ఏబీసీడీ రానట్టే!
కోల్డ్ స్టోరేజీలోకి ఎస్సీ వర్గీకరణ
రాజ్యాంగ సవరణ యోచన విరమణ
రాష్ట్రాలతో సంప్రదింపులకు కేంద్రం నిర్ణయం!

ఇక ప్రతి రాష్ట్రంలో కమిషన్‌లు,అధ్యయనాలు తప్పనిసరి
అసెంబ్లీలూ తీర్మానాలు చేయాల్సిందే
రెండింట మూడొంతల రాష్ట్రాల అంగీకారం కావాలి
ఇదంతా జరగడం దాదాపు అసాధ్యం
ఓటు బ్యాంకు చేజారొద్దనే ఈ జాగ్రత్త !!
దళితుల్లో వెనుకబాటు గుర్తించండి
అభ్యున్నతికి చర్యలు చేపట్టండి
ఎస్సీ కమిషన్ తాజా యోజన
ఎస్సీ వర్గీకరణ అంశం అటకెక్కనుందా? ఇక 'ఏ, బీ, సీ, డీ'లు రానట్టేనా? ఎన్నాళ్లుగానో ఇదిగో అదిగో అంటున్న రాజ్యాంగ సవరణ కొండెక్కినట్టేనా? మొత్తం వర్గీకరణ ప్రక్రియే కోల్డ్ స్టోరేజీలోకి పోబోతోందా? ..కేంద్ర సామాజిక న్యాయ శాఖ తాజా వైఖరి చూస్తే వీటన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది.

హైదరాబాద్, మే 26 : ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ విషయంలో రాష్ట్రాలతో సుదీర్ఘ సంప్రదింపుల ప్రక్రియకు తెర తీయాలని కేంద్రం నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే అధికారాన్ని చేజార్చుకున్న కాంగ్రెస్.. దళిత సమస్యలతో ఇకపై దాగుడుమూతలు ఆడరాదని, కొత్తగా మరిన్ని సమస్యలు కొని తెచ్చుకోరాదన్న నిశ్చయించుకున్నట్టు సమాచారం. దీంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్లను, అభిప్రాయ సేకరణ పేరిట, పూర్తిగా పక్కనపెట్టాలని కేంద్ర సామాజిక న్యాయశాఖ నిర్ణయించినట్టు తెలిసింది.

ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనకు వచ్చిన డిమాండ్లతో పాటు, కొత్తగా వచ్చే వాటిని సైతం రాష్ట్రాల మీదికే తోసేసి, చేతులు దులుపుకోవాలని అది భావిస్తోంది. ఇదే జరిగితే.. గడచిన మూడేళ్లుగా మాదిగలు, ఇతర ఎస్సీ ఉప కులాల ప్రజలు ఎదురుచూస్తున్న ఎస్సీ వర్గీకరణ బిల్లు.. పూర్తిగా కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లినట్లే. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్ఆర్‌పీఎస్) పోరాట ఫలితంగా 2000 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చింది.

మాలలు ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ వారికి ప్రతికూల తీర్పు రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2004లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అదే సంవత్సరం సుప్రీంకోర్టు మాలల పిటిషన్లను విచారించి, ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ కొట్టివేసింది. అనంతరం ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర అసెంబ్లీ మరోసారి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. మాదిగల పోరాట ఫలితంగా.. నాటి ముఖ్యమంత్రి వైఎస్ ఒత్తిడితో ఎస్సీ వర్గీకరణపై అధ్యయనానికి జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది.

దాని నివేదిక అనంతరం, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, వర్గీకరణ కోసం రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదన గడచిన మూడేళ్లుగా ఏ దశలోనూ కేంద్ర మంత్రివర్గం ముందు చర్చకు రాలేదు. కేంద్ర స్థాయిలో లోతైన చర్చ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరగలేదు. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ అనేక పర్యాయాలు ఆమరణ దీక్షలకు దిగారు. జాతీయ పార్టీల నేతలను కలిసి వర్గీకరణకు మద్దతుగా లేఖలు సంపాదించారు. వాటిని ప్రధానికి అందించారు. వీటిపైనా కేంద్రం స్పందించలేదు.

ఇకపై ఇలా..
కాంగ్రెస్ రాజకీయ ఆలోచనలకు అనుగుణంగా.. ఎస్సీ వర్గీకరణ అంశంపై సామాజిక న్యాయ శాఖ హఠాత్తుగా నిర్ణయం మార్చుకుందన్నది విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం. మన రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోరుతున్న మాదిగలు.. ఇతర రాష్ట్రాల్లో పైచేయిగా ఉన్నారు. చమర్లుగా పిలిచే ఈ వర్గం వారు ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల్లో బలమైన సామాజిక వర్గంగాను, గణనీయమైన ఓటు బ్యాంకుగాను ఉన్నారు. ఈ వర్గానికి చెందిన బడా నేతలు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి ఆగ్రహానికి గురికాకుండా చూసుకునే లక్ష్యంతో.. వ్యవహారాన్ని తెర వెనక్కి పంపుతున్నారు.

సంప్రదింపులు అంటే..
ఎస్సీ వర్గీకరణపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు అంటే.. వర్గీకరణ డిమాండ్‌ను కనీసం మరో పదేళ్లపాటు కోల్డ్ స్టోరే జీలో పెట్టడమేనని నిపుణులు చెబుతున్నారు. ఎస్సీ వ ర్గీకరణ డిమాండ్ ఆంధ్రప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోనే ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయంతో అన్నిచోట్లా వర్గీకరణ అమలు రద్దయింది. సామాజిక న్యాయ శాఖ తాజా నిర్ణయం ప్రకారం చూస్తే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అంశంపై ఆయా ప్రభుత్వాలు చర్చించాలి. అంటే వర్గీకరణ అవసరం ఉందా లేదా అనే అంశపై అధ్యయనం చేయించాలి.

అవసరమైతే కమిషన్‌లు ఏర్పాటు చేసి పరిశీలన జరిపించాలి. అంటే.. ప్రతీ రాష్ట్రానికి ఉషా మెహ్రా లాంటి కమిషన్ ఏర్పాటు చేయాలన్న మాట! ఆ తర్వాత ఆ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా.. అసెంబ్లీలో వర్గీకరణ అంశంపై తీర్మానం చేయాలి. ఎస్సీ వర్గీకరణ చేయాలని దేశంలో మూడింట రెండొంతుల మెజారిటీతో అసెంబ్లీలు తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. అప్పుడు మాత్రమే కేంద్రం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కోల్డ్ స్టోరేజీ నుంచి బయటకు తీయగలదు.

ఒకవేళ.. ఎక్కువ రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ అవసరం లేదని తీర్మానం చేస్తే, వర్గీకరణ అంతే! పునియా మాట ఇదీ! ఇదంతా ఒక ఎత్తైతే జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పి.ఎల్.పునియా కూడా ఎస్సీ వర్గీకరణపై దేశంలోని అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. దళితుల్లో వెనుకబాటుతనాన్ని గుర్తించి, దాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించినట్లు సమాచారం.

కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతాం: ఎమ్మార్పీఎస్
ఎస్సీ వర్గీకరణకు రాజ్యాంగ సవరణ చేయడం ఇష్టం లేకనే కాంగ్రెస్ సర్కారు సంప్రదింపుల ప్రక్రియను చేపడుతోందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యాతాకుల భాస్కర్ ఆరోపించారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో మాదిగలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
కార్మిక చట్టాల అమలకు దేశ స్థాయిలో ఉద్యమం !
విజయనగరం,మేజర్‌న్యూస్‌ః కార్మిక చట్టాల అమలకు 5లక్షల మందితో ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నామని రాష్ట్ర ఏఐటీయూసీ కార్యదర్శి టి.నరసింహన్‌ తెలియజేశారు.ఆదివారం స్థానిక అమర్‌ భవన్‌లో జరిగిన పీఏసీఎస్‌ సిబ్బంది యూనియన్‌ జిల్లా సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.దేశవ్యాప్తంగా పీఏసీఎస్‌ సిబ్బంది సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.కార్మిక చట్టాల 150కి పైగా ఉన్నప్పటికీ అవేవీ అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వాలు ధరలు అదుపు చెయ్యడంలేదన్నారు.కార్మిక చట్టాలను అమలు చెయ్యడంలో తాత్సారం చేస్తున్నాయన్నారు. జట్లు,ముఠాల పేరుతో 46 కోట్ల మంది కార్మికులు దయనీయంగా జీవితాలు నెట్టుకొస్తున్నారన్నారు.2004 నుంచి పింఛన్లు ప్రభుత్వాలు రద్దు చేశాయన్నారు.పింఛను ప్రతీ ఒక్కరికీ వర్తింపజేయాలని తాము పోరాటం చేస్తున్నామన్నారు.46 కోట్లలో 40 కోట్ల మంది అసంఘటిత రంగాలలో కార్మికులగా ఉన్నారన్నారు.కాంట్రాక్టు ప్రాతిపధికన పనిచేస్తున్న ఉద్యోగులు కూడా కార్మికులగానే ఉద్యోగ,సామాజిక భద్రత కోల్పోయారన్నారు.

మన రాష్ట్రంలో 5లక్షల మంది అసంఘటిత రంగంలో కార్మికులగా ఉన్నారన్నారు. ఈ వ్యవస్థను రూపు మాపి సామాజిక భద్రత కల్పించాలని తాము అన్ని కార్మిక సంఘాలతో కలిసి ప్రభుత్వాలను డిమాండు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ వాటాలు అధికంగా ఉన్న, లాభాలు ఆర్జించే బీహెచ్‌ఈఎల్‌ లాంటి సంస్థలను ప్రభుత్వం ప్రైవేటు పరం చెయ్యడానికి సిద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు. ఆర్థికంగా ఆదుకునే పెట్రో ఉత్పత్తుల కంపెనీలను ప్రైవేటు రంగానికి అప్పజెప్పి నేడు ప్రైవేటు రంగాలు చెప్పిన మాటను జవదాటలేని కేంద్ర ప్రభుత్వం తొమిది నెలల్లో ఎనిమిది దఫాలు ధరలు పెంచిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బేరల్‌ ధర 34 శాతం ఉంటే మన ప్రభుత్వాలు 75 శాతం ధరలు పెంచి మధ్య, సామాన్య తరగతులు జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. నెలకు రూ. కోటి తీసుకున్న జీతగాళ్ళు ప్రైవేటు ఆర్గనైజేషన్లలో ఉన్నారన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు ప్రస్తుతం నెలకు రూ. లక్ష గౌరవ వేతనంగా పొందుతున్న నేపథ్యంలో సామాన్యునికి కనీసం రూ. 10వేలు జీతంగా చెల్లించలేని దౌర్భాగ్య ప్రభుత్వాలు కొనసాగుతున్నాయన్నారు.

వీటిపై ప్రజలు, సంఘటిత, అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల్లో అవగాహన కల్పించి ఉద్యమాలను తీవ్రతరం చేసి కార్మిక చట్టాలు అమలకు ముందుకెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నామన్నామని ఆయన విలేకరులకు వివరించారు.
జీఓ 151 యధాతదంగా అమలు చెయ్యాలి ః రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2009 జూన్‌ నెలలో చేసిన 151 జీఓ నేటికీ అమలు కాకపోవడంపట్ల ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యగా జీఓలు ప్రటించడం ఆ తరువాత వాటిని అమలు చెయ్యకపోవడం జరుగుతోందన్నారు. దీంతో ఉద్యోగులు, కార్మికులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమన్నారు. ఈ జీఓ చేసి మూడేళ్ళు అయినప్పటికీ ఏదో ఒక వంకపెట్టి పీఏసీఎస్‌ సిబ్బందిని ప్రభుత్వం ఇరకాటంలో పెట్టి వారి జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. సొసైటీలకు వచ్చిన లాభాలపై వీరి జీతాలు ఇవ్వాలని నాబార్డు నిర్ణయించడం ఎంతవరకు సబబు అన్నారు.

ఒకపక్క రైతుల రుణాలు మాఫీ చేస్తూ, సబ్సీడీలు ప్రకటిస్తూ, ఉచిత విద్యుత్తు ఇస్తూవుంటే ఏ విధంగా సొసైటీలకు లాభాలు వస్తాయని ఆయన ఎదురుప్రశ్న వేశారు. ఇచ్చిన రుణాలు రైతుల నుంచి ముక్కుపిండి వసూలు చేసే సత్తా ప్రభుత్వానికి ఉండాలన్నారు. సొసైటీలకు వచ్చే లాభాలతో సిబ్బంది జీతాలకు ముడిపెట్టడం సమంజసం కాదన్నారు.ఆధాయంతో వీరి జీతాలకు ముడిపెట్టినట్లైతే.. ఆదాయం రాని పాఠశాలలు, పోలీసు, మెడికల్‌ తదితర శాఖలు ఏమి లాభాలు ఆర్జించిపెడుతున్నాయి.. వీరికి నెలయ్యేసరికి జీతాలు ఖజానాల ద్వారా అందజేయడం లేదా అని ఆయన నిలదీశారు. నేడు పీఏసీఎస్‌లలో పనిచేస్తున్న సిబ్బంది రూ. 1000, రూ. 1,500లు, రూ. 2000లు జీతంతో మండుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో కుటుంబాలను ఎలా నెట్టుకొస్తున్నారో అనేది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న దేశంలో యూపీఏ, ఇక్కడ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదన్నారు.

రాష్ట్రంలో పీఏసీఎస్‌లలో 10వేల మందికి పైబడి సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. 20 ఏళ్ళుగా వీరు అరకొర జీతాలతో జీవితాలు సాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం జీఓలమీద జీఓలు చెయ్యడమే తప్ప అమలు చెయ్యడం లేదని ఆయన విమర్శించారు. గత నెలలో పీఏసీఎస్‌ సిబ్బంది యూనియన్‌ రాష్ట ప్రధాన కార్యదర్శి వి. కృష్ణంరాజు నిరాహార దీక్షకు పూనుకోగా.. ఆ శాఖ కార్యదర్శి, మినిస్టర్‌ కాసు కృష్ణారెడ్డి తదితరులు వచ్చి రాజీమంత్రంతో దీక్షను విరమింపజేశారన్నారు. నాబార్డు, ఆప్కాబ్‌ స్టేట్‌, కో ఆపరేటివ్‌ రిజిస్ట్రార్‌లతో సమీక్షించి జీఓను అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కూడా ఇంతవరకు అమలు కాలేదన్నారు. ఇటీవల సహకార శాఖలో ఉద్యోగాల భర్తీ చెయ్యాలని ప్రభుత్వం తలచిందన్నారు.

ఈ భర్తీలో ఇంతవరకు ఎన్నో ఆర్థిక ఒడుదొడుకులకు, ఒత్తిళ్ళకు సతమతమై పనిచేస్తున్న సిబ్బందిలో సీనియర్లను, అర్హత ప్రాతిపదికగా ఈ ఉద్యోగాల్లో భర్తీ చెయ్యాలని తమ యూనియన్‌ డిమాండు చేస్తోందన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించని పక్షంలో మిగిలిన సంఘాలతో కలిసి సమ్మెకు ఉపక్రమిస్తామని ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశం అనంతరం జిల్లా పీఏసీఎస్‌ సిబ్బంది తో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీఏసీఎస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. కృష్ణంరాజు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం. మురళీధరరావు, ఉపాధ్యక్షుడు సాగి రంగరాజు, పీఏసీఎస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు బి. రామునాయుడు, కార్యదర్శి వర్రి. సన్యాసిరావు, ఉపాధ్యక్షుడు బి. బాస్కరరావు, ఏఐబీఈఏ కోఆర్డినేషన్‌ కమిటీ కార్యదర్శి నల్లా బాబాజీ, పీఏసీఎస్‌ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ట్యాంక్‌బండ్‌పై కొమురం విగ్రహం
KomaramBheemహైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: తెలంగాణ సాయుధ పోరా ట యోధుడు కొమురం భీమ్‌ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికోసం గిరిజన శాఖ రూ.8 లక్షలను విడుదల చేయ నుంది. కొమురం భీమ్‌ విగ్రహం నమూనా ఇప్పటికే తయారైందని, నిధులు విడుదలైన వెంటనే విగ్రహాన్ని నెలకొల్పే పనులను వేగవంతం చేస్తామని సాంస్కృతిక శాఖ మండలి ఛైర్మన్‌ ఆర్వీ రమణమూర్తి, డైరెక్టర్‌ కాంతారావు తెలిపారు. శనివారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ట్యాంక్‌బండ్‌పై మొత్తం 33 విగ్రహాలు ఉన్నాయని, వాటికి అదనంగా అదే వరుసలో కొమురం భీమ్‌ విగ్రహాన్ని నెలకొల్పుతామని అన్నారు.

ధ్వంసమైన విగ్రహాల పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. పునరుద్ధరణ పనుల కోసం ప్రభుత్వం రూ.75 లక్షలను మంజూరు చేసిందని, నిధులు విడుదల కావాల్సి ఉందని అన్నారు. విగ్రహాల రూపురేఖలు, ఎత్తు వంటి అంశాలపై చర్చించడానికి ఈ నెల25న ప్రముఖ శిల్పాచార్యులతో సమావేశాన్ని ఏర్పా టు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశం అనంతరం సాంకేతిక, ఆర్థిక కమిటీలను వేర్వేరుగా ఏర్పాటు చేస్తా మని, ఈ రెండు కమిటీలు ఇచ్చే నివేదికలు, ప్రభుత్వం రూపొందించే నిబంధనల మేరకు విగ్రహాలను పునరు ద్ధరిస్తామని అన్నారు. ప్రస్తుతం ఈ పనులు టెండర్ల దశ లో ఉన్నాయని అన్నారు.

23 నుంచి ‘శతరూప’
ఈ నెల 23నుంచి పది జిల్లాల్లో పది రోజులు చొప్పున ‘శతరూప’ కళా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఆయా జిల్లాల్లో పేరుపొందిన జానపద కళారూపాలతో ప్రదర్శనలను ఏర్పాటు చేస్తా మని అన్నారు. 23న విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అన్నారు. అనంతరం వచ్చేనెల 2న ఏలూరు, 14న నెల్లూరు, 22న చిత్తూరు, జులై 2న అనంతపురం, అదే నెల 12న కర్నూలు, 21న ఆదిలాబాద్‌, ఆగస్టు 1న నల్లగొండలో శతరూప కార్యక్రమాలు ఉంటాయని, ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌ ఆగస్టు 21 నుంచి 30 వరకు నిర్వహిస్తామని అన్నారు.

రూ.3 కోట్లతో రవీంద్రభారతి, తెలుగు లలిత కళా తోరణంలో మరమ్మతులు చేయనున్నట్లు రమణమూర్తి, కాంతారావు తెలిపారు. లలిత కళాతోరణంలో మినీ థియేటర్‌ను నిర్మించే యోచన ఉందని అన్నారు. ఎంపిక చేసిన 13 విభాగాలకు చెందిన 26 మంది కళాకారులకు కళారత్న హంస అవార్డులతో సత్కరించనున్నామని, దీన్ని వచ్చేనెల రెండవ వారంలో నిర్వహిస్తామని అన్నారు. హంస అవార్డులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దు తామని చెప్పారు.
రాజ నర్సింహకే డిప్యూటీ సీఎం?
కొలిక్కి వచ్చిన కసరత్తు
న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: డిప్యూటీ సీఎం, స్పీకర్, పీసీసీ చీఫ్ పోస్టుల భర్తీ వ్యవహారం ఒక కొలిక్కివచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, తన రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్‌తో కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ జరిపిన సమావేశంలో ఈ పోస్టులపై కసరత్తు ముగించారని, వారంలోగానే వీటిని భర్తీ చేసే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఆ వర్గాలు చెబుతున్న ప్రకారం... డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని తెలంగాణకు చెందిన మంత్రి దామోదర రాజనర్సింహకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారు.

స్పీకర్ పదవి విషయంలో ప్రస్తుత ఉపసభాపతి నాదెండ్ల మనోహర్, సీఎం సన్నిహితుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్లు పరిశీలనకు వచ్చాయి. డిప్యూటీ సీఎం పదవి ఆశిస్తున్న మంత్రి జె.గీతారెడ్డి పేరు కూడా లెక్కలోకి తీసుకున్నారు. రాష్ట్ర పార్టీ సారథ్యం విషయంలో ఐదు పేర్లను (కె.ఆర్.సురేశ్‌రెడ్డి, షబ్బీర్ అలీ, బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణ) పరిశీలించారు. సురేశ్‌రెడ్డికే ఈ పదవిని ఇవ్వాలని సీఎం కోరగా, మైనారిటీకి చెందిన షబ్బీర్ అలీకి ఇస్తే బాగుంటుందని ఆజాద్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.
మహా పురుషుల విగ్రాలు వొద్దు అంటున్న దళిత నాయకులు  వరంగల్ జిల్లా పరకాల పట్టణములో మాదిగ దండోరా సంక్షేమ సమితి తరుపున బాబు జగ్జీవన్ రామ్ విగ్రాన్ని నెల కోలుపుటకు ఎటువొంటి చందాలు అడుగాకుంట నేరుగా విగ్రము తిశుకోచ్చి పరకాల బస్సు స్టాండ్ పరిదిలో ఒక ప్రక్కన ఉంచి జిల్లా నుండి మండలము నుండి పరకాల గ్రామము నుండి అన్ని అనుమతులు మాదిగ దండోరా జిల్లా ప్రతి నిధులు బోట్ల స్వామి మాదిగ జయక్క మాదిగ తీసు కున్నారు.ఇట్టి విగ్రమునకు ఇతర దళిత కుల సంఘాల నాయకులు ఇబ్బందులు సృష్టిస్తూ కొంత మంది కాంగ్రెస్ దళిత నాయకులు మేము బాబు జగ్జీవన్ రామ్ కాంస విగ్రాన్ని పెడుతము. కావున మాదిగ దండోరా సంక్షేమ సమితి తరుపున వొచ్చిన విగ్రము ఇక్కడ వొద్దు అంటున్నారు.వేరే మండలములో పెట్టండి.అంటూ వివిధ రకాలుగా ఇబ్బందులు సృష్టిస్తున్నారు.అంతేగాక వరంగల్లు MP సిరిసిల్ల రాజయ్య విగ్రము ఇస్తున్నాడు.  అంటూ ప్రచారము చేస్తూ పేపర్ ప్రకటనులు చేయు చేయుచున్నారు.ఇట్టి విషయాన్నీ మాదిగ దండోరా బోట్ల స్వామి మాదిగ సిరిసిల్ల రాజయ్య వోద్దకు తిసుకేల్లగా అట్టి కాంగ్రెస్ దళిత నాయకులను పిలిపించి మాట్లాడి ఇప్పుడు వొచ్చిన విగ్రాన్ని నెలకొలిపి తదుపరి కొద్ది రోజులకు కాంస విగ్రము పెడుదామని చెప్పారు.ఇట్టి మాటలు విన్నా కాంగ్రెస్ దళిత నాయకులు సరే అని తిరిగి వెళ్లారు.అందుకు బోట్ల స్వామి మాదిగ రాజయ్య గారికి ధన్యవాదాలు చెప్పి వొచ్చారు.18 -05 -2011 రోజునా బోట్ల స్వామి మాదిగ ఆధ్వర్యములో  భూమి  పూజ చేయగా అదేరోజు విగ్రము వొద్దు అని తెలిపిన కాంగ్రెస్ దళిత నాయకులు మరో బాబు జగ్జీవన్ రామ్ కమిటి వేశి అట్టి కమిటిలో మాదిగ దండోరా సంక్షేమ సమితి బోట్ల స్వామికు తెలుపకుండా బోట్ల స్వామిని కూడా అట్టి కమిటి లో మెంబరుగా ప్రకటించారు.ఇక్కడ ముఖ్య విషయము ఏమిటి అనగా గత ముప్పైదు ఏండ్లుగా దళితులే యి యొక్క నియోజక వర్గాన్ని పరిపాలించారు.కానీ నాటి  నుండి నేటి  వరకు పరకాల పట్టణములో ఎక్కడ బాబు జగ్జీవన్ రామ్ విగ్రాన్ని పెట్ట లేక పోయారు.ఇప్పుడు పెడుతున్న విగ్రమునకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు.ఇది ఎంత వరకు న్యాయము......మరో విషయము ఏమిటి అంటే మాదిగ దండోరా వారు తెచ్చిన విగ్రము ఎనిమిది ఫీట్ల ఎత్తు మూడు ఫీట్ల ఎడేలుపు కలదు.ఇక్కడ ఉన్న సమస్య ఏమిటి అంటే ......ఇన్ని రోజుల నుండి కొంత మంది సీనియర్ దళిత నాయకులు ఇప్పుడు వొచ్చిన మాదిగ దండోరా తరుపు  విగ్రాన్ని యెరుపాటు చేస్తే మా బావిత్వ్యము ఏమిటి అనే ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తున్నది.వరంగల్ జిల్లలో మరో విషయము ఆస్వా రాయి పల్లి గ్రామము రఘునాధ పల్లి మండలము లో కూడా మాదిగ దండోరా సంక్షేమ సమితి నుండి ఎటువొంటి చందాలు వోసులు చేయకుండా  అంబేద్కర్ విగ్రాన్ని కూడా తెచ్చారు.ఇక్కడ ఇంకా మహా గోరము జరిగింది.ఇట్టి విగ్రాన్ని నేలా కోలుపటము చూసి జీర్ణించుకోలేని కొంత మంది దురుమర్గులు భారత రత్న అంబేద్కర్ విగ్రాన్ని కొద్దిగా ద్వంసము చేసారు.ఇట్టి కేసు వరంగల్ జిల్లా DSP  పరిదిలో ఉన్నది నేటికి అట్టి కిరాతకులను పట్టుకోలేక పోయారు.చివరకు అంబేద్కర్ విగ్రానికి వోరికోత మిషిని తగిలినది  అని చేతులు దులుపుకున్నారు.నేడు మహా పురుషులకే యిన్ని  అవమానాలు జరుగు తుంటే పట్టించు కోవటము లేదు యి ప్రబుత్వం మరి సాదారణ దళితులకు అన్యాయము జరిగితే దిక్కు ఎవరు..................ఓ దళిత జాతి మెదవులరా ఆలోచించండి ........................మన జాతి మహా పురుషుల విగ్రాలను పెడుదాం వారి అడుగుజాడలలో నడుద్దాం వారి ఆశయాలను సాదిద్దాం దళిత జాతిని అబివృద్ది చేద్దాం ...............................మాదిగ దండోరా సంక్షేమ సమితి

ఆస్తమించిన హక్కుల సూరీడు

హన్మకొండ, మే 14 : మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బుర్రా రాములు శనివారం కన్నుమూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న రాములు పరిస్థితి మరింత క్షీణించడంతో హన్మకొండలోని ప్రౖౖెవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం సుమారు 1.20 గంటలకు కన్నుమూశారు. ప్రొఫెసర్ రాములు మరణ వార్త తెలిసి ఆయన అభిమానులు, మానవహక్కుల కార్యకర్తలు, సహాద్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. భోరున విలపించారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

ఓరుగల్లు కోటలో పుట్టి: కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ రాములు స్వస్థలం వరంగల్ పడమర కోట. ఉద్యోగ రీత్యా ఆ యన విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని క్వార్టర్‌లోనే పదేళ్లుగా ఉంటున్నారు. డాక్టర్ రాములుకు భార్య స్వరూప, ఇద్దరు కూతుళ్ళు జన, రణ, తల్లి ఐల మ్మ, ఇద్దరు సోదరులు, అయిదుగురు చెల్లెళ్ళున్నారు. సోదరుడు బుర్రా రమేష్ భోపాల్‌లోని ఎన్‌సిఆర్‌టిలో ప్రొఫెసర్. మరో సోదరుడు భాస్కర్ బ్యాంక్ మేనేజర్.

రాజ్యహింసకు వ్యతిరేకంగా... ప్రొఫెసర్ రాములు తన యావజ్జీవితాన్ని మానవ హక్కుల పరిరక్షణ కోసమే వెచ్చించారు. ఎక్కడ హక్కులకు భంగం కలిగితే అక్కడ వాలేవా రు. నిజనిర్ధారణ జరిపేవారు. బాధితు ల పక్షాన గళం విప్పేవారు. రాజ్యాన్ని ప్రశ్నించేవారు. రాజ్యహింసను నిర్భయంగా నిలదీసేవారు. అణగారిన వర్గాల పక్షాన న్యాయం కోసం పోరాడేవారు. ఫ్రొఫెసర్ బుర్రా రాములు కేయూలో అధ్యాపకుడిగా కన్నా మానవహక్కుల నేతగానే సుపరిచితుడు. మొదట పౌర హక్కుల నాయకుడిగా, ఆ తర్వాత మానవ హక్కుల వేదిక ఫోరం రాష్ట్ర నేతగా ఆయన ప్రస్థానం కొనసాగింది.

అంచెలంచెలుగా 1954 జూన్10వ తేదీన ఖిలా వరంగల్‌లో మధ్య తరగతి కుటుంబం లో జన్మించిన ప్రొఫెసర్ రాములు ఉ న్నత విద్యావేత్తగా అంచెలంచెలుగా ఎదిగారు. తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించడం చిన్నతనం నుంచే అలవర్చుకున్నారు. మానవహక్కుల హరణకు వ్య తిరేకంగా ప్రశ్నించు, నినదించు అని నిత్యం ప్రభోదించారు. పాఠశాల చదు వు ఖిలా వరంగల్‌లోనే సాగింది. 1978లో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, 1980లో ఎంఏ, ఇదే విశ్వవిద్యాలయం నుంచి 1985లో ఎంఫిల్, 1990లో పిహెచ్‌డి పట్టాపుచ్చుకున్నారు. అగ్రికల్చరల్ ఎకనమిక్స్, పొలిటికల్ ఎకనమిక్స్‌లో నిష్ణాతులు. ఆయనకు ఇష్టమైన సబ్జెక్టులు కూడా ఈ రెండే.

విస్తృతంగా పరిశోధనలు విద్యాబోధనతో పాటు మరో ప్రక్క గ్రా మీణ జీవన స్థితిగతులపై పరిశోధనలను కూడా కొనసాగించారు. 1996లో యూజీసీ సహకారంతో తెలంగాణలో గ్రామీణ అనియత మార్కెట్లపై రెండేళ్ళే పరిశోధన చేశా రు. 2000 సంవత్సరంలో కేరళలోని తిరువనంతపురం సీడీసీ ఆర్ధిక సహకారంతో మూడేళ్ళ పాటు గ్రామాల సైద్ధాంతిక పునఃసర్వే-గ్రామీణ జీవనంపై అధ్యయనం అనే అంశంపై పరిశోధన చేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు. పలు పరిశోధనా పత్రాలను సమర్పించారు. 2007 ఆగస్టులో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన సదస్సులో మానవ హక్కుల అభ్యసనానికి భోధనాపరమైన పాఠ్యాంశాల రూపకల్పన పై పరిశోధనా పత్రాన్ని సమర్పించా రు.

అధ్యాపకుడిగా... 1983 నుంచి 1994 వరకు యూనివర్సిటీ అర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 1994 నుంచి 2008 వరకు యూనివర్సిటీ కళాశాల, పీజీ కళాశాలలో తన అధ్యాపక వృత్తిని కొనసాగించారు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఎస్‌డీఎల్‌సీ, తెలుగు అకాడెమికి అవసరమైన పాశ్యాంశాలను, పుస్తకాలను, ఇతర మెటీరియల్‌ను సమకూర్చారు. జాతీయ సాక్షరతా మిషన్ కింద సెంటర్ ఫర్ అడల్ట్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అక్టివిటీస్ ప్రొగ్రాం ఆఫీసర్‌గా రెండు సంవత్సరాలు పని చేశారు.

హక్కుల కోసం నిత్యం పోరు విద్యాబోధనతో పాటు చుట్టూ ఉ న్న సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై ఆయన నిత్యం తీవ్రంగా స్పందించేవారు. హ క్కుల హరణను ఆయన ఏనాడు సహించేవారు కాదు. వాటి పరిరక్షణ కు ఎంతటి ప్రతిఘటననైనా, ఒత్తిళ్ళపైనా నిర్భయంగా ఎదుర్కొనేవారు. ఎంత దూరమైన వెళ్ళేవారు. రాజ్యం ఆయనను ఎంతగా భయపెట్టాలని చూసినా అంతకు రెండింతలు దానికే సింహస్వప్నంగా నిలిచారు. మానవహక్కుల రాష్ట్ర అధ్యక్షుడిగా అట్టడుగువర్గాలకు అండగా నిలిచారు. విద్యార్ధి దశలో కళాశాలలో, విశ్వవిద్యాలయంలోనూ విద్యార్ధి ప్రతినిధిగా వారి హక్కుల కోసం డా. రాములు పోరాడారు. అధ్యాపకుడిగా కూడా తన వం తు సేవలను అందించారు.

సాంస్కతిక రంగంలోనూ.. సాంస్కృతిక, క్రీడా తదితర కమిటీల్లో సభ్యునిగా కీలక పాత్రలు పోషించారు. పలు సంస్ధలతో అయనకు అనుబంధం ఉంది. ఇండియన్ పొలిటికల్ ఎకనమి, ఎపిఈఏలలో ప్రొఫెసర్ రాములు సభ్యుడు. మహిళా అధ్యయానాలపై ముద్రించిన కాకతీయ యూనివర్సిటీ జర్నల్‌కు సంపాదకత్వం కూడా వహించారు.

రచయితగా.. ప్రొ.రాములు సామాజిక అంశాలు నేపధ్యంగా పలు పుస్తకాలను రాశారు. 1995లో ఇదో సారాకథ, 2005లో ప్రాచీన భారత రాజకీయ ఆర్ధిక నిర్మాణాలను ప్రతిబింబించిన మహిళల జీవితం, స్వాతంత్య్రానంతర భారత దేశం-స్త్రీల స్థితిగతులు, నమూనా రూపాంతరం- మానవ అభివృద్ధి-జీవితం వీటిలో కొన్ని. మానవ జీవితంతో ముడిపడిన వివిధ అంశాలను స్పృషిస్తూ అయన రాసిన అనేక వ్యాసాలు వివిధ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.

వరంగల్ హక్కుల పెద్దదిక్కు

ఒక ఏడాది ఏడాదిన్నకాలంలో తెలుగునేల మీద హక్కుల ఉద్యమం చాలా విషాదాలు ఎదుర్కోవలసి వచ్చింది. డాక్టర్ సి.ఆర్.రాజగోపాలన్, ఎస్.ఆర్. శంకరన్, కె .జి. కన్నబిరాన్ ఇంచుమించు నిండు జీవితాలు గడిపి పోయారనుకుంటే గొట్టిపాటి నరేంద్రనాథ్, కె.బాలగోపాల్‌లు అర్థాంతరంగా వెళ్ళిపోయారు. ఆ నష్టాల నుంచి కష్టాల నుంచి హక్కుల ఉద్యమం కూడదీసుకుని గ్రీన్ హంట్ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిఘటనోద్యమం బలం పుంజుకుంటున్న తరుణంలో ఇప్పుడు బుర్రా రాములు పోయారు.

డాక్టర్ బుర్రా రాములు మానవ హక్కుల సంఘం మొదటి అధ్యక్షుడు. ప్రస్తుత ఉపాధ్యక్షుడు. బాల్‌గోపాల్, బుర్రా రాములు ఇద్దరూ ఒకే వయసులో 57వ ఏట పోయారు. 1953లో కాళోజీ 'నా గొడవ' ఆవిష్కరిస్తూ శ్రీ శ్రీ ఆయనను లూయీ ఆరగాన్‌తో పోల్చారు. రెండో ప్రపంచయుద్ధకాలంలో ఫ్రాన్స్‌లో కవులందరూ యుద్దరంగానికి దూరంగా ఉంటే అరగాన్ ఒ క్కడూ నిలిచి పోరాడాడు. 1985లో రామనాథం హత్య తర్వాత ఇంచుమించు ఒక దశాబ్దంపాటు కొనసాగిన నిర్బంధంలో వరంగల్‌లో హక్కుల ఉద్యమంలో నిలబడి కలబడినవాడు బుర్రా రాములు. కాళోజీ ఉన్నంత కాలం ఆయనతోపాటు నిలబడినారు.

1989-90 నాటికి నర్రా ప్రభాకర్ రెడ్డి సాహసించి పౌరహక్కుల రంగంలోకి అభిమన్యునివలె దూకగానే ఆయనకు వెన్నుదన్నుగా నిలబడినాడు. టాడా వంటి దారుణ అణచివేత చట్టాలతో పోరాడుతూ నర్రా ప్రభాకర్ రెడ్డి పద్మవ్యూహంలో దూరిన అభిమన్యుని వలె నే అమరుడయ్యాడు. రాజ్య హత్యకు డాక్టర్ రామనాథం, జాపా లక్ష్మారెడ్డిల వలెనే గురయ్యాడు. అప్పుడు హక్కుల కాడిని బుర్రారాములే ఎత్తు కోవాల్సి వచ్చింది.

పైగా యువ కార్యకర్తలెవరూ వరంగల్ వంటిచోట రాజ్యం కన్నెర్రకు గురయితే నిలదొక్కుకోవడం క ష్టం గనుక బాలగోపాల్ నాయకత్వ బాధ్యతలు బుర్రా రాములుపైననే మోపుతుండేవాడు. ముఖ్యంగా కాళోజీ కూడా కన్నుమూసిన తర్వాత వరంగల్‌లో హక్కుల ఉద్యమానికి మిగిలిన పెద్ద దిక్కు బుర్రా రాములే అయ్యాడు. ఆ లోటు ఒక లాటిన్ అమెరికా నగరాన్ని తలపించే వరంగల్‌తో నాలుగు దశాబ్దాల సన్నిహిత పరిచయం చేయటమే తప్ప ఎంత పూడ్చుకోలేనిదో పోల్చుకోలేం.

బుర్రా రాములు వరంగల్‌లో పుట్టి అక్కడ సామాజిక ఉద్యమాలతో ఎదిగాడు. 1974లో ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూండెంట్స్ యూనియన్ ఏర్పడినప్పుడు దానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సికెఎం కాలేజి విద్యార్థి సత్యనారాయణరావు ఎన్నికయ్యాడు. అప్పటికే సత్యనారాయణరావుతో వరంగల్ ప్రజాస్వామిక విప్లవ విద్యార్థి ఉద్యమాల్లో చరుకుగా పాల్గొంటున్న బుర్రా రాములు పీడిఎస్‌యు జిల్లా నాయకుడయ్యాడు. 1980 నాటికే ఆయన పిడిఎస్‌యు రాష్ట్రస్థాయి నాయకత్వంలోకి వచ్చాడు. 1978 నుంచి 84 వరకు వరుసగా కాకతీయ యూనివర్సిటీలో విప్లవ విద్యార్థి సంఘాల ఐక్య సంఘటనయే ఎన్నికల్లో గెలిచింది.

1982లో బుర్రా రాములు అధ్యక్షుడుగా, పులి అంజయ్య ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కెయు విద్యార్థి సంఘం బహుశా యూనివర్సిటీ చరిత్రలో విప్లవ అక్షరాలతో లిఖించ దగినది. పులి అంజయ్య, గోపగాని ఐలయ్య, లింగమూర్తి వంటి విప్లవ విద్యార్థుల సాహచర్యంలో బుర్రా రాములు ఆర్ఎస్‌యు, పిడిఎస్‌యుల సైద్ధాంతిక, మిత్ర వైరుధ్యాలను పరిష్కరించుకుంటూ కూడా ఉజ్వలమైన ప్రజాస్వామిక విద్యార్థి ఉద్యమాన్ని క్యాంపస్‌లో నిర్మాణం చేయడానికి దోహదం చేసినాడు.

బుర్రా రాములు అర్థ శాస్త్రంలో ఎంఏ చేసి ప్రొఫెసర్ శివరామకృష్ణ రావు దగ్గర పిహెచ్‌డి చేసి కాకతీయ అర్థశాస్త్ర విభాగంలోనే అధ్యాపకుడుగా చేది ప్రొఫెసర్ అయ్యాడు. పుట్టిన ఊళ్ళో జ్ఞానం తెలిసిన దగ్గర్నుంచీ చుట్టూ ఉన్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ చదువుతూ, సమాజాన్ని చదువుతూ పోరాడుతూ ఉన్నత విద్యలు పొందడమే కాకుండా నిరంతరం ఆ విద్యను సమాజపరం చేస్తూ తన ఊరికి, ప్రజలకు సేవ చేయడం కేంద్రంగా పెట్టుకొని దేశమంతా విస్తరించడం ఒక సార్థక జీవితం.

బాలగోపాల్ తర్వాత హక్కుల సంఘాల్లో అంతే విస్తృతంగా తిరిగిన హక్కుల కార్యకర్తలు చాల తక్కువగా ఉంటారు. కాశ్మీరు, మణిపూర్, ఛత్తీస్‌గడ్‌లలో ఎక్కడ రాజ్యహింస తన దమన నగ్న రూపంతో విరుచుకుపడితే అక్కడికి నిజనిర్ధారణ సంఘాల్లోనూ, పోరాట సంఘీభావ పర్యటనల్లోనూ రాములు వెళ్ళేవారు. అక్కడ ప్రజలపై రాజ్యహింసను ఇక్కడ వివరించి ఒక సమన్వయాన్ని, సంఘటన సంఘీభావాన్ని నిర్మించడానికి కృషి చేసిన హక్కుల ఉద్యమ నాయకుల్లో బుర్రా రాములు ఒకరు. రాములు ప్రయత్నపూర్వకంగా ప్రజల భాషలో ప్రజలతో మాట్లాడే పద్ధతిని అలవర్చుకున్నాడు.

ప్రజలకు సులభమయ్యే పద్ధతిలో, ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజలకు అర్థమయ్యే ఉపన్యాస ధోరణిని ఆలవోకగా అందిపుచ్చుకున్నాడు. బుర్రా రాములు సాహిత్య రంగంలో కూడా అరుదయిన కృషి చేశాడు. ఇటీవలి కాలంలో చాల కథలు రాసాడు. సైద్ధాంతిక, విశ్లేషణ వ్యాసాలు రాశాడు. రావిశాస్త్రి ఆరు సారా కథలకు కొనసాగింపుగా ఆయన రాసిన 'ఏడో సారా కథ' ఎంతో చర్చితమై ప్రచారాన్ని పొందింది. సాహిత్య సమవాకారం పేరుతో తేన్నేటి సూరి, స్వర్గంలో పాణిగ్రాహి పేదుతో శివసాగర్ రాసిన ఫ్యాంటసీల తర్వాత బుర్రా రాములు రాసిన ఏడో సారా కథయేనని బాలగోపాల్‌వంటి సాహిత్య విమర్శకులు అభిప్రాయపడ్డారు.

బుర్రా రాములు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఒక ప్రజాస్వామిక హక్కుల ఉద్యమంగా భావించి అందులో వరంగల్ జిల్లావరకు విస్తృతంగా పర్యటించాడు. వరంగల్ బయట చాలా ముఖ్యమైన మానవ హక్కుల వేదిక కార్యకలాపాలు లేని సమయమంతా ఆయన తెలంగాణ ఉద్యమానికే కేటాయించాడు.

పెదముప్పారంలో జరిగిన అటువంటి సభలో నాకు కూడా ఆయనతో పాటు పాల్గొనే అవకాశం కలిగింది. మిట్టుపల్లి సరేందర్ 'శంకరా' అని ఒక అమరునిపై రాసిన పాట అడిగి పాడించుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రజలకోసం ముప్ఫై ఏళ్లుగా విద్యార్థి రంగంలో, హక్కుల రంగంలో కృషి చేస్తున్నా బుర్రా రాములు ఏకాకిగా తన కుటుంబపరంగా ఎంతో ప్రయాసను, కష్టాలను అనుభవించాల్సి వచ్చింది.

ఆయన సహచరి ఏడాది క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయి నెలల తరబడి హైదరాబాదు ఆసుపత్రిలో చికిత్స పొందవలసి వచ్చింది. అమె ఇంకా కోలుకోకుండానే జనవరి నెలలో బుర్రా రాములుకు క్యాన్సర్ అని బయటపడింది. క్యాన్సర్ వ్యవస్థతో పోరాడుతున్న వ్యక్తి బుర్రా రాములు తన అనారోగ్యాన్ని చాలా ధైర్యంతో ఎదుర్కొన్నాడు.

కానీ చాలా వేగంగా ఆయన శిథిలమవుతూ పోయాడు. మే 10వ తేదీన సికిందరాబాదు యశోదా ఆసుపత్రిలో ఆయనను ఆఖరి సారిగా చూడాలని వెళ్ళినపుడు శరీరం నిండా బంధనాలతో, కృత్రిమ శ్వాసతో ఉన్న ఆయనను 'గుర్తు పట్టారా?' అని అడిగాను. 'అయ్యో?!' అన్న ఆయన వ్యక్తీకరణ - అదేం ప్రశ్న అన్న ఆయన అలర్ట్‌నెస్-అదే ఆయన హక్కుల ఉద్యమంలో చూపిన అనవరత ప్రజాస్వామిక జాగరూకత! చిరకాల మిత్రునికి కన్నీటి వీడ్కోలు...

-వరవరరావు