ఎస్సీ, ఎస్టీ కాలనీలకు పక్కా దారులు
'ఉపాధి'కి అదనంగా 'అభివృద్ధి' పనులు   
 హైదరాబాద్, మార్చి 8 : ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టనున్న అంతర్గత  రహదారుల నిర్మాణాన్ని ఇక పక్కా దారులుగా నిర్మించనున్నారు. ఉపాధి నిధులతో  ఎస్సీ, ఎస్టీ కాలనీలకు, మారు మూల ప్రాంతాలకు అంతర్గత రహదారుల నిర్మాణం  చేపట్టిన విషయం తెలిసిందే. ఇలాంటి రహదారులను పక్కాగా నిర్మిస్తే  బాగుంటుందని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ చేసిన ప్రతిపాదనలకు ఆ శాఖ ముఖ్య  కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం ఆమోదం తెలిపారు. 
ఈ మేరకు తాజా మార్గదర్శకాలతో మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాత సమితుల (బ్లాకులు) పరిధిలో కేవలం మూడు గ్రామాలనే 2011-12లో ఈ పక్కా రోడ్లకు ఎంపిక చేయనున్నారు. విజయనగరం, విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఈ పక్కా రోడ్లను నిర్మిస్తారు.