హైదరాబాద్, మేజర్‌న్యూస్: వయోజన పాఠ శాలలు పెట్టి వృద్ధులను సైతం విద్యావంతులను చేసిన ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థులకు వయోఃపరి మితి విధించే దిశగా అడుగులు వేయడంపట్లు బడుగులు మండిపడుతున్నారు. ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’... అంటూ గోడ మీదరాతలు రాయించి గ్రామీణ మహిళలను విద్యావంతులను చేసేందుకు కృషి చేసిన ప్రభుత్వం ఇప్పుడు చదువుకునేందుకు ముందుకు వస్తున్న బడుగులపై ఎందుకు బండలు వేస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు.
బడుగు విద్యార్థులకు వయోఃపరిమితి నిర్ణయిం చి ఆ వయస్సు దాటిన వారికి ఫీజులు, ఉపకార వేతనాలు చెల్లించేది లేదనే నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోంటే, ఇటు బడుగు విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఎపిపిఎస్సీ విధి విధానాల ప్రకారం ఉద్యోగ అర్హత కు వయోఃపరిమితిలో ఏ విధమైన నిబంధనల ఉన్నాయో వాటిని విద్యా సంస్థల్లో కూడా అనుసరిం చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది. ఈ నేపథ్యంలో ఓసీ, బీసీ తదితరుల వయోః పరిమితి 34 సంవత్సరాలుగాను, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో ఐదు సంవత్సరాలు రిలాక్సెషన్ ఇవ్వనుంది. ఈ విధానం వచ్చే విద్యా సంవత్సరం నుండి అమ లు చేయాలని ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోంది.
ఇదే జరిగితే రాష్ర్ట వ్యాప్తంగా 62 వేలమంది విద్యార్థులకు పైగా వేటుపడే అవకాశం ఉంది. అయితే ఫీజుల విషయంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థు లతో సమానంగా చెల్లింపులు చేస్తున్న ప్రభుత్వం వయోఃపరిమితి విషయానికి వచ్చేసరికి ఎందుకు తేడా చూపుతున్నారని బడుగు విద్యార్థులు ప్రశ్నిస్తు న్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల మాదిరిగానే తమకూ 39సంవత్సరాల వయోఃపరిమితిని కొనసాగించా లని కోరుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ దుర్వి నియోగం అవుతున్న కారణంగానే ఈ నిర్ణయం చేయాల్సి వస్తోందని ప్రభ్తుత్వం సమర్ధించుకోవ టాన్ని బడుగు విద్యార్థులు తప్పుపడుతున్నారు. ఉన్నతవిద్య అభ్యసించడం ద్వారా ప్రైవేటు సంస్థల్లో కూడా ఉపాథి పొందే అవకాశం ఉంది కనుక ఎసీసీ ఎస్సీ నిబంధనలతో ఏవిధంగా లింకు పెడతారని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఉపాథి చూపట్లే దనీ కనీసం ఉపాథి చూపై కంపెనీలలో చేరే అవకా శాలకు ఎందుకు గండికొడతారని ప్రశ్నిస్తున్నారు.
2010-11 విద్యా సంవత్సరానికి సంబంధించి 70 సంవత్సనాలకు పైబడిన వారు 51మంది పీజీ కోర్సులు చేస్తున్నారనీ, 60నుండి 70 మధ్య వయ స్కులు 20మంది ఉన్నారనీ... గణాంకాలు చూపి అందరిపై వేటు వేసే ప్రయత్నం సరైన నిర్ణయం కాదని బడుగులు ఆరోపిస్తున్నారు. ఆర్థికంగా ఎదుగుతలలేని బడుగులు ఉన్నత చదువులు చదవాలంటే కచ్చితంగా ఫీజులు, ఉపకారవేతనాలు చెల్లిస్తున్న విధంగానే వయోపరిమితి విధించడం సరికాదంటున్నారు. అయితే ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోని పక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.