బి. అంజనేయులు
(ఎ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర అధ్యక్షులు)
ప్రభుత్వ విద్యారంగానికి రాష్ట్రంలో చెద పట్టిందని చెప్పే పరిస్థితులను పాలకులే కల్పి స్తున్నారు. విద్యా రంగం గందరగోళంలో ఉన్న ప్పుడు దాన్ని సంస్కరించి మార్గ నిర్దేశం చేయా ల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది. కాని రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వ విద్యా విధానం కుప్పకూలి పోతుంటే విద్య అనేది భవిష్యత్‌లో అంధకార బంధురంగా మారే ప్రమాదంలో పడిపోతుంటే ప్రభుత్వం మాత్రం గుర్రంలేని రథంపై కూర్చుని స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తున్నది.
నర్సరీ నుండి మొదలుకొని ఉన్నత విద్య వరకు ''డబ్బుంటే చదువు లేకుంటే నై నె''ౖ అనే విధంగా విద్యా రంగం తయారైంది. ప్రభుత్వ విద్యా సంస్థలు జీవన ప్రమాణ స్థాయి లేనటు వంటి బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసమే ఏర్పాటు చేసినట్లు దిక్కూ దివానం లేక మోకాళ్ళపై నిలబడి నడవగలుగుతున్నాయి. రాష్ట్రంలో 6000 లకు పైగా సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో 8 లక్షల మంది విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారు. సంక్షేమ వసతి గృహాలు అధ్వానంగా కూలిపోవడానికి నిధులలేమితో కాలం గడపుతున్నాయి. కాస్మోటిక్ చార్జీలు లేక పలుచబోయిన అన్నం చారుతో విద్యార్థులు దిన దిన గండంగా కాలం గడుపుతున్నారు. దుర్భర మైన పరిస్థితుల మధ్య పేద విద్యార్థుల చదువులు ముందుకు సాగాలంటే ప్రశ్నార్థకమైన విషయమే. హస్టల్స్‌కు సొంత భవనాలు లేక ఉన్న భవనాలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు సరైన సౌకార్యాలు, మంచినీరు, మరుగుదొడ్లు, టీచర్లు లేక మరోవైపు ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడలేక మూతపడ టానికి మూలుగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు విద్యార్థులు లేరనే కుంటి సాకుతో ప్రైవేట్ సంస్థలకు జీవం పోసేందుకు ప్రభుత్వ విద్యాసంస్థలకు నిధులు కేటాయింకుండా, బడులను మూసివేసేందుకు సిద్ధమవుతూ చదువులను చెప్పించడం మా బాధ్యత కాదంటూ, నిస్సిగ్గుగానే ప్రకటిస్తున్నది. అందులో భాగంగానే 2900 పాఠశాలలను రాష్ట్రంలో మూసివేయుటకు సిద్ధమౌతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో 18,143 ఉన్నత పాఠశాలలుంటే సుమారు ప్రైవేట్ రంగంలో 7000 పాఠశాలలు కొనసాగుతున్నాయి. 55 లక్షల మంది విద్యార్థులు హై స్కూల్ విద్యను చదువుతున్నా అందులో 20 లక్షల మంది విద్యా ర్థులు ప్రైవేట్ రంగంలోనే విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య 40 కన్నా తక్కువగా ఉందని రాష్ట్ర మొత్తంలో 3వేల పాఠశాలలకు తాళం పెట్టనుంది ప్రభుత్వం. ఇదే జరిగితే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య ప్రాథమిక హక్కుగా కేంద్రం తెచ్చిన విద్యా హక్కు చట్టాన్ని నవ్వులపాలు చేసినట్లు అవుతుంది.
ఈ రెండు సంవత్సర కాలంలో కొత్తగా ఏర్పాటు అయిన ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళశాలలు, పాల్‌టెక్నిక్ కళాశాలలు సొంత భవనాలు, సిబ్బంది ఏ మాత్రం లేక నల్లేరులో గిలుక ఈదినట్లు కాలం సాగిస్తున్నాయి. రాష్ట్రంలో 804 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నడుస్తు న్నాయి. అందులో 265 కాలేజీలకు సొంత భవ నాల సౌకర్యాలు లేక పాఠశాలల్లో, డిగ్రీ కళాశా లల్లో షిప్ట్ పద్ధతిలో నడుస్తున్నాయి. సుమారు 9700 మంది అధ్యాపకులు అవసరముండగా 5600 పోస్టులను భర్తీ చేయలేదు. ఏండ్లతరబడి కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయడంలేదు. అదే విధంగా 235 పైచిలుకగా రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు భవనాల కొరత వుంది. దీనితో మూడింట రెండొంతుల పోస్టుల భర్తీ చేయకుండా ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తుంది. గత జూన్‌లో రాష్ట్ర వ్యాప్తింగా 300 బి.సి. కాలేజీ హస్టల్స్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇంత వరకు ఊసెత్తకుండా మరచిపోయింది.
విద్యా హక్కు చట్టం ఎప్రిల్ 2011న అమ ల్లోకి వచ్చింది. ఇప్పటికి అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వ విఫలమైంది. దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన 11 నెలల తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు విమర్శల నుంచి బయట పడేందుకు జి.ఓ. నెం. 14 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య స్థాయి ఏంటో అర్థమవుతుంది. వాస్తవంగా విద్య హక్కు చట్టం మంచి ప్రయోజనాలు ఇవ్వాలంటే కొన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. అయినా ప్రభుత్వం చర్యలకు వెనుకడుగు వేస్తుంది. విద్యా హక్కు చట్టాన్ని అమలుపర్చడానికి అధికారాలను పాఠశాల విద్యశాఖకు కాకుండా సర్వశిక్షాభియాన్‌కు అప్పగించింది. ప్రత్యేక పాఠ శాలలను స్థాపించాలనే ఆలోచనను విరమించు కుంది. ప్రభుత్వ పాఠశాలలకు దగ్గరలో ప్రైవేట్ పాఠశాలలు ఉండరాదనే విషయాన్ని ప్రక్కకు నెట్టింది. అలాగే యాజమాన్య కమిటీలో ఎవరు ఉండాలనే విషయాన్ని స్పష్టంగా వివరించలేదు. అంతేకాక ఎసిఎంసి చైర్మన్, సభ్యులను ఎన్నికల ద్వారానే నియమించాలనే ప్రతిపాదనను త్రోసి పుచ్చింది. ముఖ్యంగా విద్య హక్కు చట్టాన్ని సక్రమంగా నిర్వహించుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రెండు కూడా సరాసరి నిధులు కేటాయిం చాలనే నిబంధనను గాలికి వదిలివేశాయి. అందులో రాష్ట్రం వాటాగా 45 శాతం నిధులు కేటాయించాలనే ప్రతిపాదనను మొన్నటి అసెంబ్లీ బడ్జెట్‌లో ప్రభుత్వం మొండి చేయి చూపింది. దీన్ని బట్టి చూస్తే విద్యా హక్కు చట్టాన్ని మసిపూసి మారేడుకాయలాగా పైపూతలు పూయుటకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయినట్లు అర్థమౌతుంది. ఇలా అయితే గ్రామీణ పేద విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్యను అందించే విద్యాహక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం నీరుగారిపోతుంది.
బడ్జెట్‌లో విద్యా రంగానికి 17,362 కోట్లు నిధులు కేటాయించారు. 1307 కోట్లను ఈసారి అదనంగా విద్యా రంగానికి కేటాయించడం జరిగింది. పాఠశాల విద్యకు 14,025 కోట్లు కేటా యించారు. ఉన్నత సాంకేతిక విద్యకు 3,337 కోట్లు కేటాయించడం జరిగింది. అయితే ఈ నిధులకు ఇంకా రెండు రెట్లు ఎక్కువ కేటాయించినా ప్రభుత్వ పాఠశాలలు మరియు ఉన్నత విద్యను గట్టెక్కించే పరిస్థితి లేదు. ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్ షిప్‌లకు 2,745 కోట్లు కేటాయించారు. ఇంకా బకాయిలతో కలిపి 2010 నుంచి 2012 వరకు 6,480 కోట్లు తక్షణం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. కాని రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఈ పథకానికి చేయిచ్చింది. మొత్తంమీద 2012లో దీన్ని ఎత్తివేయడానికి సంకేతాలు ఇచ్చినట్లే కనిపిస్తుంది. 2008-2009, 2009-2010కిగాను బకా యిలే 2,414 కోట్లుపెడింగ్‌లో ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం 3412 కోట్లు, 2012కి 3,400 కోట్లు ఇవాల్సి ఉంటుంది. మొత్తం కలిపి 9,226 కోట్లు అవసరం. కానీ విడుదలచేసిన 2,745 కోట్లతో విద్యార్థులకు ఏలా న్యాయం చేస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీనిపైన ప్రభుత్వం కూడా తక్షణం వివరణ ఇవాల్సిన అవశ్యకత ఉంది. అలాగే రాష్ట్రంలో 8 లక్షలమంది హస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను పెంచడంలేదు. కేంద్ర ప్రభుత్వం మెస్ చార్జీలను పెంచినా, రాష్ట్ర ప్రభు త్వం పెంచడంలేదు. ఒక వేళ పెంచితే అదనంగా 120 కోట్ల రూపాయలు కేటాయించాల్సి వుంటుంది. కానీ అసలే ఈ విద్యా సంవత్సరం 2010 - 2011కి గాను ఒక రూపాయి కూడా కేటాయించకపోవడం దుర్మార్గమైన విషయం.
ఉన్నత విద్యలో భాగమైన ఇంజనీరింగ్, యం.బి.ఎ., యం.సి.ఎ., ఫార్మసీలాంటి కోర్సులు మొత్తం ప్రైవేట్ రంగంలో రాజ్యంమేలుతున్నాయి. ఉన్నత విద్యను ముందు చూపులేకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఇంజనీరింగ్ విద్యను ప్రోత్సహించి దానిని సరైన దారిలో ఉంచకపోవడం వలన వ్యాపారవేత్తలు, బడా రాజకీయ నాయకులు విద్యకు పెట్టుబడి పెట్టి డబ్బులు దండుకోవడంలో సఫలీకృతులవుతున్నారు. ఉన్నత విద్య భవిష్యత్ తరాలకు అంధకారంగా మారి పెను ప్రమాదంగా రూపుదాల్చుకుంటుంది. ఇంటర్‌లో పాసైన ప్రతి వాడు ఇంజనీరింగ్‌లో చేరితే విజ్ఞానశాస్త్రాలు కూడా నిర్లక్ష్యానికి గురవుతాయి. దానితో భౌతిక, రసాయన, గణిత సామాజిక శాస్త్రాలు కనుమరు గయ్యే ప్రమాదం పొంచివుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విద్యా రంగానికి నిధులు కేటాయించడంలో తీవ్ర నిర్లక్ష్యా నికి ఒడిగడుతున్నాయి. కేంద్రం నుంచి 10 శాతం నిధులు, రాష్ట్రం నుంచి 30 శాతం నిధులు విద్యా రంగానికి కేటాయించాలని గత 30 సంవత్స రాలుగా ఎ.ఐ.ఎస్.ఎఫ్. ఇతర విద్యార్థి సంఘాలు పోరాటాలు సాగించినా అది పోరాటంగానే మిగులిపోతుంది తప్ప, పాలకులకు పట్టడంలేదు. విద్యారంగం సంక్షోభం నుండి గట్టెక్కాలంటే 30 వేల కోట్ల రూపాయలు తక్షణం కేటాయిస్తే తప్పసరైన గాడిలోకి ప్రభుత్వ విద్య రాదు, రాలేదు. మేధావులు, విద్యావంతులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున మడమతిప్పని సమరశీల మహత్తర ఉద్యమాలు కార్పోరేట్ శక్తులకు వ్యతిరేకంగా, ప్రభుత్వ విద్యాసంస్థలను సంస్కరించేందుకు సర్వ శక్తులువడ్డి పోరాటాలకు సిద్ధంకావలసిన అవసరం ఉంది.విశాలాంధ్ర పత్రిక సౌజన్యముతో