బొంకరా మల్లన్న అంటే మా ఊరి మిరియాలు తాటికాయలంత అని అన్నారట వెనకటికెవడో. సువిశాల భారతదేశానికి హోంమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా అదే రీతిగా మాట్లాడడం దేశానికి పట్టిన దౌర్బాగ్యం.
దేశ అంతర్గత భద్రతకు ప్రధాన ముప్పు మావోయిస్టులని ఒకవైపు ప్రధాని చెబుతుంటే ఆయన మంత్రివర్గంలోని మమతా బెనర్జీ ఆ మావోయిస్టులతోనే చెట్టపట్టాలేసుకుని సిపిఎం నాయకులపై హత్యాకాండ కొనసాగిస్తోంది. కానీ హోంమంత్రిగా వున్న చిదంబరం మమతను నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నారు. 149 మంది ప్రయాణీకుల దుర్మరణానికి కారణమైన జ్ఞానేశ్వరి రైలు ప్రమాదం మావోయిస్టుల జేబు సంస్థయిన పిసిపిఏ కుట్రేనని సిబిఐ నిగ్గుతేల్చింది. మావోయిస్టు, తృణమూల్ హింసాకాండకు జంగల్‌మహల్ ప్రాంతంలో 161 మంది ఆదివాసీలతో సహా 265 మంది సిపిఎం, వామపక్షాల కార్యకర్తలు, సానుభూతిపరులూ ప్రాణాలు కోల్పోయారు. ఆధారాలతో సహా వివరించినా పట్టించుకోని కేంద్ర హోంమంత్రి ఎన్నికల సభల్లో అవాస్తవాలు మాట్లాడుతున్నారు. అసత్య ఆరోపణలకు దిగుతున్నారు. పశ్చిమబెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి బాగోలేదని ఆయన ఆరోపించారు. ఆయన మంత్రిత్వశాఖకే చెందిన నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం పది లక్షలకు పైగా జనాభా గల నగరాల్లో లక్ష మందికి జరిగే నేరాల సంఖ్య కొల్‌కతాలో అతి తక్కువగా 103 వుండగా ఏలిన వారి పాలనలోని ఢిల్లీ మహానగరంలో ఆ సంఖ్య 353.7గా వుంది. అలాగే ఐపిసి నేరాల రేటు జాతీయంగా 181.4 వుండగా అది బెంగాల్లో 126 మాత్రమే. అదే విధంగా బెంగాల్ విపరీతంగా అప్పుల పాలైందని ఆ పెద్దమనిషి చెప్పారు. వాస్తవంలో మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు రు.2.3 లక్షల కోట్లకు పైగా అప్పులుండగా బెంగాల్‌కు రెండు లక్షల కోట్లు కూడా లేవు. రు. 35 లక్షల కోట్ల అప్పుల కుప్పపై కూర్చున్న యుపిఏ ప్రభుత్వంలో కీలక శాఖను నిర్వహిస్తున్న చిదంబరం గురువింద తనకింద వున్న నలుపెరగనన్నట్లు మాట్లాడారు.
బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మన్మోహన్ కూడా స్థాయి మరిచి కువిమర్శలకు పాల్పడ్డారు. విద్య, వైద్య రంగాల గురించి తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదారి పట్టించాలని చూశారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సెన్సస్ నివేదికల ప్రకారం బెంగాల్ అక్షరాస్యత 77శాతం కాగా జాతీయ అక్షరాస్యత 74 శాతం మాత్రమే. మహిళల అక్షరాస్యత బెంగాల్లో 71.2 శాతం కాగా జాతీయ సగటు కేవలం 65.4 శాతం మాత్రమే. వైద్య రంగంలో కూడా దేశంలో 2105 మంది జనాభాకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక పడక చొప్పున ఉండగా బెంగాల్లో 1605 మంది జనాభాకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పడక అందుబాటులో వుంది. ఇవేవీ ప్రధానికి తెలియక మాట్లాడారని అనుకోలేము. అవినీతి బురదలో పడిదొర్లుతోంది యుపిఏ ప్రభుత్వం. ఇన్ని కుంభకోణాలు, ఇన్ని లక్షల కోట్ల బొక్కుడు ఏ ప్రభుత్వంలోనూ లేదు. తన మంత్రివర్గ సహచరుడైన రాజాను 2జి స్కామ్‌లో అరెస్టు చేశాక 'సంకీర్ణ రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులుంటాయి' అని సిగ్గు విడిచి చెప్పిన పెద్దమనిషి ఆయన. దేశంలోనే ఆదర్శవంతంగా సంకీర్ణ పాలన సాగిస్తున్న పశ్చిమ బెంగాల్ వామపక్ష ప్రభుత్వంలోని ఏ ఒక్క మంత్రి అవినీతి ఆరోపణలపై అరెస్టు కాదు కదా కనీసం ఆరోపణ కూడా లేదన్న విషయం జగద్విదితం. బెంగాల్‌కి లేని సంకీర్ణ సంకటం మన్మోహన్‌కు ఎందుకో? శాంతి భద్రతలపై విమర్శిస్తున్న హోంమంత్రి తన కేబినెట్ సహచరుడు ముకుల్‌రారు పుత్రరత్నం, తృణమూల్ అభ్యర్థి అయిన శుభ్రంసురారు ఎన్నికల సంఘం ప్రతినిధులపై దాడి చేసిన విషయం మరిచిపోయారా? నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యాక ఆ ప్రబుద్ధుడిని మమతా బెనర్జీ పాల్గొన్న సభలోనే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలియదా? మావోయిస్టుల మొదలు ఇలాంటి నేరస్తులందరితో జట్టుకట్టి మేరునగం లాంటి వామపక్ష కూటమిని ఎదుర్కొంటోంది. యుపిఏ కూటమిలో రెండో పెద్దపార్టీగా వున్న టిఎంసీని సంతృప్తి పరచడం కోసం కాంగ్రెస్ స్థాయి మరిచి దిగజారిపోతోంది. గతంలో రాజీవ్‌గాంధీ మొదలు ఇటీవల వారి 'యువరాజు' రాహుల్ వరకూ ఇలాంటి ప్రేలాపనలకు పోయి భంగపడిన విషయం లోకానికి తెలుసు.
దేశంలోనే ఆదర్శవంతంగా భూ సంస్కరణలను, పంచాయతీరాజ్ పాలనను పారిశ్రామిక శాంతిని సాధించడంలో బెంగాల్ వామపక్ష ప్రభుత్వం ముందుంది. దేశమంతటా పంచిన మిగులు భూమిలో 23 శాతం బెంగాల్లోనే పంపిణీ అయింది. 30.12 లక్షల కుటుంబాలు లబ్ధి పొందగా వారిలో దళితులు, ఆదివాసీలు, మైనార్టీలే 70 శాతం మంది కావడం విశేషం. మన రాష్ట్ర వ్యవసాయ రంగంలో కీలక పాత్ర వహిస్తున్న కౌల్దార్లకు కనీసం బ్యాంకు రుణాలు పొందడానికి గుర్తింపు కార్డులను సైతం ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. కానీ బెంగాల్ ప్రభుత్వం 34 ఏళ్ల క్రిందటే కౌల్దార్లకు సాగు హక్కులను చట్టపరం చేసింది. ప్రజానుకూల పాలనలో అన్నింటా ముందున్న వామపక్ష పాలనకు మరో ప్రత్యామ్నాయం లేదు. యుపిఏ-1 ప్రభుత్వం ప్రజల నడ్డివిరిచే భారాలను వేయ ప్రయత్నిస్తే ప్రతిఘటించడం మొదలు వినాశకరమైన భారత్ - అమెరికా అణు ఒప్పందాన్ని వ్యతిరేకించడం వరకూ వామపక్షాలు నికరంగా ప్రజల పక్షాన నిలిచాయి. ఇది గిట్టని భారత పాలక వర్గాల మొదలు అమెరికన్ సామ్రాజ్యవాదుల వరకూ వామపక్షాలపై అందునా సిపిఎంపై కత్తికట్టారు. 'మమతను మచ్చిక చేసుకోవాలని' కొల్‌కతా కాన్సలేట్ నుంచి వాషింగ్టన్‌కు దౌత్య నివేదికలు పంపినట్లు వికీలీక్స్ వెల్లడించడంతో ఇది మరింతగా నిర్ధారణయింది. అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికే ఆ దేశమంటే అపర భక్తిని ప్రదర్శించే చిదంబరం అవాకులు చెవాకులు పేలారు. ఇంతకు ముందు 'నౌ ఆర్ నెవ్వర్' అంటే బెంగాల్ ప్రజలు శృంగభంగం చేశారు. ఇపుడూ కాంగ్రెస్ నేతలు సంధి ప్రేలాపనలు చేస్తున్నారు. వాటిని విజ్ఞులైన బెంగాల్ ప్రజలు తిరస్కరిస్తారు.ప్రజా శక్తీ దిన పత్రిక సౌజన్యముతో