తెలంగాణ దళిత సంఘాల జెఎసి కార్యాలయం ప్రారంభం గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మలక్‌పేట నియోజకవర్గంలోని ఆస్మాన్‌ఘడ్‌లో తెలంగాణ దళిత సంఘాల కార్యా చరణ రాష్ట్ర సమితి శుక్రవారం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రేటర్ దళిత సంఘాల అధ్యక్షుడు బి.సునీల్, వైస్ ప్రెసిడెంట్ ఎ.రమేష్‌లు పాల్గొని ప్రారంభించారు. అనంతరం శాఖ కమిటీ సభ్యులను ఎన్నుకు న్నారు. శాఖ ప్రెసిడెంట్ శాంతికుమార్, వైస్ ప్రెసిడెంట్ ఎ.బాబు, చీఫ్ అడ్వయిజర్ బి.డేవిడ్‌రాజు, జనరల్ సెక్రటరీ ఎస్.నిక్సన్, జాయింట్ సెక్రటరీ ఎ.విల్సన్, నర్సింహ్మ, క్రిష్టోఫర్, శ్యామ్‌సన్ తదితరులను ఎన్నుకు న్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ అధ్యక్షుడు బి.సునీల్ మాట్లాడుతూ దళితుల్లో చైతన్యం రావాలని, వారిపై జరుగుతున్న దాడులను ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దళితుల్లో ఏ వర్గానికి అన్యాయం జరిగినా ప్రతిఘటిస్తామని ఆస్మాన్‌ఘడ్ శాఖ దళిత నాయకులు హెచ్చరించారు. అదేవిధంగా ఆస్మాన్‌ఘడ్‌లో అంబేద్కర్ విగ్రహం త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో దాదాపు వందమంది దళితులు పాల్గొన్నారు.