పిల్లల విషయంలో తల్లి పాత్ర ఎంతో ఉంటుంది. పిల్లలు చెడిపోయినా, బాగుపడినా తల్లే కారణం. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇంటినీ చూసి ఇల్లాలిని చూసుకో అనే నానుడి ఉంది. ఇంటి మొత్తం బాధ్యత తల్లిపై ఉంటుంది. ఆమెకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో కూడా పిల్లలపైన చిరాకుపడటం చేయకూడదు. అది వారిని మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. వారికి ఏదైనా కావాలి అంటే అది వద్దు అని అతి సున్నితంగా చెప్పాలి.
పిల్లల విషయంలో ఇల్లు ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇల్లు వాతావరణం సక్రమంగా లేకపోయినా పిల్లలు ఒత్తిడికి గురయ్యి బయట అలవాట్లు నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లల మనస్సులో ఏమి ఉంది? వారు ఏమి కోరుకుంటున్నారు. దానికి ఎలా వద్దు అని చెప్పాలి అనేది తల్లికే సొంతం.
తల్లి పిల్లల ఆహార విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు తినటానికీ ఇష్టపడకపోతే వదిలివేయకూడదు. వాళ్ళచేత ఆ ఆహారం తినిపించాలి. పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వటం వలన మానసికంగా, శారీ రకంగా వారిలో ఎదుగుదల ఉంటుంది. అయితే వారికి ఎదిగేకొద్ది సమతులహారం, క్యాలరీలను చూసుకొని టైమింగ్ ప్రకారం అలవాటు చేయాలి. కొంత వయస్సు వరకు పిల్లలు తల్లితో ఎక్కువ సమయం గడుపుతూ, తల్లినీ స్నేహితురాలిగా భావించి అన్నీ ఆమెతో పంచుకోవటం జరుగుతుంది.
కానీ ముఖ్యంగా మన వాళ్ళనీ సరిగ్గా, సక్రమంగా తీర్చిదిద్ది కెరీర్ పరంగా సరైనా విధానంలో నడిపించటం అనేది వారి టీనేజ్‌లోనే ప్రారంభం అవుతుంది. ఈ వయస్సులో వారికి ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు. అయితే ఇప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి విషయం తల్లిదండ్రుల కన్నా కూడా ఫ్రెండ్స్‌తో ఎక్కువగా పంచుకుంటారు.
తల్లిదండ్రులు పిల్లల ముందు ఎక్కువగా గొడవపడటం చేయకూడదు. ఇలా చేయటం వల్ల వాళ్ళ ఎదుగుదల మీద ప్రభావం చూపుతుంది. వారు అలాంటి వాతావరణానికి అలవాటు పడతారు. అందువల్ల ఎదిగే పిల్లల విషయంలో ఇల్లు, ఇంటి వాతావరణం ఎక్కువగా పని చేస్తుంది.

కొన్ని సందర్భాల్లో ఆ ఒత్తిడిని స్నేహితులతో పంచుకోవటం వారు చెడు అలవాట్లను అలవాటు చేసే ప్రమాదం ఉంది. అందుకనే తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను కనిపెడుతూ ఉండాలి.
- అనుపమ విశాలాంధ్ర పత్రిక సౌజన్యముతో