ఆఫీసునుండి వచ్చి రాధను చూడగానే సుధీర్‌కు చిరాకెత్తుకొచ్చింది.  ఎదురొచ్చి మంచినీళ్లిచ్చి లోపలికెళ్లింది రాధ. వచ్చి టిఫిన్, టీ ఇచ్చింది.  అయినా అతని మొహంలో పేలాలు పేలుతూనే ఉన్నాయి. కారణమేంటో అర్థంకాని రాధ  ఆఫీసులో ఏదైనా గొడవైందేమో అనుకుంది. అడిగితే సమాధానం చెప్పే స్థితిలో భర్త  ఉండకపోవడంతో తన పని తాను చేసుకుంటూ పోతోంది. కానీ భర్త కోపానికి తానే  కారణమని ఆమె అనుకోలేదు. భోజనాల సమయంలోనూ అదే చిరాకు చూపించేసరికి ఇక  ఉండబట్టలేని రాధ భర్తను కారణమడిగింది. అతను చెప్పిన కారణం విన్న రాధకు  నవ్వొచ్చింది. కానీ నవ్వితే సుధీర్‌కు మరింత కోపం వస్తుందని ఊరుకుంది. అతను  అన్నదేంటంటే, ''ఆఫీసులో పడ్డ శ్రమంతా నిన్ను చూసి మర్చిపోదామని  నేననుకుంటాను. కానీ నేను వచ్చేసరికి ఎప్పుడూ నువ్వు జిడ్డు మొహంతో  కనిపిస్తుంటావు. ఎదురింటి శ్యామల చూడు ఎప్పుడు చూసినా మడత నలగని కాటన్  చీరలు కట్టుకుని కడిగిన ముత్యంలా ఉంటుంది. నువ్వు కూడా అలాగే ఉండొచ్చుగా''  అంటున్న భర్తవంక నిశితంగా చూసింది రాధ.
 ''ఇద్దరు  చంటిపిల్లలు, వచ్చే పోయే బంధువులు. పనమ్మాయి ఒకరోజు వస్తే రెండ్రోజులు  రాదు. వాషింగ్‌మిషన్ కొందామని అనుకుంటున్నా బడ్జెట్‌లోటువల్ల కుదరడంలేదని  మీకూ తెలుసు. మీకా పొద్దున్న వండిన కూరలు రాత్రి తినడం ఇష్టముండదు.  సాయంత్రం వచ్చేసరికి టిఫిన్ కంపల్సరీ. వీటన్నింటిమధ్యా నేను మీరొచ్చేసరికి  సింగారించుకుని ఎదురుచూడటం ఎంతవరకూ సాధ్యమో ఓసారి ఆలోచించండి. అయినా మీ  చీవాట్లు నేను భరిస్తాను. కానీ మీకు ఇతరులతో పోల్చడం మాత్రం ఒప్పుకోను.  ఎదురింటి శ్యామలకు ఇంకా పిల్లలు లేరు. ఈ ఊళ్లో బంధువులే లేరు. అన్నీ  చేయడానికి వాళ్లాయన ఓ అమ్మాయిని ఇంట్లోనే ఉంచాడు. వారాంతాలు థియేటర్లో  సినిమా, హోటల్ భోజనం తప్ప ఇంట్లోనే అసలు వుండరు. ఇక శ్యామల ఎప్పుడు చూసినా  తాజా పువ్వులా ఉంటుందంటే ఉంటుంది మరి! అయినా తన విషయం నాకు అనవసరం.

కానీ, మీరు నన్ను ఆమెతో పోల్చడమేంటి? వాళ్లాయన తన భార్యకు కల్పిస్తున్న సౌకర్యాలన్నీ నాకూ కావాలని నేనెన్నడైనా మిమ్మల్ని అడిగానా? మీకంటే ఆయన గొప్పవాడని నేనెప్పుడైనా చెప్పానా? ఎవరి ఆర్థిక స్థోమత, ఓపికలను బట్టి వారి స్థితిగతులుంటాయి. అంతేగానీ, ఎదుటివాళ్లతో పోల్చుకోవడమేంటీ అసహ్యంగా!'' అంటూ భర్తను కడిగేసింది రాధ. ఎప్పుడూ మౌనంగా పనిచేసుకుపోయే తన భార్యలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయని సుధీర్ ఏమాత్రం ఊహించలేదు. ఇప్పుడు ఒక్కసారి లావా పెల్లుబికినట్లు మాట్లాడేస్తున్న రాధను చూసి ఒక్కసారిగా బిత్తరపోయాడు సుధీర్. తర్వాత రాధ మాట్లాడిన మాటల్లో సత్యంపాళ్లే ఎక్కువని గ్రహించుకున్నాడు.
''అయాం సారీరా! ఈ కోణంలో నేనెన్నడూ ఆలోచించలేదు. ఇప్పుడర్థం అవుతోంది నేనెంత తెలివితక్కువగా ఆలోచించానో. ఇప్పట్నించి నావంతు సాయం నేను నీకందిస్తాను. తప్పితే ఇంటి భారమంతా నీపైనే వేయను. ఇంకా ఏమేం సర్దుబాట్లు చేసుకోవాలో చెప్పు. మరో ఆలోచనలేకుండా పాటిస్తాను'' అంటున్న భర్తను చూసి నిండుగా నవ్వింది రాధ. ఆ నవ్వులు సుధీర్ గుండెల్లో పువ్వులు పూయించాయని వేరే చెప్పాలా?!ప్రజా శక్తీ సౌజన్యముతో