.పొట్ట గొడ్తున్నరు

'తినే కూడును లాక్కున్నారు. 20 ఏళ్ల నుండి ఈ భూమినే నమ్ముకుని బతుకుతున్నాం. ఇప్పుడు సర్కారుదని చెబుతున్నారు. మా పొట్ట గొడుతున్నారు. ఇక బతికేదెట్ల..? మా కుటుంబం గడిచేదెట్ల..?'' కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామ దళితుల ఆవేదన ఇది. ఆ గ్రామ దళితులు తమకిచ్చిన భూముల్లో స్వేదం చిందించి రాళ్లూ రప్పలూ గుట్టలూ తొలగించారు. బీడు భూమిని సేద్యపు భూమిగా మార్చారు. తమకిదే జీవనాధారమని భావించారు. భూమి చదును చేసేందుకూ, పైర్ల సాగుకూ వేలాది రూపాయలు అప్పులు చేశారు. అయితే కొంతమంది పెత్తందారులు, రెవెన్యూ అధికారులు కుమ్మకై ఆర్నెల్ల క్రితం ఆ భూమిలో దళితులు వేసిన పత్తి పంటను ధ్వంసం చేయించారు. అది ప్రభుత్వ స్థలమంటూ ఆక్రమించారు. ప్రస్తుతం అటవీశాఖాధికారులు చెట్ల పెంపకానికి ఆ భూమిలో సర్వే చేస్తున్నారు. జీవనాధారం కోల్పోయిన దళితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టు గ్రామంలో సర్వే నంబరు 354లో 200 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో 60 ఎకరాలను 1992వ సంవత్సరంలో 42 మంది దళితులకు ఒక్కొక్కరికి ఎకరంన్నర చొప్పున ప్రభుత్వం పట్టాలిచ్చింది. రెక్కలు ముక్కలు చేసుకొని వారాభూమని చదును చేశారు. చిలక లింగయ్య, మ్యాకల జనార్థన్‌, ఇవురాల్ల లచ్చయ్య, చిలుగ దుర్గయ్య సహా 38 దళిత కుంటుంబాలు ఈ భూమినే నమ్ముకుని జీవిస్తున్నాయి.

మూడేళ్ల తాత్కాలిక పట్టాలను అంతిమ పట్టాలుగా మార్చాలని 1994వ సంవత్సరం నుంచీ వారు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. అధికారుల్లో చలనం లేకపోయింది. 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఖాళీ చేయాల్సిందిగా ఆర్నెల్ల క్రితం దళితులకు నోటీసులు పంపారు. ఇది ప్రభుత్వ స్థలమనీ, దీనిని స్వాధీనం చేసుకుంటామనీ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో దళితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 2010 ఆగస్టు 8న తమకు జరిగిన అన్యాయాన్ని జిల్లా కలెక్టర్‌కు వివరించారు. తర్వాత కూడా వారికి న్యాయం జరగకపోగా ఈ స్థలాలను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. దళితుల భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్న అధికారులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన కొంతమంది పెద్దమనుషులపై ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. ఇదే సర్వే నంబర్‌లోని కొంత భూమిని కొందరు పెత్తందారులు కబ్జా చేశారు. వారికి అధికారుల అండదండలు ఉన్నట్లు విమర్శలున్నాయి. ఆరు నెలల క్రితం దళితులు ఈ భూమిలో పత్తి వేశారు. సాగుకు ఒకొక్కరు పెట్టుబడి కింద రూ. పది వేలు చొప్పున అప్పు చేశారు. పత్తి మొక్క దశకు చేరుకుంది. పెత్తందారులు, రెవెన్యూ అధికారులు కుమ్మకై పత్తి చేలపై మేకలు, గొర్రెలను తోలి పంటను నాశనం చేయించారు. ఎత్తుపల్లాలు, రాళ్లు, రప్పలున్న ఈ భూమిని సాగులోకి తెచ్చేందుకు ఒక్కో దళిత రైతు రూ. 40 వేల వరకూ ఖర్చు చేశాడు.

పంట సాగుకు మరో రూ.10 చొప్పున అప్పు చేశాడు. 42 మంది పరిస్థితీ ఇదేవిధంగా ఉంది. తమ భూములు తమకివ్వాలని అధికారుల చూట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారుల్లో చలనం లేదు. కరీంనగర్‌ నగర పాలక సంస్థకు 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు తహశీల్దార్‌ ప్రమోద్‌ చెబుతున్నారు. ప్రభుత్వ జిఓ ప్రకారమే ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కరీంనగర్‌ 2004లో కార్పొరేషన్‌గా మారింది. అంతకుముందు నుంచే ఈ దళితులకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసింది. వీరంతా కాస్తులో ఉన్నారు. కావున ఈ జిఓ వారికి వర్తించదు. చొప్పదండి మండలంలో ఇప్పటికి మూడుసార్లు భూ పంపిణీ కార్యక్రమం చేపట్టినా రెవెన్యూ అధికారులు దళితులను విస్మరించారు. ఎల్లంపల్లిలో కోల్పోయిన అటవీ భూమికి బదులుగా దళితులకు చెందిన 60 ఎకరాలను అటవీశాఖకు అప్పగించేందుకు కుట్ర జరుగుతోంది. గ్రామ సర్పంచి, స్థానిక ఎంఎల్‌ఏ దళితులై ఉండి కూడా దళిత రైతులకు న్యాయం చేయలేకపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దళితులకు న్యాయం చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా నాయకులు లకీëనారాయణ కోరుతున్నారు.

కూడెవరేస్తరు ?
ఈ భూమితోనే బతుకుతున్నా. దీంట్లో వచ్చిన పంటతోనే బతుకుతున్నాం. భూమి సర్కారుదేనని అంటున్నరు. ఇక్కడ జంగల్‌ పెంచుతరట. మా భూములు మాకుగావాలె. ఇవి ఇయ్యకుంటే ఇంత విషమిచ్చి సంపుండ్రి.
మేకల పోచయ్య (బాధితుడు)
అంతిమ పట్టాలిచ్చే వరకూ పోరాటం : కెవిపిఎస్‌, వ్యకాస
దళితులకు అంతిమ పట్టాలిచ్చే వరకూ వారి పక్షాన పోరాడుతామని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడికందుల సత్యం, కెవిపిఎస్‌ జిల్లా కన్వీనర్‌ లక్ష్మీనారాయణ అన్నారు. 42 మంది దళితులకు తాత్కాలిక పట్టాలిచ్చారనీ, అంతిమ పట్టాల కోసం దళితులు ఎన్నిసార్లు మెరపెట్టుకున్నా అధికారులు కనికరించలేదనీ వాపోయారు. వెంటనే దళితులకు అంతిమపట్టాలు అందజేయాలనీ, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు చేపడతామనీ హెచ్చరించారు.

ఇక చావే గతి
ప్రభుత్వం పట్టాలిచ్చింది. ఈ భూమి నాదేననుకున్నా. రూ. 40వేలు అప్పుచేసి బీడు భూమిని మంచిగా చేసుకున్న. ఈ ఏడు మరో 10వేలు అప్పుజేసి పత్తివేశా. 20 ఏళ్లుగా లేనిది ఇప్పుడొచ్చి ఈ భూమి సర్కారుదంటున్నారు. నాకిక చావేగతి.
ఇవురాల్ల చిన్న లచ్చయ్య (బాధితుడు)
  • పెత్తందారుల కబ్జాకు అధికారుల అండ
ప్రజాశక్తి - కరీంనగర్‌ టౌన్

ఆదిలాబాద్ కు అద్యక్ష ఎన్నిక

మాదిగ దండోరా సంక్షేమ సమితి తెలంగాణా విభాగము అద్యక్షులు నకిరేకంటి కొమరయ్య మాదిగ గారు ఆదిలాబాద్ కు అద్యక్ష ఎన్నిక జరుపగా రాష్ట కమిటి మరియు వర్కింగ్ కమిటి కలిశి బిరుదుల ధర్మయ్య మాదిగను ఏకగ్రీవంగా ఎన్నుకొని ధర్మయ్య మాదిగ యొక్క పూర్తి వివరాలను రాష్ట అద్యక్షలు బి జయ రామ్ మాదిగ గారికి పంపివగా గతములోను ధర్మయ్య గారి సేవలను తెలుసుకొని ధర్మయ్య ఎన్నిక సంతృప్తిని ఇచ్చినదని బి జయ రామ్ మాదిగ గారు కొమరయ్య గారికి మరియు వర్కింగ్ కమిటికి ఫక్ష్ ద్వార తెలియ జేసారు.మరో వివరణలో నకిరేకంటి కొమరయ్య మాదిగ బిరుదుల ధర్మయ్య మాదిగ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మాదిగ జాతి కోసము మరింత కృషి చేయాలనీ తెయ జేశారు.రాష్ట వర్కింగ్ కమిటి మెంబర్ తాడేపల్లి శ్రీనివాస్ రావు గారు ఆదిలాబాద్ జిల్లా రాష్టములోని అన్ని జిల్లకంటే మాదిగ జాతి బిడ్డలు నేటికి గోండ్రు గల్లుగా పిలువా పడుతున్నారు.ఇట్టి విషయాన్నీ తెపుతూ మనవ జాతికి మూలా పురుషులు మాదిగలనితెయ జెప్పారు.అంతే కాకుండా జిల్లా నుండి ప్రతి నియోజక కమిటీలు మండల కమిటీలు గ్రామా కమిటీలు తొందరగా పూర్తిజేసి ఆదిలాబాద్ జిల్లా మాదిగల అందరి మన్ననలు పొందాలని తెలియజేసారు.ఇట్టి ఎన్నికను ధర్మయ్య గారు స్వాగతిస్తూ మాదిగ దండోరా సంక్షేమ సమితి నా పై ఉంచిన భాద్యతను జాతి కోసము మరింత సేవకు అవకాశము కలిపించినదని జెప్పారు .

ప్రభుత్వ విద్యారంగాన్ని సంస్కరించాలి!

బి. అంజనేయులు
(ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. రాష్ట్ర అధ్యక్షులు)
ప్రభుత్వ విద్యారంగానికి రాష్ట్రంలో చెద పట్టిందని చెప్పే పరిస్థితులను పాలకులే కల్పి స్తున్నారు. విద్యా రంగం గందరగోళంలో ఉన్న ప్పుడు దాన్ని సంస్కరించి మార్గ నిర్దేశం చేయా ల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది. కాని రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వ విద్యా విధానం కుప్పకూలి పోతుంటే విద్య అనేది భవిష్యత్‌లో అంధకార బంధురంగా మారే ప్రమాదంలో పడిపోతుంటే ప్రభుత్వం మాత్రం గుర్రంలేని రథంపై కూర్చుని స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తున్నది.
నర్సరీ నుండి మొదలుకొని ఉన్నత విద్య వరకు ''డబ్బుంటే చదువు లేకుంటే నై నె''ౖ అనే విధంగా విద్యా రంగం తయారైంది. ప్రభుత్వ విద్యా సంస్థలు జీవన ప్రమాణ స్థాయి లేనటు వంటి బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసమే ఏర్పాటు చేసినట్లు దిక్కూ దివానం లేక మోకాళ్ళపై నిలబడి నడవగలుగుతున్నాయి. రాష్ట్రంలో 6000 లకు పైగా సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో 8 లక్షల మంది విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారు. సంక్షేమ వసతి గృహాలు అధ్వానంగా కూలిపోవడానికి నిధులలేమితో కాలం గడపుతున్నాయి. కాస్మోటిక్‌ చార్జీలు లేక పలుచబోయిన అన్నం చారుతో విద్యార్థులు దిన దిన గండంగా కాలం గడుపుతున్నారు. దుర్భర మైన పరిస్థితుల మధ్య పేద విద్యార్థుల చదువులు ముందుకు సాగాలంటే ప్రశ్నార్థకమైన విషయమే. హస్టల్స్‌కు సొంత భవనాలు లేక ఉన్న భవనాలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు సరైన సౌకార్యాలు, మంచినీరు, మరుగుదొడ్లు, టీచర్లు లేక మరోవైపు ప్రైవేట్‌ పాఠశాలలతో పోటీ పడలేక మూతపడ టానికి మూలుగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు విద్యార్థులు లేరనే కుంటి సాకుతో ప్రైవేట్‌ సంస్థలకు జీవం పోసేందుకు ప్రభుత్వ విద్యాసంస్థలకు నిధులు కేటాయింకుండా, బడులను మూసివేసేందుకు సిద్ధమవుతూ చదువులను చెప్పించడం మా బాధ్యత కాదంటూ, నిస్సిగ్గుగానే ప్రకటిస్తున్నది. అందులో భాగంగానే 2900 పాఠశాలలను రాష్ట్రంలో మూసివేయుటకు సిద్ధమౌతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో 18,143 ఉన్నత పాఠశాలలుంటే సుమారు ప్రైవేట్‌ రంగంలో 7000 పాఠశాలలు కొనసాగుతున్నాయి. 55 లక్షల మంది విద్యార్థులు హై స్కూల్‌ విద్యను చదువుతున్నా అందులో 20 లక్షల మంది విద్యా ర్థులు ప్రైవేట్‌ రంగంలోనే విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య 40 కన్నా తక్కువగా ఉందని రాష్ట్ర మొత్తంలో 3వేల పాఠశాలలకు తాళం పెట్టనుంది ప్రభుత్వం. ఇదే జరిగితే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య ప్రాథమిక హక్కుగా కేంద్రం తెచ్చిన విద్యా హక్కు చట్టాన్ని నవ్వులపాలు చేసినట్లు అవుతుంది.
ఈ రెండు సంవత్సర కాలంలో కొత్తగా ఏర్పాటు అయిన ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళశాలలు, పాల్‌టెక్నిక్‌ కళాశాలలు సొంత భవనాలు, సిబ్బంది ఏ మాత్రం లేక నల్లేరులో గిలుక ఈదినట్లు కాలం సాగిస్తున్నాయి. రాష్ట్రంలో 804 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు నడుస్తు న్నాయి. అందులో 265 కాలేజీలకు సొంత భవ నాల సౌకర్యాలు లేక పాఠశాలల్లో, డిగ్రీ కళాశా లల్లో షిప్ట్‌ పద్ధతిలో నడుస్తున్నాయి. సుమారు 9700 మంది అధ్యాపకులు అవసరముండగా 5600 పోస్టులను భర్తీ చేయలేదు. ఏండ్లతరబడి కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్‌ చేయడంలేదు. అదే విధంగా 235 పైచిలుకగా రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు భవనాల కొరత వుంది. దీనితో మూడింట రెండొంతుల పోస్టుల భర్తీ చేయకుండా ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తుంది. గత జూన్‌లో రాష్ట్ర వ్యాప్తింగా 300 బి.సి. కాలేజీ హస్టల్స్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇంత వరకు ఊసెత్తకుండా మరచిపోయింది.
విద్యా హక్కు చట్టం ఎప్రిల్‌ 2011న అమ ల్లోకి వచ్చింది. ఇప్పటికి అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వ విఫలమైంది. దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన 11 నెలల తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు విమర్శల నుంచి బయట పడేందుకు జి.ఓ. నెం. 14 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య స్థాయి ఏంటో అర్థమవుతుంది. వాస్తవంగా విద్య హక్కు చట్టం మంచి ప్రయోజనాలు ఇవ్వాలంటే కొన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. అయినా ప్రభుత్వం చర్యలకు వెనుకడుగు వేస్తుంది. విద్యా హక్కు చట్టాన్ని అమలుపర్చడానికి అధికారాలను పాఠశాల విద్యశాఖకు కాకుండా సర్వశిక్షాభియాన్‌కు అప్పగించింది. ప్రత్యేక పాఠ శాలలను స్థాపించాలనే ఆలోచనను విరమించు కుంది. ప్రభుత్వ పాఠశాలలకు దగ్గరలో ప్రైవేట్‌ పాఠశాలలు ఉండరాదనే విషయాన్ని ప్రక్కకు నెట్టింది. అలాగే యాజమాన్య కమిటీలో ఎవరు ఉండాలనే విషయాన్ని స్పష్టంగా వివరించలేదు. అంతేకాక ఎసిఎంసి చైర్మన్‌, సభ్యులను ఎన్నికల ద్వారానే నియమించాలనే ప్రతిపాదనను త్రోసి పుచ్చింది. ముఖ్యంగా విద్య హక్కు చట్టాన్ని సక్రమంగా నిర్వహించుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రెండు కూడా సరాసరి నిధులు కేటాయిం చాలనే నిబంధనను గాలికి వదిలివేశాయి. అందులో రాష్ట్రం వాటాగా 45 శాతం నిధులు కేటాయించాలనే ప్రతిపాదనను మొన్నటి అసెంబ్లీ బడ్జెట్‌లో ప్రభుత్వం మొండి చేయి చూపింది. దీన్ని బట్టి చూస్తే విద్యా హక్కు చట్టాన్ని మసిపూసి మారేడుకాయలాగా పైపూతలు పూయుటకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయినట్లు అర్థమౌతుంది. ఇలా అయితే గ్రామీణ పేద విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్యను అందించే విద్యాహక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం నీరుగారిపోతుంది.
బడ్జెట్‌లో విద్యా రంగానికి 17,362 కోట్లు నిధులు కేటాయించారు. 1307 కోట్లను ఈసారి అదనంగా విద్యా రంగానికి కేటాయించడం జరిగింది. పాఠశాల విద్యకు 14,025 కోట్లు కేటా యించారు. ఉన్నత సాంకేతిక విద్యకు 3,337 కోట్లు కేటాయించడం జరిగింది. అయితే ఈ నిధులకు ఇంకా రెండు రెట్లు ఎక్కువ కేటాయించినా ప్రభుత్వ పాఠశాలలు మరియు ఉన్నత విద్యను గట్టెక్కించే పరిస్థితి లేదు. ఫీజు రియంబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షిప్‌లకు 2,745 కోట్లు కేటాయించారు. ఇంకా బకాయిలతో కలిపి 2010 నుంచి 2012 వరకు 6,480 కోట్లు తక్షణం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. కాని రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఈ పథకానికి చేయిచ్చింది. మొత్తంమీద 2012లో దీన్ని ఎత్తివేయడానికి సంకేతాలు ఇచ్చినట్లే కనిపిస్తుంది. 2008-2009, 2009-2010కిగాను బకా యిలే 2,414 కోట్లుపెడింగ్‌లో ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం 3412 కోట్లు, 2012కి 3,400 కోట్లు ఇవాల్సి ఉంటుంది. మొత్తం కలిపి 9,226 కోట్లు అవసరం. కానీ విడుదలచేసిన 2,745 కోట్లతో విద్యార్థులకు ఏలా న్యాయం చేస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీనిపైన ప్రభుత్వం కూడా తక్షణం వివరణ ఇవాల్సిన అవశ్యకత ఉంది. అలాగే రాష్ట్రంలో 8 లక్షలమంది హస్టల్‌ విద్యార్థుల మెస్‌ చార్జీలను పెంచడంలేదు. కేంద్ర ప్రభుత్వం మెస్‌ చార్జీలను పెంచినా, రాష్ట్ర ప్రభు త్వం పెంచడంలేదు. ఒక వేళ పెంచితే అదనంగా 120 కోట్ల రూపాయలు కేటాయించాల్సి వుంటుంది. కానీ అసలే ఈ విద్యా సంవత్సరం 2010 - 2011కి గాను ఒక రూపాయి కూడా కేటాయించకపోవడం దుర్మార్గమైన విషయం.
ఉన్నత విద్యలో భాగమైన ఇంజనీరింగ్‌, యం.బి.ఎ., యం.సి.ఎ., ఫార్మసీలాంటి కోర్సులు మొత్తం ప్రైవేట్‌ రంగంలో రాజ్యంమేలుతున్నాయి. ఉన్నత విద్యను ముందు చూపులేకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఇంజనీరింగ్‌ విద్యను ప్రోత్సహించి దానిని సరైన దారిలో ఉంచకపోవడం వలన వ్యాపారవేత్తలు, బడా రాజకీయ నాయకులు విద్యకు పెట్టుబడి పెట్టి డబ్బులు దండుకోవడంలో సఫలీకృతులవుతున్నారు. ఉన్నత విద్య భవిష్యత్‌ తరాలకు అంధకారంగా మారి పెను ప్రమాదంగా రూపుదాల్చుకుంటుంది. ఇంటర్‌లో పాసైన ప్రతి వాడు ఇంజనీరింగ్‌లో చేరితే విజ్ఞానశాస్త్రాలు కూడా నిర్లక్ష్యానికి గురవుతాయి. దానితో భౌతిక, రసాయన, గణిత సామాజిక శాస్త్రాలు కనుమరు గయ్యే ప్రమాదం పొంచివుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విద్యా రంగానికి నిధులు కేటాయించడంలో తీవ్ర నిర్లక్ష్యా నికి ఒడిగడుతున్నాయి. కేంద్రం నుంచి 10 శాతం నిధులు, రాష్ట్రం నుంచి 30 శాతం నిధులు విద్యా రంగానికి కేటాయించాలని గత 30 సంవత్స రాలుగా ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. ఇతర విద్యార్థి సంఘాలు పోరాటాలు సాగించినా అది పోరాటంగానే మిగులిపోతుంది తప్ప, పాలకులకు పట్టడంలేదు. విద్యారంగం సంక్షోభం నుండి గట్టెక్కాలంటే 30 వేల కోట్ల రూపాయలు తక్షణం కేటాయిస్తే తప్పసరైన గాడిలోకి ప్రభుత్వ విద్య రాదు, రాలేదు. మేధావులు, విద్యావంతులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున మడమతిప్పని సమరశీల మహత్తర ఉద్యమాలు కార్పోరేట్‌ శక్తులకు వ్యతిరేకంగా, ప్రభుత్వ విద్యాసంస్థలను సంస్కరించేందుకు సర్వ శక్తులువడ్డి పోరాటాలకు సిద్ధంకావలసిన అవసరం ఉంది.విశాలాంధ్ర పత్రిక సౌజన్యముతో

నా జాతిని ద్వంసము చేస్తున్నది

నా జాతిని ద్వంసము చేస్తున్నది ఎవరు! షెడ్యుల్డ్ కులలా బాల బాలికలు విద్యార్ది దశ నుండి ప్రభుత్వ బడులలో చదువుతూ షెడ్యుల్డ్ హాష్టలలోవుంటూ చదువు కుంటున్నారు.హాష్టలలో వుంటున్నబాల బాలికలను మాత్రము నాటి నుండి నేటి వరకు ప్రభుత్వమూ ఖైదీలకు ఇచ్చే వసతులలో పది శాతము కూడా యి బాల బాలికలకు ఇవ్వటము లేదు.మన ప్రజా ప్రతినిధులు ప్రజా పాలకులు మాత్రము నేటి బాల బాలికలే రేపటి భారత పౌరాలని పొంతన లేని మాటలు చేభుతుంటారు.జైల్లో వుండే ఖైదీలకు రోజుకు   మెస్ బిల్ 40  రూపాయలు  యిస్తు ప్రతి రూముకు ప్రతి నల్గురికి కలిపి ఒక సీలింగ్ ఫ్యాన్ ఎరుపాటు చేస్తున్నది.పుష్కలమైన నీటి శాదుపయము కలిపిస్తున్నది.చక్కటి ప్రకృతి పార్క్ ఎరుపాటు చేస్తున్నది. వే ఖైదికైన ఆరోగ్యము కోసము ప్రతి నెలకు రొండు సార్ల సర్కారు దవఖనకు తీసుకొని వెళ్లి చూపిస్తున్నది.బోజానా విషయములో ప్రతి రోజు నాల్గు రకాల కూరలు ప్రతి ఆదివారాము మటన్  లేదా చికెన్ వొడ్డిస్తున్నది.రోజు తప్పి రోజు ఫ్రూట్ లేదా గుడ్డు వొడ్డిస్తున్నది.నేటి సమాజపు వివరాలను తెలుసు కొనుటకు వార్త పత్రికలను అందు బాటులో వుంచుతున్నది.ఖైదీల విలాసము కొరకు టేలివిజనులను వేర్పటు చేస్తున్నది.ప్రతి మూడు నెలలకు   ఒక సరి నూతన దుస్తువులను ఇస్తున్నది.ఖైదీలకు శారిర దార్డ్యము కొరకు వ్యయమ కోశము పరికరాలను అందు బాటులో వుంచుతున్నది.క్రీడల పై అవగహన కోసము వివిధ క్రీడ సామగ్రిని అందు బాటులో వుంచుతున్నది ఇట్టి సదుపాయాలు కేవలము సాదారణ ఖైదీలకు  అదే వి ఐ పి ఖైదీలకు చెప్పలేనన్ని సదుపాయాలు కలిపించు తున్నది యి ప్రభుత్వాలు,మరి రేపటి రోజులకు షెడ్యుల్డ్ బాల బాలికలు పౌరులగా ఎదుగాటానికి కలిపిస్తున్న అవకాశాలు ఒకటవ తరగతి నుండి వేనిమోదవ తరగతి వరకు రోజుకు పద్నాలుగు రూపాయలు యిస్తే నేటి  కురగాలు ధరలు చెప్పెరితిలో లేవు, కనీసము హోటలులో టిపిన్ కూడా రావటము లేదు.ఇదే గాక షెడ్యుల్డ్ కులాల  కోసము ఉద్యమాలు చేసే కొంత మంది నాయకులూ కూడా షెడ్యుల్డ్ హాస్టళ్ళు నడిపే హర్డేల్లను బెదిరించి బ్రతుకుతూ చిన్న పిల్లల కుతి కాడి అన్నము లకుంటున్నారు,షెడ్యుల్డ్ కులాలకు చెందినా హస్టలలులో స్నానానికి బాతు రూములు వుండవు.ముత్రసాలలు అసేలే వుండవు.క్రీడల కోసము కనీస సౌకర్యాలు వుండవు.నిద్రించే రుములలో సీలింగ్ ఫ్యాన్లు వున్నా తిరుగావు .ఎ రుములో కూడా పవర్ లైట్లు సరిగ్గా వుండవు.ప్రతి నెల క్రమము తప్పకుండ సర్కారు డాక్టర్స్ వొచ్చి పిల్లలకు  ఆరోగ్య నియమాలు తెలియజేసి వైద్యసేవలను అందించిలని జి  వో వున్నా పేపరుకు పరిమితము అయింది తప్ప!ఎ ప్రజా పాలకులు ప్రజా ప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోలేదు.హస్టలలులో పిల్లలకు ఏదైనా ఆపద సంబవించి మృత్యువాత పడితే షెడ్యుల్డ్ కులాల కోసము ఉద్యమాలు చేసే నాయకులూ అక్కడి రాజకీయ నాయకులూ వారి స్వార్ధము కోసము పేపర్లకు పోజులు ఇవ్వటానికి షేవ రాజకీయాలు చేస్తారు తప్ప మృత్యువు భందువులకు మేలు చేసే వారు ఎవ్వరు లేరు, మృత్యువు రావటానికి కారణాలు ఆలోచించే ఉద్యమా నాయకులూ ప్రజా ప్రతి నిధులు ప్రజా పాలకులు లేరా !లేదా షెడ్యుల్డ్ కులాలకు సంబదించిన MLA లు లేరా MP  లు లేరా లేఖ మంత్రులు లేరా విద్య వంతులు లేరా మేధావులు లేరా IAS  లు లేరా  లేక ధనవంతులు లేరా లేక షెడ్యుల్డ్ కులాల జనాభా ఏమైనా తక్కువగా వున్నదా!మరి అదికారా ములో వుండే పాలకులు ఖైదిలకంటే తక్కువ చేసి షెడ్యుల్డ్ కులాల విద్యార్దులను వెందుకు  చూస్తున్నారు.మరి జాతి  ప్రజలు యి రాజకీయ నాయకులకు ఓట్లు వేమైన వేయలేదా మొదట విద్యార్దిలకు మంచి అవకాశాలు కలిపించాలని నేటి ప్రభుత్వమూ పై ఒత్తిడి తెచ్చి జాతి కాపాడుకునే బాద్యత ప్రతి షెడ్యుల్డ్ కులాల ప్రతి ఒక్కరు తెలుసు కోవాలి ,దీనితో పటు నేటి మీడియా నేటి ప్రజా పలుకులు ఇట్టి విషయము పై మరింత అద్యనము  చేసి న్యాయము చేయాలి అప్పుడే భారత దేశము మరింత అభివృద్ధి  సదించాగలదు --------ఇట్లు బిమనపల్లి జయరాం దళిత జాతి సెల్ 9494443337  website - madhigadandora .org ------ఈమెయిలు mailto:---bjr@madhigadandora.org