ఎస్సీ, ఎస్టీ కాలనీలకు మట్టి పనులే!

  • అనుసంధానంపై అనుమానాలు
  • ఆసక్తి చూపని ఎంఎల్‌ఏలు
ఎస్సీ, ఎస్టీ కాలనీలపై సర్కారు వివక్ష ఇది. మౌలిక వసతుల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఆధునిక హంగులు అద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మాత్రం మట్టి పనులతో సరిపెట్టనుంది. దళిత గిరిజన ఆవాసాల అభివృద్దికోసం ఇటీవల వ్యవసాయ కార్మికసంఘం, కెవిపిఎస్‌ తదితర సంఘాలతో పాటు సిపిఎం నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలతో దిగివచ్చిన ప్రభుత్వం ఉపాధిహామీ నిధులతో, శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి నిధులను అనుసంధానం చేసి ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. దీనికోసం వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు చేయను న్నట్లు ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఈ ప్రకటనపైనే అనుమానాలు వ్యక్తమవ ుతున్నాయి. ఉపాధి హామీ చట్టం నిబంధనల ప్రకారం ఆ పథకం కింద చేపట్టే పనులకు ఏ ఇతర నిధులను అనుసంధానం చేసినా మట్టిపనులకే పరిమితం చేయాల్సిఉంది. దీనికి భిన్నంగా జరిగితే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశమే లేదని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉంటే ఉప ప్రణాళిక కింద కేటాయించిన నిధులనే దీనికోసం ప్రభుత్వం వినియోగించేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి షెడ్యూల్డ్‌ కులాల ఉప ప్రణాళిక కేటాయించిన నిధులే 2009-10 ఆర్థిక సంవత్సరంలో మూడువేల కోట్లరూపాయల దాకా మిగిలిఉంది.

ఆ మొత్తంలో దాదాపుగా 2662 కోట్ల రూపాయలు ఇతర పథకాలకు మళ్లించారు. గత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి. 2010-11 ఆర్థిక సంవత్సరలో ఎస్సీ ఉపప్రణాళిక నిధులు దాదాపుగా 4వేల కోట్లు మిగిలినట్టు అంచనా. సబ్‌ప్లాన్‌ కింద కేటాయించిన మొత్తాలను ఇతర పథకాలను మళ్లిస్తున్న ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉపాధి హామీ నిధులతో దళిత,గిరిజన ఆవాసాల అభివృద్ధిని ముడిపెడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలుత ఉపాధిహామి పథకంతో మట్టి పనులు చేసినప్పటికి ఆ తరువాత వీటినుండి శాశ్వత ప్రయోజనం పొందాలన్నా ఇతర నిధులను వినియోగించాల్సిఉంది. ఆ దశలో కూడా సబ్‌ప్లాన్‌ నిధులను వినియోగించడానికి సర్కారు సిద్దపడక పోవడం గమనార్హం. దీంతో చివరకు ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో మట్టిపనులు మాత్రమే మిగలనున్నాయి. ఉపాధి హామీతో నేరుగా అనుసంధానానికి నిబంధనలు అంగీకరించకపోవడంతో మట్టి పనులు చేసిన తర్వాత కాంక్రీటును వేసేందుకు నియోజవర్గ అభివృద్ధి నిధులను ఖర్చు చేస్తామని అధికారులు చెబుతున్నారు. 22జిల్లాల్లో 1500 ఎస్సీ, ఎస్టీ ఆవాస ప్రాంతాలో ఈ పనులు చేస్తామని వారు తాజాగా చెబుతున్నారు. అయితే ఈ నిధులను ఖర్చు పెట్టాలంటే సంబంధిత ఎమ్మెల్యేలు అనుమతి తప్పనిసరని తెలిసిందే. అయితే ఈ పనులపట్ల ఎంఎల్‌ఏల నుండి పెద్దగా ఆసక్తి వ్యక్తం కాకపోవడం గమనార్హం. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరిగేటప్పుడే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చాంబర్‌లో జిల్లాల వారిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉపాధిహామీ పథకంపై అవగాహన సమావేశం జరిపారు.

కానీ ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హాజరు శాతం నామమాత్రమే. ఈసమావేశాల్లో హాజరైన ప్రజా పతినిధులు కూడా పలు అనుమానాలను వ్యక్తపర్చినట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి వందశాతం ఉపాధిహామీ నిధులనే ఖర్చుపెడితే బాగుంటుందని వారు సూచించినట్లు సమాచారం. పైగా తమ నిధులను కేటాయించేందుకు ససేమిరా అన్నట్లు తెలిసింది. వారు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై రెండేళ్లు గడుస్తున్న కూడా నియోజకవర్గ నిధులను ప్రభుత్వం పెద్దగా మంజూరు చేయలేదు. పైగా అరకొర నిధులతో తమ కార్యకర్తలను సంతృప్తి పర్చడమే కష్టమని, ఇక ఉపాధిహామీకి నిధులను కేటాయించడమేమిటని బాహాటంగానే మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఉపాధిహామీకి కేంద్రప్రభుత్వం వేల కోట్ల నిధులను ఇస్తున్నప్పుడు తమ నిధులకు ముడిపెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేల నిధుల ఉపాధిహామీకి కేటాయించే పరిస్థితి లేదని అర్థమవుతుంది. ఎంపీ లాడ్స్‌ పరిస్థితి ఇంతే. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు సంబంధిత గ్రామ పంచాయతీలను గ్రామసభ ద్వారా ఎంపిక చేయాలి అనంతరం తప్పకుండా ఎమ్మెల్యేల ఆమోదం పొందాలి. అంతేకాకుండా మెటిరియల్‌ కంపోనెంటు కింద 5శాతం పూర్తయిన గ్రామ పంచాయతీల్లోనే రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గ్రామాలను గుర్తించడంలో పలు ఇబ్బందికర పరిస్థితులున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఎస్‌సి ఉపప్రణాళిక ఖర్చు ఇలా (ప్రభుత్వ లెక్కల ప్రకారం ... కోట్ల రూపాయల్లో)
సంవత్సరం కేటాయింపు ఖర్చు మిగులు
2007-08 4355.90 3830.16 525.74
2008-09 7630.42 3511.44 4118.98
2009-10 5243.16 2764.79 2478.37
2010-11 6131.39 2521.82 3609.57

సంక్షేమంపై చిన్నచూపు

  • అందుకే మానవ వనరుల అభివృద్ధిలో రాష్ట్రం వెనుకబాటు
  • మరింత పేదరికంలోకి దళితులు, గిరిజనులు
  • వెల్లడించిన ప్రణాళికా సంఘం
గత రెండు దశాబ్దాలలో సామాజిక రంగానికి ప్రభుత్వం చేస్తున్న వ్యయం స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జిఎస్‌డిపి)లో, మొత్తం వ్యయంలో శాతంగా తగ్గిపోవటంతో ప్రధాన రాష్ట్రాలలో మానవ అభివృద్ధి సూచిలో రాష్ట్ర ర్యాంకు పడిపోవటానికి దారితీసింది. సామాజిక అభివృద్ధిపై ప్రభుత్వ ప్రకటనలకు ఈ పరిస్థితి విరుద్ధంగా ఉందని ప్రణాళికా సంఘం వ్యాఖ్యానించింది. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లని చెబుతున్న పాలకుల మాటల్లోని డొల్లతనాన్ని ప్రణాళికా సంఘం బట్టబయలు చేసింది. గత రెండు దశాబ్దాలలో జిఎస్‌డిపిలో కేవలం 6 నుంచి 10 శాతం మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినట్లు ప్రణాళికా సంఘం ముఖ్యమంత్రికి పంపిన పత్రంలో పేర్కొంది. సామాజిక సేవలకు చేసిన వ్యయం 1980 దశకంలో 6.59 శాతం కాగా, అది 1990 దశకంలో 5.61 శాతానికి, 2000-07లో 5.55 శాతానికి పడిపోయింది. ఈ కాలాలలో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక రంగంపై చేసిన మొత్తం వ్యయం శాతం వరుసగా 46, 42, 35.6గా ఉన్నాయి. 2000-07 కాలంలో విద్య నిమిత్తం చేసిన వ్యయం వాటాలో పెరుగుదల లేకపోగా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమాల నిమిత్తం చేసిన వ్యయం తగ్గుదల ధోరణులతో ఉంది. ప్రభుత్వ ఆర్థిక, లక్ష్యాల ప్రాధాన్యతలలో సామాజిక రంగం ప్రాముఖ్యత ఎలా ఉందో ఈ పరిస్థితి సూచిస్తున్నదని ప్రణాళికా సంఘం వ్యాఖ్యానించింది.

వివిధ రంగాలకు చేసిన ప్రణాళికా కేటాయింపులలో సామాజిక రంగానికి చేసిన కేటాయింపులను తక్కువగా వ్యయం చేసినట్లు, గత ఏడాది ఏప్రిల్‌ మొదటి తేదీ నాటికి మూడేళ్ళ కాలానికి రూ.8,447 కోట్ల మేరకు చెల్లింపులు పెండింగులో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వమే తెలిపిందని ప్రణాళికా సంఘం వివరించింది.
మరింత పేదరికంలో ఎస్‌సిలు, ఎస్‌టిలు
రాష్ట్రంలో తలసరి ఆదాయం గణనీయంగా పెరిగినప్పటికి, ప్రాంతీయ వ్యత్యాసాలు, గ్రామీణ-పట్టణ వ్యత్యాసాలు, చాలా అధికంగా సామాజిక వ్యత్యాసాలు ఉన్నాయని వివరిస్తూ, ఈ వ్యత్యాసాలను పూడ్చటం ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటి కావాలని ప్రణాళికా సంఘం పేర్కొంది. జిల్లా స్థూల ఉత్పత్తి గణాంకాల ప్రకారం తలసరి జిడిపి రూ.15 వేలకు తక్కువగా ఉండి, రాష్ట్ర సగటుకన్నా పెరుగుదల రేటు చాలా తక్కువగా ఉన్న కర్నూలు, నిజామాబాద్‌, అనంతపురం జిల్లాల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రణాళికా సంఘం సూచించింది. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతులలో పేదరికం పెరుగుతుం డటం ఈ వ్యత్యాసాలలో మరొక పార్శ్యం. దారిద్య్రంలో ఉన్నవారిలో ఎస్‌సిల శాతం 1993లో 26 శాతం నుంచి ఇప్పటికి 30 శాతానికి పెరిగింది. అదే విధంగా, పేదలలో ఎస్‌టిల శాతం 1983-2005 కాలంలో 9 శాతం నుంచి 23 శాతానికి పెరిగింది. పట్టణ పేదలలో ఎస్‌సిల శాతం 12 నుంచి 20 శాతానికి పెరిగింది.
ప్రణాళికా పెట్టుబడి లక్ష్యాన్ని రాష్ట్రం సాధిస్తుందా?
వచ్చే మార్చి నాటికి ముగియనున్న 11వ పంచవర్ష ప్రణాళికా కాలంలో రూ.1,47,395 కోట్ల మేరకు (2006-07 నాటి ధరల ప్రకారం) ప్రణాళికా పెట్టుబడిని ఖర్చు చేయాలన్న లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ గట్టి కృషి చేయాల్సి ఉన్నదని ప్రణాళికా సంఘం వ్యాఖ్యానించింది. 11వ ప్రణాళిక మొదటి నాలుగేళ్ళలో రాష్ట్రం చేసిన ప్రణాళికా పెట్టుబడి వ్యయం రూ.1,10,439 కోట్లు (70.78 శాతం). 11వ ప్రణాళికా కాలంలో జిఎస్‌డిపిలో 9.5 శాతం పెరుగుదలను సాధించాలన్నది లక్ష్యం. కేంద్ర గణాంక సంస్థ గణాంకాల ప్రకారం జిఎస్‌డిపిలో రాష్ట్రం 2007-08లో 10.75 శాతం పెరుగుదలను సాధించగా, 2008-09లో అది 5.04 శాతానికి, 2009-10లో 5.45 శాతానికి తగ్గిపోయింది. 11వ ప్రణాళికా కాలంలో సాధించగలదని అంచనా వేసిన 8.1 శాతం ఆర్ధిక పెరుగుదల రేటు లక్ష్యాన్ని 12వ ప్రణాళికలో 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రణాళికా దృక్పధం పత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రణాళికా సంఘం తెలిపింది.
వనరుల సేకరణకు సంబంధించి, 11వ ప్రణాళిక మొదటి నాలుగేళ్ళలో ప్రణాళికా వనరుల నిమిత్తం జిఎస్‌డిపిలో 4 శాతం మేరకు రాష్ట్ర స్వంత వనరుల నుంచి లభించటంతో ప్రస్తుత ఆదాయ మిగులు (బిసిఆర్‌) జిఎస్‌డిపిలో దాదాపు 3 శాతంగా సానుకూలంగా ఉందని ప్రణాళికా సంఘం పేర్కొంది. జిఎస్‌డిపిలో పన్నుల ఆదాయం 2008లో దాదాపు 8.8 శాతం నుండి 2009-10లో దాదాపు 9.9 శాతానికి పెరిగింది. 2009-10లో జాతీయ సగటు 7.5 శాతం కన్నా ఇది ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వ అప్పు జిఎస్‌డిపిలో దాదాపు 31 శాతంగా జాతీయ సగటు 32 శాతం కన్నా తక్కువగా ఉంది. మొత్తం మీద రాష్ట్ర ద్రవ్య నిర్వహణ స్థిరంగా ఉందని, ప్రభుత్వ పెట్టుబడిని మెరుగుపర్చేందుకు వనరులను సమకూర్చేందుకు, కీలక రంగాలలో ఉత్పాదకతకు దోహదం చేయగలదని ప్రణాళికా సంఘం అభిప్రాయపడింది. నిర్ణీత లక్ష్యాల మేరకు ప్రణాళికా పెట్టుబడిని ఖర్చు చేయలేక, పన్నుల భారం పెరచుతూ, మానవ అభివృద్ధి సూచికలో దిగజారుతున్న స్థితిలో రాష్ట్ర ప్రభుత్వ ద్రవ్య నిర్వహణపై ప్రణాళికా సంఘం ఇచ్చిన కితాబు నయా ఉదారవాద సంస్కరణలతో కూడిన దాని అమానవీయ దృక్పథాన్ని వెల్లడిస్తున్నది.

1980 1990 2000-07
దశకం (%) దశకం (%) (%)
సామాజిక సేవలకు
చేసిన వ్యయం 6.59 5.61 5.51
సామాజిక రంగంపై
మొత్తం వ్యయం 46 42 35.6

annaa hazare

అన్నా హజారే నేడు భారత దేశములో జరుగుతున్న అరాచక అవినీతి పై పోరాటాముగా బవించ వొచ్చు.నేడు భారత దేశములో 2 జి స్ప్రేక్తం భారి కుంబ కోణం కామన్వెల్త్  భారి కుంబ కోణం మరియు మహా రాష్ట అధర్ష్ కుంబ కోణాలు వివిధ కోణాలలో భారత దేశము కుంబ కోణాల వుభిలో ఉన్నది.అన్నా హజారే దీక్ష ఇదే సరైనా సమయము.ఇటువొంటి తరుణములో భారత దేశ ప్రతి పౌరుడు అన్నా హజారే దేక్షకు తమ వొంతు కృషి చేయాలి.దానితో పాటు  ప్రతి పౌరుడు విధి విధి గ్రామా గ్రామానా ప్రజలకు తెలియజేషి చైతన్య పరచాలి అంతే కాకుండా యెవరికి తోసినా రీతిలో వారు యి ఉద్యమాన్ని ఉధృతం చేయటమే ప్రతి భారతీయుడి ధర్మము కూడా,నేడు భారత రాజదాని డిల్లీలో అన్నా హజారే చేపట్టినా యి దీక్షను ప్రతి భారతీయుడు ప్రతి గ్రామములో నిర్హంచాలి,అన్నా హజారే డిమాండ్ నెరవేరే వరకు అన్నా హజారే యొక్క గ్రామములో అడుగు పెట్టనని ఒక వేలా ఉద్యమములో మరణిస్తే అంతిమ సంస్కారాలను స్వగ్రామములో నిర్వైంచాలని చేపధము చేసాడు.దేశాన్ని ఉపెస్తున్న అన్నా హజారే దీక్ష అసేతుకం అవినీతి పై మరో స్వసంత్ర్య సమరం అవినీతి పై  బాణం ఎక్కు పెట్టిన భారతీయుడు.ఏడు పదులు వయస్సు మీదపడిన యోధుడు మహా వీరుడు ఇట్టి ఉద్యమానికి ఆంధ్ర ప్రదేశ్ మాదిగ దండోరా సంక్షేమ సమితి తరుపున పూర్తి మద్దతు తెలుపు చున్నాము.అంతే కాకుండా యి పిలుపును ప్రతి మాదిగ దండోరా  కార్యకర్త తమ దృష్టికి తీసుకొని మద్దతు తెలుపాలని కోరుతున్నాము మీ యొక్క మిత్రుడు బిమనపల్లీ  జయ రాము మాదిగ 

దళిత మహాప్రస్థానం

దళిత మహాప్రస్థానం
-చుక్కా రామయ్య

ఇప్పటివరకు గడిచిన చరిత్రంతా అగ్రకులాల కిందనే నలుగు తూ వచ్చింది. కులం గోడలు కూలగొడతూ కులస్వామ్యా న్ని కూలదోయడానికి నూతన శక్తులు ముందుకు వస్తున్నాయి. తెలంగాణ జిల్లాల్లో దొర గడీలను కూల్చిన చేతులతోనే కులం గోడలు కూల్చటానికి సన్నధమై సాగుతున్నారు. ఊరుబైట వాడ ల మూలుగుల్ని వినని చరిత్ర చరిత్రేనా? వెలివాడల్ని పట్టించుకోని సమాజం ఏదైనా అది అగ్రవర్ణ ఆధిపత్య కుల సమాజమే అవుతుంది. అగ్రకుల భావజలం పోవాలి. శరీరాన్ని నాలుగు ముక్కలు చేసిన మను వ్యవస్థ మసైపోవాలి.

దళితులు మరో ముందడుగు వేశారు. చరిత్ర రచనను ఆధిపత్యం ఆక్రమించుకుంటే ఎవరి చరిత్రను వారే లిఖించుకుంటా రు. ప్రజా ఉద్యమాలు లేకుండా ఇతరుల లిబరల్ ఔట్‌లుక్‌తో రాజ్యాంగంలో ఎన్నో అ«ధికరణలు వచ్చాయి.14వ అధికరణ అన గా చట్టం ముందు అందరూ సమానులే. 17 వ అధికరణ సకల వివక్షల పైన నిషేధం. 16వ అధికరణ ప్రభుత్వోద్యోగాల్లో సమానావకాశాలు. 17వ అధికరణ అంటరానితనంపై నిషేధం.

18వ అధికరణ భావప్రకటనా స్వేచ్ఛ. 21వ అధికరణ వ్యక్తిగత స్వేచ్ఛ. 23 వ అధికరణ బలవంతపు చాకిరీ రద్దు. 24వ అధికరణ 14 ఏళ్ళలోపు పిల్లలను ప్రమాదకరమైన పను ల్లో నియమించడంపై ఆంక్షలు. 39 వ అధికరణ స్త్రీ పురుషులకు సమాన వేతనం, ఆస్తిపై హక్కు. 49వ అధికరణ గౌరవ ప్రదమైన జీవితం. 45వ అధికరణ పిల్లలందరికీ ఉచిత విద్య. 46 వ అధికరణ ప్రత్యేక కమిషన్‌ను నియమించటం. 243 (డి) ద్వారా తరతరాలుగా అణచివేతకు గురైన వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి.

330, 332 అధికరణలు చట్ట సభలలో రిజర్వేషన్లు కల్పించటం. 345 అధికరణం ద్వారా ప్రభుత్వ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఇచ్చిన హామీలు 60 సంవత్సరాలు గడిచినా అమలుకు నోచుకోకపోవటం ఈ దేశంలో అతిపెద్ద విషాదం. రాజకీయమైన సంకల్పం ఉంటేనే సరిపోదు. దానికి కావల్సిన రాజకీయ కల్చర్ కూడా ఉండాలి. ప్రజాస్వామిక సంస్కృతి లేకుంటే ఏళ్ళ తరబడి ఉన్న ఆధిపత్య సంస్కృతే అధికారం చెలాయిస్తుంది. అదే జరిగింది. ఏళ్ల తరబడి ఎదురుచూసీ చూసీ కళ్లు కాయలు కాసినాయి.

తమ కోసం తామే ఉద్యమించక తప్పదని దళితులు ఉద్యమించారు. పాలకుల కళ్ళు తెరిపించారు. కానీ కుల వ్యవస్థ ఆధిపత్యం చాపకింద నీరులాగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం చుట్టూ ఉద్యమకంప మాదిరిగా సమాజం చుట్టూ కులం చుట్టబడింది. నడిచేందుకు సిమెంట్ రోడ్ కనిపిస్తుంది కానీ నడవలేని బాటగా అది మారుతుంది. ఆ విధంగా ఏళ్ళు గడిచాయి.

ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు చెందిన విద్యార్థులే చైతన్యంతో ప్రశ్నించడమే కాదు, ఉద్యమాలు నిర్మించుకున్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. అర్ధ పెట్టుబడిదారీ సమాజంలో ఉద్యమాలు నిర్మించటంలో పేద వర్గాలు ఎన్ని వ్యయప్రయాసలకు గురౌతున్నారో కళ్లారా చూస్తున్నారు. లాకప్‌లో చిత్రహింసలు, ఎన్‌కౌంటర్లకు గురయ్యారు. ఉపవాస దీక్షలు చేశారు. కానీ ప్రభుత్వ చక్రాలకు ఎదురు తిరిగి అడ్డుపడ్డ వారిని అణచటమే తెలుసు కానీ కదలటం మాత్రం ఈ మొద్దు పాలకులకు తెలియదు.

ప్రతి రాజకీయ పార్టీ దళిత గిరిజనులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఉపన్యాసాలు ఇస్తారు. వాగ్దానాలు చేస్తారు. కానీ తరతరాలుగా అనుభవిస్తున్న రాజకీయ తాత్త్విక సాంస్కృతిక ఆధిపత్యం వదులుకోవటానికి మాత్రం సిద్ధపడరు. ఈ రథ చక్రాలను కదిలించటానికై తామే పూనుకుని దళిత శక్తులు ముందుకొచ్చాయి. ఇది ఏ రాజకీయ పార్టీ తలపెట్టలేదు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యం లో రంగారెడ్డి జిల్లాలో బృహత్తర కార్యక్రమం తీసుకుంది. దేవాలయాల్లోకి దళితుల ప్రవేశం కోసం పెనుగులాట జరిగింది. బి.వి.రాఘవులు నేతృత్వంలో సైకిల్ యాత్ర చేయటం జరిగింది. ఆ జిల్లాలో రెండు గ్లాసుల పద్ధతిపై ఉద్యమించటం జరిగింది.

అదే కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో 30 మంది సైకిల్ యాత్ర చేయటం జరిగింది. మా సమస్యలపై మీరు ముందుకు రావాలని దళితులు అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఇందుకు నేనే నాయకత్వం వహిస్తానని తమ్మినేని వీరభద్రం ముందుకు వచ్చారు. 76 రోజులు ఖమ్మం జిల్లాలో సైకిల్‌యాత్ర నిర్వహించా రు.

దళితులకు అండగా నిలిచినా ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు ఈ సైకిల్ యాత్రను సమర్థించారు. ఆయనే ప్రారంభ జెండా వూపారు. జిల్లాలో మొత్తంగా 2291 కిలో మీట ర్లు, 30 మండలాలు, 8 పట్టణాలను సైకిల్ యాత్రలో చుట్టి వచ్చారు. 628 దళిత వాడల గుండా తమ్మినేని దళిత సైకిల్ యాత్ర కొనసాగింది. ఇది మార్పుకు సంకేతం. ఇది కొత్త సంకే తం.

అన్యాయాలు ఇక సాగవని, మా దళిత వాటా మాకిస్తారా? మా వాటాను మేం గుంజుకోమంటారా? అని పెత్తందారీ సమాజాన్ని తమ చైతన్యపు పలుగులతో పొడిచారు. ఇది మహా ఉద్యమమే. అగ్రకుల ఆధిపత్య సమాజం ఇకనైనా మెట్టుదిగి వచ్చి ఆ దళిత చైతన్యాన్ని కౌగిలించుకోవాలి. మాటలు, చేతలు కావాలంటే వేలాది చేతులు కలవాలి. అదే ఆరంభమైంది.

ఈ దళిత ప్రస్థానం కొనసాగాలి. ఆధిపత్య సంస్కృతి కూలిపోవాలి. దళితులు అమాయకులు అనుకుని వారికి కేటాయించిన నిధులను ఇతరత్రాలకు మళ్ళిస్తే వూరుకోమని రాజకీయ నాయకులకు, పాలకులకు ఈ సైకిల్ యాత్ర ఓ హెచ్చరిక చేసింది. దిక్కుమొక్కులేని దళిత జనం ఒక్కసారి గర్జిస్తే ఆధిపత్య కోటలు కూలిపోతాయని చెప్పారు.

దొర గడీలను కూలగొట్టాం. గడీల ముందు పోరుకేకలు పెట్టాం. ఆక్రమించుకున్న దొర గడీలు పగిలి అవి దళితులకు అందుతాయని అనుకున్నాం. ఊరి వెలుపల మూలుగులే మిగిలాయి. ఇప్పుడు దొర గడీలు ఆధునిక ఆధిపత్య కోటలుగా మారిపోయాయి.

దళితులకు కోటా ప్రకారం బియ్యమే మిగిల్చారు. దళితుల వాటా దళితులకు ఇచ్చేంతవరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరికగా ఆ దళిత సైకిల్ యాత్ర ముందుకు సాగింది. అదే మరో దళిత మహాప్రస్థానం. అందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు , అది నా నల్గొండ నియోజకవర్గం నుంచే బయలుదేరినందుకు గర్విస్తున్నాను. మనిషి జీవితాలు ఉద్యమాలతో పవిత్రమౌతాయి. మనమందరం పవిత్రులవుదాం రండి. ప్రజా ఉద్యమాలలో పాలు పంచుకుందాం. పదండి ముందుకు....

-చుక్కా రామయ్య
శాసన మండలి సభ్యులు

పేదల పట్ల ప్రభుత్వానికెందుకింత ఏహ్యభావం?

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ రైతుల కోసం ఎంతో చేస్తున్నట్లు గొప్పగా చెబుతున్నారు. కొందరయితే, 2011-12 బడ్జెట్‌ను సామాన్యుడి బడ్జెట్‌ (ఆమ్‌ ఆద్మీ)గా పేర్కొన్నారు. అయితే సవివరమైన విశ్లేషణను చూస్తే ఈ బడ్జెట్‌, పరిశ్రమలో, మౌలికవసతుల కల్పనలో, పెట్టు బడుల మార్కెట్లో, సేవల రంగంలో, గృహ నిర్మా ణంలో పెట్టుబడుల అవకాశాలను పెంచే ఉద్దే శంతో రూపొందించినట్లు అర్థమౌతుంది. వ్యవ సాయంపై కొద్దిపాటి సానుకూల ప్రభావం చూపించే అవకాశం వుంది. బడ్జెట్‌లో కేంద్రీకర ణపై అసమతౌల్యం కారణంగా ధరల పెరుగు దలకు ద్రవ్యోల్బణ ధోరణులకు దారితీసి గ్రామీణ పేదలను ఇబ్బందులలోకి నెట్టేయడం జరుగుతుంది.
వ్యవసాయానికి ఎప్పుడూ జరిగేలాగున ఒక విధాయకంగా కేటాయింపులు జరిగాయి. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనకు రు 7,860 కోట్లు, తూర్పుప్రాంతంలో హరిత విప్లవానికి రు 400 కోట్లు, పప్పులు, ఆయిల్‌ పాం, పట్టణ శివారు ప్రాంతాల్లో కూరగాయల పెంపకం, ముతక ధాన్యాలు, పశుదాణా ప్రోటీన్‌ అనుబంధ ఆహారం కోసం నూతన జాతీయ మిషన్‌కు ఒక్కొక్కదానికి రు 300 కోట్లు చొప్పున ఈ కేటాయింపు లున్నాయి. దేశంలోని 6,00,000 రెవెన్యూ గ్రామాలలోని 75 కోట్ల మంది రైతుల ప్రయోజ నాలు నెరవేర్చేందుకు ఈ కేటాయింపులు నామ మాత్రం.
తక్కువ వడ్డీ రేటుపై రైతులను ఆర్థికంగా కలుపుకొని పోవడంపై పెద్ద పెద్ద హామీలైతే యివ్వ డం జరిగింది. పంట రుణాల వడ్డీపై ప్రభుత్వం అందజేసే 3శాతం ప్రభుత్వ ఆర్థిక సహాయం, రైతులకు చాలావరకు ప్రయోజనకారి అని ఆర్థిక మంత్రి అంటున్నారు. అయితే ఆయనో విషయం తెలుసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలకు గురైన సుమారు 5 కోట్ల మంది చెరకు పండించే రైతు లకు ఈ స్కీం వల్ల ఎటువంటి ప్రయోజనం లభించటం లేదు. చెరకు అన్నది 11 నుండి 18 మాసాల పంట. ఫ్యాక్టరీలు రైతులకు డబ్బును ఆలస్యంగా చెల్లిస్తూ ఉంటాయి. అందువల్ల రైతులు వడ్డీపై ప్రభుత్వం సహాయక పథకం వల్ల ప్రయో జనం పొందేందుకు, ఒక సంవత్సరంలోగా రుణాలు తిరిగి చెల్లించే పరిస్థితి ఉండదు. అందు వల్ల పంట రుణాలను తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం కనీసం రెండేళ్ళ వ్యవధినివ్వాలి.
అవకాశాలకు దూరంగా ఉన్నవారికి, అల్పా దాయ గ్రూపులకు భరించగలిగే ఖర్చుపై ఆర్థిక (బ్యాంకింగ్‌) సేవలు అందించే కార్యక్రమాన్ని (సమ్మిళిత ఆర్థిక వృద్ధి) రైతులకు వర్తింపజేసే టప్పుడు జాగ్రత్తగా రూపొందించాలి. ఆ విధంగా రుణగ్రస్తులైన రైతులు తాము పెట్టిన పెట్టుబడు లకు గిట్టుబాటైన రాబడులను పొందుతూ రుణాలను తేలికగా తిరిగి చెల్లించే స్థితిలో ఉండ గలరు. అయితే ఈ దేశంలో పరిస్థితి దీనికి భిన్నంగా వుంది. ఇక్కడ రుణగ్రస్తుడైన రైతు రుణ భారం పెరిగిపోయి తనకు, తన కుటుంబానికి జీవనోపాధిని నిలబెట్టుకునేందుకు సరిపడు రాబడులను సమకూర్చుకోలేకపోతున్నాడు. ఇది అతనిని నిరంతరం అప్పుల ఊబిలోకి నెట్టేసేలా చేసి, అంతిమంగా ఆత్మహత్యకు పురిగొల్పుతోంది. అందువల్ల ప్రభుత్వం ముందున్న ప్రధాన సమస్య-తనను తన కుటుంబాన్ని నిర్వహించు కొనేలా సరిపడు రాబడులను రైతుకు లభించేలా చూడడం. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) లో ప్రభుత్వం చేసే మెరుగుదలలు సేద్యం చేయడంలో పెరిగిపోతున్న ఉత్పాదకాల ఖర్చులు తట్టుకునేం దుకు, సానుకూలమైన రాబడి పొందేందుకు ఏమాత్రం సరిపడా ఉండడం లేదు.
అయితే ఆర్థికమంత్రికి ఒక మంచి ఆలోచన వచ్చింది. అధికాధికంగా రసాయన సేద్యం వల్ల భూసారపరిస్థితి నానాటికీ క్షీణించిపోతోందని ఆయన అంగీకరించారు. అందువల్ల సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత వుంది. దిగజారిపోతున్న భూసారం, ఉత్పాదకత, ఉత్పత్తి పెంపుదలకు అవరోధంగా వుంది. అంతే గాక, వ్యవసాయంలో సాంప్రదాయక సేంద్రీయ వ్యవసాయ భూసారాన్ని పునరుద్దరించడమేగాక, అదేసాపేక్షకంగా రసాయన సేద్యం కంటే చౌక.
సేంద్రీయ ఉత్పత్తులకు 3వేల కోట్ల డాలర్ల ప్రపంచ మార్కెట్‌ పరిమాణం వుంది. దీని ధ్రువీ కరణ వ్యయం హెచ్చుగా ఉండడంతో మనరైతులు ఆ ప్రయోజనం పొందలేకపోతున్నారు. విడివిడిగా రైతులకు సేంద్రీయ ధ్రువీకరణ ఖర్చును ప్రభుత్వం సబ్సిడీగా చెల్లిస్తూ, అతని సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే అది వివేకవంతమైన చర్య అవుతుంది. రైతులకు ఎరువుల సబ్సిడీని నేరుగా అందజేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గ చర్య. అయితే ఎరువుల సబ్సిడీని దారిద్య్రరేఖకు దిగువన జీవించే రైతులకు మాత్రమే అందజేయా లని ప్రభుత్వం యోచిస్తోంది. ఎరువుల సబ్సిడీని రైతులందరికీ అందజేయాలి. సబ్సిడీ పరిమాణం భూకమతాన్ని అనుసరించి నిర్ణయించాలి. ఈ మొత్తాన్ని వ్యవసాయదారుని బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. రైతులందరికీ సబ్సిడీ అవసరం వుంది. అందువల్ల భూకమతాల పరిమితిపై దేశమంతటా ఎటువంటి తేడాలు లేకుండా ఎలా అమలు పరచబడిందో సబ్సిడీ కూడా అలాగే అందజేయాలి. సబ్సిడీని ఎలా వినియోగించా లన్నది రైతు స్వేచ్ఛకే వదిలివేయాలి. అది రసా యన సేద్యం కావచ్చు. సేంద్రియ వ్యవసాయం కావచ్చు. ప్రభుత్వం గనుక సేంద్రీయ వ్యవ సాయాన్ని ప్రోత్సహించాలని భావిస్తే సేంద్రీయ ధ్రువీకరణకు సంబంధించిన హెచ్చు ఖర్చును కూడా కలుపుకుంటూ అదనపు సబ్సిడీని అంద జేయాల్సి ఉంటుంది.
ఇంధనం, ఎరువులు, ఆహారం పై ప్రధాన సబ్సిడీలు 2010-11లో ఖర్చు చేసిన దానికంటే (సవరించిన అంచనా) 2011-12 బడ్జెట్‌లో భారీ స్థాయిలో రు 20,000 కోట్ల కోత విధించబడింది. ఆహార సబ్సిడీలో విధించిన రు 27 కోట్ల కోతతో ఆహారభద్రత, రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వాని కున్న చిత్తశుద్ధి అర్థమౌతుంది. ప్రభుత్వం డీజిల్‌ సబ్సిడీని రైతులకు నేరుగా అందజేయాల్సి ఉం టుంది. ఎరువుల సబ్సిడీలో తగ్గింపు ప్రభుత్వ రైతు వ్యతిరేక స్వభావాన్ని వెల్లడిస్తోంది.
మెగాఫుడ్‌ పార్క్స్‌ ఏర్పాటు చేసే బదులు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగయువకులు చిన్న చిన్న వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి, విలువ జోడింపు యూనిట్లను నెలకొల్పుకునేందుకు ప్రభుత్వం సహాయం అందించాలి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు తోడ్పడుతుంది. గ్రామీణ నిరుద్యోగాన్ని పరిష్కరిస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలసలను నిరోధిస్తుంది. ఈ బడ్జెట్‌ అటవీ వ్యవసాయ దారులు, కొండ ప్రాంత వ్యవసాయదారుల పట్ల ఏమాత్రం దృష్టి పెట్టలేదు. సాగునీటి సమస్యకు అవసరమైన శ్రద్ధ ఈ బడ్జెట్‌లో కనబడలేదు.
వదులుకున్న రెవెన్యూకు సంబంధించిన స్టేట్‌మెంట్‌ ప్రకారం 2010-11లో మొత్తం పన్ను రాయితీలు రు 5,00,000 కోట్లకు పైగా వున్నాయి. కార్పొరేట్‌ పన్ను మినహాయింపులు రు 88,000 కోట్లకు పైగా వున్నాయి. ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు ఇలా భారీ ప్రయోజనాలు అందజేస్తున్న పరిస్థితుల్లో రైతుల పట్ల ఎందుకు పిసినారిలా వ్యవహరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సంరక్షణ, విద్య, భరించగలిగే రేట్లపై సరిపడు సౌకర్యాలను అందజేయడంలో ప్రభుత్వ వైఫల్యం పేదల పట్ల ప్రభుత్వానికున్న ఏహ్యభావాన్ని వెల్లడిస్తోంది.

ఎస్‌సి, ఎస్‌టిల అభ్యున్నతికి చట్టం అవసరం

హైదరాబాద్‌ (వివి) : షెడ్యూల్డు కులాలు,షెడ్యూల్డు తెగల ఉప ప్రణాళిక (ఎస్‌సిఎస్‌పి) బిల్లును చట్టంగా రూపొందించి ఆ వర్గాలకు నాణ్యమైన ఉన్నతవిద్య అందించాలని, ఆర్థిక సాధికారతకై జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి, అవి దారి మళ్లకుండా పర్యవేక్షక కమిటీలను గ్రామస్థాయిలో పనిచేసేలా చూడాలని వక్తలు ముక్తకంఠంతో ఉద్ఘాటించారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ ఏర్పాటు చేసిన చర్చలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి, ఎస్‌సి, ఎస్‌టి, బిసిల సబ్‌ కమిటీ చైర్మన్‌, జస్టిస్‌ కె.రామస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించారు. దీనికై అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు కలిసి రావాలని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్‌సిఎస్‌పి కేటాయించిన నిధులలో రూ.21వేల కోట్లు ఇతర శాఖలకు దారి మళ్లాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఎస్‌సి సబ్‌ప్లాన్‌ పేర తాను ముసాయిదా బిల్లును రూపొందించి యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీకి అందించానని, ఆమె సూచించినా కేంద్రప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోలేదని జస్టిస్‌ రామస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌సిఎస్‌పికి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని, జాతీయ అభివృద్ధి మండలి ఈ వర్గాల అభ్యున్నతినే సూచించినట్లు తెలిపారు. ఈ నిధులను గ్రామస్థాయిలో సద్వినియోగంకై వేసే పర్యవేక్షక కమిటీలో ఎన్‌జిఒలు, స్థానిక నాయకులు అర్హత గల ఇతరులను సభ్యులుగా చేయాలని కోరారు. నిధులు దారిమళ్లినా, సద్వినియోగం కాకపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించి సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఫలితంగా సంబంధిత అధికారులు జవాబుదారీతనంతో పనిచేస్తారని పేర్కొన్నారు. లేకుంటే ప్రభుత్వం బాధ్యత వహించి వారిపై కఠినశిక్ష తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీస్‌ పేర అధికారులపై చర్యలు తీసుకునే వీలుంది తప్ప మంత్రులపై చర్యలు తీసుకోలేమని ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంనర్సింహారావు మాట్లాడుతూ, ముసాయిదా బిల్లుకు చట్టబద్ధత కల్పించి నిమ్నవర్గాల అభ్యున్నతికి, ఆర్థిక సాధికారతకు కృషి చేయాలని సూచించారు. రాజ్యాంగపు 21, 46 అధికరణల ప్రకారం ఎస్‌సి, ఎస్‌టిలకు నాణ్యమైన విద్య అందించాలని పేర్కొన్నారని చెప్పారు. సామాజిక న్యాయం జరగాలని చెబుతూ, జస్టిస్‌ రామస్వామి రూపొందించిన ముసాయిదా బిల్లుకు పూర్తి మద్దతు పలికారు. ఎస్‌సిఎస్‌పి నిధుల సద్వినియోగం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కలిసి పనిచేయాల్సి ఉందని సూచించారు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై.వి.రావు మాట్లాడుతూ, ఉప ప్రణాళిక బిల్లును చట్టం చేయాలని, నోడల్‌ వ్యవస్థ ద్వారా దానిని అమలు చేయాలని కోరారు. దళిత వర్గాల అభివృద్ధికి తగిన చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదన్నారు. ఇదే విషయమై తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు నిరాహారదీక్ష చేశారని గుర్తు చేశారు. దీనికై చేసిన 50 డిమాండ్లలో తొలి డిమాండ్‌ ఎస్‌సిల అభివృద్ధి, ఆర్థిక సాధికారత, సమాజంలో అభివృద్ధే అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ మాట్లాడుతూ, బిల్లుకు రాష్ట్రస్థాయిలో చట్టబద్ధత కల్పిస్తే సరిపోదని కేంద్రస్థాయిలో చట్టబద్ధత అవసరమన్నారు. అన్ని పార్టీల నాయకులు అసెంబ్లీ, పార్లమెంట్‌లో దీనిపై గట్టిగా స్వరాన్ని వినిపించాలని, కొందరు అధికారుల నిర్లక్ష్యంవల్ల నిధుల మళ్లింపు జరుగుతోందన్నారు. బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, దీనిపై ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సామాజిక దోపిడీ, అసమానతలు పోవాలంటే బిల్లుకు చట్టబద్ధత అవసరమన్నారు. ఎస్‌సిల జనాభా 15 నుంచి 18 శాతం, ఎస్‌టిల జనాభా 7 నుంచి 9 శాతానికి పెరిగిందని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్లు ఉండాలన్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి కో-కన్వీనర్‌ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ, బిల్లుకు చట్టబద్ధత కల్పించడం ద్వారా నిధుల మళ్లింపు ఆపవచ్చన్నారు. ఎస్‌సి, ఎస్‌టిల అభ్యున్నతికి కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. సిడిఎస్‌ చైర్మన్‌ డా.సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం మాని సమాజంలో దళితుల అభివృద్ధి, సాధికారతకు తోడ్పడాలని సూచించారు. సిడిఎస్‌కు చెందిన ఆంజనేయులు తదితరులు మాట్లాడారు

వివిధ ప్రభుత్వ ఉగ్యోగాలలో షెడ్యుల్డ్ కులాలకు అన్యాయము

వివిధ ప్రభుత్వ ఉగ్యోగాలలో షెడ్యుల్డ్ కులాలకు అన్యాయము!!ప్రభుత్వ రంగాలలో పోటి పరిక్షలలో షెడ్యుల్డ్ కులాల విద్యార్దులు ఉన్నతమైన మార్కులు సాదించి మొదటి స్థానములో అర్హత పొందిన జెనరల్ కేటగిరిలో కాకుండా షెడ్యుల్డ్ కులాలకు కేటయించిన స్థానాలలోనే ఉద్యోగాలు ఇస్తున్నారు.ఇదేమిటని ఏయరైన ప్రశ్నయిస్తే ఉద్యోగమూ  కావాలా వద్ద ఎదురు ప్రశ్నలు బెదిరింపులకు పలు పడుతున్నారు.మరి కొంత మంది షెడ్యుల్డ్ కులాల విద్యార్దులు ఉద్యోగమూ వస్తే చాలు ఎ కేటగిరిలో వస్తేమిటి అనే ఆలోచనలో కూడా ఉన్నారు.షెడ్యుల్డ్ కులాల కోసం కొన్ని వందల సంఘాలు నేడు భారత దేశం,ఆంధ్ర ప్రదేశ్ నుండి ఉన్న యి సంఘాలకు ఇట్టి  విషయాలు ఏమి పట్టవు,కేవలం వారి స్వార్ధలకు ఉపయోగించుకొని షెడ్యుల్డ్ కులాల పై కొంత పట్టు సాదించి కద్దర్ బట్టలు యేసి తిరుగు తున్నారు తప్ప నేడు విద్యార్దులకు జరుగుతున్న  అన్యాయము గురించి ప్రభుత్వాలపై వొత్తిడి తెచ్చి న్యాయము చెయ్యాల్సిన పని ఏ యొక్క షెడ్యుల్డ్ కులాల సంఘాల నాయకులూ చేయడము లేదు.ఉదాహరణ డిఎస్సి  నియమాలలో షెడ్యుల్డ్ కులాల విద్యార్దులు 90 శాతము మార్కులు సాదించిన  అభ్యర్దులను కూడా షెడ్యుల్డ్ కేటగిరి లోనే అవకాశాలు ఇచ్చారు తప్ప జెనరల్ కేటగిరిలో ఇవ్వటము లేదు.ఇదే  కాకుండా ప్రమోషన్ల విషములో కూడా షెడ్యుల్డ్ కులాల ఉద్య్గులను అనగా తొక్కుతున్నారు.కొన్ని కొన్ని సందర్బాలలో ప్రమాషన్లు జారిచేసే వీదులలో షెడ్యుల్డ్ కులాల ఉద్యోగులు ఉండి కూడా వారి కులము వారికీ జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహాయము చేయలేక పోతున్నారు.అంతే కాకుండా ప్రతి షెడ్యుల్డ్ కులాల ఉద్యోగులు తమ కులం వారికీ యిరితో ఏమైనా ఉద్యోగరిత్య అవసరాలు ఉండి వస్తే చులకన భావముతో చూస్తున్నారు యి రకంగా కుడా షెడ్యుల్డ్ కులాలు ఎనుకకు నెట్టి వెయ భాడుతున్నవి,మరో పక్క కొంత మంది  పై స్థానములో ఉద్యోగాలు చేస్తూ షెడ్యుల్డ్  కులాల నిరుద్యోగులను అసరచేసుకొని ఉద్యోగాలు ఇప్పస్తామని మోసాలకు పలు పడుతున్నారు.మరి కొంత మంది ఉద్యోగులు ఉన్నతమైన పదవులలో ఉండి కూడా కానిసం జాతి చేసే ఉద్యమాలలో చేయూతను కూడా ఇవ్వటము లేదు.కొంత మంది ఉద్యోగులు సభ వేదికలలో విబిన్నమైన నీతులు గొప్ప ప్రసంగాలు చేస్తారు.వారిని స్వయంగా కలిసి జాతి కోసం మీ వొంతు చెవా చెయ్యాలన్నప్పుడు కనీసం మాట కూడా మాట్లాడారు.ఇదేమిటి అని అడిగితె మరొక సరి అపైంట్  మెంటు కూడా ఇవ్వరు.మరి కొంత మంది ఉద్యోగులు తన హోదాకు మించి విలాసాలకు పోయి ఖరీదైన  భావనలు కార్లు కొని తలకు మించిన అప్పులు చేసుకొని జాతి మనుగడను కుటుంబ గౌరవాలను మర్చి పోతున్నారు.మరి కొంత మంది వారి పిల్లల వివాహ విషములో తన కంటే 10  అంతాలు డబ్బు ఉన్నవారితో సంబందాలు కలుపు కొని మాకంటే గొప్పవారు లేరని విర్ర  విగుతున్నారు.ఇంకా కొంత మంది పిల్లికి బిచ్చము చేసే వారు కూడా లేరు.వీరిలో కొంత మంది వారి తల్లి తండ్రులను కూడా చూసుకోలేక పోతున్నారు.ఇటువంటి వారు ఉండటము వల్లే నేడు షెడ్యుల్డ్ జాతి యి  స్థానములో ఉన్నది.ఇట్టి విషయాన్నీ షెడ్యుల్డ్ కుల సంఘాల నాయాకులు,ప్రజా ప్రతినిధులు,రాజకీయ నాయాకులు ,మేధావులు అందరు అలోచించి ఇకనైనా ప్రభుత్వముపై వొత్తిడి తెచ్చి విజయము సాదిస్తారని బావిస్తూ ............................... మీ యొక్క మిత్రుడు బి జే ఆర్ మాదిగ  సెల్ నంబర్ 9494443337