దళిత మహాప్రస్థానం

దళిత మహాప్రస్థానం
-చుక్కా రామయ్య

ఇప్పటివరకు గడిచిన చరిత్రంతా అగ్రకులాల కిందనే నలుగు తూ వచ్చింది. కులం గోడలు కూలగొడతూ కులస్వామ్యా న్ని కూలదోయడానికి నూతన శక్తులు ముందుకు వస్తున్నాయి. తెలంగాణ జిల్లాల్లో దొర గడీలను కూల్చిన చేతులతోనే కులం గోడలు కూల్చటానికి సన్నధమై సాగుతున్నారు. ఊరుబైట వాడ ల మూలుగుల్ని వినని చరిత్ర చరిత్రేనా? వెలివాడల్ని పట్టించుకోని సమాజం ఏదైనా అది అగ్రవర్ణ ఆధిపత్య కుల సమాజమే అవుతుంది. అగ్రకుల భావజలం పోవాలి. శరీరాన్ని నాలుగు ముక్కలు చేసిన మను వ్యవస్థ మసైపోవాలి.

దళితులు మరో ముందడుగు వేశారు. చరిత్ర రచనను ఆధిపత్యం ఆక్రమించుకుంటే ఎవరి చరిత్రను వారే లిఖించుకుంటా రు. ప్రజా ఉద్యమాలు లేకుండా ఇతరుల లిబరల్ ఔట్‌లుక్‌తో రాజ్యాంగంలో ఎన్నో అ«ధికరణలు వచ్చాయి.14వ అధికరణ అన గా చట్టం ముందు అందరూ సమానులే. 17 వ అధికరణ సకల వివక్షల పైన నిషేధం. 16వ అధికరణ ప్రభుత్వోద్యోగాల్లో సమానావకాశాలు. 17వ అధికరణ అంటరానితనంపై నిషేధం.

18వ అధికరణ భావప్రకటనా స్వేచ్ఛ. 21వ అధికరణ వ్యక్తిగత స్వేచ్ఛ. 23 వ అధికరణ బలవంతపు చాకిరీ రద్దు. 24వ అధికరణ 14 ఏళ్ళలోపు పిల్లలను ప్రమాదకరమైన పను ల్లో నియమించడంపై ఆంక్షలు. 39 వ అధికరణ స్త్రీ పురుషులకు సమాన వేతనం, ఆస్తిపై హక్కు. 49వ అధికరణ గౌరవ ప్రదమైన జీవితం. 45వ అధికరణ పిల్లలందరికీ ఉచిత విద్య. 46 వ అధికరణ ప్రత్యేక కమిషన్‌ను నియమించటం. 243 (డి) ద్వారా తరతరాలుగా అణచివేతకు గురైన వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి.

330, 332 అధికరణలు చట్ట సభలలో రిజర్వేషన్లు కల్పించటం. 345 అధికరణం ద్వారా ప్రభుత్వ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఇచ్చిన హామీలు 60 సంవత్సరాలు గడిచినా అమలుకు నోచుకోకపోవటం ఈ దేశంలో అతిపెద్ద విషాదం. రాజకీయమైన సంకల్పం ఉంటేనే సరిపోదు. దానికి కావల్సిన రాజకీయ కల్చర్ కూడా ఉండాలి. ప్రజాస్వామిక సంస్కృతి లేకుంటే ఏళ్ళ తరబడి ఉన్న ఆధిపత్య సంస్కృతే అధికారం చెలాయిస్తుంది. అదే జరిగింది. ఏళ్ల తరబడి ఎదురుచూసీ చూసీ కళ్లు కాయలు కాసినాయి.

తమ కోసం తామే ఉద్యమించక తప్పదని దళితులు ఉద్యమించారు. పాలకుల కళ్ళు తెరిపించారు. కానీ కుల వ్యవస్థ ఆధిపత్యం చాపకింద నీరులాగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం చుట్టూ ఉద్యమకంప మాదిరిగా సమాజం చుట్టూ కులం చుట్టబడింది. నడిచేందుకు సిమెంట్ రోడ్ కనిపిస్తుంది కానీ నడవలేని బాటగా అది మారుతుంది. ఆ విధంగా ఏళ్ళు గడిచాయి.

ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు చెందిన విద్యార్థులే చైతన్యంతో ప్రశ్నించడమే కాదు, ఉద్యమాలు నిర్మించుకున్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. అర్ధ పెట్టుబడిదారీ సమాజంలో ఉద్యమాలు నిర్మించటంలో పేద వర్గాలు ఎన్ని వ్యయప్రయాసలకు గురౌతున్నారో కళ్లారా చూస్తున్నారు. లాకప్‌లో చిత్రహింసలు, ఎన్‌కౌంటర్లకు గురయ్యారు. ఉపవాస దీక్షలు చేశారు. కానీ ప్రభుత్వ చక్రాలకు ఎదురు తిరిగి అడ్డుపడ్డ వారిని అణచటమే తెలుసు కానీ కదలటం మాత్రం ఈ మొద్దు పాలకులకు తెలియదు.

ప్రతి రాజకీయ పార్టీ దళిత గిరిజనులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఉపన్యాసాలు ఇస్తారు. వాగ్దానాలు చేస్తారు. కానీ తరతరాలుగా అనుభవిస్తున్న రాజకీయ తాత్త్విక సాంస్కృతిక ఆధిపత్యం వదులుకోవటానికి మాత్రం సిద్ధపడరు. ఈ రథ చక్రాలను కదిలించటానికై తామే పూనుకుని దళిత శక్తులు ముందుకొచ్చాయి. ఇది ఏ రాజకీయ పార్టీ తలపెట్టలేదు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యం లో రంగారెడ్డి జిల్లాలో బృహత్తర కార్యక్రమం తీసుకుంది. దేవాలయాల్లోకి దళితుల ప్రవేశం కోసం పెనుగులాట జరిగింది. బి.వి.రాఘవులు నేతృత్వంలో సైకిల్ యాత్ర చేయటం జరిగింది. ఆ జిల్లాలో రెండు గ్లాసుల పద్ధతిపై ఉద్యమించటం జరిగింది.

అదే కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో 30 మంది సైకిల్ యాత్ర చేయటం జరిగింది. మా సమస్యలపై మీరు ముందుకు రావాలని దళితులు అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఇందుకు నేనే నాయకత్వం వహిస్తానని తమ్మినేని వీరభద్రం ముందుకు వచ్చారు. 76 రోజులు ఖమ్మం జిల్లాలో సైకిల్‌యాత్ర నిర్వహించా రు.

దళితులకు అండగా నిలిచినా ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు ఈ సైకిల్ యాత్రను సమర్థించారు. ఆయనే ప్రారంభ జెండా వూపారు. జిల్లాలో మొత్తంగా 2291 కిలో మీట ర్లు, 30 మండలాలు, 8 పట్టణాలను సైకిల్ యాత్రలో చుట్టి వచ్చారు. 628 దళిత వాడల గుండా తమ్మినేని దళిత సైకిల్ యాత్ర కొనసాగింది. ఇది మార్పుకు సంకేతం. ఇది కొత్త సంకే తం.

అన్యాయాలు ఇక సాగవని, మా దళిత వాటా మాకిస్తారా? మా వాటాను మేం గుంజుకోమంటారా? అని పెత్తందారీ సమాజాన్ని తమ చైతన్యపు పలుగులతో పొడిచారు. ఇది మహా ఉద్యమమే. అగ్రకుల ఆధిపత్య సమాజం ఇకనైనా మెట్టుదిగి వచ్చి ఆ దళిత చైతన్యాన్ని కౌగిలించుకోవాలి. మాటలు, చేతలు కావాలంటే వేలాది చేతులు కలవాలి. అదే ఆరంభమైంది.

ఈ దళిత ప్రస్థానం కొనసాగాలి. ఆధిపత్య సంస్కృతి కూలిపోవాలి. దళితులు అమాయకులు అనుకుని వారికి కేటాయించిన నిధులను ఇతరత్రాలకు మళ్ళిస్తే వూరుకోమని రాజకీయ నాయకులకు, పాలకులకు ఈ సైకిల్ యాత్ర ఓ హెచ్చరిక చేసింది. దిక్కుమొక్కులేని దళిత జనం ఒక్కసారి గర్జిస్తే ఆధిపత్య కోటలు కూలిపోతాయని చెప్పారు.

దొర గడీలను కూలగొట్టాం. గడీల ముందు పోరుకేకలు పెట్టాం. ఆక్రమించుకున్న దొర గడీలు పగిలి అవి దళితులకు అందుతాయని అనుకున్నాం. ఊరి వెలుపల మూలుగులే మిగిలాయి. ఇప్పుడు దొర గడీలు ఆధునిక ఆధిపత్య కోటలుగా మారిపోయాయి.

దళితులకు కోటా ప్రకారం బియ్యమే మిగిల్చారు. దళితుల వాటా దళితులకు ఇచ్చేంతవరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరికగా ఆ దళిత సైకిల్ యాత్ర ముందుకు సాగింది. అదే మరో దళిత మహాప్రస్థానం. అందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు , అది నా నల్గొండ నియోజకవర్గం నుంచే బయలుదేరినందుకు గర్విస్తున్నాను. మనిషి జీవితాలు ఉద్యమాలతో పవిత్రమౌతాయి. మనమందరం పవిత్రులవుదాం రండి. ప్రజా ఉద్యమాలలో పాలు పంచుకుందాం. పదండి ముందుకు....

-చుక్కా రామయ్య
శాసన మండలి సభ్యులు

పేదల పట్ల ప్రభుత్వానికెందుకింత ఏహ్యభావం?

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ రైతుల కోసం ఎంతో చేస్తున్నట్లు గొప్పగా చెబుతున్నారు. కొందరయితే, 2011-12 బడ్జెట్‌ను సామాన్యుడి బడ్జెట్‌ (ఆమ్‌ ఆద్మీ)గా పేర్కొన్నారు. అయితే సవివరమైన విశ్లేషణను చూస్తే ఈ బడ్జెట్‌, పరిశ్రమలో, మౌలికవసతుల కల్పనలో, పెట్టు బడుల మార్కెట్లో, సేవల రంగంలో, గృహ నిర్మా ణంలో పెట్టుబడుల అవకాశాలను పెంచే ఉద్దే శంతో రూపొందించినట్లు అర్థమౌతుంది. వ్యవ సాయంపై కొద్దిపాటి సానుకూల ప్రభావం చూపించే అవకాశం వుంది. బడ్జెట్‌లో కేంద్రీకర ణపై అసమతౌల్యం కారణంగా ధరల పెరుగు దలకు ద్రవ్యోల్బణ ధోరణులకు దారితీసి గ్రామీణ పేదలను ఇబ్బందులలోకి నెట్టేయడం జరుగుతుంది.
వ్యవసాయానికి ఎప్పుడూ జరిగేలాగున ఒక విధాయకంగా కేటాయింపులు జరిగాయి. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనకు రు 7,860 కోట్లు, తూర్పుప్రాంతంలో హరిత విప్లవానికి రు 400 కోట్లు, పప్పులు, ఆయిల్‌ పాం, పట్టణ శివారు ప్రాంతాల్లో కూరగాయల పెంపకం, ముతక ధాన్యాలు, పశుదాణా ప్రోటీన్‌ అనుబంధ ఆహారం కోసం నూతన జాతీయ మిషన్‌కు ఒక్కొక్కదానికి రు 300 కోట్లు చొప్పున ఈ కేటాయింపు లున్నాయి. దేశంలోని 6,00,000 రెవెన్యూ గ్రామాలలోని 75 కోట్ల మంది రైతుల ప్రయోజ నాలు నెరవేర్చేందుకు ఈ కేటాయింపులు నామ మాత్రం.
తక్కువ వడ్డీ రేటుపై రైతులను ఆర్థికంగా కలుపుకొని పోవడంపై పెద్ద పెద్ద హామీలైతే యివ్వ డం జరిగింది. పంట రుణాల వడ్డీపై ప్రభుత్వం అందజేసే 3శాతం ప్రభుత్వ ఆర్థిక సహాయం, రైతులకు చాలావరకు ప్రయోజనకారి అని ఆర్థిక మంత్రి అంటున్నారు. అయితే ఆయనో విషయం తెలుసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలకు గురైన సుమారు 5 కోట్ల మంది చెరకు పండించే రైతు లకు ఈ స్కీం వల్ల ఎటువంటి ప్రయోజనం లభించటం లేదు. చెరకు అన్నది 11 నుండి 18 మాసాల పంట. ఫ్యాక్టరీలు రైతులకు డబ్బును ఆలస్యంగా చెల్లిస్తూ ఉంటాయి. అందువల్ల రైతులు వడ్డీపై ప్రభుత్వం సహాయక పథకం వల్ల ప్రయో జనం పొందేందుకు, ఒక సంవత్సరంలోగా రుణాలు తిరిగి చెల్లించే పరిస్థితి ఉండదు. అందు వల్ల పంట రుణాలను తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం కనీసం రెండేళ్ళ వ్యవధినివ్వాలి.
అవకాశాలకు దూరంగా ఉన్నవారికి, అల్పా దాయ గ్రూపులకు భరించగలిగే ఖర్చుపై ఆర్థిక (బ్యాంకింగ్‌) సేవలు అందించే కార్యక్రమాన్ని (సమ్మిళిత ఆర్థిక వృద్ధి) రైతులకు వర్తింపజేసే టప్పుడు జాగ్రత్తగా రూపొందించాలి. ఆ విధంగా రుణగ్రస్తులైన రైతులు తాము పెట్టిన పెట్టుబడు లకు గిట్టుబాటైన రాబడులను పొందుతూ రుణాలను తేలికగా తిరిగి చెల్లించే స్థితిలో ఉండ గలరు. అయితే ఈ దేశంలో పరిస్థితి దీనికి భిన్నంగా వుంది. ఇక్కడ రుణగ్రస్తుడైన రైతు రుణ భారం పెరిగిపోయి తనకు, తన కుటుంబానికి జీవనోపాధిని నిలబెట్టుకునేందుకు సరిపడు రాబడులను సమకూర్చుకోలేకపోతున్నాడు. ఇది అతనిని నిరంతరం అప్పుల ఊబిలోకి నెట్టేసేలా చేసి, అంతిమంగా ఆత్మహత్యకు పురిగొల్పుతోంది. అందువల్ల ప్రభుత్వం ముందున్న ప్రధాన సమస్య-తనను తన కుటుంబాన్ని నిర్వహించు కొనేలా సరిపడు రాబడులను రైతుకు లభించేలా చూడడం. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) లో ప్రభుత్వం చేసే మెరుగుదలలు సేద్యం చేయడంలో పెరిగిపోతున్న ఉత్పాదకాల ఖర్చులు తట్టుకునేం దుకు, సానుకూలమైన రాబడి పొందేందుకు ఏమాత్రం సరిపడా ఉండడం లేదు.
అయితే ఆర్థికమంత్రికి ఒక మంచి ఆలోచన వచ్చింది. అధికాధికంగా రసాయన సేద్యం వల్ల భూసారపరిస్థితి నానాటికీ క్షీణించిపోతోందని ఆయన అంగీకరించారు. అందువల్ల సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత వుంది. దిగజారిపోతున్న భూసారం, ఉత్పాదకత, ఉత్పత్తి పెంపుదలకు అవరోధంగా వుంది. అంతే గాక, వ్యవసాయంలో సాంప్రదాయక సేంద్రీయ వ్యవసాయ భూసారాన్ని పునరుద్దరించడమేగాక, అదేసాపేక్షకంగా రసాయన సేద్యం కంటే చౌక.
సేంద్రీయ ఉత్పత్తులకు 3వేల కోట్ల డాలర్ల ప్రపంచ మార్కెట్‌ పరిమాణం వుంది. దీని ధ్రువీ కరణ వ్యయం హెచ్చుగా ఉండడంతో మనరైతులు ఆ ప్రయోజనం పొందలేకపోతున్నారు. విడివిడిగా రైతులకు సేంద్రీయ ధ్రువీకరణ ఖర్చును ప్రభుత్వం సబ్సిడీగా చెల్లిస్తూ, అతని సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే అది వివేకవంతమైన చర్య అవుతుంది. రైతులకు ఎరువుల సబ్సిడీని నేరుగా అందజేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గ చర్య. అయితే ఎరువుల సబ్సిడీని దారిద్య్రరేఖకు దిగువన జీవించే రైతులకు మాత్రమే అందజేయా లని ప్రభుత్వం యోచిస్తోంది. ఎరువుల సబ్సిడీని రైతులందరికీ అందజేయాలి. సబ్సిడీ పరిమాణం భూకమతాన్ని అనుసరించి నిర్ణయించాలి. ఈ మొత్తాన్ని వ్యవసాయదారుని బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. రైతులందరికీ సబ్సిడీ అవసరం వుంది. అందువల్ల భూకమతాల పరిమితిపై దేశమంతటా ఎటువంటి తేడాలు లేకుండా ఎలా అమలు పరచబడిందో సబ్సిడీ కూడా అలాగే అందజేయాలి. సబ్సిడీని ఎలా వినియోగించా లన్నది రైతు స్వేచ్ఛకే వదిలివేయాలి. అది రసా యన సేద్యం కావచ్చు. సేంద్రియ వ్యవసాయం కావచ్చు. ప్రభుత్వం గనుక సేంద్రీయ వ్యవ సాయాన్ని ప్రోత్సహించాలని భావిస్తే సేంద్రీయ ధ్రువీకరణకు సంబంధించిన హెచ్చు ఖర్చును కూడా కలుపుకుంటూ అదనపు సబ్సిడీని అంద జేయాల్సి ఉంటుంది.
ఇంధనం, ఎరువులు, ఆహారం పై ప్రధాన సబ్సిడీలు 2010-11లో ఖర్చు చేసిన దానికంటే (సవరించిన అంచనా) 2011-12 బడ్జెట్‌లో భారీ స్థాయిలో రు 20,000 కోట్ల కోత విధించబడింది. ఆహార సబ్సిడీలో విధించిన రు 27 కోట్ల కోతతో ఆహారభద్రత, రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వాని కున్న చిత్తశుద్ధి అర్థమౌతుంది. ప్రభుత్వం డీజిల్‌ సబ్సిడీని రైతులకు నేరుగా అందజేయాల్సి ఉం టుంది. ఎరువుల సబ్సిడీలో తగ్గింపు ప్రభుత్వ రైతు వ్యతిరేక స్వభావాన్ని వెల్లడిస్తోంది.
మెగాఫుడ్‌ పార్క్స్‌ ఏర్పాటు చేసే బదులు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగయువకులు చిన్న చిన్న వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి, విలువ జోడింపు యూనిట్లను నెలకొల్పుకునేందుకు ప్రభుత్వం సహాయం అందించాలి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు తోడ్పడుతుంది. గ్రామీణ నిరుద్యోగాన్ని పరిష్కరిస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలసలను నిరోధిస్తుంది. ఈ బడ్జెట్‌ అటవీ వ్యవసాయ దారులు, కొండ ప్రాంత వ్యవసాయదారుల పట్ల ఏమాత్రం దృష్టి పెట్టలేదు. సాగునీటి సమస్యకు అవసరమైన శ్రద్ధ ఈ బడ్జెట్‌లో కనబడలేదు.
వదులుకున్న రెవెన్యూకు సంబంధించిన స్టేట్‌మెంట్‌ ప్రకారం 2010-11లో మొత్తం పన్ను రాయితీలు రు 5,00,000 కోట్లకు పైగా వున్నాయి. కార్పొరేట్‌ పన్ను మినహాయింపులు రు 88,000 కోట్లకు పైగా వున్నాయి. ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు ఇలా భారీ ప్రయోజనాలు అందజేస్తున్న పరిస్థితుల్లో రైతుల పట్ల ఎందుకు పిసినారిలా వ్యవహరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సంరక్షణ, విద్య, భరించగలిగే రేట్లపై సరిపడు సౌకర్యాలను అందజేయడంలో ప్రభుత్వ వైఫల్యం పేదల పట్ల ప్రభుత్వానికున్న ఏహ్యభావాన్ని వెల్లడిస్తోంది.

ఎస్‌సి, ఎస్‌టిల అభ్యున్నతికి చట్టం అవసరం

హైదరాబాద్‌ (వివి) : షెడ్యూల్డు కులాలు,షెడ్యూల్డు తెగల ఉప ప్రణాళిక (ఎస్‌సిఎస్‌పి) బిల్లును చట్టంగా రూపొందించి ఆ వర్గాలకు నాణ్యమైన ఉన్నతవిద్య అందించాలని, ఆర్థిక సాధికారతకై జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి, అవి దారి మళ్లకుండా పర్యవేక్షక కమిటీలను గ్రామస్థాయిలో పనిచేసేలా చూడాలని వక్తలు ముక్తకంఠంతో ఉద్ఘాటించారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ ఏర్పాటు చేసిన చర్చలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి, ఎస్‌సి, ఎస్‌టి, బిసిల సబ్‌ కమిటీ చైర్మన్‌, జస్టిస్‌ కె.రామస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించారు. దీనికై అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు కలిసి రావాలని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్‌సిఎస్‌పి కేటాయించిన నిధులలో రూ.21వేల కోట్లు ఇతర శాఖలకు దారి మళ్లాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఎస్‌సి సబ్‌ప్లాన్‌ పేర తాను ముసాయిదా బిల్లును రూపొందించి యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీకి అందించానని, ఆమె సూచించినా కేంద్రప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోలేదని జస్టిస్‌ రామస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌సిఎస్‌పికి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని, జాతీయ అభివృద్ధి మండలి ఈ వర్గాల అభ్యున్నతినే సూచించినట్లు తెలిపారు. ఈ నిధులను గ్రామస్థాయిలో సద్వినియోగంకై వేసే పర్యవేక్షక కమిటీలో ఎన్‌జిఒలు, స్థానిక నాయకులు అర్హత గల ఇతరులను సభ్యులుగా చేయాలని కోరారు. నిధులు దారిమళ్లినా, సద్వినియోగం కాకపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించి సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఫలితంగా సంబంధిత అధికారులు జవాబుదారీతనంతో పనిచేస్తారని పేర్కొన్నారు. లేకుంటే ప్రభుత్వం బాధ్యత వహించి వారిపై కఠినశిక్ష తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీస్‌ పేర అధికారులపై చర్యలు తీసుకునే వీలుంది తప్ప మంత్రులపై చర్యలు తీసుకోలేమని ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంనర్సింహారావు మాట్లాడుతూ, ముసాయిదా బిల్లుకు చట్టబద్ధత కల్పించి నిమ్నవర్గాల అభ్యున్నతికి, ఆర్థిక సాధికారతకు కృషి చేయాలని సూచించారు. రాజ్యాంగపు 21, 46 అధికరణల ప్రకారం ఎస్‌సి, ఎస్‌టిలకు నాణ్యమైన విద్య అందించాలని పేర్కొన్నారని చెప్పారు. సామాజిక న్యాయం జరగాలని చెబుతూ, జస్టిస్‌ రామస్వామి రూపొందించిన ముసాయిదా బిల్లుకు పూర్తి మద్దతు పలికారు. ఎస్‌సిఎస్‌పి నిధుల సద్వినియోగం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కలిసి పనిచేయాల్సి ఉందని సూచించారు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై.వి.రావు మాట్లాడుతూ, ఉప ప్రణాళిక బిల్లును చట్టం చేయాలని, నోడల్‌ వ్యవస్థ ద్వారా దానిని అమలు చేయాలని కోరారు. దళిత వర్గాల అభివృద్ధికి తగిన చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదన్నారు. ఇదే విషయమై తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు నిరాహారదీక్ష చేశారని గుర్తు చేశారు. దీనికై చేసిన 50 డిమాండ్లలో తొలి డిమాండ్‌ ఎస్‌సిల అభివృద్ధి, ఆర్థిక సాధికారత, సమాజంలో అభివృద్ధే అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ మాట్లాడుతూ, బిల్లుకు రాష్ట్రస్థాయిలో చట్టబద్ధత కల్పిస్తే సరిపోదని కేంద్రస్థాయిలో చట్టబద్ధత అవసరమన్నారు. అన్ని పార్టీల నాయకులు అసెంబ్లీ, పార్లమెంట్‌లో దీనిపై గట్టిగా స్వరాన్ని వినిపించాలని, కొందరు అధికారుల నిర్లక్ష్యంవల్ల నిధుల మళ్లింపు జరుగుతోందన్నారు. బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, దీనిపై ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సామాజిక దోపిడీ, అసమానతలు పోవాలంటే బిల్లుకు చట్టబద్ధత అవసరమన్నారు. ఎస్‌సిల జనాభా 15 నుంచి 18 శాతం, ఎస్‌టిల జనాభా 7 నుంచి 9 శాతానికి పెరిగిందని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్లు ఉండాలన్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి కో-కన్వీనర్‌ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ, బిల్లుకు చట్టబద్ధత కల్పించడం ద్వారా నిధుల మళ్లింపు ఆపవచ్చన్నారు. ఎస్‌సి, ఎస్‌టిల అభ్యున్నతికి కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. సిడిఎస్‌ చైర్మన్‌ డా.సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం మాని సమాజంలో దళితుల అభివృద్ధి, సాధికారతకు తోడ్పడాలని సూచించారు. సిడిఎస్‌కు చెందిన ఆంజనేయులు తదితరులు మాట్లాడారు

వివిధ ప్రభుత్వ ఉగ్యోగాలలో షెడ్యుల్డ్ కులాలకు అన్యాయము

వివిధ ప్రభుత్వ ఉగ్యోగాలలో షెడ్యుల్డ్ కులాలకు అన్యాయము!!ప్రభుత్వ రంగాలలో పోటి పరిక్షలలో షెడ్యుల్డ్ కులాల విద్యార్దులు ఉన్నతమైన మార్కులు సాదించి మొదటి స్థానములో అర్హత పొందిన జెనరల్ కేటగిరిలో కాకుండా షెడ్యుల్డ్ కులాలకు కేటయించిన స్థానాలలోనే ఉద్యోగాలు ఇస్తున్నారు.ఇదేమిటని ఏయరైన ప్రశ్నయిస్తే ఉద్యోగమూ  కావాలా వద్ద ఎదురు ప్రశ్నలు బెదిరింపులకు పలు పడుతున్నారు.మరి కొంత మంది షెడ్యుల్డ్ కులాల విద్యార్దులు ఉద్యోగమూ వస్తే చాలు ఎ కేటగిరిలో వస్తేమిటి అనే ఆలోచనలో కూడా ఉన్నారు.షెడ్యుల్డ్ కులాల కోసం కొన్ని వందల సంఘాలు నేడు భారత దేశం,ఆంధ్ర ప్రదేశ్ నుండి ఉన్న యి సంఘాలకు ఇట్టి  విషయాలు ఏమి పట్టవు,కేవలం వారి స్వార్ధలకు ఉపయోగించుకొని షెడ్యుల్డ్ కులాల పై కొంత పట్టు సాదించి కద్దర్ బట్టలు యేసి తిరుగు తున్నారు తప్ప నేడు విద్యార్దులకు జరుగుతున్న  అన్యాయము గురించి ప్రభుత్వాలపై వొత్తిడి తెచ్చి న్యాయము చెయ్యాల్సిన పని ఏ యొక్క షెడ్యుల్డ్ కులాల సంఘాల నాయకులూ చేయడము లేదు.ఉదాహరణ డిఎస్సి  నియమాలలో షెడ్యుల్డ్ కులాల విద్యార్దులు 90 శాతము మార్కులు సాదించిన  అభ్యర్దులను కూడా షెడ్యుల్డ్ కేటగిరి లోనే అవకాశాలు ఇచ్చారు తప్ప జెనరల్ కేటగిరిలో ఇవ్వటము లేదు.ఇదే  కాకుండా ప్రమోషన్ల విషములో కూడా షెడ్యుల్డ్ కులాల ఉద్య్గులను అనగా తొక్కుతున్నారు.కొన్ని కొన్ని సందర్బాలలో ప్రమాషన్లు జారిచేసే వీదులలో షెడ్యుల్డ్ కులాల ఉద్యోగులు ఉండి కూడా వారి కులము వారికీ జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహాయము చేయలేక పోతున్నారు.అంతే కాకుండా ప్రతి షెడ్యుల్డ్ కులాల ఉద్యోగులు తమ కులం వారికీ యిరితో ఏమైనా ఉద్యోగరిత్య అవసరాలు ఉండి వస్తే చులకన భావముతో చూస్తున్నారు యి రకంగా కుడా షెడ్యుల్డ్ కులాలు ఎనుకకు నెట్టి వెయ భాడుతున్నవి,మరో పక్క కొంత మంది  పై స్థానములో ఉద్యోగాలు చేస్తూ షెడ్యుల్డ్  కులాల నిరుద్యోగులను అసరచేసుకొని ఉద్యోగాలు ఇప్పస్తామని మోసాలకు పలు పడుతున్నారు.మరి కొంత మంది ఉద్యోగులు ఉన్నతమైన పదవులలో ఉండి కూడా కానిసం జాతి చేసే ఉద్యమాలలో చేయూతను కూడా ఇవ్వటము లేదు.కొంత మంది ఉద్యోగులు సభ వేదికలలో విబిన్నమైన నీతులు గొప్ప ప్రసంగాలు చేస్తారు.వారిని స్వయంగా కలిసి జాతి కోసం మీ వొంతు చెవా చెయ్యాలన్నప్పుడు కనీసం మాట కూడా మాట్లాడారు.ఇదేమిటి అని అడిగితె మరొక సరి అపైంట్  మెంటు కూడా ఇవ్వరు.మరి కొంత మంది ఉద్యోగులు తన హోదాకు మించి విలాసాలకు పోయి ఖరీదైన  భావనలు కార్లు కొని తలకు మించిన అప్పులు చేసుకొని జాతి మనుగడను కుటుంబ గౌరవాలను మర్చి పోతున్నారు.మరి కొంత మంది వారి పిల్లల వివాహ విషములో తన కంటే 10  అంతాలు డబ్బు ఉన్నవారితో సంబందాలు కలుపు కొని మాకంటే గొప్పవారు లేరని విర్ర  విగుతున్నారు.ఇంకా కొంత మంది పిల్లికి బిచ్చము చేసే వారు కూడా లేరు.వీరిలో కొంత మంది వారి తల్లి తండ్రులను కూడా చూసుకోలేక పోతున్నారు.ఇటువంటి వారు ఉండటము వల్లే నేడు షెడ్యుల్డ్ జాతి యి  స్థానములో ఉన్నది.ఇట్టి విషయాన్నీ షెడ్యుల్డ్ కుల సంఘాల నాయాకులు,ప్రజా ప్రతినిధులు,రాజకీయ నాయాకులు ,మేధావులు అందరు అలోచించి ఇకనైనా ప్రభుత్వముపై వొత్తిడి తెచ్చి విజయము సాదిస్తారని బావిస్తూ ............................... మీ యొక్క మిత్రుడు బి జే ఆర్ మాదిగ  సెల్ నంబర్ 9494443337

రాబోవు 2014 ఎన్నికలలో భారత ప్రధాన మంత్రి మీరా కుమార్



 







మంచి నాయకత్వం కోసం భారత దేశం ఎదురు చూపు ప్రస్తుతం అధికారములో ఉన్న కాంగ్రెస్ పార్టి మల్ల గుల్లలు పడుతున్నది.ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టికి బారిఎత్తున తెలంగాణా సెగ తగులు తున్నది,ఉత్తర ప్రదేశ్ లో బలమైన పార్టీగా B S P అధికారములో ఉన్నది.బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వం నిగఎసి కూర్చున్నది.పచ్చిమ బెంగాల్లో త్రునముల్ కాంగ్రెస్ పార్టి కరకు రాణి కొయ్యగా మమత బెనర్జీ పాగా వేసి ఉన్నది.తమిళ నాడులో ప్రపంచములోనే అతి పెద్ద కుంభ కోణం జరిపిన కరుణా నిదిని 2 జి స్పెక్టం గురించి కనీసం నిలదియలేక పోయింది కాంగ్రెస్ పార్టి మరో పక్క దేశ రాజదాని నడి బొడ్డులో క్రీడ విబగాములో బారి కుంబ కోణాలు వోనికిస్తున్నవి.మహా రాష్ట్రములో సాక్షాత్తు అ రాష్ట ముఖ్య మంత్రి ఆదర్శ లో అవినితులకు పాలుపడి ముఖ్య మంత్రి పదవి నుండి దూరమయ్యారు.ఆంధ్ర కర్ణాటక సరి హద్దులో బారి మైనింగ్ మాపియ జరిగిన బిజెపిని మాటల వరకే విమర్శించిది తప్పా చేతల్లో చేయలేక పోయింది.ఇన్ని కుంబ కోణాలు మరోపక్క  చిన్న రాష్టాల ఉద్యమాలు అవినీతిపై మాజీ ప్రభుత్వ అధికారులు పోరాటాలు కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నవి,ఇప్పుడు 5 రాష్టాల ఎన్నికలు మరో పక్క కలవార పెడుతున్నవి.2014 లో వొచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే కసరత్తు మొదలైనది.రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయాలన్న సోనియా గాంధీ కోరిక నేర వేరే రీతిలో లేదు.ప్రస్తుతం బిజెపి పార్టి వంశ వారసత్వ రాజకీయాన్ని వ్యతిరెకిస్తున్నది.మరో పక్క ఆంధ్ర ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులూ కాకా వెంకట స్వామి గత కొద్ది రోజుల క్రితము నేరుగా సోనియా గాంధీని విదేసురల్లని పిలుపును ఇచ్చాడు.కేంద్రములో బిజెపి పార్టి దళితులకు దగ్గరవుటకు ఆనాడు ఎన్నికలలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ను ఓడించినది కంగ్రేసాని మాటికి మాటికి దళితులకు తెలియ జేస్తున్నది.ఇటువంటి తరుణములో రాహుల్ ప్రధాన మంత్రి కావటం అనేది అంత తెలికైనా విషయము  కాదు రాహుల్ గాంధీని 2019 ది ఎన్నికలలో నిలబెడితే మంచిదని కాంగ్రెస్ పార్టిలోని కొందరి సీనియర్ నాయకుల అబిప్రాయం,ఇటు మాయావతిని అటు బిజెపిని మిత్ర పక్షాలను మెప్పించి గలిగే నాయకుని కోసం ఎతుకుతున్నది.ఇట్టి సమస్యలను అడిమిన్చాలంటే అన్ని లక్షణాలు ఉన్న నాయకత్వం తప్పని సరి అవసరం కాంగ్రెస్ కు  మరో పక్క మహిళా బిల్లు ఎదురు చూస్తున్నది.నేడు ఉన్న రాజకీయ నాయకులలో అందరిని మెప్పించే ప్రధాన మంత్రికి అర్హత గల ఏకైక నాయకు రాలు  ఉన్నత విద్య రాజకీయ అనుబవం మంచి ఓర్పు సహనం అన్ని బాషలలో మాట్లేడే చక చక్యం.మరో పక్క మహిళాగ  ఉండటము అంతే గాక దళితురాలై ఉండటము ఒక్క మీరా కుమార్ కే కలిసి వొచ్చే అవకాసము మెరుగ్గా ఉన్నది.మీరా కుమార్ ను  కాంగ్రెస్ పార్టి ప్రధాన మంత్రిగా ప్రకటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నవి.మీరా కుమార్ నేడు లోక్ సభలో అందరి మన్ననలు పొందినది.అంతేగాక బాబు జగ్జీవన్ రామ్ కూతురు కావటము మరో పక్క దేశములో మీరా కుమార్ ప్రధాన మంత్రి అభ్యర్దిగా వుంటే కాంగ్రెస్ కే ఎక్కువగా కలిసొచ్చే అవకాసము ఉన్నది.2014 లో దళితుల కల నేరా వేరనున్నది.మహిళలకు కూడా ఇక్కడి నుండే మహిళా బిల్లు ఆమోదము పొందినట్టుగా బావించ వొచ్చు ,ఏది ఏమైనా ఒక దళిత జాతి మహిళా మీరా కుమార్ ను  నేడు భారత దేశములో ఎవ్వరు కదాన లేరు. మద్దతు ఇవ్వటానికి చాల పార్టిలు ముందుకు రాగలవు అనే వాదన కూడా ఉన్నది. కాంగ్రెస్ కు యి ఒక్క మార్గము మాత్రమే అధికారాన్ని అంది ఇవ్వగలదని మేధావుల ఆలోచనా ........................బి జయరాము దళిత జాతి విస్లేచాకులు హైదరాబాద్ సెల్ నంబర్ 949444337  

రాబోవు 2014 ఎన్నికలలో భారత ప్రధాన మంత్రి మీరా కుమార్


భారత దేశానికి ఉన్నతమైనా లక్షణాలు గల రాజకీయ నాయకత్వం ఎంతైనా అవసరము వున్నది నేడు భారత దేశము కుమ్బకోనల  మద్య కొట్టు మిట్టాడు తున్నది ఇట్టి తరుణములో నేడు UPA ప్రభుత్వం  కొన్ని రాష్ట్రాల పొత్తు సందర్బంగా దేనిని వదులు కోలేక మంచి  ఆర్ధిక ఎత్తైన మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి హోదాలో వుండి కూడా ఎన్నో అవినీతి కుంభ కోణాలు జరుగు తున్న పట్టి పట్టనటు వుంటున్నారు దిని అంతటికంటి కారణమూ ప్రధాన మంత్రి పూర్తి అధికారాలు నేడు మన్మోహన్ సింగ్ గారికి లేవన్నవి అక్షర సత్యము నేడు కాంగ్రెస్ కేవలం రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేయాలనీ ఉన్నదే తప్ప నీతి నిజాయతి రాజకీయ అనుబవము ఉన్న నాయకులను గుర్తుంచి ప్రధాన మంత్రిగా నియమించితే తప్ప భారత దేశము బాగు  పడే దశలో లేదు నీతి నిబద్దత మరియు హిందీ ఇంగ్లీష్ మరి కొన్ని బాషలు,ఉన్నత విద్య కలిగిన దళిత జాతి ముద్దు బిడ్డ బాబు జగ్జీవన్ రామ్ వారాసురాల్లు ప్రస్తుత లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ప్రధాన మంత్రి హోదాకు సరైనా నాయకు రాలుగా నేడు భారత దేశం మొత్తము దళిత జాతి మొత్తము మిలియన్ కండ్లతో నేడు ఎదురు చూస్తున్నది,అక్షర సత్యము...........రాబోవు 2014 ఎన్నికలలో భారత ప్రధాన మంత్రి మీరా కుమార్

బహుజన సామాజిక దృక్పథం

సాహిత్యం కులాన్ని పట్టించుకుని వెలువడిన విధానాన్ని బహుజన సాహిత్య దృక్పథం తెలుపుతుంది తప్ప, కులాన్ని ప్రోత్సహించదు. కులాన్ని ఆధారంగా చేసుకుని వ్యక్తిగత ప్రతిభను, సమాజాన్ని విచ్ఛిన్నం చేసిన విధ్వంసాన్ని విశ్లేషిస్తూ, కుల నిర్మూలనకు ప్రయత్నిస్తుంది. అందుకనే సాహిత్య సృజన కూడా ఒక బాధ్యతాయుత, సామాజిక ప్రయోజక సాధనంగా ఉపయోగపడాలని భావిస్తుంటుంది. కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసమన్న రీతిలో అవగాహన చేసుకోమంటుంది. అందుకే బహుజన సాహిత్యం అవధాన, చిత్ర కవిత్వ పాండిత్య ప్రదర్శనలకు అంతగా ప్రాధాన్యాన్నివ్వదు.

సాహిత్యం విశ్వజనీనమైంది. తీసుకున్న వస్తువు ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక ప్రాం తానికో, ఒక మతానికో, ఒక జెండర్‌కో చెందినట్లు పైకి కనిపిం చినా, దానిలో చెప్పే సత్యం మాత్రం విశ్వజనీనం కావాలి. అలా కానపు డు అది అందరి సాహిత్యంగా కాకుండా, కొందరి సాహిత్యంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఏ సమాజంలో జీవిస్తున్న రచయితైనా తన దృక్పథాన్ని బట్టి రచన కొనసాగిస్తాడు. తీసుకొనే వస్తువేదైనా, దాన్ని ఏ లక్ష్యం వైపు తీసు కెళ్తున్నాడో ఆ మార్గమే ఆ రచనా తత్త్వాన్ని, ఆ రచయిత దృక్ప థాన్నీ తెలుపుతుంది. అయినా, సర్వమానవాళికి చెందిన ఒక సామూహిక అనుభవమేదో ప్రతిఫలించగలిగినపడే అది సాిహ త్యమై పరిమళిస్తుంది.

ప్రపంచ సాహిత్యమంతా ప్రధానంగా రెండు మార్గాల్లో నడు స్తుంది. ఒకటి, సమాజాన్ని కొన్ని ఆధిపత్య వర్గాలకు అనుకూ లంగా మార్చుకోవడానికి సాహిత్యాన్ని ఒక సాధనంగా వాడు కునే దృక్పథం. దీన్ని భావ వాద దృక్పథం అని అంటారు. సమా జంలో అపరిష్కృతంగా కనిపించే అనేక క్లిష్ట సమస్యలకు పరి ష్కారాల్ని సూచిస్తున్నట్లుంటుంది. దైవాన్ని నమ్ముకోవడం వల్ల, యజ్ఞయాగాదులు, పూజలు చేయడం వల్ల ఆ సమస్యలన్న్లీ తీరి పోతాయని ఈ సాహిత్యం బోధిస్తుంది. తెలుగులో ప్రాచీన సాిహ త్యమంతా ఇంచు మించు ఈ భావవాద ధోరణిలోనే నడిచింది.

మానవుడే అన్నింటికీ కేంద్రమంటూ, అన్ని వర్గాలకూ ప్రాధా న్యాన్నిచ్చే దిశలో, సామాజిక వాస్తవిక దృష్టితో కొనసాగేది ఆధు నిక సాహిత్యం. కాలాన్నీ, సాహిత్య తత్త్వాన్నీ పరిశీలించడం వల్ల నిజమైన ఆధునిక సాహిత్యమేంటో తెలుస్తుంది. భావవాద ఛా యలున్న సాహిత్యం కొంత వెలువడుతున్నా, దానికి మూడు రె ట్లు అధికంగా భౌతికవాద దృక్పథంతోనే ఆధునిక సాహిత్యం వ స్తోంది. సామాజిక వాస్తవిక వాదులు భావవాద దృక్పథంతో వె లువడే సాహిత్యాన్ని తిరోగమన సాహిత్యమనీ, భౌతికవాద దృక్ప థంతో వెలువడే సాహిత్యాన్ని పురోగమన సాహిత్యమనీ వ్యాఖ్యా నిస్తారు.

భౌతికవాద దృక్పథంతో సాహిత్యాన్ని పరిశీలించే ధోరణి మార్క్సిజంలో కనిపిస్తుండడం వల్ల కేవలం దీన్నే ఒక ప్రధాన దృ క్పథంగా భావించడం జరుగుతోంది. దీనిలో వర్గం పునాదిగా ఉంటుంది. ఉపరితలాంశాలన్నీ, సాహిత్య, కళారూపాలతో సహా వర్గ సమస్య పరిష్కృతమైతే, మిగతా అన్ని సమస్యలూ పరిష్కా రమైపోతాయని భావిస్తుండడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. బహుజన దృక్పథంలో వర్గ సమస్యలున్నా, దేశీయ వాస్తవిక సామాజిక దృష్టివల్ల కులం ప్రాధాన్యాన్ని వహిస్తుంది. వర్గ వివ క్షనీ, కుల వివక్షనీ పక్క పక్కనే పెట్టి చూస్తే, కుల వివక్ష మానసిక క్షోభను కలిగిస్తూ, ఆత్మగౌరవ సమస్యని ముందుకి తెస్తుం ది. అందువల్ల కేవలం వర్గ సమస్యతో మాత్రమే సాహిత్యాన్ని చూస్తే, దాంట్లోనూ భౌతికదృష్టి ఉన్నా, సాహిత్యం సమాజ వాస్తవికతను ప్రదర్శించడంలో పాక్షికకోణమే ప్రదర్శితమౌతుంది. అందువల్ల వర్గ, కుల సమస్యల సమ్మేళనంతో సాిహత్యాన్ని విశ్లేషించేది సాహిత్యంలో బహుజన దృక్పథమవుతుంది.

కేవలం తెలుగుసాహిత్యం వరకే చూసినా, మన సాహిత్య చరి త్రకారులు అత్యధికులు నన్నయతోనే సాహిత్య యుగాన్ని ప్రా రంభించారు. అంతకుముందు సాహిత్యం ఉన్నా, గాసట బీసట గా ఉందనీ, లిఖిత సాహిత్యం కావ్యరూపంలో కనిపించ డమనే ది నన్నయతోనే మొదలైందని సిద్ధాంతీకరిస్తున్నారు. అందువల్ల నన్నయకు ముందున్న సాహిత్యాన్ని ప్రాజ్ఞన్నయ యుగం అం టున్నారు. నన్నయ సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అను సృజన (ట్రాన్స్‌క్రియేషన్‌ ) చేశాడు. పద్యంలో ఆంధ్ర మహా భార తాన్ని రమణీయంగా వర్ణించాడు.

పద్య రూపంలో ఒక కావ్యం వెలువడాలంటే, నాటి సాహి త్యవేత్తలు పద్యాన్ని అర్ధం చేసుకునే సామర్ధ్యానికి సంసిద్ధులై ఉండాలనే కదా. అంటే అప్పటికే సాహిత్యం చాలా ఉంది. అది పద్య, గద్య, గేయ, వచన రూపాల్లో ఉండే అవకాశం ఉందన్న మాట. దీన్ని శోధించడంతోనే తెలుగు సాహిత్యంలో బహుజన దృక్పథానికి ద్వారాలు తెరిచే అవకాశం ఉంది.సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థను బలంగా ఆచరించడానికి ఉపయోగపడే భావజాలాన్ని భావవాదం ప్రయత్నిస్తుంది. రాజు లు, పోషకుల ఆధారంగా సాహిత్య సృజన జరిగిందని నిరూ పించే దిశగా ఆరుద్ర తన సమగ్రాంధ్ర సాహిత్యాన్ని రాశారు. అభ్యుదయ యుగం వరకే రాసి, తర్వాత సాహిత్య చరిత్రను కొ నసాగించకపోవడానికి కుల అస్తిత్త్వ చైతన్యాన్ని గుర్తించక తప్ప ని పరిస్థితి రావడం ఒక బలమైన కారణం.

అందుకే 13వ సం పుటి రాసే నాటికే స్త్రీ, దళిత సాహిత్య ఉద్యమాలు వచ్చినా, వాటి ని చాలా జాగ్రత్తగా పక్కకు పెట్టేశాడు. ఇక్కడ నుండి మళ్ళీ సాహిత్య చరిత్రను రాయాల్సిన అవసరం ఉంది. అదెవరు రాసి నా దానిలో బహుజన దృక్పథం తప్పకుండా ప్రతిఫలించాలి.పన్నెండో శతాబ్దం నాటి శివకవులలో కూడా కులాన్ని యెడ బాయలేమని ప్రకటించిన వాళ్ళున్నారు. శివకవులు కొన్ని కింది వర్ణాలకీ స్థానం కల్పించినట్లనిపిస్తున్నా, వారినీ తమ మతానికి అనుకూలంగా మార్చుకోవడానికే ఆ భావాల్ని ఉపయోగించు కున్నారనేది బహుజనసాహిత్య దృక్పథం గుర్తిస్తుంది.

16వ శతాబ్దంలో మొల్ల రామాయణం, శ్రీకృష్ణదేవరాయలు �ఆముక్తమాల్యద� రాశారనే విషయాల్లోని వివాదాల్ని కుల దృష్టి తో పరిశీలించాల్సిన అవసరం ఉంది. వసుచరిత్రికారుడి పేరు గురించిన వివాదం, శూద్రుడు రాసిన కావ్యం కాకి ఎంగిలితో సమానమనీ, దాన్ని చదవకూడదనీ లక్షణాల్ని నిర్దేశించిన 17వ శతాబ్దం నాటి అప్పకవిని గురించి ఆలోచించాలి. బ్రౌన్‌ వెలికి తీసిన వేమననూ, వేమన పద్యాలుగా చలామణిలో ఉన్న ఆధ్యా త్మిక పద్యాల్నీ విశ్లేషించుకోవాలి. వీరబ్రహ్మేం ద్రస్వామి సాిహ త్యం కూడా ఆధ్యాత్మికమైనా, ఆ సాహిత్యంలో కనిపించే ప్రజా స్వామిక భావాల్ని మూల్యాంకన చేసే పద్ధతికీ, సంప్రదాయ సా ిహత్యాన్ని విశ్లేషించే దానికీ తేడా ఉంది. 17, 18 శతాబ్దాల నాటి తెలుగు సాహిత్యాన్ని క్షీణ ప్రబంధ యుగంగా సంభావించడం లోని ఆంతర్యాన్నీ గమనించాలి.

సాహిత్యం కులాన్ని పట్టించుకుని వెలువడిన విధానాన్ని బహుజన సాహిత్య దృక్పథం తెలుపుతుంది తప్ప, కులాన్ని ప్రో త్సహించదు. కులాన్ని ఆధారంగా చేసుకుని వ్యక్తిగత ప్రతిభను, సమాజాన్ని విచ్ఛిన్నం చేసిన విధ్వంసాన్ని విశ్లేషిస్తూ, కుల నిర్మూ లనకు ప్రయత్నిస్తుంది. అందుకనే సాహిత్య సృజన కూడా ఒక బాధ్యతాయుత, సామాజిక ప్రయోజక సాధనంగా ఉపయోగప డాలని భావిస్తుంటుంది. కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోస మన్న రీతిలో అవగాహన చేసుకోమంటుంది. అందుకే బహుజన సాహిత్యం అవధాన, చిత్ర కవిత్వ పాండిత్య ప్రదర్శనలకు అంత గా ప్రాధాన్యానివ్వదు.

తీసుకునే వస్తువుతో పాటు, ఆ వస్తువుకి ఎన్నుకునే రూపాన్ని కూడా జాగ్రత్తగా ఎన్నుకోవాలనేది బహుజన దృక్పథంలో గమ నించాల్సిన మరో ముఖ్యమైన అంశం. మన తెలుగు సాహిత్యం లో పద్యానికి ఒక విశిష్ట స్థానం ఉన్నా, ఆ పద్యం సంస్కృత సమా స భూయిష్టంగా ఉండటాన్నీ గమనించాలి. పద్య కవులు తమ పాండిత్య నిరూపణ కోసం రాస్తున్నారో, పండిత పామర జనరం జకంగా పద్యాన్ని నిర్మిస్తున్నారో పరిశీలించి, పద్యం ఎంతవరకూ ఆదరణీయమో తేల్చుకోవాలి.

గేయం, వచనం కలిగించినంత సత్వర చైతన్యం పద్యం కలి గించలేదు. కానీ, ఒక శాశ్వతమైన అనుభూతిని ఒకటి రెండు వాక్యాల్లో కూడా అందించగల శక్తి పద్యానికి ఉందని గుర్తిం చాలి. వచన సాహిత్యంలో కూడా చిన్న చిన్న వాక్యాలు, సంభాష ణలు, సన్నివేశ కల్పనలు ఉంటాయి. అవి పాఠకుల మనస్సుల్లో శాశ్వతంగా గుర్తుంటాయి. పద్యమా, వచనమా అనే దానికంటే, శక్తివంతమైన వాక్యం ముఖ్యం. అది వచనానికి కూడా ఉంది. రూపకాల్లో వివిధ వస్తువుల్ని తీసుకున్నా, సంభాషణలు, సన్నివేశ కల్పనలు శక్తివంతంగా వర్ణించి, ప్రదర్శించగలిగితే ఈ సాహిత్య రూపాలు కూడా ప్రజల్ని ఆలోచింప జేయగలుగుతా యి. సమాజ పురోభివృద్ధికి తోడ్పడాలనుకునే రచయితలు తీసు కునే వస్తువుతోపాటు, సాహిత్య రూపాల్ని కూడా జాగ్రత్తగా ఎ న్నుకోవాలి.

సాహిత్యంలో వస్తువు, రూపం, శిల్పం, ప్రక్రియల పట్ల ఉన్న కొంత అస్పష్టత వల్ల వీటిని సమర్థవంతంగా ఉపయోగించు కోలేని కొంతమంది రచయితలు కూడా కనిపిస్తున్నారు.ఇప్పటికే మార్క్సిస్టుశిబిరాల్లో సాహిత్యపాఠశాలలు కొనసా గిస్తూ, సాహిత్యాన్ని చారిత్రక, భౌతికవాద దృష్టితో చూడ్డం నేర్పా రు. దాన్నింకా కొనసాగిస్తూ, ప్రజాకళారూపాల్ని వాడుకోవడానికీ శిక్షణలిస్తున్నట్లు తెలుస్తోంది.ఇటువంటి శిక్షణనే దళిత సాహిత్యానికి కేంద్రస్థానంగా, మూలస్థానంగా పేరు గాంచిన హైదరాబాదు సెంట్రల్‌ యూని వర్సిటీలో సాహిత్య పాఠశాలలో తరగతుల్ని డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ అసోషియేషన్‌ ఆరంభించింది. దీనిలో ఎంపిక చేసిన కొంతమందికి రాజకీయ, ఆర్థిక, సాహిత్య, సాంస్కృతిక అంశా ల్ని బహుజనదృక్పథంతో అధ్యయనం చేయడమె లాగో శిక్షణ నిస్తుంది. ఇటు వంటి అవగాహనా తరగతుల్ని అన్ని చోట్లా కొన సాగించగలిగితే బహుజనదృక్పథం మరింత వేగవంతంగా ముందుకు రాగలుగుతుంది.

darlaసమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థను బలంగా ఆచరించడానికి ఉపయోగపడే భావజాలాన్ని భావవాదం ప్రయత్నిస్తుంది. రాజులు, పోషకుల ఆధారంగా సాహిత్య సృజన జరిగిందని నిరూపించే దిశగా ఆరుద్ర తన సమగ్రాంధ్ర సాహిత్యాన్ని రాశారు. అభ్యుదయ యుగంవరకే రాసి, తర్వాత సాహిత్య చరిత్రను కొనసాగించకపోవడానికి కుల అస్తిత్త్వ చైతన్యాన్ని గుర్తించక తప్పని పరిస్థితి రావడం ఒక బలమైన కారణం. అందుకే 13వ సంపుటి రాసే నాటికే స్త్రీ, దళిత సాహిత్య ఉద్యమాలు వచ్చినా, వాటి ని చాలా జాగ్రత్తగా పక్కకు పెట్టేశాడు. ఇక్కడ నుండి మళ్ళీ సాహిత్య చరిత్రను రాయాల్సిన అవసరం ఉంది. అదెవరు రాసినా దానిలో బహుజన దృక్పథం తప్పకుండా ప్రతిఫలించాలి.