న్యూఢిల్లీ : తెలంగాణ అంశంపై గురువారం లోక్‌సభ దద్దరిల్లింది. దాంతో సభ మూడుసార్లు వాయిదా పడింది. తెలంగాణ అంశంపై చర్చకు పట్టుబడుతూ టీఅర్‌ఎస్ ఎంపీలు కేసీఆర్, విజయశాంతిలు పోడియం వద్దకు దూసుకెళ్లారు. తెలంగాణకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన విజయశాంతి, కేసీఆర్‌లకు ఎన్డీయే మద్దతు పలికింది. అలాగే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా గొంతు కలిపారు.
దాంతో సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ మీరాకుమార్ సమావేశాలను 12 గంటలకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో సభను స్పీకర్ మరోసారి మధ్యాహ్నాం రెండు గంటల వరకూ వాయిదా వేశారు. |