రామన్నపేట (వి.వి): సమాజంలోని ఆడపిల్లలను అబ్బాయిలతో పాటు సమానంగా  పెంచాలని నకిరేకల్ ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం  రామన్నపేటలో ఐసిడిఎస్ కార్యాలయంలో బాలికల సంక్షరణ యోజన పథకం కింద మంజూరైన  బాలికలకు చెక్కులు అందజేసి అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న  బాలికల సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 18 సంవత్సరాల  వరకు బాలికలను ఉన్నతమైన చదువులు చదివించి బాల్య వివాహాలకు ధూరంగా ఉంచాలని  ఆయన తల్లిదండ్రులను కోరారు. గ్రామాల్లో బాల్య వివాహాలపై అవగాహన  పెంపొందించాలని, అందుకు ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులు, యువతి యువకులు,  విద్యా వంతులు బాల్య వివాహాల నిలుపుదలకు కృషి చేయాలని ఆయన కోరారు.  కార్యక్రమంలో ఎంపిపి నీలా దయాకర్, జెడ్పీటిసి నోముల పద్మామారయ్య. ఎంపిడిఓ  ఇందుమతి, ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిణి మోతి, స్థానిక ఎంపిటిసి సాల్వేరు  అశోక్, గర్దాసు పద్మ, ఐసిడిఎస్ సూఫర్‌వైజర్లు, యాదమ్మ, అంజమ్మ, పద్మావతి,  అంగన్‌వాడీ కార్యకర్తలు. బాలికలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.ఈ సభలో 85  మంది బాలికలకు 30వేల రూపాయల చొప్పున, నలుగురు బాలికలకు లక్ష రూపాయల చొప్పున  బాండ్లు అందజేయడం జరిగింది.
గ్రామ పంచాయితీ భవన నిర్మాణానికి చిరుమర్తి శంకుస్థాపన:
మండలంలోని సర్నేనిగూడెంలో నూతన గ్రామ పంచాయితీ భవన నిర్మాణానికి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద 10లక్షల రూపాయలు మంజూరు కాగా నిర్మాణ పనులకు శుక్రవారం నకిరేకల్ ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి నీలా దయాకర్, జెడ్పీటిసి నోముల పద్మామారయ్య, ఎంపిడిఓ ఇందుమతి, గ్రామ సర్పంచ్ రూపం లక్ష్మీమల్లయ్య, ఉప సర్పంచ్ అంజయ్య, గ్రామ కార్యదర్శి జ్యోతి, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.