలో ఖజానాకు చెల్లించిన సొమ్ముతో ఉభయ తారకంగా వాటిని అలవోకగా అమలు చేయవచ్చు. డి.ఎం.కె. ఇందులో ఆరితేరింది. 1967లో డి.ఎం.కె. తొలిసారి అధికారంలోకి రావటానికి కాంగ్రెస్‌ వ్యతిరేక పవనాలతో పాటు రూపాయికి పడి (మూడుసేర్లు) బియ్యం బ్రహ్మాస్త్రంగా పనిచేసింది. 2006 ఎన్నికల్లో కరుణానిధి నాయకత్వంలోని డి.ఎం.కె. రూపాయికి కిలోబియ్యం, కలర్‌ టెలివిజన్‌ల ఉచిత పంపిణీని వాగ్దానం చేసింది. ఈ పంపిణీ ఇంకా పూర్తికాలేదు. ఎన్నికలు ప్రకటించగానే ఎన్నికల సంఘం టి.వి.ల పంపిణీని నిలుపుచేసింది. వచ్చే నెలలో జరిగే ఎన్నికలకు డి.ఎం.కె. ఉచిత పంపిణీల జాబితాను విస్తరించింది. విద్యార్ధులకు లాప్‌ట్యాప్‌, గృహిణులకు గ్రైండర్‌ లేదా మిక్సీ, పేద కుటుంబాలకు నెలకు 35 కిలోల ఉచిత బియ్యం, వృద్ధులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, గర్భిణులకు నగదు సహాయం పెంపుదల, మత్స్యకారులకు సబ్సిడీలు పెంపు వగైరా కొత్తగా చేరాయి. కుటుంబపాలనపై అసంతృప్తిని, 2జి స్పెక్ట్రం అవినీతిని ఈ 'ఉచితాలు' పరిహరిస్తాయని, ప్రజలు తిరిగి తమకే అధికారం కట్టబెడతారన్నది కరుణానిధి ఆశ! ప్రతిపక్షం ఇంతకు మించి ఏమివ్వగలుగుతుంది!
సినీ నటజీవితమంతా మద్రాసులో (ఇప్పుడు చెన్నై) గడిపిన ఎన్‌.టి.రామారావు 1982లో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అడుగిడి ఆ ప్రభావంతో రెండ్రూపాయలకు కిలో బియ్యం ప్రకటించారు. కాంగ్రెస్‌ దుష్పరిపాలన పట్ల ప్రజల్లో వున్న అసంతృప్తికి ఇది తోడైంది. 1983 జనవరిలో ఆయన టిడిపి అధికారంలోకి వచ్చింది. బి.జె.పి. ముఖ్య మంత్రు లు-మధ్య ప్రదేశ్‌లో శివరాజ్‌ చౌహాన్‌,చత్తీస్‌ ఘర్‌లో రమణ్‌ సింగ్‌, కర్నాటకలో ఎడ్యూరప్ప, గుజరాత్‌లో నరేంద్ర మోడీ ఇదే ధాన్యం రాజకీయం నుండి లబ్దిపొం దారు. పంజాబ్‌లో అకాలీదళ్‌ ఉచిత విద్యుత్‌ వాగ్దానంతో అధికారంలోకి వచ్చింది. 2004 లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ దశాబ్దం తర్వాత తిరిగి అది óకారం లోకి రావటంలో వ్యవసా యానికి ఉచిత విద్యుత్‌ వాగ్దానం ప్రభావం తక్కువేమీకాదు. ప్రతిపక్ష టిడిపి 'నగదు బదిలీ' పథకం ప్రకటించినా ఫలితం లేకపోయింది. ఉచిత పంపిణీలు పేదలకు తాత్కాలిక ఊరట, వెసులుబాటు కల్పించే చర్యలే అయినప్పటికీ, ఎన్నికల్లో చేసే అటువంటి వాగ్దానాలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు లంచంతో సమానం. కాని వాటిని నిరోధించే శక్తి ఎన్నికల చట్టాలకు, వాటిని అమలు జరిపే ఎన్నికల కమిషన్‌కు లేకపోవటం వల్ల రాజకీయ పార్టీలు పోటీపడి ఇటువంటి వాగ్దానాలు చేస్తున్నాయి.
బూర్జువావర్గ పార్టీలు పేదల గూర్చి మొసలి కన్నీరు పెడుతూ ప్రలోభాలతో (వెచ్చించే ధనానికివి అదనం) వారి ఓట్లు పొందటంలో ఆరితేరాయిగాని భూపంపిణీ, శాశ్వత ఉపాధికి చర్యలు తీసుకోవటం ద్వారా వారి కాళ్ళపై వారిని నిలబెట్టేందుకు కృషి చేయవు. వారలా పేదరికంలో వుండటంలోనే వాటికి స్వార్ధం వుంది. అయితే అన్నివేళలా 'ఉచిత' వాగ్దానాలు రాజకీయపార్టీలను గట్టెక్కించలేవు. ఎన్నికల సమయానికున్న రాజకీయ వాతావరణం, పాలకపార్టీ పట్ల ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలు ఫలితాలు నిర్ణయించటంలో ప్రధానపాత్ర వహిస్తాయి. పేదలు కూడా 'ఉచిత' వాగ్దానాల భ్రమల్లో కొట్టుకుపోకుండా రాజకీయంగా మంచి చెడులు ఆలోచించాలి. రాజకీయ పార్టీలు 'ఉచిత' వాగ్దానాలతో తాత్కాలికంగా పబ్బంగడుపుకునే అవకాశవాద రాజకీయాన్ని పక్కనపెట్టి పేదల జీవనాన్ని మెరుగుపరిచే శాశ్వత లాభ చర్యలు చేపట్టిన ప్పుడే నిజమైన ప్రగతి సాధ్యం. ఉచితంగా ఇస్తే అది ఆ రోజుతో సరి. కాని ఆహారం సంపాదించుకునే మార్గం చూపితే అది శాశ్వతం.

మరో అడుగు ముందుకేశాం

  • బహిరంగ సభలో రాఘవులు
  • విశాల వేదిక నిర్మాణానికి కృషి
  • సర్కారు అప్రజాస్వామిక ధోరణులకు నిరసన
దళితులు, గిరిజనులు,కౌలుదార్లు,అసంఘటిత కార్మికులు, పట్టణ పేదలకు సంబంధించి ప్రజా సంఘాలు ప్రస్తుతం సాధించిన పాక్షిక విజయంతో ఒక అడుగు ముందుకేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. 'ప్రభుత్వం అనేక ఆటంకాలు పెట్టినా అశేషంగా తరలి వచ్చిన మీ అందరి స్ఫూర్తితో మున్ముందు మరిన్ని ఉద్యమాలను చేపడతామని' చలో హైదరాబాద్‌ సభకు హాజరైన ప్రజలనుద్దేశించి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, పట్టణ పేదలు, కౌలు రైతులు, కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో సిపిఎం నేతలు బివి రాఘవులు,జి నాగయ్య, ఎస్‌ వీరయ్య,మిడియం బాబూరావు ఆరు రోజులుగా సాగిస్తున్న నిరవధిక నిరాహారదీక్షను ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన బహిరంగ సభ వేదికపై విరమించారు. ఐద్వా అఖిల భారత ఉపాధ్యక్షురాలు బృందాకరత్‌ నాయకులకు నిమ్మ రసమివ్వడంతో దీక్ష ముగిసింది. అనంతరం రాఘవులు మాట్లాడుతూ ప్రజా సంఘాలు ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లలో కొన్నింటిపై స్పష్టమైన హామీ ఇచ్చిం దన్నారు. మరికొన్నింటిని అమలు చేసేందుకు ప్రక్రియను పూర్తి చేస్తున్నామంటూ చర్చలకు వచ్చిన మంత్రులు తెలిపారని చెప్పారు. ఇంకొన్నింటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీగానీ, నిర్ణయంగానీ వెలువడలేదని తెలిపారు. ఇది పాక్షిక విజయమని అన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమం ఒక అడుగు ముందుకేసిందని చెప్పారు.

భవిష్యత్తులో మరిన్ని అడుగులు ముందుకేయాల్సి ఉంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలకు రూపకల్పన చేయాలని చెప్పారు. ఈ సమస్యలపై ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాబోయే రోజులో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, సంస్థలు, శక్తులు, వ్యక్తులతో కలిపి ఒక విశాల వేదికను నిర్మించడానికి కృషి చేస్తామని చెప్పారు.
రాజకీయ సుడిగుండంలో పార్టీలు
ప్రస్తుతం రాష్ట్ర విభజన, సమైక్యత అనే అంశాల చుట్టూనే రాజకీయ పార్టీలు గిర్రున తిరుగుతున్నాయని చెప్పారు. రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్న పార్టీలు రాష్ట్ర విభజన, సమైక్యత అనే సమస్య ఒక్కటే రాష్ట్రంలో ఉన్నట్లు, మిగతా సమస్యలేవీ లేనట్లు వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఆ సమస్య పరిష్కారమైతే ప్రజల కడుపులు నిండినట్లు, వారి పిల్లలకు చదువు, వైద్యం, తదితర సౌకర్యాలు అందుతాయన్నట్లు, అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయన్నట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రం ఒక్కటిగా ఉండాలా? లేక విడిపోవాలా? అనే డిమాండ్లపై ప్రతి పార్టీ తన రాజకీయ విధానానికి అనుగుణంగా పోరాడుతూనే ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు తదితర ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఆ విధంగా చేస్తే తమ పార్టీ, ప్రజా సంఘాల తరపున వారికి పూర్తి సంఘీభావం తెలుపుతామని అన్నారు.ప్రజా సమస్యలపై విస్తృత పోరాటాలు సాగాలన్నారు.
అప్రజాస్వామిక ధోరణులు ప్రమాదకరం
ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తున్న ధర్నాలు, ప్రదర్శనలు, బహిరంగ సభల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు పద్ధతుల్లో, పొరపాటు వైఖరితో వ్యవహరిస్తోందని రాఘవులు విమర్శించారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కూడా వివిధ సమస్యలపై ధర్నాలు, ఆందోళనలు నిర్వహించిందని గుర్తుచేశారు. అంగన్‌వాడీల చలో హైదరాబాద్‌ సందర్భంగా పోలీసులు జిల్లాల్లో ఎక్కడికక్కడ కార్యకర్తలు, నాయకులను అరెస్టు చేశారని అన్నారు. వారేమైనా రౌడీలా? ఉగ్రవాదులా? సిఎం కుర్చీని ఊడబెరకడానికి వస్తున్నారా? లేక అసెంబ్లీని కూల్చేసేందుకు వస్తున్నారా? అని ప్రశ్నించారు. మహిళలని కూడా చూడకుండా ఈ విధంగా అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం వ్యవహరించడం అమానుషమన్నారు. కెవిపిఎస్‌, గిరిజన సంఘం, వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యాన నిర్వహించతలపెట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమం విషయంలోనూ ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరించిందని విమర్శించారు. ప్రజా సంఘాల వారెప్పుడైనా, ఎక్కడైనా దౌర్జన్యం చేశారా? అధికారులు, పోలీసుల మీద దాడులేమైనా చేశారా? ఆస్తులేమైనా ధ్వంసం చేశారా? అని ప్రశ్నించారు. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్ధతుల్లో, అపహాస్యం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమన్నారు.ఇది ప్రజాతంత్ర ఉద్యమాలకు తీవ్ర హాని కలిగిస్తుందన్నారు. ప్రభుత్వం ఈ విధంగా ప్రజాస్వామ్యం మీద దాడిచేస్తే సహించబోమంటూ ప్రజలు గళమెత్తాలని పిలుపునిచ్చారు. ప్రజాతంత్ర వాదులంతా ముక్త కంఠంతో నిరసించాలని కోరారు. ప్రజా ఉద్యమాలను అణచివేస్తే అవి తారాజువ్వలా ఎగిరిపడతాయని రాఘవులు హెచ్చరించారు. జిల్లాల్లో పాదయాత్రలు, సైకిల్‌ యాత్రలు, సర్వేలు, అధ్యయనాలు సాగించిన ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, పేదల పట్టుదల, కృషి వల్లనే ఈ పోరాటం విజయవంతమైందని అన్నారు. ఈ సందర్భంగా వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. దీక్షకు సంఘీభావం తెలిపిన పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులందరికీ ధన్యవాదాలు తెలిపారు