తెలంగాణ దళిత సంఘాల జెఎసి కార్యాలయం ప్రారంభం

తెలంగాణ దళిత సంఘాల జెఎసి కార్యాలయం ప్రారంభం గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో మలక్‌పేట నియోజకవర్గంలోని ఆస్మాన్‌ఘడ్‌లో తెలంగాణ దళిత సంఘాల కార్యా చరణ రాష్ట్ర సమితి శుక్రవారం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రేటర్‌ దళిత సంఘాల అధ్యక్షుడు బి.సునీల్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ఎ.రమేష్‌లు పాల్గొని ప్రారంభించారు. అనంతరం శాఖ కమిటీ సభ్యులను ఎన్నుకు న్నారు. శాఖ ప్రెసిడెంట్‌ శాంతికుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ఎ.బాబు, చీఫ్‌ అడ్వయిజర్‌ బి.డేవిడ్‌రాజు, జనరల్‌ సెక్రటరీ ఎస్‌.నిక్సన్‌, జాయింట్‌ సెక్రటరీ ఎ.విల్సన్‌, నర్సింహ్మ, క్రిష్టోఫర్‌, శ్యామ్‌సన్‌ తదితరులను ఎన్నుకు న్నారు. ఈ సందర్భంగా గ్రేటర్‌ అధ్యక్షుడు బి.సునీల్‌ మాట్లాడుతూ దళితుల్లో చైతన్యం రావాలని, వారిపై జరుగుతున్న దాడులను ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. దళితుల్లో ఏ వర్గానికి అన్యాయం జరిగినా ప్రతిఘటిస్తామని ఆస్మాన్‌ఘడ్‌ శాఖ దళిత నాయకులు హెచ్చరించారు. అదేవిధంగా ఆస్మాన్‌ఘడ్‌లో అంబేద్కర్‌ విగ్రహం త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో దాదాపు వందమంది దళితులు పాల్గొన్నారు.

తల్లే కీలకం

పిల్లల విషయంలో తల్లి పాత్ర ఎంతో ఉంటుంది. పిల్లలు చెడిపోయినా, బాగుపడినా తల్లే కారణం. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇంటినీ చూసి ఇల్లాలిని చూసుకో అనే నానుడి ఉంది. ఇంటి మొత్తం బాధ్యత తల్లిపై ఉంటుంది. ఆమెకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో కూడా పిల్లలపైన చిరాకుపడటం చేయకూడదు. అది వారిని మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. వారికి ఏదైనా కావాలి అంటే అది వద్దు అని అతి సున్నితంగా చెప్పాలి.
పిల్లల విషయంలో ఇల్లు ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇల్లు వాతావరణం సక్రమంగా లేకపోయినా పిల్లలు ఒత్తిడికి గురయ్యి బయట అలవాట్లు నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లల మనస్సులో ఏమి ఉంది? వారు ఏమి కోరుకుంటున్నారు. దానికి ఎలా వద్దు అని చెప్పాలి అనేది తల్లికే సొంతం.
తల్లి పిల్లల ఆహార విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు తినటానికీ ఇష్టపడకపోతే వదిలివేయకూడదు. వాళ్ళచేత ఆ ఆహారం తినిపించాలి. పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వటం వలన మానసికంగా, శారీ రకంగా వారిలో ఎదుగుదల ఉంటుంది. అయితే వారికి ఎదిగేకొద్ది సమతులహారం, క్యాలరీలను చూసుకొని టైమింగ్‌ ప్రకారం అలవాటు చేయాలి. కొంత వయస్సు వరకు పిల్లలు తల్లితో ఎక్కువ సమయం గడుపుతూ, తల్లినీ స్నేహితురాలిగా భావించి అన్నీ ఆమెతో పంచుకోవటం జరుగుతుంది.
కానీ ముఖ్యంగా మన వాళ్ళనీ సరిగ్గా, సక్రమంగా తీర్చిదిద్ది కెరీర్‌ పరంగా సరైనా విధానంలో నడిపించటం అనేది వారి టీనేజ్‌లోనే ప్రారంభం అవుతుంది. ఈ వయస్సులో వారికి ఫ్రెండ్స్‌ ఎక్కువ అవుతారు. అయితే ఇప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి విషయం తల్లిదండ్రుల కన్నా కూడా ఫ్రెండ్స్‌తో ఎక్కువగా పంచుకుంటారు.
తల్లిదండ్రులు పిల్లల ముందు ఎక్కువగా గొడవపడటం చేయకూడదు. ఇలా చేయటం వల్ల వాళ్ళ ఎదుగుదల మీద ప్రభావం చూపుతుంది. వారు అలాంటి వాతావరణానికి అలవాటు పడతారు. అందువల్ల ఎదిగే పిల్లల విషయంలో ఇల్లు, ఇంటి వాతావరణం ఎక్కువగా పని చేస్తుంది.
కొన్ని సందర్భాల్లో ఆ ఒత్తిడిని స్నేహితులతో పంచుకోవటం వారు చెడు అలవాట్లను అలవాటు చేసే ప్రమాదం ఉంది. అందుకనే తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను కనిపెడుతూ ఉండాలి.
- అనుపమ విశాలాంధ్ర పత్రిక సౌజన్యముతో

గౌరవ నియులైన ప్రజా శక్తి దినా పత్రిక ఎడిటర్ గార్కి నమస్కరించి తెలుపునది.ప్రజా శక్తి గతములో చిత్తూరు జిల్లలో దళితులకు స్మశాన వాటిక లేదు ఉన్నదాన్ని డబ్బు పలుకుబడితో ఆక్రమించారని చక్కటి సందేశాన్ని ప్రజలకు తెలిపారు.కానీ మీరు రాష్టాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రులు వారి జిల్లలో దళితులకు జరుగుతున్న అన్యాన్ని చూసి కూడా నాటి నేటి ముఖ్యమంత్రుల పై సంపాదకియము ఎందుకు వ్రాయటము లేదు మీరు యి విషయము పై స్పందిస్తారని మరలా యి విషయాన్నీ మరింత క్సున్నంగా అద్యాయనము చేసి మరింత ప్రచారము చేసి దళితులకు న్యాయము చేస్తారని మనసారా కోరుకుంటున్నాను

అసలు మానవత్వం అంటే ఏమిటి? సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడాన్ని మానవత్వం అంటాం. ఒకరిని మరొకరు ఇబ్బంది పెట్టకుండా సఖ్యతగా సామరస్యంగా సహకరించు కుంటూ సంఘజీవనం సాగించడాన్ని విలువలు అంటున్నాం. ఇటువంటి మానవత్వం విలువలు తల్లిదండ్రులకు కరువయ్యాయనే చెప్పాలి. తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుండి పిల్లలను క్రెష్‌ల్లోనూ, హాస్టల్స్‌లోనూ, రెసిడెన్షియల్స్‌ లోనూ చేర్పించేస్తున్నారు. అందువలన వాళ్ళకి తల్లిదండ్రుల విలువ తెలియడం లేదు. సాధారణంగా పదవ తరగతి వరకైనా పిల్లలు తల్లిదండ్రుల వద్ద వుంటే అమ్మానాన్నల విలువ వాళ్ళకి తెలుస్తుంది. పిల్లల మనస్తత్వం కూడా ఎటువైపు వెళుతుందో తల్లిదండ్రులు కూడా గుర్తిస్తారు. వృద్ధాప్యంలో పిల్లలు తల్లిదండ్రులను విడిచి పెట్టకుండా వుండటానికి అవకాశ ముంది. ఏది ఏమైనా సరే, బంధుత్వాలు, అనుబంధాలు నేడు నామమాత్రాలైనాయి. కష్టకాలంలో కూడా ఒకరినొకరు ఆదుకునే పరిస్థితికి కూడా దూరమైపోయాము. సెల్‌ఫోన్‌ల లోను, ఈ మెయిల్స్‌లోనూ మెసేజ్‌లు ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రుల విషయంలో కూడా ఇందుకు మినహాయింపు ఉండటంలేదు. ఒకరు లేదా ఇద్దరు పిల్లల్ని కని అల్లారుముద్దుగా పెంచి, పెద్దచేసి విద్యాబుద్ధులు నేర్పించి వారి కాళ్ళపై వారు నిలబడే వరకు ఆసరాగా తల్లిదండ్రులు తమ బాధ్యతను నేటికీ సక్రమంగానే నిర్వర్తిస్తున్నారు. అటువంటప్పుడు వారికి వయస్సు మళ్లినకాలంలో పిల్లలు ఆలంబనగా వుండి ఆదుకోవాలనుకోవడం అత్యాశేమీ కాదుకదా. ఇది వరకు రెక్కలొచ్చేసరికి అంటే ఉద్యోగమొచ్చేసరికి ఎగిరిపోయారు. ఇప్పుడు మరీ అడ్వాన్సుగా చదువు పూర్తయ్యే సరికి ఎగిరిపోతున్నారు. ఇటువంటి వారు కొంతమందైతే మరి కొంతమందిపెళ్ళాల మోజులో పడి తల్లిదండ్రులను గాలికి వదిలేస్తున్నారు. పెళ్ళానికి డబ్బు లేదా ఆదాయం ఎక్కువ ఉంటే ఆమె కొండెక్కి కూర్చొంటే వీళ్ళు వారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ వుంటారు. తల్లిదండ్రులు ఉన్నారనే ధ్యాసే వుండదు. ఒక వృద్ధుడు కొడుకు చూడటం లేదని ఆత్మహత్య చేసుకున్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. ఏదీఏమైనా నష్టపోతున్నదీ కష్టాలు పడుతున్నదీ మాత్రం తల్లిదండ్రులే. దీనికి కారణం నేటియువకులే. దీనివలనే రోజురోజుకీ వృద్ధాశ్రమాలు పెరుగు తున్నాయి. పిల్లలు వారి కాళ్ళమీద వారు నిలబడే వరకు తల్లిదండ్రులు పెంచు తున్నారంటే దానికి కారణం వాళ్ళ మమకారం, పేగుబంధం. దీని వెనుక వారి త్యాగమెంతో వుంది. బాల్యం నుండి వాళ్ళు ఎదిగే వరకు కూడా ఒక్కొక్కదశలో ఒక్కోసారి వారి అత్యవసరాలను ప్రక్కకు పెట్టి పిల్లల బాగోగులే ముఖ్యమని భావిస్తారు . అటువంటి త్యాగమూర్తులు వృద్ధాప్యంలో పిల్లల అనాదరణ వల్ల కష్టాలు ఎదుర్కొవాల్సిందేనా, ఒంటరిగా బ్రతకవలసిందేనా? ఈ పరిస్థితి మారా లంటే ఒక్కటే మార్గం ''చేతికి అందివచ్చిన పిల్లలు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ, ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా వారి వారి ఆదాయంలో కొంత భాగం తప్పనిసరిగా తల్లిదండ్రులకు చేరే విధంగా చట్టాలు తయారుచేస్తే బాగుం టుందని నా అభిప్రాయం. ఎవరైతే వాళ్ళకు ఈ విధంగా జీతం కానీ వేతనం గానీ చెల్లిస్తారో వారికి మాత్రమే తల్లిదండ్రుల వాటాను మినహాయించి వారికి నేరుగా అందేటట్లు చూడాలి'' పిల్లలు ఎదుగుదల కోసం ఏ విధంగా తల్లిదండ్రులు వారి అవసరాలను త్యాగం చేశారో సంపా దిస్తున్న పిల్లలుకూడా వృద్ధులైన తల్లిదండ్రుల కోసం వారి అవసరాలను త్యాగం చేయక తప్పదు. తల్లిదండ్రులు వాటాపోగా మిగిలిన ఆదాయంతోనే వారు సరిపెట్టుకొనేలా చేస్తే బాగుంటుంది. ఈ విధంగా చేయడం వలన వృద్ధాశ్రమాల శాతాన్ని తగ్గించ వచ్చు. బిడ్డలు తల్లిదండ్రు లకు దగ్గరగా వుంటారు.
-పి. హారిక విశాలాంధ్ర దిన పత్రిక సౌజన్యముతో

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఛైర్మన్‌ను నియమించాలి

రాష్ట్రంలో దళితుల కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు వెంటనే చైర్మన్‌ను నియమించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు డిమాండ్‌ చేశారు. ఎస్సీల అభివృద్ధి కోసం నియమించిన నోడల్‌ ఎజెన్సీకి చట్టబద్ధత కల్పించాలన్నారు. సబ్‌ప్లాన్‌ నిధుల ఖర్చు కోసం నిపుణుల కమిటీని నియమించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం సిపిఎం రాష్ట్ర నాయ కులు సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణకు దళితుల సమస్య లపై వినతిపత్రం ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్రకార్యదర్శి రాఘవులుతోపాటు కేంద్రకమిటీ సభ్యులు పి. మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జి. రాములు ఉన్నారు. అనంతరం రాఘవులు మీడియాతో మాట్లాడుతూ గతంలో దళితుల సమస్యలపై సిపిఎం పోరాటం చేయగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ప్రభుత్వం నియమించిందన్నారు. రెండు సంవత్సరాలుగా కమిషన్‌కు చైర్మన్‌, సభ్యులను నియమించలేదన్నారు. దళితులకు జరిగే అన్యాయాలపై ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదన్నారు. వెంటనే కమిషన్‌కు చైర్మన్‌, సభ్యులను నియమించాలని డిమాండ్‌ చేశారు. 2007లో తమ నిరాహార దీక్షా ఫలితంగా దళితులకోసం నోడల్‌ ఎజెన్సీని ఏర్పాటు చేసిందన్నారు. అది ఇపుడు చెత్తకాగితంలాగే ఉంది తప్ప దాని ద్వారా ఎలాంటి ఉపయోగం దళితులకు జరగలేదన్నారు. వెంటనే నోడల్‌ ఎజెన్సీకి చట్టబద్ధత కల్పించాలన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తున్న సబ్‌ప్లాన్‌ నిధులను దళితులకే ఖర్చు చేసేలా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. దళితుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ప్రజాసంఘాలు ఈ నెల 22న చేపట్టనున్న ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి తమపార్టీ మద్దతు తెలుపుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ నివాస ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక పథకాన్ని బడ్జెట్‌ సమావేశాలలోనే ప్రవేశ పెట్టాలన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్‌లో 10 వేల కోట్లు కేటాయించాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు రూ. 5 వేల కోట్లు కేటాయించాలని కోరారు. అంటరానితనం, కులవివక్ష నిర్మూలనకు తాహసీల్దారు, ఎస్‌.ఐ.లు వారంలో ఒకరోజు గ్రామాల్లో సదస్సు నిర్వహించాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా స్వయం ఉపాధి పథకానికి 500 కోట్లు కేటాయించి, బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలివ్వాలని కోరారు. ఎస్సీ విద్యార్థుల స్కాలర్‌షిప్స్‌, ఫీజురీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్స్‌కు సొంత భవనాలు నిర్మించాలన్నారు. 15 వేల దళిత గ్రామాల్లో శ్మశాన స్థలాలు లేవని, వెంటనే గ్రామానికి రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని చెప్పారు. ఇళ్ల స్థలాలు లేని 13 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలివ్వాలని కోరారు. మంచినీటి సౌకర్యంలేని 11 వేల దళిత వాడల్లో మంచినీటి సౌకర్యం కోసం రూ. 300 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

4 వేల దళితవాడలలో విద్యుత్‌ సౌకర్యం కోసం రూ.23 కోట్లు ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పథకం పనిదినాలను దళితులకు 200 రోజులకు పెంచాలని, రోజు వేతనం రూ. 150 ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జలయజ్ఞానికి కేటాయించిన బడ్జెట్‌లో ఎస్సీ సబ్‌ప్లాన్‌ ప్రకారం దళితులకు రావాల్సిన రూ. 2432 కోట్లను వారి భూములకు సాగునీరందించడానికి ఖర్చు చేయాలని కోరారు. రాష్ట్రంలోని లెదర్‌పార్కులు పనిచేయడానికి 100 కోట్లు కేటాయించాలన్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల అమలును సమీక్షించి, వాటి అమలుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన అపెక్స్‌బాడీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించాలన్నారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.ప్రజా శక్తీ సౌజన్యముతో

గందరగోళపరిచే రాతలు

గందరగోళపరిచే రాతలు
జాహ్నవి వ్యాస పరంపరస్వోత్కర్ష, పరనింద, అబద్ధాలమయంగా ఉన్నది. మార్క్సిజం మీద రాళ్లువేసే కార్యక్రమం ప్రారంభించారు. కొండను ఢీకొట్టే పొట్టేలులాగా ఎందుకీ దుస్సాహసం? వీరికి మార్క్సిజం గిట్టకపోవచ్చు. ఎంతైనా విమర్శించవచ్చు. కానీ మార్క్స్ చెప్పనివి చెప్పినట్టు, చెప్పినవి చెప్పనట్టు అబద్ధాలు వల్లించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఎవరి కోసమీ తప్పుడు రాతలు? క్యాపిటల్ గ్రంథాన్ని, గతితార్కిక భౌతికవాద సిద్ధాంతాన్ని కాచి వడపోశానని చెప్పుకుంటున్న జాహ్నవి కారల్‌మార్క్స్ గానీ, ఏంగెల్స్ గానీ వర్గాలంటే ఏమి టో, ఉత్పత్తి శక్తుల నిర్వచనం ఏమిటో చెప్పలేదంటున్నారు.

సహజ వనరుల పాత్ర గురించి కూడా మార్క్స్ విస్మరించారట. సోషలిస్టు సమాజంతో చరిత్ర పరిసమాప్తమవుతుందని, దానితో మానవ సమాజ పరిణామ క్రమం ఆగిపోతుందని మార్క్స్ చెప్పని మాటలు చెప్పినట్టు రాశారు. చరిత్ర పరిణామ క్రమం అంతటితో ఆగిపోతుంద ని మార్క్స్ ఏనాడు చెప్పలేదు. ప్రజాస్వామ్య పార్టీలు చేపట్టే సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు కమ్యూనిస్టులకు పెట్టి బూర్జువా ఎత్తుగడలుగా కనబడతాయట. ఇదెప్పుడు కలగన్నారో చెప్పలేదు.

ప్రపంచ చరిత్రలో ప్రజలకు మేలు చేసే ప్రతి చిన్న సంస్కరణనూ ఆహ్వానించింది కమ్యూనిస్టులేనన్న వాస్తవాన్ని జాహ్నవి కావాలనే కప్పిపుచ్చుతున్నారు. ఈ దేశంలో, రాష్ట్రంలో సంఘ సంస్కకర్తల గురించి ప్రచారంలో పెట్టిన వారిలో కమ్యూనిస్టులే ముందున్నారన్న విషయం విస్మరించారు. మార్క్స్, ఏంగెల్స్ ప్రతిపాదించిన సిద్ధాంతాలలో ఎన్నో వైరుధ్యాలున్నాయట! నాటి నుంచి నేటి వరకు ఎంత మంది ఎత్తి చూపినా ఆ చిక్కుముడులు వీడలేదట.

ఆ చిక్కుముడులు విప్పే పని తనే చేయగలుగుతున్నట్టు చెప్పుకున్నారు. అదనపు శ్రమ సిద్ధాంతాన్ని నమ్మే వారందరికీ ఇంతకాలం తట్టనిది, పట్టనిదొక రహస్యం తనకు మాత్రమే బోధపడిందట. ఉత్పత్తి సరళమైన పద్ధతి నుంచి ప్రావీణ్యతల ద్వారా ఎలా ఎందుకు మారుతుందో, పని విభజన ఎలా విస్తరించిందో తనకు మాత్రమే అర్థమయిందట. ఈ విషయం ఒబామాకు తెలిసి, అర్జెంటుగా ఆహ్వానించి, నోబెల్ బహుమతి ఇప్పించుగాక.

గత మూడేళ్లుగా తమ కలల సౌధాలైన పెట్టుబడిదారీ వర్గాలు కుప్పకూలుతున్నాయి. అభివృద్ధి బాటలో పరుగులు తీసిన అమెరికా, జపాన్, ఫ్రాన్స్ తదితర ఆర్థిక వ్యవస్థలు అంతర్గత వైరుధ్యాలతోనే కుప్పగూలాయి. ఐస్‌లాండ్‌ను అమ్ముకుంటే తప్ప తీరనంత అప్పులో కూరుకుపోయామని ఆ దేశ అధ్యక్షుడు బహిరంగంగానే ప్రకటించాడు. పోర్చుగల్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలు సంక్షోభంతో, కార్మికవర్గ పోరాటాలతో ఉడికిపోతున్నా యి.

జర్మనీ, బ్రిటన్‌లలో కూడా ఆందోళనకరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్య జి-20 దేశాల సమావేశం నుంచి బయటకు రాగానే ఫ్రాన్స్ అధ్యక్షుడు సర్కోజీ సంక్షోభం నుంచి ఎలా బయట పడాలో అర్థం కావడం లేదనీ, అర్జెంటుగా తనకు క్యాపిటల్ గ్రంథం ఇవ్వండని విలేకరుల ముందే వాపోయిన విషయం ప్రపంచమంతా గమనించింది. మన దేశంలో కూడా ఒకవైపు స్థూల జాతీయోత్పత్తి ఉరకలేస్తుంటే, ప్రపంచ ధనికుల లిస్టు లో చేరుతున్న భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతుంటే మరోవైపు దారిద్య్రం, రైతుల ఆత్మహత్యలు, శిశుమరణాలు, పౌష్ఠికాహారలోపం వెంటాడుతూనే ఉన్నాయి.

ఈ మధ్య మన దేశంలో కొందరికి అభివృద్ధి జబ్బు పట్టుకున్నదని, అభివృద్ధినే సర్వంగా భావిస్తున్నారని నోబెల్ గ్రహీత డా.అమర్త్యసేన్ అందుకే అన్నారు. అగ్రరాజ్యాలన్నీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ చైనా, భారత్‌లు మాత్రం ఇందుకు భిన్నంగా ఎందుకున్నాయనే చర్చ జరుగుతున్నది. ఈ పరిణామాలన్నీ ప్రజానీకాన్ని మరోసారి మార్క్సిజం వైపు దృష్టి సారించేలా చేస్తున్నాయి. సోవియట్ పరిణామలు మార్క్సిజానికి కాలం చెల్లిపోయిందని భ్రమించిన వారికి ఇది మింగుడు పడడం లేదు. గందరగోళపరిచే రాతలన్నీ ఇందుకే. జాహ్నవి నిజరూపాన్ని ఏమీ దాచుకోలేదు.

పొదుపు చేసి మదుపు చేయాలన్న పాత సిద్ధాంతాన్ని కొత్తగా చెప్పారు. శ్రమ ద్వారా సృష్టించిన సంపదంతా తిని కూర్చుంటే ఇంకా అడవుల్లోనే ఉండేవాళ్లమన్నారు. సంపద సృష్టిస్తున్న వారెవరో, తిని కూర్చుంటున్న వారెవరో చెప్పలేదు. అనూహ్యమైన సౌకర్యాలు అనుభవిస్తూ రేయింబవళ్లు జల్సాల్లో తేలియాడే పారిశ్రామికవేత్తలు ఎవరూ బికారులుగా కాకపోగా ఫోర్బ్స్ లిస్టులో చోటు సంపాదిస్తున్నారు. ఐదు వేళ్లూ నోట్లోకిపోవడమే గగనంగా ఉన్న పేదలను మాత్రం పొదుపు చేయమంటున్నారు.

ఒక వ్యక్తిని మరొక వ్యకి, ఒక జాతిని మరొక జాతి, ఒక వర్గాన్ని మరొక వర్గం దోచుకునే వ్యవస్థ చిరకాలం వర్ధిల్లాలని వీరి కోరిక!' పెట్టుబడిదారీ సమాజం పరిపక్వమైన తర్వాతనే కదా విప్లవం సాధ్యం, విప్లవం కోరుకునే వారంతా క్యాపిటల్ వృద్ధి చెంది త్వరగా పరిపక్వ దశకు చేరడానికే ప్రయత్నించాలి కదా' అంటున్నారు. అంటే ఇక జాహ్నవి బాటలో అందరూ చేరి పెట్టుబడిదారీ విధానానికి భజన చేయాలన్న మాట.

ప్రపంచీకరణ వేగంతో పరుగులు తీసిన పెట్టుబడిదారీ వ్యవస్థ బోర్లా పడుతు న్న దశలో, దానిని కాపాడడానికి ఎంతో మంది పెట్టుబడిదారీ పండితులు అవసరమే మరి! వేటాడుతూ బతికే పూర్వయుగాల నుంచి మనిషిని ఇంత దూరం రమ్మని ఎవరు బలవంతం చేశారని జాహ్నవి ప్రశ్నిస్తున్నారు. నిజ మే! ఎవరూ బలవంతం చేయలేదు. సహజ పరిణామ సూత్రాలకనుగుణంగానే అది జరిగింది. పెట్టుబడిదారీ వ్యవస్థను ఎవరూ బలవంతంగా కాపాడలేరని, సహజ సూత్రాల ఫలితంగానే కుప్పగూలుతుందన్న విషయం జాహ్నవి గుర్తించడం మంచిది.
-ఎస్.వీరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

కొల్లి నిర్మలా కుమారి, ‘తూర్పు’ మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు

వాగ్దానాలు నమ్మి దారుణంగా మోసపోయాం
అందుకే జగన్‌కు జై కొడుతున్నాం
జగన్ పార్టీలో చేరిన నేతల మనోగతం

రాజమండ్రి,(తూర్పుగోదావరి) న్యూస్‌లైన్: ప్రజల సంక్షేమాన్ని పట్టించుకుంటామని, సామాజిక న్యాయం తెస్తామన్న వాగ్దానాలను నమ్మి దారుణంగా మోసపోయామని, పదవుల కోసం నీచాతి నీచానికి దిగజారుతుంటే చూడలేక బయటకు వచ్చామని ప్రజారాజ్యం పార్టీ నుంచి జగన్ పార్టీలో చేరిన నాయకులు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట జాతీయ రహదారిని ఆనుకుని శుక్రవారం జరిగిన బహిరంగ సభలో వారు తమ అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టారు. వారితోపాటు పలువురు జగన్ మద్దతుదారులు ఈ సభలో మాట్లాడారు. ఆ వివరాలివీ..

ఠాగూర్, ఇంద్రసేనారెడ్డి అనుకున్నాం..

ఒకపక్క ప్రభుత్వం లేదు. మరో పక్క ప్రతిపక్షం లేదు. మార్పు తెస్తుందనుకున్న పార్టీ కాంగ్రెస్‌లో కలిసిపోయింది. రాష్ట్రాన్ని రక్షించడానికి ఎవరో వస్తారని 1983లో ప్రజలు ఎదురు చూశారు. అప్పుడు కూడు, గుడ్డ, నీడ నినాదంతో ఎన్టీ రామారావు వచ్చారు. ఆ తరువాత ఆయన స్థాపించిన టీడీపీ మారిపోయింది. అధికారాన్ని దుర్వినియోగం చేసేవారు తయారయ్యారు. మళ్లీ రెండేళ్ల క్రితం ఓ మహనీయుడు వస్తే.. ఠాగూర్ వచ్చాడు.. అవినీతిని నిర్మూలిస్తాడు.. ఇంద్రసేనారెడ్డి వచ్చాడు.. మెట్టను సస్యశ్యామలం చేస్తాడు అనునుకున్నాం. ఎదురు చూశాం. కాని దారుణంగా మోసపోయాం. జగన్ ప్రతి అడుగునూ పరిశీలించాం. ఓదార్పు యాత్ర ద్వారా ఇంటింటికీవెళ్లి కష్టంలో ఉన్న వారిని ఆదుకున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. మెట్ట ప్రాం తంలో ఉన్న నీటి వనరులను సక్రమంగా వినియోగించుకోవాలన్న ఆశయంతో రాజకీయంలోకి వచ్చిన మెట్ట ప్రాంత రైతు బిడ్డను నేను. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే లక్షలాది మంది రైతులు బాగుపడతారు.

కానీ కొందరు వైఎస్‌కు ఎక్కడ పేరు వచ్చేస్తుందేమోనన్న దురుద్దేశ పూరిత ఆలోచనలతో పోలవరం పనులను జరగనివ్వడం లేదు. జలయజ్ఞం ద్వారా వైఎస్ చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసే విధంగా త్వరలో పోరాటం మొదలుపెడతాం. అది ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తుంది. పదవుల కోసం జగన్ పార్టీ పెట్టడం లేదనే విశ్వాసం నాకుం ది. పోరాటం ద్వారానే పార్టీలు ప్రజాభిమానం పొందగలవు. నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్‌తోనేఉండి పనిచేస్తాను.
- జ్యోతుల నెహ్రూ, పీఆర్‌పీ తూర్పుగోదావరి అధ్యక్షుడు

సోనియాకే తల బొప్పి కట్టింది..

ఢిల్లీలో సోనియా గాంధీ అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశమై వాళ్లను తీసెయ్, వీళ్లను తీసై అంటూ నిర్ణయం చేస్తుంది. ఇక్కడిముసలి నేతలు కమిటీలో కూర్చుని ఈ కుర్రాణ్ణి తట్టుకోలేకపోతున్నామని మేడంతో చెబితే ఆమె ముఖం పక్కకు తిప్పి నేనెవరికి చెప్పుకోనంటూ బొప్పి చూపిస్తున్నారు. పోలవరం వద్దని ఆనాడు చంద్రబాబు అన్నారు. దానికి సాక్ష్యం నాదగ్గర ఉంది. జగన్ గురించి ఆలోచిస్తూ గోక్కోవడం వల్ల ఆయన జుట్టు ఊడిపోతోంది. వరిచేను కోస్తారని, వేరుశనగ పీకుతారని కూడా తెలియని వ్యక్తి మన సీఎం.

- తోట గోపాలకృష్ణ , మాజీ ఎంపీ

నాయకుడు లేని అనాథలా రాష్ట్రం

ఈ రోజు నాయకుడు లేని అనాథలా రాష్ట్రం రోదిస్తోంది. రాజశేఖరరెడ్డి మరణం తరువాత రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేది జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే. కళ్లు కానక జగన్‌ను ఒంటరి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రకు రాష్ట్ర ప్రజలు సమాధానం ఇస్తున్నారు. ఓ సోదరుడి ప్రేమ కిందకు మేమంతా వచ్చాం. జగన్ నాయకత్వంలో రాష్ట్రాన్ని ముం దుకు తీసుకుపోతాం. చిరంజీవి నాయకత్వంపై నమ్మకం లేక, కాంగ్రెస్‌లో ఇమడలేక బయటకొచ్చి జగన్‌కు మద్దతు పలుకుతున్నాం.
- వాసిరెడ్డి పద్మ, పీఆర్‌పీ అధికార ప్రతినిధి

జగన్‌కు తోడుగా నిలుద్దాం

ఆ రోజున బీజేపీ నుంచి శాసన సభ్యుడిగా ఎన్నికైన నాకు వైఎస్‌ఆర్ పూర్తి సహకారం అందించి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడ్డారు. పార్టీతో సంబంధం లేకుండా ప్రజాసంక్షేమాన్ని కాంక్షించిన ఆ మహానేత తనయుడికి మనం తోడుగా ఉండాలి. గ్రామాల స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా శ్రమిద్దాం. జగన్ సీఎం అయ్యేంతవరకు పోరాడదాం.
- పెండెం దొరబాబు, మాజీ ఎమ్మెల్యే


చిరంజీవికి సిగ్గు లేదు...
కుల, మతాలకు అతీతంగా ఓట్లు వేసి గెలిపించిన జనాన్ని చిరంజీవి బంగాళాఖాతంలో కలిపేశారు. ఢిల్లీ, సోనియా, కిరణ్ చుట్టూ తిరుగుతూ సిగ్గులేకుండా నమ్ముకున్న వారిని చిరంజీవి విడిచిపెట్టారు. ఓట్లు వేసిన చేతులతోనే ఈ నాయకులను మహిళలు త్వరలో చీపుర్లతో తరిమి కొడతారు. వారు తలుపులేసుకుని ఇంటిలో కూర్చుని ఏడ్చే రోజు వస్తుంది.

- కొల్లి నిర్మలా కుమారి, ‘తూర్పు’ మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు